bus - car dash
-
Up: యమునా ఎక్స్ప్రెస్ వే పై ప్రమాదం.. ఐదుగురి సజీవ దహనం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మధుర పరిధిలోని మహవాన్ వద్ద యమునా ఎక్స్ప్రెస్ వేపై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. 40 మందితో ప్రయాణిస్తున్న బస్సు కారును ఢీకొన్న ఘటనలో అయిదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. బస్సు బీహార్ నుంచి ఢిల్లీ వైపు వెళుతోంది. ఈ ప్రమాదం కారణంగా చెలరేగిన మంటల్లో కారు పూర్తిగా కాలిపోయి అందులోని వ్యక్తులు సజీవ దహనమైనట్లు సమాచారం. బస్సులో ఉన్నవారంతా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినట్లు తెలిసింది. ఇదీ చదవండి.. పారా గ్లైడింగ్ చేస్తూ హైదరాబాద్ టూరిస్టు మృతి -
Kamareddy: కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృత్యువాత పడ్డడారు. మాచారెడ్డి మండలం ఘన్పూర్లో సోమవారం వేకువ జామునే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం ఎలా జరిగిందనేది తేల్చే పనిలో ఉన్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
సూర్యాపేట: బస్సును ఢీకొన్న కారు
-
రోడ్డు ప్రమాదంలో టీఆర్ఎస్ నేత మృతి
దండెపల్లి: వేగంగా వెళ్తున్న బస్సు,కారును ఢీ కొట్టడంతో టీఆర్ఎస్ నేత ఊరెల్లి లక్ష్మణ్ (58) మృతిచెందారు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా దండెపల్లి మండలం ముత్యంపేటలో చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి లక్సిట్టిపేట నుంచి నర్సాపూర్ వస్తున్న లక్ష్మణ్ కారును ఊట్నూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు ముత్యంపేట వద్ద ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందగా.. ఆయన వెంట ఉన్న వెంగళరావుకు గాయాలయ్యాయి. నాయకుడి మృతితో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలుతీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.