bus services cancelled
-
ఆర్టీసీ అంతర్రాష్ట్ర సర్వీసులు రద్దు
సాక్షి, అమరావతి: అంతర్రాష్ట్ర సర్వీసులను ఆర్టీసీ పూర్తిగా నిలిపివేసింది. రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న కర్ఫ్యూ నిబంధనలతో తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతి ఉండటంతో ఆర్టీసీ సర్వీసులను భారీగా తగ్గించింది. కరోనా సెకండ్ వేవ్ రాకముందు రోజుకు 10,553 షెడ్యూళ్లలో బస్సు సర్వీసులు నిర్వహించేది. కానీ, ప్రస్తుతం రోజుకు 3,000 షెడ్యూళ్లే నిర్వహిస్తోంది. అంటే కేవలం 30 శాతం సర్వీసులనే కొనసాగిస్తోంది. వీటిలో కూడా గరిష్టంగా 50 శాతం మంది ప్రయాణికులనే అనుమతిస్తోంది. కరోనా ఉధృతితో ప్రజలు కూడా స్వచ్ఛందంగా ప్రయాణాలను విరమించుకుంటున్నారు. దాంతో బస్సుల్లో 50 శాతం ఆక్యుపెన్సీ కూడా ఉండటం లేదు. దీనికితోడు తాజాగా 1,450 అంతర్రాష్ట్ర సర్వీసులను పూర్తిగా రద్దు చేయడంతో ఆర్టీసీ ఆదాయానికి భారీగా గండి పడనుంది. సాధారణ రోజుల్లో ఆర్టీసీకి టిక్కెట్ల ద్వారా రోజుకు సగటున రూ.15 కోట్లు ఆదాయం వచ్చేది. కరోనా రెండో వేవ్ ఉధృతి పెరిగాక రోజువారి ఆదాయం రూ.7 కోట్లకు పడిపోయింది. ఇక కర్ఫ్యూ నిబంధనలు అమలులోకి రావడంతో రోజువారీ ఆదాయం కేవలం రూ.1.50 కోట్లు మాత్రమే వస్తోంది. మే అంతా దాదాపు ఇలానే ఉంటుందని ఆర్టీసీ వర్గాలు భావిస్తున్నాయి. సాధారణ పరిస్థితులు నెలకొంటే తప్ప ఆర్టీసీ ఆదాయం మళ్లీ గాడిన పడే అవకాశాల్లేవని అధికారులు చెబుతున్నారు. కర్ఫ్యూలోనూ పార్సిల్ సేవలు కర్ఫ్యూ పరిస్థితుల్లోనూ పార్సిల్ సర్వీసులు నిరం తరాయంగా కొనసాగేలా ఆర్టీసీ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. అందుకోసం డెడికేటెడ్ కారిడార్ కింద రాష్ట్రంలోని అన్ని జిల్లాలతోపాటు హైదరాబా ద్‌ను అనుసంధానిస్తూ రోజుకు 9 ప్రత్యేక పార్సిల్ సర్వీసులను నిర్వహిస్తోంది. ► గుంటూరు–విశాఖపట్నం, తిరుపతి–విజయవాడ, అనంతపురం–విజయవాడ మధ్య రెండేసి పార్సిల్ సర్వీసులు నిర్వహిస్తోంది. రోజూ అటు వైపు నుంచి ఒక బస్సు, ఇటువైపు నుంచి ఒక బస్సు నడుస్తుంది. ► రాజమండ్రి–హైదరాబాద్, గుంటూరు–విజయవాడ–హైదరాబాద్, తిరుపతి–అనంతపురం మధ్య ఒక్కో పార్సిల్ సర్వీసు నిర్వహిస్తున్నారు. ► విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు పార్సిళ్లను ప్రయాణికుల బస్సుల్లో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల్లోపు చేరవేస్తున్నారు. ఇదే విధంగా రాష్ట్రంలో అన్ని జిల్లాలతోపాటు హైదరాబాద్‌ను అనుసంధా నిస్తూ పార్సిల్ సేవలు అందిస్తున్నారు. -
TSRTC: ఏపీకి వచ్చే బస్సులు రద్దు
-
