BSNL network
-
బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్వర్క్ సేవలకు డేట్ ఫిక్స్
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వచ్చే ఏడాది జూన్ నాటికి 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొస్తుందని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. మే నాటికి లక్ష బేస్ స్టేషన్ల ద్వారా దేశీయంగా 4జీ టెక్నాలజీని విస్తరిస్తామన్నారు. ‘యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరమ్’ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..‘4జీ టెక్నాలజీకి సంబంధించి భారతదేశం ప్రపంచాన్ని అనుసరించింది. ప్రపంచంతో కలిసి 5జీ సాంకేతికతను అభివృద్ధి చేసింది. కానీ 6జీ టెక్నాలజీలో మాత్రం ఇండియా ప్రపంచానికి నాయకత్వం వహిస్తుంది. బీఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది మే నాటికి ఒక లక్ష బేస్ స్టేషన్ల ద్వారా దేశీయంగా 4జీ టెక్నాలజీని విస్తరించనున్నాం. జూన్ నాటికి 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. ఇప్పటివరకు 38,300 సైట్లను ఎంపిక చేశాం. ప్రభుత్వ సంస్థ ప్రైవేట్ కంపెనీలకు చెందిన కీలక పరికరాలను ఉపయోగించబోదు. ఈమేరకు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బీఎస్ఎన్ఎల్ వద్ద పూర్తిస్థాయిలో పనిచేసే రేడియో యాక్సెస్ నెట్వర్క్ ఉంది. పదేళ్ల క్రితం వాయిస్ కాల్ ఖరీదు 50 పైసలు. కానీ దాని విలువ మూడు పైసలకు చేరింది. వాయిస్ ధర 96 శాతం తగ్గింది. గతంలో ఒక జీబీ డేటా ధర రూ.289.10గా ఉండేది. దాని విలువా గణనీయంగా పడిపోయింది. రానున్న రోజుల్లో టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి’ అన్నారు.ఇదీ చదవండి: రూ.7.7 కోట్లు బాకీ.. కంపెనీపై దివాలా చర్యలు‘బీఎస్ఎన్ఎల్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీ-డాట్, దేశీయ ఐటీ కంపెనీ టీసీఎస్ కన్సార్టియం అభివృద్ధి చేసిన 4జీ సాంకేతికతను ఉపయోగిస్తోంది. పదేళ్ల క్రితం బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల సంఖ్య ఆరు కోట్లుగా ఉంది. ప్రస్తుతం అది 94 కోట్లకు పెరిగింది. భారత్-అమెరికా వ్యూహాత్మక సంబంధాలు మెరుగవుతున్నాయి. ఈమేరకు చాలా రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకారం అందించుకుంటున్నాయి. అమెరికాలో రక్షణ రంగానికి అవసరమయ్యే చిప్‌లను సరఫరా చేసే ఫ్యాబ్ (చిప్ ప్లాంట్)ను భారత్‌లో ఏర్పాటు చేయబోతున్నాం’ అని మంత్రి తెలిపారు. -
ఇక BSNLను ఆపడం ఎవరి తరమూ కాదు..!
-
ఇక ప్రైవేట్ సంస్థలకు బాడ్ టైమే!.. 5జీ ట్రయల్స్ సక్సెస్..
-
నగదు మింగేస్తున్న ఏటీఎంలు
సాక్షి, కర్నూలు: బ్యాంకులకు వెళ్లి అకౌంట్లలో నగదు డిపాజిట్ చేయడానికి ప్రయత్నిస్తే.. అక్కడి సిబ్బంది తీసుకోకుండా ఏటీఎం సెంటరులోని నగదు డిపాజిట్ మిషన్‌లో డిపాజిట్ చేయమని సూచిస్తున్నారు. అయితే సాంకేతిక సమస్యలు ఖాతాదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏటీఎం మిషన్ ద్వారా నగదు డిపాజిట్ చేయడానికి ప్రయత్నిస్తే మధ్యలో సాంకేతిక సమస్యలు తలెత్తి మిషన్ స్ట్రక్ అయిపోతోంది. డబ్బులేమో మిషన్‌లోకి వెళ్లి పోతున్నాయి. నగదు మాత్రం అకౌంట్లలో జమ కావడం లేదు. దీంతో బ్యాంకు ఖాతాదారులు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం అన్ని ప్రధాన బ్యాంకులు నగదు డిపాజిట్ మిషన్లను అందుబాటులోకి తెచ్చాయి. ప్రతి రోజు వందల మంది అత్యవసరాల నిమిత్తం ఏటీఎం సెంటర్లలోని డిపాజిట్ మిషన్ల ద్వారా నగదును అకౌంట్లలో జమ చేస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా డిపాజిట్ మిషన్లలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కర్నూలు నగరంలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచీకి ఖాతాదారుల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల ఏటీఎం సెంటరులో నగదు డిపాజిట్ మిషన్లు పెట్టారు. అయితే వారం 10 రోజులుగా సాంకేతిక సమస్యలు ఖాతా దారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నగదు మిషన్‌లోకి వెల్లిపోయినా నగదు ఖాతాలో జమ కాకపోవడంతో ఖాతాదారుల ఆందోళన చెందు తున్నారు. 10 రోజుల నుంచి రోజు 10 నుంచి 15 వరకు ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి. సమస్య ఉన్నా చర్యలు సున్నా... ఒక్కరోజు కాదు.. రెండు రోజులు కాదు.. 