మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే..?
తొలిరోజు పార్లమెంట్ సమావేశాలు ముగిశాక ప్రధాన నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు(డబ్ల్యూఆర్‌బీ) ఆమోదిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీపై ఒక్కసారిగా ప్రశంసలు వెల్లువెత్తాయి. మహిళా రిజర్వేషన్ డిమాండ్‌ను నెరవేర్చే నైతిక ధైర్యం మోదీ ప్రభుత్వానికి మాత్రమే ఉందంటూ అభినందనల జల్లు వెల్లువెత్తింది. ఇవాళే లోక్‌సభలో న్యాయశాఖ మంత్రి రామ్ మెగ్వాల్ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. రేపే లోక్‌సభలో ఆమెదం పొందనుంది. తదనంతరం రాజ్యసభ ముందుకు వెళ్తుంది. ఈ సందర్భంగా "మహిళా రిజర్వేషన్ బిల్లు" అంటే ఏమిటి? దీన్ని ఎప్పుడూ తీసుకొచ్చారు. ఇన్నేళ్ల నిరీక్షణకు గల కారణం తదితరాల గురించే ఈ కథనం.
మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే..
దేశంలో లింగ విబేధం లేకుండా అందరికి సమాన హక్కులు ఉండాలని.. అన్ని మతాలు, వర్గాలు, సంస్కృతులు సమానంగా ఉండాలన్న ఆంక్షతో స్వాతంత్య్రం సాధించుకున్నాం. కానీ... పురుషుల ఆధిపత్యం ఎక్కువై.. మహిళల ప్రాధాన్యత తగ్గుతూ ఉండటంతో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రాధాన్యత పెరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే... రాజ్యంగం 108వ సవరణ బిల్లు, 2008 లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలో మొత్తం సీట్లలో మూడింట ఒక వంతు(33%) మహిళలకు రిజర్వ్ చేయాలని కోరింది. 33 శాతం కోటాలో ఎస్సీ, ఎస్టీలు, ఆంగ్లో-ఇండియన్ల సబ్ రిజర్వేషన్లను కూడా బిల్లు ప్రతిపాదిస్తుంది. ప్రతి సార్వత్రిక ఎన్నికల తర్వాత రిజర్వ్డ్ సీట్లను మార్చాలని బిల్లు ప్రతిపాదిస్తోంది.
Union MoS Prahlad Patel deletes his post on 'Women's Reservation Bill'. pic.twitter.com/N8PeEvg5kV
— Press Trust of India (@PTI_News) September 18, 2023
ఈ బిల్లు చరిత్ర...
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మే 1989లో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశ పెట్టడం ద్వారా పార్లమెంట్లో మహిళ రిజర్వేషన్ బిల్లుకి బీజం పడిందని చెప్పాలి. ఆయన ప్రవేశ పెట్టిన బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది కానీ 1989 సెప్టెంబర్‌లో రాజ్యసభలో ఆమోదం పొందడంలో విఫలమైంది.
1992, 1993లో అప్పటి ప్రధాని పీ వీ నరసింహరావు రాజ్యాంగ సవరణ బిల్లు 72, 73లను తిరిగి ప్రవేశ పెట్టారు. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలలో మహిళలకు 33% రిజర్వ్ చేశారు. బిల్లులు ఉభయ సభలు ఆమోదించాయి. చట్టంగా మారాయి. దీంతో దేశ వ్యాప్తంగా పంచాయితీలు, నగరాల్లో దాదాపు 15 లక్షల మంది మహిళా ప్రతినిధులు ఎంపికయ్యారు.
తొలిసారిగా ఎప్పడూ ప్రవేశపెట్టారంటే..
