Budget debate
-
మాస్కుల కోసం ఎగబడొద్దు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వైరస్ సోకినంత మాత్రాన ప్రాణం పోతుందన్న భయం అవసరం లేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇది సోకినవారిలో కేవలం 5 శాతం మందికి మాత్రమే ఐసీయూలో చికిత్స తీసుకోవాల్సిన అసవరం ఉంటుందని, 95 శాతం మంది తమంతట తాముగా గాని, సాధారణ చికిత్సతోపాటు కోలుకుంటారని తెలిపారు. పద్దులపై చర్చ సందర్భంగా ఆదివారం రాత్రి ఆయన మరోసారి శాసనసభలో కోవిడ్‌పై ప్రకటన చేశారు. రాష్ట్రంలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, విదేశాల నుంచి వచ్చిన వారికి తప్ప స్థానికంగా ఉన్న ఎవరికీ ఇప్పటి వరకు వైరస్ సోకలేదని చెప్పారు. ప్రస్తుతం గాంధీలో ఇద్దరు మాత్రమే వైరస్ సోకి చికిత్స పొందుతున్నారన్నారు. వికారాబాద్ అనంతగిరిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్ వల్ల ఎవరికీ ఏమాత్రం ఇబ్బంది ఉండదని, విదేశాల నుంచి వచ్చినవారిలో అందులో కేవలం అబ్జర్వేషన్ కోసం 14 రోజులు ఉంచుతామని తెలిపారు. ఇక మాస్కుల కోసం ఎవరూ ఎగబడవద్దని, వైరస్ సోకిన వారు, వారికి చికిత్స అందిస్తున్న వైద్యులు, నర్సులకు మాత్రమే ప్రస్తుతం వాటి అవసరం ఉందని, ఈ విషయంలో మాస్కులకు ఎలాంటి కొరతలేదని ఈటల స్పష్టంచేశారు. మిగతావారు ముందుజాగ్రత్త చర్యగా జేబు రుమాలు, చీరకొంగు, తలపాగాను వాడినా సరిపోతుందన్నారు. ఈఎస్ఐ సంక్షోభంతో మందుల కొరత: మంత్రి మల్లారెడ్డి రాష్ట్రంలో ఈఎస్ఐ సంక్షోభం వల్ల కొన్ని మందులకు కొరత ఏర్పడిన మాట నిజమేనని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అంగీకరించారు. అయితే దాన్ని అధిగమించామని ఇప్పుడు మందులకు కొరతేలేదన్నారు. -
రాక్షసుల్లా తయారయ్యారు
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగిని జాయిన్ చేస్తే లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని, రాష్ట్రంలో కొంత మంది ప్రైవేటు వైద్యులు రాక్షసుల్లా తయారయ్యారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. వైద్యారోగ్య శాఖ, విద్యా శాఖ పద్దులపై ఆదివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాధి తగ్గించడం కంటే మొదట ఎన్ని ఎక్కువ డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రోగి చనిపోయాక కూడా రెండు మూడు రోజులు వెంటిలేటర్లపై పెట్టి డబ్బులు గుం జుతున్నారని పేర్కొన్నారు. రోగి చనిపోతే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇంటికి పంపించేలా చట్టం చేయాలని కోరారు. అప్పుడే ప్రజలకు నష్టం ఉండదని, మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. డయాలసిస్ సెంటర్లను ప్రారంభించాలి: రాజేందర్‌రెడ్డి వైద్యారోగ్య శాఖ పద్దులపై రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి జిల్లా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్లను ప్రారంభించాలన్నారు. ఐసీయూలను ఏర్పాటు చేయాలన్నారు. పేదలు చనిపోతే తీసుకెళ్లే వాహనాలను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలన్నారు. సీఎస్ఆర్ కింద నీలోఫర్, సరోజినీదేవి ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని, క్యాన్సర్ ఆసుపత్రికి నిధులను పెంచాలని, నిమ్స్‌లో మరో 60 –70 వెంటిలేటర్లను ఏర్పాటు చేయాలన్నారు. -
నా నియోజకవర్గానికి రండి
సాక్షి, హైదరాబాద్: ఇంటింటికి నల్లా నీరు సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న దానికి, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు చాలా తేడా ఉందని అసెంబ్లీ కాంగ్రెస్‌పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ‘స్పీకర్ గారు మీరు నా నియోజకవర్గానికి రండి. గ్రామాల్లో మిషన్ భగీరథ అమలు తీరు ఎలా ఉందో తెలుస్తుంది’అని పేర్కొన్నారు. ఆదివారం అసెంబ్లీలో పద్దులపై జరిగిన చర్చలో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రూప్–1 నోటిఫికేషన్ కూడా వేయలేదని, వయసు మీరుతోందని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారని, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యువతను పట్టించుకోకపోవడం దారుణమని దుయ్యబట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ రోడ్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, 2014లో మొదలుపెట్టిన రోడ్లు ఇప్పటికీ అసంపూర్ణంగానే మిగిలిపోయాయని, లింకు రోడ్లు, గ్రామాలను అనుసంధానం చేసే మార్గాలను అభివృద్ధి చేయాలని కోరారు. ఒక్క అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేయలేదని, ఇప్పటికైనా జిల్లాకో అగ్రి పాలిటెక్నిక్ కాలేజీ స్థాపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనుమతుల్లేని కార్పొరేట్ విద్యాసంస్థల సంఖ్య పెరిగిపోయిందని, ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వీటికి ముకుతాడు వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రా ల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, దీన్ని ప్రాధాన్యాంశంగా పరిగణనలోకి తీసుకుని తక్షణమే పీహెచ్‌సీల్లో సిబ్బందిని భర్తీ చేయాలని, ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునికంగా తీర్చిదిద్దాలని కోరారు. సీఎం వ్యాఖ్యలు అభ్యంతరకరం కాంగ్రెస్ పార్టీనే దేశానికి పట్టిన కోవిడ్ వైరస్ అని, కొందరు రాజకీయాలు చేస్తూ శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారని శనివారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. ఆదివారం ఉదయం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పార్టీ ఎమ్మెల్యేలతో కలసి స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ఆయన చాంబర్లో కలిశారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు అభ్యంతరకరమని, సీఎం తీరును నియంత్రించి తమ కు అండగా నిలవాలని కోరారు. అనంతరం మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడిన భట్టి.. ప్ర పంచ దేశాలన్నీ కోవిడ్ పట్ల ఇప్పటికే అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకున్నాయని, అసెంబ్లీ లో కనీస చర్యలు తీసుకోలేదని విమర్శించా రు. అసెంబ్లీ ప్రాంగణంలో శానిటైజర్లు అం దుబాటులో లేకపోవడం సరైందికాదన్నారు. -
ఒక్కో విద్యార్థిపై 1.25 లక్షలు ఖర్చు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై సగటున రూ.1.25లక్షలు ఖర్చు చేస్తూ వారికి నాణ్యమైన విద్య, భోజనం, వసతులు కల్పిస్తోందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. నైతిక విలువలతో కూడిన గుణాత్మక విద్య అందించడమే లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు. ఆదివారం శాసనసభలో పద్దులపై చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. ‘రాష్ట్రంలో అన్ని రకాల పాఠశాలలు 29,275 నడుస్తున్నాయి. వీటిలో 25.51లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వారికి రూ.110కోట్లతో యూని ఫాంలు అందిస్తున్నాం. రూ.75కోట్లు ఖర్చు చే సి పాఠ్యపుస్తకాలు, ప్రభుత్వ స్కూళ్లల్లో రూ. 474 కోట్లతో సన్నబియ్యంతో భోజనం పెడుతున్నా. ఇప్పటికే తల్లిదండ్రుల అభీష్టం మేరకు 9,537 పాఠశాలలను ఇంగ్లిష్ మీడియంవిగా మార్చాం’అని వెల్లడించారు. పాఠశాలలు, కళాశాలల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నామని, అనుమతుల్లేని పాఠశాలలపై కఠినం గా వ్యవహరిస్తున్నామని, ఫీజుల నియంత్రణ కు చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో ఢి ల్లీ తరహా స్కూళ్లు ఏర్పాటు చేయాలన్న డిమాం డ్ ఉందని, దీన్ని ప్రయోగాత్మకంగా జీహెచ్ ఎంసీ పరిధిలో అమలుపరిచేలా చర్యలు మొదలయ్యాయన్నారు. పర్యాటక, సాం స్కృతిక, క్రీడాశాఖ పద్దుల పై మం త్రి శ్రీనివాస్‌గౌడ్ సమాధానమిస్తూ, ప్రతి మెట్రో స్టేషన్ నుంచి అం తర్గత రవాణాకు వీలుగా ఎలక్ట్రిక్ ఆటో, బస్సులను ప్రవేశపెట్టే ఆ లోచన ఉందన్నారు. ప్రతి నియోజకవర్గంలో స్టేడియం ఏర్పాటు చేస్తామన్నారు. మంచిని చెప్పు.. అమ్మ ఆశీర్వదిస్తది... ప్రభుత్వం పర్యాటక అభివృధ్ధికి అనేక చర్య లు తీసుకుందని, వరంగల్, ములుగు ప్రాం తాల్లో అనేక అభివృద్ధి చర్యలు చేపట్టినా, కాం గ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఒక్క మంచి పనిని చెప్పలేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ నవ్వుతూ వ్యాఖ్యానించారు. ‘అమ్మా మంచి చేస్తే మంచిని చెప్పాలి. మీ నియోజకవర్గంలో చెరువులను తీర్చిదిద్దినా, మేడారం జాతరకు విస్తృత ఏర్పాట్లు చేసినా ప్రభుత్వం చేసిన ఒక్క పని ని మెచ్చుకోలే. మంచిని చెబితే అమ్మ సైతం ఆశీర్వదిస్తుంది’అంటూ చమత్కరించారు. -
త్వరలో రామప్ప, లక్నవరానికి గోదావరి నీళ్లు
సాక్షి, హైదరాబాద్: ‘అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అనగానే ఎండిన మొక్కజొన్న జూళ్లు, ఎండిన వరి కంకులు, నీటి సమస్యకు చిహ్నంగా ఖాళీ బిందెలు, కరెంటు కోతలకు నిరసనగా కందిళ్ల ప్రదర్శనలు కనిపించేవి. కానీ కేసీఆర్ సీఎం అయ్యాక ఇలాంటివి కన్పించట్లేదు. ప్రజారంజక పాలనకు ఇదే నిదర్శనం’అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా సీఎం కేసీఆర్ తరఫున నీటిపారుదల శాఖపై ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్ర చరిత్రలో యాసంగిలో ఏకంగా 38 లక్షల ఎకరాలు సాగుతో కళకళలాడటం తొలిసారి చూస్తున్నామని చెప్పారు. అద్భుతమైన రీతిలో సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసి కోటి ఎకరాలు సాగులోకి తెచ్చే దిశగా తెలంగాణ సాగుతోందన్నారు. ఇటీవల సీడబ్ల్యూసీ చైర్మన్ కూడా తెలంగాణ ప్రాజెక్టులపై ప్రశంసలు కురిపించారని గుర్తు చేశారు. త్వరలో దేవాదుల ప్రాజెక్టులో భాగంగా రామప్ప చెరువును గోదావరి నీటితో నింపుతామని, అక్కడి నుంచి లక్నవరం చెరువుకు గ్రావిటీ ద్వారా అందిస్తామని తెలిపారు. వెరసి 8,700 ఎకరాలకు కొత్తగా సాగు నీరు అందిస్తామని చెప్పారు. లక్ష కోట్ల అవినీతి: కోమటిరెడ్డి సాగునీటిపై హరీశ్‌రావు మాట్లాడుతుండ గా.. కాంగ్రెస్ ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అధికారపక్షంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రాజెక్టుల పేరుతో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ గట్టిగా నినాదాలు చేశారు. దీంతో అధికార పార్టీ సభ్యులు ఆయనపై విరుచుకుపడ్డారు. భారీ అవినీతి జరిగినా, గొప్పగా పనులు జరిగాయంటూ చెప్పుకోవడాన్ని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. కాంట్రాక్టర్ల బకాయిలు చాలావరకు తీర్చాం: ప్రశాంత్‌రెడ్డి రోడ్ల అభివృద్ధికి గతం కంటే ఈసారి ఎక్కువ నిధులే కేటాయించుకున్నామని రోడ్లు భవనాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. కాంట్రాక్టర్లకు భారీగా బిల్లుల బకాయిలున్న మాట నిజం కాదన్నారు. గతంలో ఎక్కువే ఉండేవని, కానీ ఆర్డీఎఫ్ ద్వారా రుణం పొంది వాటిని చాలా వరకు తీర్చేశామని చెప్పారు. లుంబినీ పార్కులో తెలంగాణ అమరవీరుల స్మృతి చిహ్నాన్ని అద్భుతంగా రూపొందిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లోనూ ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాలు నిర్మించాలన్న సభ్యుల సూచనను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. 80 శాతం పూర్తయిన ‘భగీరథ’ రాష్ట్రంలో మిషన్ భగీరథ పథకం 80% పూర్తయిందని, త్వరలో మిగతా పనులు పూర్తి చేస్తామని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు. మిషన్ భగీరథ పుణ్యాన ఇప్పుడు వేసవిలోనూ రాష్ట్రంలో తాగు నీటి సమస్య లు లేవన్నారు. పుణ్యస్నానాలు ఆచరించే గోదావరి జలం ఇంటిలో నల్లా తిప్పగానే వస్తున్నందుకు అభినందించాల్సింది పో యి కాంగ్రెస్ నేతలు అనవసర ఆరోపణ లు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయనపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంలో రాజగోపాల్ ను ఉద్దేశించి మంత్రి వాడిన ఓ పదాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటిం చారు. అందుకు సారీ కూడా చెప్పారు. -
అంకెల రంకెలు మనకే చేటు: జానారెడ్డి
-
అంకెల రంకెలు మనకే చేటు: జానారెడ్డి
⇒ బడ్జెట్ గణాంకాలు సప్త సముద్రాలు దాటుతున్నా అభివృద్ధి ఏది? ⇒ ఆశల పల్లకిలో ఊరేగించారు.. భ్రమింపజేసే బడ్జెట్ ఇది వాస్తవికతకు దూరంగా ఉంది.. ⇒ గతబడ్జెట్ అసలు లెక్కలు మరిచిపోయారా? ⇒ లోటును దాచి లేని మిగులు చూపితే కేంద్రం నుంచి మనకే నిధులు తగ్గుతాయి ⇒ వ్యవసాయం గొప్పగా ఉంటే ఆహారధాన్యాల ఉత్పత్తి ఎందుకు తగ్గింది? సాక్షి, హైదరాబాద్: ‘‘నైరాశ్యం నుంచి ఆశావహం వైపు పయనం సాగిస్తున్నామని బడ్జెట్లో పేర్కొన్నారు. నిజమే.. ప్రజలకు ఆశలు కల్పించేలా అంకెలు చూపారు. అభివృద్ధి ఎల్లలు దాటుతోందని చెప్పారు. బడ్జెట్ గణాంకాలు సప్త సముద్రాలు దాటుతున్నాయి.. మరి నిజమైన అభివృద్ధి ఎటుపోయింది? ఏ రాష్ట్రంలో కూడా బడ్జెట్ అంకెల పెరుగుదల రేటు ఇంతగా లేదు. ప్రజలను గొప్ప ప్రగతి అంటూ భ్రమింపజేసే ప్రయత్నం భేషుగ్గా జరిగింది. ఆశల పల్లకిలో ఊరేగించేశారు. ఏ రకంగానూ ఇది వాస్తవిక బడ్జెట్ కాదు..’’అని ప్రతిపక్ష నేత జానారెడ్డి దుయ్యబట్టారు. ఆర్భాటాలకు పోయి ప్రభుత్వం బడ్జెట్ గణాంకాలను భారీగా చూపి తుదకు రాష్ట్రానికి భారీ నష్టాన్ని తేబోందని హెచ్చరించారు. లోటు కనపడకుండా అంకెల్లో మిగులును చూపి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు మోకాలొడ్డి రాష్ట్ర ప్రగతికి ప్రతిబంధకంగా మారుతోందంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌పై చర్చలో భాగంగా అసెంబ్లీలో గురువారం ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. ప్రభుత్వ తీరుపై ప్రజల్లో అనుమానాలుంటే నివృత్తి చేయాలి తప్ప వాటిని కొట్టిపడేయొద్దని, తాము అలా కొట్టేశాం కాబట్టే మమ్మల్ని ఇలా కొట్టిపడేశారని వ్యాఖ్యానించారు. లోటు ఉంటే మిగులు ఎలా చూపుతారు? వ్యవసాయం గొప్పగా ఉందంటున్న ప్రభుత్వం ఈ లెక్కలకు సమాధానం చెప్పాలంటూ జానారెడ్డి కొన్ని గణాంకాలను సభ ముందుంచారు. 2013–14లో ఆహారధాన్యాల ఉత్పత్తి 107 లక్షల టన్నులుంటే తదుపరి రెండు సంవత్సరాల్లో వరుసగా 72 లక్షల టన్నులు, 51 లక్షల టన్నులకు పడిపోయిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ‘‘2015–16 కాగ్ ఆడిట్ నివేదికలో.. రెవెన్యూ రాబడి రూ.73 వేల కోట్లు, రెవెన్యూ వ్యయం రూ.77 వేల కోట్లుగా ఉంది. ఆ నివేదిక రూ.4 వేల కోట్ల లోటు చూపిస్తుంటే మీ లెక్కలు మాత్రం మిగులును చూపుతున్నాయి, అభివృద్ధి ఎల్లలు దాటిందంటే ఇదేనా?’’అని జానారెడ్డి ప్రశ్నించారు. ‘‘గత బడ్జెట్లో పన్నుల ఆదాయం రూ.46 వేల కోట్లకు మించదు అని నేను చెప్పా.. సవరించిన అంచనాలు దాన్ని దాదాపు నిజం చేసిన మాట మరిచారా? ఈసారి రూ.62 వేల కోట్లు అంటున్నారు. అది రూ.52 వేల కోట్లను మించదు. వివిధ ఆదాయాల్లో దాదాపు రూ.25 వేల కోట్ల మేర తగ్గుదల ఉండబోతోంది. అలాంటపుపడు బడ్జెట్‌ను రూ.1.49 లక్షల కోట్లుగా ఎలా చూపుతారు?’’అని ప్రశ్నించారు. గత బడ్జెట్ రూ.1.30 లక్షల కోట్లుగా చూపి సవరణలో రూ.1.12 లక్షల కోట్లుగా చూపారని, అందులోనూ మరో రూ.10 వేల కోట్ల తేడా ఉండబోతోందన్నారు. దీన్ని చూసైనా వాస్తవ అంకెలు పేర్కొనాల్సిందని అభిప్రాయపడ్డారు. సంక్షోభంలో వ్యవసాయం.. గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని జానారెడ్డి పేర్కొన్నారు. రుణమాఫీలో జాప్యంతో, అప్పులు దొరక్క అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారని, పావలా వడ్డీ సకాలంలో చెల్లించటం లేదని, బడ్జెట్లో వ్యవసాయ కేటాయింపులు తగ్గాయని.. ఇవన్నీ వ్యవసాయ సంక్షోభాన్ని సూచించటం లేదా