TSRTC: ఏపీకి వచ్చే బస్సులు రద్దు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే 250 బస్సులను తెలంగాణ ఆర్టీసీ రద్దు చేసింది. ముందస్తు రిజర్వేషన్లను కూడా అధికారులు రద్దు చేశారు. దీంతో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ తదితర ప్రాంతాలతోపాటు కర్నూలు, శ్రీశైలం, బెంగళూరు వైపునకు బస్ సర్వీసులు నిలిచిపోయా యి. బుధవారం కొన్ని సర్వీసులను ఏపీకి నడిపినప్పటికీ గురువారం నుంచి 18వ తేదీ వరకు హైదరాబాద్ నుంచి వెళ్లే అన్ని బస్సులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఏపీలో మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ విధిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొ న్నారు. ‘ఏపీలో కర్ఫ్యూకు ముందే బస్సులు అక్కడికి చేరుకోవలసి ఉంటుంది. ఉదయం అక్కడికి చేరుకున్న బస్సులు తిరిగి మధ్యాహ్నం 12 లోపు ఆ రాష్ట్ర సరిహద్దులను దాటాలి. ఇది ఏమాత్రం సాధ్యం కాదు. మరోవైపు తెలంగాణలో రాత్రి 9 గంటల నుంచే కర్ఫ్యూ అమలవుతున్న దృష్ట్యా ఏపీ నుంచి బయలు దేరిన బస్సులు రాత్రి 9 గంటలలోపు డిపోలకు చేరుకోవడం సాధ్యం కాదు’ అని ఆ అధికారి వివరించారు. ఏపీకి ఆనుకుని ఉన్న సరిహద్దు జిల్లాల బస్సులు మాత్రం మధ్యాహ్నం 12 లోపు ఆయా డిపోలకు చేరుకునే అవకాశం ఉంటే రాకపోకలు సాగిస్తాయని చెప్పారు. ఈ మేరకు కోదాడ నుంచి విజయవాడ వరకు 6 బస్సులు మాత్రం తిరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపునకు వెళ్లే 48 బస్సులు కూడా నిలిచిపోయాయి. ఇక్కడ చదవండి: వారాంతపు లాక్‌డౌన్‌పై పరిశీలించి నిర్ణయం: సీఎస్ Hyderabad Railway Station: నాంపల్లి స్టేషన్ కాడా... -
హాజీపూర్‌లో మళ్లీ ఆందోళన
సాక్షి, హైదరాబాద్/ఏఎస్ రావు నగర్: యాదాద్రి–భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో మరోసారి ఆందోళన నెలకొంది. వరుస హత్యాచారాల నేపథ్యంలో గ్రామానికి బస్సులను పెంచిన ఆర్టీసీ తాజాగా ఆదాయం రావడం లేదనే కారణంతో సర్వీసులను రద్దు చేసింది. దీంతో ఆ ఊరు నుంచి స్కూళ్లు, కాలేజీలకు వెళ్లాల్సిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రత్యేకించి అమ్మాయిలకు ఇది మరింత ఇబ్బందిగా మారింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె ముందు వరకు ఈ ప్రాంతానికి బస్సులు అందుబాటులో ఉండేవి. సమ్మె విరమణ అనంతరం ఆదాయం వచ్చే మార్గాలు, రాని మార్గాలు అంటూ రూట్లను హేతుబద్ధం చేసే నెపంతో గ్రేటర్ ఆర్టీసీ పెద్ద ఎత్తున బస్సుల రద్దుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే హాజీపూర్ గ్రామానికి సైతం బస్సులను రద్దు చేసింది. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్సులు అందుబాటులో లేకపోవడం వల్లనే స్కూళ్లకు నడిచే వెళ్లే అమ్మాయిలకు మర్రి శ్రీనివాస్‌రెడ్డి తన బైక్ పైన లిఫ్ట్ ఇవ్వడం, అనంతరం వారిపై హత్యాచారాలకు పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని హాజీపూర్ గ్రామ సర్పంచ్ కవితా వెంకటేష్‌గౌడ్ శుక్రవారం కుషా యిగూడ డిపో మేనేజర్ బి.పాల్‌ను కోరారు. -
పల్లెల్లో తెలుగు వెలుగులేవీ?