సెప్టెంబర్ 12, 1996 అప్పటి దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం తొలిసారిగా పార్లమెంట్లో మహిళ రిజర్వేషన్ కోసం 81వ రాజ్యంగా సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టింది. ఐతే లోక్‌సభలో ఆమోదం పొందలేకపోవడంతో గీతా ముఖర్జీ అధ్యక్షతన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేశారు. డిసెంబర్ 1996లో ముఖర్జీ కమిటీ తన నివేదికను సమర్పించింది. అయితే లోక్‌సభ రద్దు కారణంగా బిల్లు రద్దయింది. ఇక రెండు సంవత్సరాల తర్వాత అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం 1998లో 12వ లోక్‌సభలో ఈ మహిళ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది.
ఈ సారి కూడా బిల్లుకు మద్దతు లభించలేదు. పైగా రద్దైపోయింది. మళ్లీ వాజ్‌పేయి ప్రభుత్వంలో 1999,2002, 2003లో తిరిగి ప్రవేశ పెట్టారు, కానీ విజయవంతం కాలేదు. ఐదేళ్ల తర్వాత మన్మోహన్సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో మహిళా రిజర్వేషన్ బిల్లు కొంత పట్టు సాధించింది. 2004లో ప్రభుత్వం తన సాధారణ కార్యక్రమంలో ఈ బిల్లుని భాగస్వామ్యం చేసింది. చివరకు మే 6, 2008న రాజ్యసభలోకి ప్రవేశపెట్టింది. ఈసారి రద్దవ్వకుండా నిరోధించేలా 1996 గీతా ముఖర్జీ కమిటీ చేసిన ఏడు సిఫార్సులలో ఐదింటిని ఈ బిల్లు సంస్కరణలో చేర్చడం జరిగింది.
ఆ చట్టం మే 9, 2009న స్థాండింగ్ కమిటీకి పంపించారు. స్టాండింగ్ కమిటీ తన నివేదికను డిసెంబర్ 17, 2009న సమర్పించింది. దీనికి ఫిబ్రవరి 2010లో కేంద్ర మంత్రివర్గం నుంచి ఆమోద ముద్ర పొందింది. చివరికి ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదించబడింది. మార్చి 9, 2010న 186-1 మోజార్టీ ఓట్లు పడ్డాయి. అయితే ఈ బిల్లు లోక్‌సభలో పరిశీలనకు తీసుకోలేదు. చివరికి 2014లో లోక్‌సభ రద్దుతో ముగిసిపోయింది. నిజానికి రాజ్యసభలో ప్రవేశపెట్టిన లేదా ఆమోదించన ఏ బిల్లు అంత తేలిగ్గా ముగియదు. అందువల్లే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంకా వీగిపోలేదు.
కాగా, ఇప్పుడూ కొత్త పార్లెమంట్ భవనంలో మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళ రిజర్వేషన్ బిల్లుతో అధికార, ప్రతిపక్ష పార్టీలు సమావేశం కావడం విశేషం. ఇక ప్రధాని సైతం ఈ చారిత్రత్మక నిర్ణయానికి దేవుడు తనను ఎంచుక్నున్నాడంటూ భావోద్వేగం చెందారు. ఈ బిల్లుకు నారీశక్తి వందన్ అనే పేరు కూడా పెట్టారు. ఈ బిల్లు కోసం కేంద్రం 128వ రాజ్యంగ సవరణ చేయనుంది కేంద్రం. అంతా అనుకూలంగా జరిగి ఈ బిల్లు పాసైతే మహిళలకు 33 శాతం సీట్లు లభిస్తాయి. 15 ఏళ్ల పాటు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లో ఉంటుంది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ చారిత్రాత్మక బిల్లుకి మోక్షం కలగాలాని ఎందరో మహళలు అత్యంత ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
It’s been a long-standing demand of the Congress party to implement women’s reservation. We welcome the reported decision of the Union Cabinet and await the details of the Bill. This could have very well been discussed in the all-party meeting before the Special Session, and… https://t.co/lVI9RLHVY6
— Jairam Ramesh (@Jairam_Ramesh) September 18, 2023
(చదవండి: దేవదూతలందరికీ రెక్కలు ఉండవ్!... ! కొందరికి స్టెతస్కోప్‌లే ఉంటాయ్!!)