budget 2016-17
-
'ఆయన ప్రసంగం వాస్తవాలకు విరుద్ధం'
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ చేసినా ప్రసంగం వాస్తవాలకు విరుద్ధంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, చిన్నారెడ్డిలు ఆరోపించారు. గురువారం ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో మాట్లాడుతూ.... గవర్నర్ ప్రసంగంలో రైతు రుణమాఫీపై ప్రస్తావనే చేయలేదన్నారు. వృద్ధిరేటు విషయంలో ప్రభుత్వం గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులు కరువుతో అల్లాడుతుంటే దాని గురించి ఒక్క ముక్క మాట్లాడలేదని విమర్శించారు. కేసీఆర్‌ది రైతు వ్యతిరేక ప్రభుత్వామని వారు పేర్కొన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గురువారం గవర్నర్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ నెల 14న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. -
'బాబుకు దమ్ముంటే కేంద్రంపై ఒత్తిడి తేవాలి'
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దమ్ముంటే తమ పార్టీ ఎంపీలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జ్యోతుల నెహ్రు డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మంగళవారం ఆయన మీడియాతో మట్లాడారు. కేంద్ర రైల్వే, సాధారణ బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. స్వప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం వైఎస్ఆర్ సీపీ రాజీలేని పోరాటం చేస్తోందని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఢిల్లీకి వెళ్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయకత్వం వహిస్తే వైఎస్ఆర్ సీపీ మద్ధతు పలుకుతుందని స్పష్టంచేశారు. ఈ విషయంపై రానున్న అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వంపై కచ్చితంగా ఒత్తిడి తీసుకొస్తామన్నారు.