అని ప్రశ్నించారు. కరెంటు కొనుగోలు, ఇతర అంశాల్లో ప్రభుత్వ నిర్వాకం భవిష్యత్‌లో తీవ్ర సంక్షోభానికి కారణమవుతుందన్నారు. ఇప్పుడు కోతలు లేవని సంబరపడ్డా భవిష్యత్‌లో వాతలు తప్పవని హెచ్చరించారు. ఛత్తీస్‌గఢ్ కరెంటు విషయంలో ప్రణాళిక లేకుండా వ్యవహరించి ఖజానాపై తీవ్ర భారం మోపబోతున్నారన్నారు. ఈఆర్సీ ధర నిర్ణయించకుండానే కరెంటు తీసుకుంటున్నారని, ఛత్తీస్‌గఢ్ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ప్రకారం మెగావాట్‌కు రూ.9 కోట్లు ఖర్చవుతుందని, కొనే కరెంటుకు ఆ మేరకు ధర నిర్ణయిస్తే భారీగా భారం పడుతుందన్నారు. మహేశ్వరం కారిడార్ సిద్ధం కాకుండానే కరెంటును బుక్ చేసుకోవటం వల్ల ఏప్రిల్ నుంచి పవర్ వాడినా వాడకున్నా వపర్ గ్రిడ్‌కు సరఫరా ఖర్చు కింద యూనిట్‌కు 45 పైసలు, ఛత్తీస్‌గఢ్‌కు ఫిక్స్డ్ కాస్ట్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. టీఎస్ఐపాస్తో భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయని ప్రభుత్వం చెబుతున్నా... కొత్తగా ఉపాధి పొందినవారి సంఖ్య నిరాశాజనకంగా ఉందని విమర్శించారు. ఈ విషయాన్ని సామాజిక, ఆర్థిక సర్వే కూడా స్పష్టం చేసిందన్నారు. జానా మాటల్లో కొన్ని విరుపులు.. – ప్రభుత్వం తీరును నిలదీస్తే విమర్శలంటూ ఎదురుదాడి చేస్తున్నారు. కానీ సభలో నేను సరిగా మాట్లాడకుంటే పాలక పక్షంతో కుమ్మక్కయ్యారా అని ప్రజలు నన్ను అడుగుతారు. – మీలాగా మేం కూడా కొన్ని ఆర్భాటపు ప్రకటనలు చేశాం. అవి తప్పని తెలుసుకుని తేరుకునే సరికి ఇక్కడొచ్చి కూర్చోవాల్సి వచ్చింది. – అధికారంలోకి వచ్చాక ఇక ధర్నాలు లేవంటున్నారు. కానీ రాష్ట్రంలో యువత ఇప్పుడు తీవ్ర నైరాశ్యంలో ఉంది. తెలంగాణ రావటానికి ఉద్యమంలో ముందుండి నిలబడింది ఆ యువతేనన్న విషయాన్ని పాలకపక్షం మరిచిపోయినట్టుంది. ధర్నాలే లేవంటూ.. అసలు ధర్నాలకు అవకాశం లేకుండా ధర్నా చౌక్‌ను తొలగిస్తున్నారు. -
బడ్జెట్‌పై చర్చను ప్రతిపక్షం ప్రారంభించదా?
కాంగ్రెస్ ఎమ్మెల్యేల విస్మయం సాక్షి, హైదరాబాద్: బడ్జెట్‌పై చర్చను ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రారంభించాల్సి ఉన్నా, బుధవారం శాసనసభలో చర్చ జరిగిన తీరుపై కాంగ్రెస్ పార్టీ సభ్యులు అసంతృప్తిని వెలిబుచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 2017–18 బడ్జెట్‌ను సోమవారం ప్రవేశపెట్టగా, బుధవారంనాడు దీనిపై చర్చ ప్రారంభమైంది. బడ్జెట్‌పై ప్రధాన ప్రతిపక్ష పార్టీ చర్చను ప్రారంభించడం ఇప్పటిదాకా ఆనవాయితీ. దీని ప్రకారం రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు చర్చను ప్రారంభించాల్సి ఉండగా, దీనికి భిన్నంగా బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి చర్చను ప్రారంభించారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి బుధవారం సభకు హాజరుకాకపోవడం వల్లనే బీజేపీ సభ్యులు చర్చను ప్రారంభిం చినట్టుగా కాంగ్రెస్ సభ్యులు వెల్లడించారు. కీలకమైన బడ్జెట్ ప్రారంభ చర్చ అవకాశా న్ని మరో పార్టీకి వదిలివేయడంపై ఆ పార్టీ సభ్యులు అసంతృప్తిని వ్యక్తం చేశారు.