126 గ్రామాలకు తెలుగు వెలుగులు దూరం శ్లాక్ సీజన్ పేరుతో 21 సర్వీసుల రద్దు – ప్రయాణికుల ఇక్కట్లు ‘ఆర్టీసీ బస్సులో ప్రయాణించండి సురక్షితంగా గమ్యం చేరండి.. ప్రైవేటు వాహనాలు ఆశ్రయించకండి.. ప్రమాదాల బారిన పడకండి’ అని అధికారుల మాటలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. రూట్లో ఆదాయం వస్తేనే బస్సును తిప్పండి లేదంటే నిలిపివేయండంటూ ఆర్టీసీ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో కొన్ని పల్లెల్లో తెలుగు వెలుగు బస్సులు కనిపించడం లేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. నెల్లూరు(టౌన్): జిల్లాలో 126 గ్రామాలకు నేటికి ఆర్టీసీ బస్సులు నడవడం లేదంటే కొంత ఆశ్చర్యంగా ఉన్నా నమ్మక తప్పదు. తాజాగా శ్లాక్ సీజన్ పేరుతో నష్టాలు వస్తున్నాయంటూ ప్రధాన రహదారుల్లో తిరుగుతున్న 21 సర్వీసులను నిలిపివేశారు. వీటిపై ఆర్టీసీ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. నాలుగు రోజుల క్రితం నుంచి 21 సర్వీసులను అధికారులు రద్దు చేశారు. ప్రస్తుతం పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో సర్వీసులు నిలిపివేయడంపై ఆర్టీసీ సంఘాలు మండిపడుతున్నాయి. నెల్లూరు డిపో–1 నుంచి చెన్నై, హైదరాబాద్, విజయవాడకు తిరుగుతున్న మూడు బస్సులను నిలిపివేశారు. డిపో–2 నుంచి చెన్నై నుంచి విజయవాడ తిరుగుతున్న బస్సును రద్దు చేశారు. అదేవిధంగా రాపూరు డిపో నుంచి –1, ఆత్మకూరు డిపో నుంచి–3 కావలి నుంచి–4, ఉదయగిరి నుంచి –4, వాకాడు, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి డిపోల నుంచి ఒక్కో బస్సును రద్దు చేశారు. బెంగళూరు, చెన్నై, విజయవాడ, హైదరాబాద్, తిరుపతికి తిరుగుతున్న బస్సులను రద్దు చేశారు. సర్వీసుల రద్దు చేయడానికి ప్రైవేటు వాహనాల యజమానుల నుంచి అందుతున్న ముడుపులే కారణమని సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. బస్సులు తిరగని గ్రామాలు... నష్టాలు వస్తున్నాయని, రోడ్డు బాగాలేదని చెబుతూ ఇప్పటికి జిల్లాలో 126 గ్రామాల్లో ఆర్టీసీ బస్సులను తిప్పడం లేదు. అనంతసాగరం రూట్లో చీపురపల్లి, చాకురాళ్లపల్లి, కావలి మండలంలో కోనేటిపాలెం, గానుగపెంట, దగదర్తి రూట్లో మట్టెంపాడు, సంగం రూట్లో నీలాయపాలెం, తిమ్మాపురం, చింతూరు, ఆనపల్లిపాడు, వెంగమాంబపురం, దేవరవేమూరు, అత్తలసిద్దవరం, కోనేశ్వరపాడు, ఎల్లవగ్గపలి, తిమ్మినగుంట, లింగంపాలెం, బొట్ల, కొత్తనల్లపాడు, పెనుబర్తిగోపవరం, శుద్ధమల్లి, కోటూరుపాడు, చందనమూడి, మనిమాలముడి, సూరపుఅగ్రహారం, బురదమడుగు, యల్లాయపాలెం, వేటగిరిపాలెం గ్రామాలకు బస్సులు తిరగడం లేదు. సూళ్లూరుపేట మండలంలో చెరువుమిట్ట, కొమ్మినేనిపల్లి, పంట్రంగం, సర్వారెడ్డికొండ, ఎర్రబల్లి, వాకాడు మండలంలో పాటెటిపాలెం, జువ్వినట్టు, రెడ్డిపాలెం, పంబలి, పుదిరాయదరువు, ఉదయగిరి నుంచి కిష్టంపల్లి మీదుగా అర్లపడిగ, బిజ్జంపల్లి, అప్పసముద్రం, గూడూరు నుంచి చెర్లోపల్లి, కుడితపల్లి, కాగితాలపూర్, లక్ష్మీనరసాపురం, కొడవలూరు మండలం యల్లాయపాలెం, రామన్నపాలెం, మానేగుంటపాడు, రెడ్డిపాలెం, ఆలూరు తదితర గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ఈ ప్రాంత ప్రజలు ప్రైవేట వాహనాలను ఆశ్రయిస్తున్నారు. కావాలనే సర్వీసులను రద్దు చేశారు : – రమణరాజు, ఎన్ఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధికారులు కావాలనే సర్వీసులను రద్దు చేశారు. ప్రస్తుతం శ్రావణమాసం సందర్భంగా పెళ్లిళ్లు, ఫంక్షన్లు అధికంగా ఉన్నాయి. వీటితో పాటు పుష్కరాలు కూడా జరగనున్నాయి. శ్లాక్ సీజన్ పేరుతో బస్సులను రద్దు చేయడం తగదు. వెంటనే వాటిని పునరుద్ధరించాలి. ఆదరణ ఉంటే తప్పకుండా తిప్పుతాం : రవివర్మ, ఆర్టీసీ ఆర్ఎం రూట్లల్లో ఆదరణ, ఆదాయం వస్తే తప్పకుండా బస్సులను తిప్పుతాం. నష్టాలు వస్తే బస్సులను తిప్పలేం. శ్లాక్ సీజన్ కారణంగా ప్రయాణికులు తక్కువగా ఉండటంతోనే ఆ సర్వీసులను నిలిపివేశాం. రద్దీ రోజుల్లో అదనంగా 48 సర్వీసులను తిప్పాం.