10 రోజులకుపైగా ఈ సమస్య ఉన్నా ఎస్బీఐ అధికారులు చర్యలు తీసుకోకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మిషన్లకు బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ వినియోగిస్తున్నారు. జిల్లా కేంద్రంలో జీఎం, ఇతర ఉన్నతాధికారులు, ఇంజినీర్లు ఉన్నారు. అయినా సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నగదు డిపాజిట్ చేస్తే రసీదు రావడం లేదు. ఈ సమస్యలను ఎస్బీఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తగిన స్పందన లేదు. ఫిర్యాదు చేస్తే 7 రోజులకు సమస్య పరిష్కారం అవుతుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పడిన సాంకేతిక సమస్యలనే పరిష్కరించకపోతే గ్రామీణ ప్రాంతాల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నిస్తున్నారు. అత్యవసరంగా డబ్బు పంపాలనుకుంటే.. సీను రివర్స్ ఆదోని పట్టణానికి చెందిన తేజ కర్నూలులో సెయింట్ జోసఫ్ కాలేజీలో బయో టెక్నాలజీ చదువుతున్నాడు. ఆదోనిలోని తండ్రి ఖాతాకు రూ.49 వేలు పంపేందుకు బుధవారం ఎస్బీఐ మెయిన్ బ్రాంచీలోని ఏటీఎం సెంటరులోని నగదు డిపాజిట్ మిషన్‌ను అశ్రయించారు. నగదు మిషన్‌లో పెట్టి వివరాలు నమోదు చేసిన తర్వాత స్ట్రక్ అయ్యి మొత్తం నగదు లోనికి వెల్లింది. ఇంతవరకు నగదు ఖాతాకు జమ కాలేదు. అత్యవసరం అనుకుంటే సమస్య పరిష్కారానికి వారం రోజులు పడుతుందని బ్యాంకు అధికారులు చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. -
ఏపీ సర్కిల్ బీఎస్ఎన్ఎల్ 6% వృద్ధి
విలేకరుల సమావేశంలో సీజీఎం మురళీధర్ సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పరిధి టెలికంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ ఆర్థిక సంత్సరం రెవెన్యూలో ఆరు శాతం వృద్ధి సాధించామని బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ టెలికం చీఫ్ జనరల్మేనేజర్ మురళీధర్ తెలిపారు. శుక్రవారం గుంటూరులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ నెట్వర్క్ అపరేటర్లతో పోటీగా బీఎస్ఎన్ఎల్ కూడా వేగవంతమైన నెట్వర్క్ అందించటం కోసం అత్యాధునిక జడ్టీఎక్స్ టెక్నాలజీ కలిగిన 1415.. 3జీ బిటిఎస్లను సర్కిల్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేస్తుందన్నారు. దీని వల్ల ప్రతి మండల కేంద్రంలో 3జీ నెట్వర్క్ అందుబాటులోకి వస్తుందన్నారు. ఇటీవల రాష్ట్రంలో బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ పై డేటా వినియోగం ఐదు రెట్లు పెరిగిందన్నారు. గతంలో సర్కిల్ పరిధిలో ఐదు టెరాబైట్లు ఉండగా ప్రస్తుతం 30టెరాబైట్లకు పెరిగిందన్నారు. బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ అందుబాటులేని ప్రాంతాల్లో హాట్ స్పాట్ ద్వారా వైఫై సిగ్నల్ అందిస్తున్నామన్నారు. జిల్లాలో అమరావతి రాజధానిలో ప్రాంతంలో బీఎస్ఎన్ఎల్ నెట్ వర్కింగ్ అవసరాల కోసం కార్యాలయాలు, ఎక్స్ఛేంజ్ల నిర్మాణానికి 11 ఎకరాల స్థలం అవసరం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. ప్రైవేట్ టెలికం అపరేటర్లు నుంచి ఎదురౌతున్న పోటీని ఎదుర్కోవటానికి బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు సాంకేతిక అంశాల్లో స్వల్పకాలిక శిక్షణను అందజేస్తున్నామన్నారు. -
15 నుంచి బీఎస్ఎన్ఎల్ ఉచిత రోమింగ్
* జూలైలో పూర్తి మొబైల్ నంబర్ పోర్టబులిటీ * కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సాక్షి, న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ పరిధిలో ఉచిత రోమింగ్ సేవలు జూన్ 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. పూర్తిస్థాయి మొబైల్ నంబర్ పోర్టబులిటీ జూలై నుంచి మొదలవ్వనుందని తెలిపారు. ఢిల్లీలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టెలికం, పోస్టల్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో సాధించిన ప్రగతిని ఆయన వివరించారు. 2004లో బీఎస్ఎన్ఎల్ రూ.10 వేల కోట్ల లాభాల్లో ఉండగా యూపీఏ పదేళ్ల పాలనలో రూ.7,500 కోట్ల నష్టాల్లోకి వెళ్లిందన్నారు. 2008 వరకు లాభా ల్లో ఉన్న ఎంటీఎన్ఎల్ కూడా నష్టాల బాట పట్టిం దన్నారు. వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చడం, టెలికం, పోస్టల్, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధి లక్ష్యంగా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామన్నారు. స్పెక్ట్రం వేలం ద్వారా ప్రభుత్వానికి లక్ష కోట్లకు పైగా ఆదాయం సమకూరిందన్నారు. దేశంలోని 100 పర్యాటక ప్రాంతాల్లో వైఫై ఏర్పాటు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తెలంగాణలోని హైదరాబాద్ సహా బెంగుళూరు, వారణాసిలో ఇప్పటికే వైఫై సేవలు ప్రారంభమైనట్లు వెల్లడించారు.