Brown University
-
చంద్రుడి పైకి తొలి మహిళ!
ఆకాశంలో సగం అనే నానుడిని నిజం చేస్తూ మగువ అన్ని రంగాల్లో మగవాడికి దీటుగా దూసుకుపోతోంది. ఏరంగంలో పురుషులకు తీసిపోమంటూ అంతరిక్ష ప్రయాణం కూడా పూర్తి చేసుకున్న స్త్రీ శక్తి త్వరలో చంద్రుడిపై కాలు మోపేందుకు సిద్ధమవుతోంది. 1969లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ అల్డ్రైన్లు తొలిసారి చంద్రోపరితలంపై కాలుపెట్టారు. వీరితో కలిసి ఇంతవరకు 12 మంది పురుషులు చంద్రుడిపైకి విజయవంతంగా వెళ్లి తిరిగి వచ్చారు. కానీ ఇంతవరకు ఒక్క మహిళా వ్యోమగామికి ఈ అవకాశం రాలేదు. కానీ ఈ దఫా అమెరికా నాసా సంస్థ తమ ఆర్టిమిస్ మిషన్‌లో భాగంగా తొలిసారి చందమామపైకి మహిళా వ్యోమోగామిని పంపాలని యోచిస్తోంది. ఇందుకోసం బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన డా. జెస్సికా మెయిర్‌ను ఎంపిక చేసుకుంది. ప్రస్తుతం ఈమె ఆర్టిమిస్ మూన్ లాండింగ్ ప్రోగ్రామ్‌లో పాల్గొనే మరో 17మంది ఆస్ట్రోనాట్లతో కలిసి శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొంటోంది. చంద్రయానానికి అవకాశం వచ్చిన తొలి మహిళ కావడం తనకెంతో సంభ్రమాన్ని కలిగించిందని జెస్సికా చెబుతోంది. చంద్రుడి ఉపరితలంపై నడిచేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటోంది. మిషన్‌లో అంతిమంగా పాల్గొనే ఆస్ట్రోనాట్ల పేర్లు ఇంకా అధికారికంగా ఖరారు కాకపోయినా, తప్పక తనను ఎంచుకుంటారని ఆమె ధీమాగా ఉంది. చివరి నిమిషంలో ఒకవేళ మూన్ జర్నీ అవకాశం తప్పిపోయినా బాధపడేది లేదని, తాను వెళ్లకపోయినా, తన కొలీగ్స్‌లో ఒకరు వెళ్తున్నారనే తృప్తి చాలని చెబుతూ పెద్దమనసు చాటుకుంది. రాబోయే ఆర్టిమిస్ మిషన్ కేవలం చంద్రుడిపైకి అలా వెళ్లి ఇలా రావడం కోసం కాదని, భవిష్యత్‌లో మార్స్ ప్రయాణాలకు ఇది మార్గదర్శకమవుతుందని వివరించింది. అలాగే చంద్రుడిపై ఒక శాశ్వత మానవ కాలనీ నిర్మాణానికి సంబంధించి ఈ మిషన్ తొలిమెట్టుగా మారవచ్చని నిపుణుల అంచనా. -
అమెరికా ఉగ్రపోరులో 5 లక్షల మంది హతం
అమెరికా చేపట్టిన ‘ఉగ్రవాదంపై యుద్ధం’లో ఐదు లక్షల మందికి పైగా మరణించినట్లు అమెరికాకు చెందిన బ్రౌన్ యూనివర్సిటీ వాట్సన్ అంతర్జాతీయ, ప్రజా వ్యవహారాల సంస్థ నివేదిక వెల్లడించింది. మృతుల్లో ఉగ్రవాదులతోపాటు పోలీసులు, భద్రతా దళాలు, పౌరులు, అమెరికా, మిత్రపక్షాల సైనికులు ఉన్నారు. 2001 సెప్టెంబర్ 11న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి తర్వాత ఇరాక్, అఫ్ఘానిస్తాన్, పాక్‌లో ఉగ్రవాద స్థావరాలు, సమూహాలు, వ్యక్తులపై వివిధ రూపాల్లో అమెరికా దాడులు ప్రారంభించింది. అప్పటి నుంచి ఆయా దేశాల్లో జరిగిన హింసాత్మక ఘటనల్లో 5.07 లక్షల మంది చనిపోయారని, వాస్తవానికి ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని నివేదిక పేర్కొంది. 2016లో ఈ సంస్థ వెల్లడించిన గణాంకాలతో పోల్చితే ఈ రెండేళ్లలో లక్షా పది వేల మంది అధికంగా మృత్యువాతపడ్డారు. ‘ఉగ్రవాదంపై యుద్ధాన్ని అమెరికాలో పౌరులు, పత్రికలు, రాజకీయవేత్తలు పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే, పెరుగుతున్న మృతుల సంఖ్య యుద్ధ తీవ్రతను స్పష్టం చేస్తోంది’ అని ఆ సంస్థ తెలిపింది. ఆ దాడుల్లో మృతులను మిలిటెంట్లుగా అమెరికాతోపాటు ఆయా దేశాల సైనికవర్గాలు అభివర్ణిస్తున్నా వాస్తవానికి వారు పౌరులై ఉండే అవకాశం ఉందని ఆ నివేదికను రూపొందించిన నేట క్రాఫోర్డ్ అభిప్రాయపడ్డారు. ‘ఇలాంటి యుద్ధాల్లో ప్రత్యక్షంగా ఎందరు చనిపోయి ఉంటారన్నది మనకు తెలిసే అవకాశం లేదు. ఉదాహరణకు ఇరాక్‌లోని మోసుల్‌తో పాటు ఇతర నగరాలను ఐసిస్ తీవ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకునే క్రమంలో వేల సంఖ్యలో పౌరులు మరణించి ఉంటారు. అయితే, వారి మృతదేహాలు లభ్యం కాకపోవడం వల్ల లెక్క తేలే అవకాశం లేదు’ అని క్రాఫోర్డ్ తెలిపారు. ఈ నివేదిక ప్రకారం...ఇరాక్‌లో దాదాపు 2,04,575 మంది, అఫ్గాన్‌లో 38,480 మంది, పాక్‌లో 23,372 మంది మరణించారు. ఇరాక్, అఫ్ఘానిస్తాన్‌లలో మోహరించిన దాదాపు 7 వేల మంది అమెరికా సైనికులు చనిపోయారు. డ్రోన్ దాడుల్లో 2,714 మంది మృతి ఉగ్రవాదంపై యుద్ధంలో భాగంగా అమెరికా గూఢచారి విభాగం సీఐఏ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) పాకిస్తాన్లో డ్రోన్ల ద్వారా 409 దాడులకు పాల్పడినట్లు డాన్ పత్రిక వెల్లడించింది. 2004 నుంచి జరుగుతున్న ఈ దాడుల్లో ఇప్పటి వరకు 2,714 మంది మృతి చెందగా, 728 మంది గాయపడ్డారు. -
రోబోలకూ హ్యాకింగ్ ముప్పు
వాషింగ్టన్: ఇంటర్నెట్ వాడుతున్న మనుషులకే కాదు రోబోలకు కూడా హ్యాకింగ్ ముప్పు ఉందని ఓ అధ్యయనం చెబుతోంది. పరిశోధనలు చేసే రోబోల కదలికలను హ్యాకర్లు రిమోట్ ద్వారా నియంత్రించే ప్రమా దం ఉందని, ఆఖరికి రోబోల కెమెరా లోని సమాచారాన్ని కూడా తస్కరించే అవకాశాలున్నాయని హెచ్చరిస్తోంది. అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు రోబో ఆపరేటింగ్ సిస్టమ్ (ఆర్వోఎస్)ను ప్రపంచవ్యాప్తంగా స్కాన్ చేశారు. 2017–18 మధ్య చేసిన ఈ స్కానింగ్‌లో దాదాపు 100 వరకు సురక్షితం కాని వ్యవస్థలు ఆర్వోఎస్ను నడిపిస్తున్నట్లు గుర్తించారు. ‘కొన్ని సురక్షితం కాని రోబోలకు ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ పరిశోధనలు చేసే రోబోలు మాత్రం పబ్లిక్ ఇంటర్నెట్ ద్వారా అందుబాటులోకి వచ్చే ప్రమాదం ఉంది. వాటిని నియంత్రించవచ్చు’ అని పరిశోధకులు వివరించారు. రోబోలకు, వాటిని నడిపే మనుషులకూ ప్రమాదంగా పరిణమించేలా వాటిని ప్రభావితం చేయొచ్చన్నారు. డిజిటల్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఈ అధ్యయనం గుర్తు చేస్తోందన్నారు. ఆర్వోఎస్ను హ్యాక్ చేయ డం ద్వారా రోబోల కెమెరాలు, సెన్సర్లు తదితర పరికరాలనూ నియత్రించొచ్చని చెప్పారు. -
ఫోన్ కాల్స్ ద్వారా ఆత్మహత్యలకు చెక్!
వాషింగ్టన్: ఆత్మహత్య చేసుకుంటారనుకున్న వారితో కొన్ని సార్లు ఫోన్ మాట్లాడటం ద్వారా వారిని ఆ బాధ నుంచి తప్పించి ఎన్నో ప్రాణాలను రక్షించవచ్చని ఓ పరిశోధనలో తేలింది. అమెరికాకు చెందిన యూనివర్సిటీ కొలరాడో మెడికల్ క్యాంపస్, బ్రౌన్ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు.. అత్యవసర విభాగాల నుంచి చేసే ఫోన్ కాల్స్ చేసి వారితో ప్రేమగా మాట్లాడటం ద్వారా ఆత్మహత్యా ప్రయత్నాల్లో 30 శాతం తగ్గిందని కనుగొన్నారు. | దాదాపు సంవత్సరం నుంచి జరిగిన ఈ పరిశోధనలో అమెరికాకు చెందిన 1,376 మందిపై ఈ పరిశోధన నిర్వహించారు. ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు ఇతరులతో పెద్దగా కలవరని పరిశోధకులు తెలిపారు. కాబట్టి వారిని ప్రపంచంతో కలిసేలా చేస్తే వారు ఆ భావన నుంచి బయటపడతారని పేర్కొన్నారు. అమెరికాలో ఏటా పది లక్షల మంది ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారని తెలిపారు. -
అమ్మాయిలదే అల్లరెక్కువ
వాషింగ్టన్: తరగతి గదిలో బాలుర కంటే బాలికలే ఎక్కువ అల్లరి చేస్తారని తాజా అధ్యయనంలో తేలింది. అల్లరి విషయంలో హైస్కూల్, కాలేజీ స్థాయిలో అబ్బాయిలదే పైచేయిగా కనిపించినా ప్రాథమికస్థాయిలో మాత్రం అమ్మాయిలదే అల్లరి ఎక్కువగా వినిపిస్తుందట. నాలుగైదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అబ్బాయిలు, అమ్మాయిలు ఒకేరకమైన భావోద్వేగాలు కలిగి ఉంటారని, అయితే వయసు పెరిగేకొద్దీ వారిలో కలిగే మార్పుల వల్ల అల్లరి స్థాయి పెరగడం, తగ్గడం జరుగుతుందని యూఎస్‌లోని బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన జయంతి ఓన్స్ అన్నారు. ఇక చదువులో రాణించడం, రాణించకపోవడం వెనుక ఆరోగ్యం, లింగవివక్ష ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. 59.4 శాతం విద్యాఫలితాలకు లింగవివక్షే కారణమవుతోందని, ఇది అనుకూలంగా, ప్రతికూలంగా ఉంటోందని జయంతి తెలిపారు.