ఫోన్‌ కాల్స్‌ ద్వారా ఆత్మహత్యలకు చెక్‌! | More interaction through phone call may reduce suicidal attempts: Study | Sakshi
Sakshi News home page

ఫోన్‌ కాల్స్‌ ద్వారా ఆత్మహత్యలకు చెక్‌!

Published Tue, May 9 2017 10:38 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

More interaction through phone call may reduce suicidal attempts: Study

వాషింగ్టన్‌: ఆత్మహత్య చేసుకుంటారనుకున్న వారితో కొన్ని సార్లు ఫోన్‌ మాట్లాడటం ద్వారా వారిని ఆ బాధ నుంచి తప్పించి ఎన్నో ప్రాణాలను రక్షించవచ్చని ఓ పరిశోధనలో తేలింది. అమెరికాకు చెందిన యూనివర్సిటీ కొలరాడో మెడికల్‌ క్యాంపస్, బ్రౌన్‌ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు.. అత్యవసర విభాగాల నుంచి చేసే ఫోన్‌ కాల్స్‌ చేసి వారితో ప్రేమగా మాట్లాడటం ద్వారా ఆత్మహత్యా ప్రయత్నాల్లో 30 శాతం తగ్గిందని కనుగొన్నారు. |

దాదాపు సంవత్సరం నుంచి జరిగిన ఈ పరిశోధనలో అమెరికాకు చెందిన 1,376 మందిపై ఈ పరిశోధన నిర్వహించారు. ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు ఇతరులతో పెద్దగా కలవరని పరిశోధకులు తెలిపారు. కాబట్టి వారిని ప్రపంచంతో కలిసేలా చేస్తే వారు ఆ భావన నుంచి బయటపడతారని పేర్కొన్నారు. అమెరికాలో ఏటా పది లక్షల మంది ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement