
సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రసార మాధ్యమాలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రచురించడం, ప్రసారం చేయడంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్తాన్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈనెల 12–డిసెంబరు 7 మధ్య ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 12 ఉదయం 7 గంటల నుంచి డిసెంబరు 7 వ తేదీ సాయంత్రం 5.30 గంటల మధ్య ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించరాదని ఈసీ శుక్రవారం ప్రకటన జారీ చేసింది. అలాగే ఒపీనియన్ పోల్స్ సైతం పోలింగ్(విడతల వారీగా) ముగియడానికి 48 గంటల ముందు నుంచి ప్రసారం చేయరాదని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment