Bull Rally
-
ఈక్విటీ రాబడులపై పన్ను సున్నా!
కొన్నేళ్ల క్రితం విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు మొదలు పెడితే మన ఈక్విటీలు బేల చూపు చూసేవి. కానీ, నేడు ఆ పరిస్థితి లేదు. ఫారిన్ ఇన్వెస్టర్లు అమ్మిన మేర ఇనిస్టిట్యూషన్స్, రిటైల్ ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తున్నారు. మన దేశ ఈక్విటీల్లో రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం గతంతో పోలి్చతే గణనీయంగా పెరిగిందని చెప్పడానికి ఈ ఒక్క నిదర్శనం చాలు. నేరుగా స్టాక్స్‌లో, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా తర్వాతి నుంచి ఈక్విటీ మార్కెట్ మంచి బుల్ ర్యాలీ చేయడం.. ఎంతో మంది ఇన్వెస్టర్లు అటు వైపు అడుగులు వేసేలా చేసింది. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్‌లో క్రమానుగత పెట్టుబడుల (సిప్) ప్రాధాన్యాన్ని ఇన్వెస్టర్లు అర్థం చేసుకుంటున్నారు. తమ భవిష్యత్ ఆరి్థక లక్ష్యాల్లో ఈక్విటీలకు చోటు కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఈక్విటీ రాబడులపై పన్ను బాధ్యతను ప్రతి ఇన్వెస్టర్ తప్పకుండా అర్థం చేసుకోవాలి. 2024–25 బడ్జెట్లో ఈక్విటీ లాభాలపై స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాల పన్నును కేంద్ర సర్కారు పెంచేసింది. ఈ భారం సాధ్యమైన మేర తగ్గించుకునేందుకు ఇన్వెస్టర్ల ముందు పలు మార్గాలున్నాయి. వాటి గురించి వివరించే కథనమే ఇది. ఆదాయపన్ను చట్టంలో ఇటీవలి మార్పుల అనంతరం స్వల్పకాల లాభాలపై 20 శాతం, దీర్ఘకాల లాభాలపై 12.5 శాతం చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కొనుగోలు చేసిన తేదీ నుంచి ఏడాది నిండకుండా విక్రయించిన స్టాక్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై వచ్చే లాభం స్వల్పకాల మూలధన లాభం (ఎస్టీసీజీ) అవుతుంది. దీనిపై 20 శాతం పన్ను చెల్లించాలి. ఏడాది పూర్తయిన అనంతరం విక్రయించినప్పుడు వచి్చన లాభం దీర్ఘకాల మూలధన లాభం (ఎల్టీసీజీ) కిందకు వస్తుంది. ఎల్టీసీజీ ఒక ఆరి్థక సంవత్సరంలో రూ.1.25 లక్షలకు మించకపోతే ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. రూ.1.25 లక్షలకు మించిన లాభంపై 12.5 శాతం ఎల్టీసీజీ చెల్లించాల్సి ఉంటుంది. పన్ను తగ్గించుకునే మార్గాలు..ఈక్విటీల్లో స్వల్పకాల మూలధన లాభాలపై (ఎస్టీసీజీ) 20 శాతం పన్ను చెల్లించాల్సిందే. పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు ఎలాంటి వెసులుబాట్లు లేవు. ఏడాదికి మించి పెట్టుబడులు కొనసాగించడం ద్వారానే మూలధన లాభాలపై పన్ను భారం లేకుండా చూసుకునేందుకు లేదా తగ్గించుకునేందుకు మార్గాలున్నాయి. ముఖ్యంగా ఈక్విటీలు మూడేళ్లు అంతకుమించిన కాలానికే అనుకూలం. మూడేళ్లలోపు పెట్టుబడులకు ఈక్విటీలు సూచనీయం కాదు. ఎందుకంటే స్వల్పకాలంలో ఈక్విటీలు స్థూల ఆరి్థక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విధాన నిర్ణయాలు తదితర ఎన్నో అంశాల ఆధారంగా అస్థిరతలకు లోనవుతూ ఉంటాయి. మూడు నుంచి ఐదేళ్లు అంతకుమించిన కాలంలో ఈ అస్థిరతలను అధిగమించి స్టాక్స్ ర్యాలీ చేస్తుంటాయి. కనుక స్వల్పకాలంలో ఆటుపోట్లు ఉన్నప్పటికీ.. దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు భరోసా ఉంటుంది. కనుక రిటైల్ ఇన్వెస్టర్లు తమ మధ్య, దీర్ఘకాల లక్ష్యాల కోసమే ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. తద్వారా అధిక రాబడులకు తోడు, ఆ మొత్తంపై పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి అవకాశాలుంటాయి.ట్యాక్స్ హార్వెస్టింగ్ఒక ఆరి్థక సంవత్సరంలో ఈక్విటీల్లో దీర్ఘకాల మూలధన లాభం రూ.1.25 లక్షల వరకు పన్ను లేదు కనుక, ఏటా తమ పెట్టుబడులపై ఈ మేరకు లాభాలను స్వీకరించడం ట్యాక్స్ హార్వెస్టింగ్ అవుతుంది. తిరిగి అంతే మొత్తాన్ని మళ్లీ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఒక ఉదాహరణ చూద్దాం. ఉదాహరణకు 2023 సెపె్టంబర్ 1న స్టాక్స్ లేదా ఈక్విటీ ఫండ్స్‌లో రూ.6 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. 2024 సెపె్టంబర్ 1 నాటికి ఈ విలువ 12 శాతం రాబడి అంచనా ప్రకారం రూ.6,75,305 అవుతుంది. ఇందులో లాభం రూ.75,305. రూ.1.25లక్షల వరకు లాభం ఉన్నా పన్ను లేదు కనుక, ఈ మొత్తాన్ని విక్రయించి తిరిగి ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల ఎలాంటి పన్ను భారం పడదు. ఇలా ఏటా రూ.1.25లక్షల మేరకు దీర్ఘకాలిక మూలధన లాభాన్ని స్వీకరిస్తూ.. తిరిగి ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడం ఒక మార్గం. ఇల్లు కొనడం.. ఈక్విటీ దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను లేకుండా ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 54ఎఫ్ మార్గం చూపిస్తోంది. ఈ సెక్షన్ కింద గరిష్ట ప్రయోజనం రూ.10 కోట్లు. దీర్ఘకాల ఈక్విటీ పెట్టుబడులు విక్రయించినప్పుడు వచి్చన మొత్తం రూ.10 కోట్ల వరకు ఉంటే, దీనిపై భారీగా పన్ను చెల్లించాల్సి వస్తుంది. దీనికి బదులు ఆ మొత్తంతో ఒక నివాస గృహం కొనుగోలు చేస్తే సరి. ఇలా చేయడం వల్ల ఎలాంటి పన్ను లేకుండా సెక్షన్ 54ఎఫ్ కింద పూర్తి ప్రయోజనం పొందొచ్చు. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలే (హెచ్‌యూఎఫ్) ఈ ప్రయోజనానికి అర్హులు. దీర్ఘకాలిక ఈక్విటీ పెట్టుబడులే అని కాదు, ప్లాట్, వాణిజ్య భవనం, బంగారం, ట్రేడ్ మార్క్‌లు, పేటెంట్లు, మెషినరీ సైతం లాంగ్ టర్మ్ క్యాపిటల్ అస్సెట్ కిందకు వస్తాయి. వీటిపైనా ఇదే ప్రయోజనం పొందొచ్చు. బాండ్లు సెక్షన్ 80ఈసీ కింద ఈక్విటీ దీర్ఘకాల మూలధన లాభాలను క్యాపిటల్ గెయిన్స్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసినా పన్ను భారం నుంచి తప్పించుకోవచ్చు. ఆర్ఈసీ, ఎన్హెచ్ఏఐ తదితర ప్రభుత్వరంగ సంస్థలు జారీ చేసే బాండ్లలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. వీటిలో పెట్టుబడులపై రాబడి 6 శాతం వరకు ఉంటుంది. దీర్ఘకాల ఈక్విటీ పెట్టుబడులు విక్రయించిన తేదీ నుంచి ఆరు నెలలు దాటకుండా ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తేనే ప్రయోజనం లభిస్తుంది. గరిష్టంగా రూ.50 లక్షల పెట్టుబడులకే ఈ ప్రయోజనం పరిమితం. ఈక్విటీ దీర్ఘకాల పెట్టుబడులు విక్రయించినప్పుడు వచ్చిన మొత్తం రూ.50 లక్షలకు మించి ఉంటే, అదనపు మొత్తంపై నిబంధనల మేరకు పన్ను చెల్లిస్తే సరిపోతుంది. బాండ్లలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఐదేళ్లలోపు వాటిని విక్రయిస్తే.. గతంలో పొందిన పన్ను ప్రయోజనం కోల్పోతారు. అంటే ఆ మొత్తంపై పన్ను చెల్లించాల్సి వస్తుంది. అంతేకాదు ఈ బాండ్లపై ఐదేళ్లలోపు రుణం పొందినా ఈ ప్రయోజనం కోల్పోతారు.షరతులు ఉన్నాయ్... దీర్ఘకాల ఈక్విటీ మూలధన లాభాలపై సెక్షన్ 54ఎఫ్ కింద పన్ను మినహాయింపు పొందాలంటే కొన్ని షరతులు పాటించాల్సి ఉంటుంది. దీర్ఘకాల ఈక్విటీ పెట్టుబడులు విక్రయించే తేదీకి ఏడాది ముందు కాలంలో లేదా విక్రయించిన తేదీ నుంచి తర్వాతి రెండేళ్లలోపు నివాస అవసరాలకు వినియోగించే ఇల్లు (పాతది లేదా కొత్తది) కొనుగోలు చేయాలి. ఇల్లు నిరి్మంచుకునేట్టు అయితే దీర్ఘకాల క్యాపిటల్ అసెట్స్ విక్రయించిన నాటి నుంచి మూడేళ్ల వరకు వ్యవధి ఉంటుంది. మూలధన లాభాలే కాకుండా, విక్రయించినప్పుడు వచ్చిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా కొంత మొత్తంతోనే ఇల్లు కొనుగోలు లేదా ఇంటి నిర్మాణంపై వెచి్చస్తే, అప్పుడు మిగిలిన మూలధన లాభాలపై నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఒక ఇంటి కొనుగోలుకే ఈ ప్రయోజనం పరిమితం. ఈక్విటీ ధీర్ఘకాల పెట్టుబడులు విక్రయించగా వచ్చిన మొత్తం రెండిళ్ల కొనుగోలుపై వెచ్చిస్తే.. ఒక ఇంటిపై చేసిన వ్యయాన్నే సెక్షన్54ఎఫ్ కింద పరిగణనలోకి తీసుకుంటారు. సెక్షన్ 54ఎఫ్ కింద పన్ను మినహాయింపు పొందాలంటే, ఈక్విటీ దీర్ఘకాల పెట్టుబడులు విక్రయించే నాటికి ఒక ఇంటిని మించి కలిగి ఉండకూడదు. రెండో ఇంటిని జాయింట్లో కలిగి ఉన్నా అర్హత కోల్పోయినట్టే. ఈక్విటీ దీర్ఘకాల పెట్టుబడులను విక్రయించినప్పుడు పన్ను మినహాయింపు కోసం ఇంటిపై వెచ్చించాలని చెప్పుకున్నాం. అయితే, విక్రయించిన ఆర్థిక సంవత్సరం రిటర్నులు దాఖలు చేసే నాటికి ఇల్లు కొనుగోలు లేదా నిర్మాణంపై వెచి్చంచడం సాధ్యపడలేదు అనుకుందాం. అలాంటప్పుడు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో క్యాపిటల్ గెయిన్స్ అకౌంట్ స్కీమ్ కింద ఆ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలి. ఆ తర్వాత దీని నుంచి ఉపసంహరించుకుని నిబంధనలకు అనుగుణంగా నిరీ్ణత కాలం లోపు ఇంటి కోసం వెచి్చంచి, పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ నిరీ్ణత కాలంలోపు ఇంటి కొనుగోలు లేదా నిర్మాణంపై వెచి్చంచలేకపోయారని అనుకుందాం. అటువంటప్పుడు ఆ మొత్తాన్ని క్రితం ఆరి్థక సంవత్సరానికి సంబంధించి ఎల్‌టీసీజీగా చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.సరైన నిర్ణయమేనా?మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ లాభాలపై పన్ను తప్పించుకునేందుకు సెక్షన్ 54ఎఫ్‌ను వినియోగించుకుని ఇంటిపై ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయమేనా..? అంటే, అందరికీ కాకపోవచ్చన్నదే సమాధానం. పిల్లల ఉన్నత విద్య, వారి వివాహం, రిటైర్మెంట్ తదితర లక్ష్యాల కోసం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన వారు, పన్ను మినహాయింపు కోసం తీసుకెళ్లి ఇంటిపై వెచి్చంచడం సరైనది అనిపించుకోదు. కనుక ఈ విషయంలో ఇన్వెస్టర్లు అందరికీ ఒక్కటే సలహా నప్పదు. సొంతిల్లు సమకూర్చుకోవాలని కోరుకునే వారికి సెక్షన్ 54ఎఫ్ మంచి ఆప్షన్ అవుతుంది. అలాగే, పన్ను మినహాయింపు కోసం ఇంటిపై ఇన్వెస్ట్ చేసి వృద్ధాప్యంలో ఆ ఇంటిని రివర్స్ మార్ట్గేజ్ కోసం వినియోగించుకునే ఆలోచన ఉన్న వారికి కూడా 54ఎఫ్ ప్రయోజనం అనుకూలమే.నష్టాలతో భర్తీ..ఈక్విటీల్లో మూలధన లాభాలపై పన్ను తగ్గించుకునేందుకు.. మూలధన నష్టాలతో భర్తీ చేసుకోవడం మరో ఆప్షన్. ఏడాదికి మించని ఈక్విటీ పెట్టుబడులు విక్రయించగా వచ్చిన స్వల్పకాల మూలధన నష్టాన్ని.. తిరిగి స్వల్పకాల మూలధన లాభం లేదా దీర్ఘకాల మూలధన లాభంలో సర్దుబాటు చేసుకోవచ్చు. ఇలా సర్దుబాటు చేయగా మిగిలిన మొత్తంపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఇలా సర్దుబాటు చేసుకున్న తర్వాత కూడా నష్టం మిగిలి ఉంటే దాన్ని అప్పటి నుంచి తదుపరి ఎనిమిదేళ్లపాటు లాభాలతో సర్దుబాటు చేసుకోవచ్చు. పన్ను రిటర్నులు దాఖలు చేయడం ద్వారానే ఇందుకు అవకాశం ఉంటుంది. కానీ, దీర్ఘకాల మూలధన నష్టాన్ని.. కేవలం దీర్ఘకాల మూలధన లాభంతోనే సర్దుబాటు చేసుకోగలరు.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
కాంగ్రెస్ సభలో ఎద్దు బీభత్సం.. బీజేపీ కుట్రేనటా!
గాంధీనగర్: కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలోకి ఓ ఎద్దు ప్రవేశించింది. ఎటు వెళ్లాలో తెలియక అటూఇటు పరుగులు పెట్టడం వల్ల అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంఘటన గుజరాత్‌లోని మెహ్సానా ప్రాంతంలో మంగళవారం జరిగింది. వేదికపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ మాట్లాడుతున్న క్రమంలో ఓ నల్లటి కొమ్ములు తిరిగిన ఎద్దు ఆ సభలోకి ప్రవేశించింది. దీంతో పలువురు భయంతో పరుగులు పెట్టాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్‌గా మారింది. మరోవైపు.. ఎద్దు బెదిరిపోకుండా అంతా నిశబ్దంగా ఉండాలని సీఎం అశోక్ గెహ్లట్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ సభ జరుగుతున్న సమయంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, బీజేపీ సభ్యులు కావాలనే ఎద్దులు లేదా ఆవులను వదులుతున్నారని ఆరోపించారు. సభను చెదరగొట్టేందుకు ఎద్దును బీజేపీనే పంపించిందన్నారు. ఇది బీజేపీ చేసిన కుట్ర అని ఆరోపించారు. కాంగ్రెస్ సమావేశాలను భంగపరచాలనే దురుద్దేశంతో తరుచుగా ఇలాంటి వ్యూహాలను పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 1, 5వ తేదీల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆప్‌ల మధ్య త్రిముఖ పోరు ఉండనుంది. ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న ఉండనుంది. మంగళవారంతో తొలివిడత 89 స్థానాల పోలింగ్‌కు ప్రచారం ముగిసింది. गुजरात मे @ashokgehlot51 की सभा में घुसा सांड!! सीएम बोले.... मैं बचपन से देखता आ रहा हूं, ये भाजपा भेजती है मेरी सभा में सांडों को. pic.twitter.com/RkB8oSmowx — Sharad (@DrSharadPurohit) November 28, 2022 ఇదీ చదవండి: ప్రధాని మోదీని రావణుడితో పోల్చిన ఖర్గే.. బీజేపీ ఆగ్రహం -
7వ రోజూ భలే దూకుడు
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లలో అలుపెరుగకుండా రంకెలేస్తున్న బుల్ మరోసారి విజృంభించింది. సూచీలు వరుసగా 7వ రోజూ హైజంప్ చేశాయి. సెన్సెక్స్ 460 పాయింట్లు ఎగసి 61,766 వద్ద నిలవగా.. నిఫ్టీ 139 పాయింట్లు ఎగసి 18,477 వద్ద ముగిసింది. ప్రధానంగా మెటల్, బ్యాంకింగ్, ఐటీలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో మిడ్‌సెషన్‌కల్లా సెన్సెక్స్ 61,963కు చేరగా.. నిఫ్టీ 18,543 పాయింట్లను అధిగమించింది. వెరసి అటు ముగింపు, ఇటు ఇంట్రాడేలోనూ మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలను సాధించాయి! విదేశీ మార్కెట్లలో కనిపిస్తున్న నిరుత్సాహకర ట్రెండ్‌ను సైతం లెక్కచేయకుండా సరికొత్త గరిష్టాలను చేరాయి. ఎన్ఎస్ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్, మెటల్ రంగాలు 4 శాతం జంప్‌చేయగా.. ఐటీ 1.6 శాతం ఎగసింది. లాభాల స్వీకరణ నేపథ్యంలో ఫార్మా, హెల్త్‌కేర్, మీడియా ఇండెక్సులు 0.7% బలహీనపడ్డాయి. ఇన్ఫోసిస్ జోరు నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కో, ఇన్ఫోసిస్ 5 శాతం స్థాయిలో జంప్‌చేయగా.. టెక్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, ఓఎన్జీసీ, మారుతీ, యాక్సిస్, ఎస్బీఐ 3.3–1.3 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే ఎంఅండ్ఎం, హెచ్‌సీఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, బజాజ్ ఆటో, హీరో మోటో, సిప్లా, ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సన్ ఫార్మా 2–0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. ఈ ఏడాది క్యూ3(జులై–సెప్టెంబర్)లో చైనా జీడీపీ గణాంకాలు నిరాశపరచినప్పటికీ ఎంపిక చేసిన రంగాలలోని బ్లూచిప్ కౌంటర్లలో పెట్టుబడులు సెంటిమెంటుకు బలాన్నిచి్చనట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. క్యూ3లో చైనా ఆర్థిక వ్యవస్థ 4.9 శాతమే పుంజుకుంది. ఇందుకు పారిశ్రామికోత్పత్తి అంచనాలను అందుకోకపోవడం ప్రభావం చూపింది. బేస్ మెటల్ ధరలు బలపడటంతో మెటల్ షేర్లకు డిమాండ్ పెరిగినట్లు తెలియజేశారు. చిన్న షేర్లు ఓకే... బీఎస్ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1 శాతం స్మాల్ క్యాప్ 0.7 శాతం చొప్పున వృద్ధి చూపాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1,758 లాభపడగా.. 1,696 నీరసించాయి. నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నికరంగా రూ. 512 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) దాదాపు రూ. 1,704 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. ఇతర విశేషాలు.. ► పారస్ డిఫెన్స్ షేరు టీ గ్రూప్ నుంచి రోలింగ్ విభాగంలోకి బదిలీ కావడంతో 20% అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఎన్ఎస్ఈలో రూ. 125 జమ చేసుకుని రూ. 750 వద్ద ముగిసింది. ► ఈ ఏడాది క్యూ2లో రెట్టింపు నికర లాభం ప్రకటించిన ఎవెన్యూ సూపర్‌మార్ట్స్(డీమార్ట్) షేరు తొలుత 11 శాతం దూసుకెళ్లి రూ. 5,900ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. చివర్లో లాభాల స్వీకరణ ఊపందుకుని చతికిలపడింది. 7.6% పతనమై రూ. 4,920 వద్ద స్థిరపడింది. ► కార్లయిల్ గ్రూప్‌నకు ప్రిఫరెన్స్ షేర్ల జారీ ద్వారా రూ. 4,000 కోట్లు సమకూర్చుకునే ప్రతిపాదనను విరమించుకోవడంతో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ షేరు 5 శాతం లోయర్ సర్క్యూట్‌కు చేరింది. ఎన్ఎస్ఈలో రూ. 32 కోల్పోయి రూ. 607 వద్ద నిలిచింది. ► ఏడు వరుస సెషన్లలో మార్కెట్లు బలపడటంతో ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 12.49 లక్షల కోట్లమేర ఎగసింది. దీంతో బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 2,74,69,607 కోట్లకు చేరింది. ఇది సరికొత్త రికార్డు కావడం విశేషం! ► గత ఏడు రోజుల్లో ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 2,576 పాయింట్లు(4.4 శాతం) దూసుకెళ్లింది. -
సెన్సెక్స్ @ 59,000
స్టాక్ మార్కెట్లో బుల్ దూకుడు కొనసాగుతోంది. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, ఇంధన రంగాల షేర్లు రాణించడంతో గురువారమూ సూచీల రికార్డుల ర్యాలీ కొనసాగింది. ఆయా రంగాలకు సంబంధించి కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు మార్కెట్ వర్గాలను మెప్పించాయి. ఐటీసీ, రిలయన్స్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ ద్వయం, ఇండస్ఇండ్ బ్యాంక్ తదితర లార్జ్‌క్యాప్ షేర్లు లాభపడి సూచీల ర్యాలీకి ప్రాతినిథ్యం వహించాయి. సెన్సెక్స్ తొలిసారి 59,000 శిఖరాన్ని అధిరోహించి 417 పాయింట్ల లాభంతో 59,141 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 481 పాయింట్లు ర్యాలీ చేసి 59,204 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 125 పాయింట్లు ర్యాలీ చేసి 17,645 వద్ద కొత్త తాజా గరిష్టాన్ని అందుకుంది. మార్కెట్ ముగిసేసరికి 110 పాయింట్ల లాభంతో 17,629 వద్ద నిలిచింది. గడచిన మూడురోజుల్లో సెన్సెక్స్ 963 పాయింట్లు, నిఫ్టీ 274 పాయింట్లను ఆర్జించాయి. ఐటీ, మెటల్, మీడియా షేర్లలో మాత్రం లాభాల స్వీకరణ జరిగింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1622 కోట్ల షేర్లను కొనగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.168 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ రెండు పైసలు బలహీనపడి 73.52 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకుల మొండి బకాయిల పరిష్కారానికి సంబంధించి బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుకు సంబంధించిన వార్తతో బ్యాంకింగ్ షేర్లకు భారీ డిమాండ్ నెలకొంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ షేర్లు రాణించడంతో ఎన్ఎస్ఈలోని నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్ ఐదున్నర శాతం, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 3%, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ రెండుశాతం ర్యాలీ చేశాయి. రెండోరోజూ టెలికం షేర్ల లాభాల మోత టెలికాం రంగానికి చేయూతనిచ్చేందుకు కేంద్ర కేబినేట్ తీసుకున్న నిర్ణయాలతో ఈ రంగ షేర్లు రెండురోజూ రాణించాయి. వోడాఫోన్ ఇంట్రాడేలో 28 శాతం లాభపడి రూ.11.47 స్థాయికి చేరింది. చివరికి 26 శాతం లాభంతో రూ.11.25 వద్ద ముగిసింది. భారతీ ఎయిర్టెల్ షేరు ట్రేడింగ్‌లో రెండున్నర శాతం ర్యాలీ చేసి రూ.744 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. మార్కెట్ ముగిసే సరికి ఒకశాతం శాతంతో రూ.718 వద్ద స్థిరపడింది. మార్కెట్ క్యాప్‌లో ఐదో స్థానానికి భారత్ సూచీలు వరుస ర్యాలీతో గడిచిన మూడురోజుల్లో స్టాక్ మార్కెట్లో రూ.4.46 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ జీవితకాల గరిష్టస్థాయి రూ.260 లక్షల కోట్లకు చేరింది. విలువపరంగా భారత స్టాక్ మార్కెట్ ప్రపంచంలోనే ఐదోస్థానానికి చేరినట్లు బీఎస్ఈ సీఈవో అశిష్ చౌహాన్ తెలిపారు. సన్సార్ ఐపీఓకు మంచి స్పందన... ఆటో ఉపకరణాల తయారీ సంస్థ సన్సార్ ఇంజనీరింగ్ ఐపీఓకు మంచి స్పందన లభించింది. చివరిరోజు నాటికి 11.47 రెట్ల సబ్స్రై్కబ్షన్ను సాధించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ మొత్తం 1.21 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా... 13.88 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. క్యూఐబీ విభాగంలో 26.47 రెట్లు, నాన్ – ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కేటగిరీలో 11.37 రెట్లు, రిటైల్ విభాగంలో 3.15 రెట్లు సబ్‌స్క్రైబ్ అయినట్లు ఎక్చ్సేంజీ గణాంకాలు తెలిపాయి. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.382 కోట్లను సమీకరించింది. సెపె్టంబర్ 21న పరాస్ డిఫెన్స్ ఐపీఓ పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఐపీఓ సెపె్టంబర్ 21న ప్రారంభం కానుంది. ఇదే నెల 23న ముగియనుంది. ఐపీఓకు ధరల శ్రేణిని రూ.165 – 175 గా నిర్ణయించారు. సెన్సెక్స్ 57వేల నుంచి 58వేల స్థాయికి చేరేందుకు మూడురోజుల ట్రేడింగ్ సమయాన్ని తీసుకోగా.., 58 వేల నుంచి 59 వేల స్థాయికి చేరుకొనేందుకు ఎనిమిది ట్రేడింగ్ సమయాన్ని తీసుకుంది. -
బుల్ పరుగు వెనుక రహస్యమేంటి!
దేశ యువతకే కాదు.. భారత స్టాక్ మార్కెట్ వ్యవస్థకు నరేంద్రమోడీ ఉత్తేజాన్ని అందించారు. ప్రధాని అభ్యర్థిత్వాన్ని ప్రకటించకముందు స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు ఒడిదుడుకులకు లోనవుతూ.. నిస్తేజంగా ఉండేవి. ఎప్పడైతే నరేంద్రమోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారో.. మోడీతోపాటు సూచీలు కూడా పరుగులు పెట్టాయి. నరేంద్రమోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టాక కూడా ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు పరుగు ఆపలేదు. తాజాగా ప్రధాన సూచీలు రికార్డులను తిరగరాస్తూ.. సరికొత్త గరిష్టస్థాయి వద్ద ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 28 వేల, నిఫ్టీ 8350 మార్కును తాకాయి. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత అంటే అక్టోబర్ 16 తేది నుంచి కేవలం 12 సెషన్స్ లో 2 వేల పాయింట్ల ర్యాలీని కొనసాగించింది. 2014 సంవత్సరాంతానికి సెన్సెక్స్ 30 వేల మార్కును చేరవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2009 తర్వాత ఇంత వేగంగా బుల్ ర్యాలీ కొనసాగడం ఇదే ప్రథమం. స్టాక్ మార్కెట్ లో బుల్ మార్కెట్ ర్యాలీ కొనసాగడం వెనుక కారణాలు పరిశీలిద్దాం! *సెన్సెక్స్, నిఫ్టీల ర్యాలీకి 30 శాతం మేరకు విదేశీ నిధుల ప్రవాహమే కారణమని అభిప్రాయపడుతున్నారు. సెప్టెంబర్ 30 నాటికి 294 బిలియన్ల డాలర్ల మేరకు నిధుల ప్రవాహం కొనసాగినట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. భారత దేశ వ్యాపార రంగ చరిత్రలో విదేశీ ఇన్వెస్టర్లు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారి. ' అంతర్జాతీయ మార్కెట్ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గముఖం పెట్టడం కూడా సూచీలు పరుగు పెట్టడానికి కారణమని తెలుస్తోంది. క్రూడ్ ధరలు క్షీణించడంతో డీజీల్, పెట్రోల్ ధరలు తగ్గి ద్రవ్యోల్బణం కూడా అదుపులోకి రావోచ్చని అంచనా వేస్తున్నారు. ' వచ్చే త్రైమాసిక పరపతి ద్రవ్య సమీక్షలో భాగంగా కీలక వడ్డీ రేట్లలో కోత విధించవచ్చనే ఊహాగానాలతో బ్యాంకింగ్ రంగ కంపెనీల షేర్లలో సానుకూలత కనిపించింది. దాంతో బ్యాంకింగ్ ఇండెక్స్ కూడా గరిష్ట స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. * ఈ సంవత్సరం 84 వేల కోట్ల రూపాయల మేరకు భారతీయ ఈక్వీటిల వాటాలను కొనుగోలు చేసినట్టు గణాంకాలు తెలుపుతున్నాయి. -
కొలువులకు బుల్ కళ!
మళ్లీ జోరుగా నియామకాలు రిటైల్ బ్రోకింగ్ సంస్థల భారీ హైరింగ్ ప్రణాళికలు పెద్దయెత్తున ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు న్యూఢిల్లీ: స్టాక్‌మార్కెట్లలో బుల్ ర్యాలీ ఇటు జాబ్ మార్కెట్లోనూ ఉత్సాహం నింపుతోంది. రిటైల్ ఇన్వెస్టర్లు మళ్లీ మార్కెట్లవైపు చూస్తుండటంతో.. బ్రోకింగ్ సంస్థల వ్యాపారం కూడా గణనీయంగా పెరుగుతోంది. దీంతో, కస్టమర్లకు సర్వీసులు అందించడం కోసం అవసరమైన సిబ్బందిని నియమించుకోవడంపై సంస్థలు దృష్టి పెడుతున్నాయి. జోరుగా రిక్రూట్మెంట్ ప్రణాళికలు వేసుకుంటున్నాయి. ఫలితంగా రాబోయే కొన్ని నెలల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల కొద్దీ ఉద్యోగావకాశాలు రానున్నాయి. స్టాక్ మార్కెట్ల ఊగిసలాట కారణంగా కొద్దిరోజుల క్రితం దాకా బ్రోకింగ్ సంస్థలు తీవ్ర సంక్షోభం ఎదుర్కొన్నాయి. గడ్డు పరిస్థితుల నుంచి బైటపడేందుకు వ్యయాలను భారీగా తగ్గించుకున్నాయి. ఇందులో భాగంగా ఏకంగా 1 లక్ష మంది పైగా ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. అయితే, ప్రస్తుతం మార్కెట్లు కళకళ్లాడుతుండటంతో బ్రోకింగ్ సంస్థలు హైరింగ్ యోచనల్లో ఉన్నాయి. క్యాష్ సెగ్మెంట్లో మొత్తం 9,500 బ్రోకింగ్ సంస్థలు ఉండగా.. ఇందులో సింహభాగం సంస్థలు కొత్త కస్టమర్లను దక్కించుకోవడం, వారికి సర్వీసులు అందించేందుకు ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. ఇన్వెస్టర్లు మళ్లీ మార్కెట్లవైపు చూస్తుం డటంతో ఆనంద్ రాఠీ, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి సంస్థలు బులిష్‌గా ప్రణాళికలు వేసుకుంటున్నాయి. ప్రస్తుతం తమ దగ్గర దాదాపు 3,200 మంది ఉద్యోగులు ఉన్నారని, దశలవారీగా ఈ సంఖ్యను మరో 10 శాతం మేర పెంచుకునే అవకాశం ఉందని షేర్‌ఖాన్ మానవ వనరుల విభాగం హెడ్ ఉల్హాస్ పగీ తెలిపారు. క్యాపిటల్ మార్కెట్లు మళ్లీ పుంజుకోవడంతో.. క్లయింట్ల లావాదేవీలు భారీగా పెరుగుతున్నాయని వివరించారు. కొత్త అకౌంట్ల కోసం దరఖాస్తులు కూడా పెరుగుతున్నాయన్నారు. ఆశావహంగా భవిష్యత్..: గడ్డుకాలంలో కూడా భవిష్యత్‌పై ఆశావహ అంచనాలతో అన్ని సన్నాహాలూ చేసుకున్నామని ఆనంద్ రాఠీ ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యవస్థాపక చైర్మన్ ఆనంద్ రాఠీ తెలిపారు. తాము ఊహించినదే ప్రస్తుతం జరుగుతోందని, రిటైల్ సెగ్మెంట్ కూడా కళకళ్లాడుతోందని ఆయన వివరించారు. ట్రేడింగ్ పరిమాణాలు పెరుగుతుండటంతో భవిష్యత్ మరింత ఆశాజనకంగా ఉండగలదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆనంద్ రాఠీ సంస్థలో ప్రస్తుతం 2,500 మంది ప్రొఫెషనల్స్ ఉన్నారు. మరోవైపు, మోతీలాల్ ఓస్వాల్ సంస్థ తమ బ్రోకింగ్ వ్యాపార విభాగం కోసం గత ఏడాది వ్యవధిలో 200 మందిని రిక్రూట్ చేసుకుంది. ఈ సంస్థకు 8 లక్షల క్లయింట్లు ఉండగా. అందులో సుమారు ఏడు లక్షల పైచిలు రిటైల్ బ్రోకింగ్, డిస్ట్రిబ్యూషన్ క్లయింట్లు ఉన్నారు. వ్యాపార పరిస్థితులు మెరుగుపడుతున్నాయని, రిటైల్ కస్టమర్లకు మళ్లీ మార్కెట్లపై విశ్వాసం వస్తోందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఎండీ మోతీలాల్ ఓస్వాల్ తెలిపారు. విస్తరణపై దృష్టి.. గడచిన రెండు నెలలుగా కోటక్ సెక్యూరిటీస్ కూడా నియామకాలపై దృష్టి పెట్టింది. ఎక్కువగా సీనియర్ స్థాయి ఉద్యోగులను తీసుకుంటోంది. జూనియర్ స్థాయి వారికీ అవకాశాలు బాగానే ఉన్నాయని కోటక్ సెక్యూరిటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(హెచ్ఆర్) వివేక్ జైన్ తెలిపారు. తమ దగ్గర ప్రస్తుతం 3,600 మంది సిబ్బంది ఉన్నారని, కొత్తగా వ్యాపారావకాశాలు మరిన్ని వస్తుండటంతో.. సేల్స్, సర్వీసింగ్ విభాగాల్లో మరింత మందిని తీసుకోవాల్సి వస్తుందని వివరించారు. జియోజిత్ బీఎన్పీ పారిబా తమ కస్టమర్ల వ్యాపార పరిమాణం 100% పెరిగిందని, ప్రతి ఇద్దరు కస్టమర్లలో ఒకరు ఇంటర్నెట్ ట్రేడింగ్ చేస్తున్నట్లు పేర్కొంది. ‘వ్యాపారం పెరుగుతోంది. బ్రోకర్లు బాగా ఆర్జిస్తున్నారు. ఉత్పత్తులను విక్రయించాలంటే సరైన నిపుణులు అవసరం. అందుకే దీనిపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నాం’ అని జియోజిత్ బీఎన్పీ పారిబా ఎండీ సీజే జార్జ్ తెలిపారు. ప్రస్తుతం తమ దగ్గర 2,000 మంది ఉద్యోగులు ఉన్నారని, మార్కెట్ల పెరుగుదలను బట్టి మరింత విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు. -
బుల్ ర్యాలీ ఇప్పుడే మొదలైంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే కేంద్రంలో మోడీ నాయకత్వంలోని సుస్థిరమైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మార్కెట్ దృష్టంతా మోడీ ప్రవేశపెట్టే బడ్జెట్‌పైనే ఉంది. బడ్జెట్లో తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా మార్కెట్ కదలికలు ఉంటాయంటున్నారు ఐడీబీఐ మ్యూచువల్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి.శరత్ శర్మ. స్టాక్ మార్కెట్లు గరిష్ట స్థాయిలో ఉన్నా... ఇప్పటికీ ఇంకా చాలా చౌకగానే ఉన్నాయని, రానున్న కాలంలో ఈక్విటీలు మంచి లాభాలు అందించనున్నాయి అంటున్న శరత్ శర్మతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.. మార్కెట్ అంచనాలకు అనుగుణంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక్కడి నుంచి మార్కెట్ కదలికలు ఏ విధంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు? గత మూడు నాలుగేళ్లుగా ఒక పరిమిత శ్రేణిలోనే కదిలాయి. చాలా కంపెనీల షేర్లు వాటి వాస్తవ ధర కంటే చాలా తక్కువ ధరలో ఉండేవి. కాని బీజేపీ మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు మార్కెట్లు 28 శాతం పెరిగాయి. సంస్కరణలకు అనుకూలమైన ప్రభుత్వం పూర్తి మెజార్టీతో అధికారంలోకి రావడం మార్కెట్లకు సానుకూలమైన అంశం. వృద్ధిరేటును గాడిలో పెడుతూ సంస్కరణలను చేపడితే సూచీలు మరింత పైకి దూసుకుపోతాయనడంలో సందేహం లేదు. ఇప్పటికే సూచీలు బాగా పెరగడంతో ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లోకి ప్రవేశించొచ్చా? బుల్ ర్యాలీకి ఇది ప్రారంభం మాత్రమే. సెన్సెక్స్ 24,000 దాటినప్పటికీ ఇంకా 25 శాతం చౌకగానే ఉందని చెప్పొచ్చు. 2014-15 ఆదాయాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం సెన్సెక్స్ 16 పీఈ వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది 15 ఏళ్ల సగటు పీఈ 17-18కి కొద్దిగా తక్కువ. ఈ విధంగా చూస్తే మన సూచీలు సహజ విలువకు దగ్గరగా ఉన్నాయేకాని ఖరీదైనవి కావు. ప్రస్తుతం వృద్ధిరేటు 5 శాతంలోపు ఉంది. ఇది కనుక వృద్ధి చెంది 7-8 శాతానికి చేరితే మన మార్కెట్లు చాలా చౌకగా కనిపిస్తాయి. సగటు పీఈ 18కి చేరినా సెన్సెక్స్ 30,000 మార్కును దాటుతుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి. గడిచిన ఆరేళ్లలో సూచీలు 20 శాతం అంటే ఏడాదికి సుమారు 3 శాతం చొప్పున పెరిగాయి. బ్యాంకు డిపాజిట్లు అందించే వడ్డీ 10 శాతం కంటే ఇది చాలా తక్కువ. ఈ నష్టాన్ని సూచీలు ఒకటి రెండు ఏళ్లలోనే భర్తీ చేస్తాయి. గడిచిన మూడు నెలల్లో కొన్ని రంగాల షేర్లు రెండు నుంచి మూడు రెట్లు పెరిగాయి. ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉందా? వార్తల ఆధారంగా జరిపే ర్యాలీ ఎంతో కాలం నిలబడదు. ఇది మార్కెట్లకు మంచిది కాదు. ఇప్పుడు ర్యాలీ చేసిన వాటిల్లో చాలా షేర్లు రానున్న కాలంలో ఈ లాభాలను నిలుపుకోలేవు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మంచి పనితీరు కనబరుస్తూ, డివిడెండ్ ఇచ్చే, మంచి యాజమాన్యం, పనితీరు, వృద్ధికి అవకాశం ఉన్న లార్జ్, మిడ్‌క్యాప్ షేర్లతోనే పోర్ట్‌ఫోలియో రూపొందించుకోవాలి. అంతేకాని ఒకేసారి సెక్టార్స్‌ను మార్చొద్దు. ఇలా వార్తల ఆధారంగా పెరిగే షేర్లకు దూరంగా ఉండాలి. మోడీ నేతృత్వంలోని రాబోయే కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ నుంచి మార్కెట్ ఏమి ఆశిస్తోంది? ఇప్పుడు మార్కెట్ దృష్టంతా మోడీ ప్రవేశపెట్టే బడ్జెట్ మీదే ఉంది. ప్రభుత్వం వ్యయం ఏవిధంగా ఉంది, సబ్సిడీలపై ఏ విధంగా వ్యవహరించారన్నవే కీలక విషయాలు. బడ్జెట్ లోటును పెంచుతూ వ్యయాలు ఎక్కువ చేస్తే ప్రభుత్వానికి రుణ భారం పెరగడమే కాకుండా, అది ద్రవ్యోల్బణాన్ని పెంచుతూ వృద్ధిరేటును దెబ్బతీసే ప్రమాదం ఉంది. సంస్కరణల పరంగా తీసుకునే చర్యలను బట్టి ఆయా రంగాల షేర్ల కదలికలుంటాయి. ఇప్పటికే సూచీలు బాగా పెరిగి ఉండటంతో బడ్జెట్ వరకు ఒక పరిమిత శ్రేణిలో తిరుగుతాయి. బడ్జెట్ తర్వాత ఒక స్పష్టమైన దిశలో కదులుతాయి. గత తొమ్మిది నెలల్లోనే ఎఫ్ఐఐలు మన మార్కెట్లో లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టారు. రానున్న కాలంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందా? ఎఫ్ఐఐల పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉంది. ఎఫ్ఐఐల కొనుగోళ్లు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. మార్కెట్లు పెరుగుతుండటంతో పాటు, రూపాయి బలపడుతుండటంతో ఎఫ్ఐఐలు రెండిందాల ప్రయోజనం పొందుతున్నారు. దీంతో రానున్న కాలంలో ఎఫ్ఐఐ పెట్టుబడులు మరింత పెరుగుతాయి. దేశీయ ఇన్వెస్టర్లు మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారా? లేక మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఇంకా అమ్మకాల ఒత్తిడినే ఎదుర్కొంటోందా? గడిచిన మూడు నెలల నుంచి పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. చాలా కాలం తర్వాత ఈ త్రైమాసికంలో నికర కొనుగోళ్లు జరిగాయి. ఇప్పటికే హైనెట్వర్త్ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టగా, రిటైల్ ఇన్వెస్టర్లు సిప్ ఖాతాలు తెరవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఏ రంగాలపై ఆసక్తి చూపిస్తున్నారు? వేటికి దూరంగా ఉంటున్నారు? ఇప్పటికీ మేము దేశీయ వినియోగంతో ముడిపడి ఉన్న బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఫార్మా, ఐటీ వంటి రంగాలపై ఆసక్తి చూపిస్తున్నాం. ఇతర రంగాల్లో ఉన్న మంచి షేర్లను కూడా కొనుగోలు చేస్తున్నాం. పీఎస్‌యూ బ్యాంకుల ర్యాలీపై నాయక్ కమిటీ సిఫార్సులు ఏ మేరకు ప్రభావం చూపుతున్నాయి? వాస్తవ విలువ కంటే చాలా తక్కువ ధరల వద్ద ఉండటంతో పీఎస్‌యూ బ్యాంకు షేర్లు పెరుగుతున్నాయి. వృద్ధిరేటు పెరిగితే ఎన్పీఏలు తగ్గుతాయనే నమ్మకమే దీనికి కారణం. అంతేకాని ఈ ర్యాలిపై నాయక్ కమిటీ సిఫార్సుల ప్రభావం తక్కువే. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకుల మధ్య విలీనం అవకాశాలు కూడా తక్కువే. వడ్డీరేట్లు, రూపాయి కదలికలపై మీ అంచనాలు? వడ్డీరేట్ల, కదలికలు పూర్తిగా రుతుపవనాలపై ఆధారపడి ఉంటాయి. ద్రవ్యోల్బణం గనుక అదుపులో ఉంటే రానున్న రోజుల్లో వడ్డీరేట్లు తగ్గడమేకానీ పెరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఎఫ్ఐఐల నిధుల ప్రవాహంతో రూపాయి విలువ పెరుగుతూవస్తోంది. వచ్చే ఏడాది కాలంలో డాలరుతో రూపాయి మారకం విలువ 60 లోపే ఉంటుంది.