కాంగ్రెస్ ఎమ్మెల్యేల విస్మయం
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్‌పై చర్చను ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రారంభించాల్సి ఉన్నా, బుధవారం శాసనసభలో చర్చ జరిగిన తీరుపై కాంగ్రెస్ పార్టీ సభ్యులు అసంతృప్తిని వెలిబుచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 2017–18 బడ్జెట్‌ను సోమవారం ప్రవేశపెట్టగా, బుధవారంనాడు దీనిపై చర్చ ప్రారంభమైంది. బడ్జెట్‌పై ప్రధాన ప్రతిపక్ష పార్టీ చర్చను ప్రారంభించడం ఇప్పటిదాకా ఆనవాయితీ. దీని ప్రకారం రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు చర్చను ప్రారంభించాల్సి ఉండగా, దీనికి భిన్నంగా బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి చర్చను ప్రారంభించారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి బుధవారం సభకు హాజరుకాకపోవడం వల్లనే బీజేపీ సభ్యులు చర్చను ప్రారంభిం చినట్టుగా కాంగ్రెస్ సభ్యులు వెల్లడించారు. కీలకమైన బడ్జెట్ ప్రారంభ చర్చ అవకాశా న్ని మరో పార్టీకి వదిలివేయడంపై ఆ పార్టీ సభ్యులు అసంతృప్తిని వ్యక్తం చేశారు.
బడ్జెట్‌పై చర్చను ప్రతిపక్షం ప్రారంభించదా?
Published Thu, Mar 16 2017 2:15 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement