Broker 2
-
పోసాని మంచి కమర్షియల్ నటుడు
‘ఈ చిత్రాన్ని ఓ కమిట్మెంట్తో తీశారు. పోసాని కృష్ణమురళి మంచి కమర్షియల్ నటుడు’’ అని దాసరి నారాయణరావు అన్నారు. పోసాని కృష్ణమురళి కీలక పాత్రలో మద్దినేని రమేశ్ దర్శకత్వంలో డెరైక్టర్స్ సినిమా పతాకంపై రూపొందిన ‘బ్రోకర్-2’ పాటల ఆవిష్కరణ శుక్రవారం హైదరాబాద్లో జరిగింది. పాటల సీడీని దాసరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ -‘‘దాసరి దర్శకత్వంలో ఓ మంచి పాత్ర చేయాలని ఉంది’’ అన్నారు. థియేటర్ల విషయంలో కళా ఉద్యమం మొదలైతే తాము మద్దతు పలుకుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ చెప్పారు. ఈ సినిమా హిట్టవుతుందనే నమ్మకం ఉందని మద్దినేని రమేశ్ పేర్కొన్నారు. ఇందులో కీలకపాత్ర చేశానని మాదాల రవి తెలిపారు. తన భావజాలానికి దగ్గరగా ఉండే పాటలు రాశానని రచయిత చైతన్య ప్రసాద్ చెప్పారు. ఈ కార్యక్రమంలో కాశీ విశ్వనాథ్, ప్రసన్నకుమార్, భీమనేని, దశరథ్ తదితరులుపాల్గొన్నారు. -
బ్రోకర్ 2 మూవీ స్ట్సిల్స్
-
బ్రోకర్ 2 మూవీ ఆడియో లాంచ్
-
చెప్పాలి అనుకున్నది సూటిగా...
‘‘కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు వాటిల్లో కొన్నింటిని ఫిల్టర్ చేసి మాట్లాడతాం. కానీ ఈ సినిమాలో మాత్రం చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేశాం. నేటి రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టే సినిమా ఇది’’ అని పోసాని కృష్ణమురళి అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో మద్దినేని రమేశ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘బ్రోకర్-2’. స్నేహ కథానాయిక. టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి మద్దినేని రమేశ్ మాట్లాడుతూ -‘‘నాలుగు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. కీలక సన్నివేశంలో వచ్చే ఓ పాటలో మాదాల రవి నటించారు. డిసెంబర్ 20న పాటలను, జనవరి నెలాఖరున సినిమాను విడుదల చేస్తాం. ఆర్పీ పట్నాయక్ ‘బ్రోకర్’ చిత్రానికి ఏ మాత్రం తక్కువ కాకుండా ఈ సినిమా ఉంటుంది’’ అని తెలిపారు.