bus ticket fare
-
బెంగళూరు - హైదరాబాద్ టిక్కెట్ రూ.99కే!
అంతర్జాతీయ ట్రావెల్ సర్వీసు అందించే ఫ్లిక్స్‌బస్ సంస్థ ఇండియాలోని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా హైదరాబాద్-బెంగళూరు, చెన్నై మధ్య బస్సు సర్వీసులు ప్రారంభించింది. కేవలం రూ.99కే హైదరాబాద్-బెంగళూరు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది.కర్ణాటక వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి ఎంబీ పాటిల్ ఈ రూట్లలో బస్సులను ప్రారంభించారు. బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్యాసింజర్ల సంఖ్య అధికంగా ఉండడంతో వారి ప్రయాణాలకు అనుగుణంగా కంపెనీ ఆఫర్ ప్రకటించింది. రూ.99కే ఈ రూట్లో ప్రయాణించే అవకాశం కల్పించింది. ఈ ఆఫర్ వినియోగించుకోవాలంటే ఈ నెల 3-15 మధ్య టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణ తేదీలు సెప్టెంబరు 10-అక్టోబరు 6 మధ్య ఉండాలని పేర్కొంది. ఈ కార్యక్రమంలో గ్లోబల్ ఫ్లిక్స్ సీఓఓ మ్యాక్స్ జుమేర్, సహ వ్యవస్థాపకులు డేనియల్ క్రాస్ పాల్గొన్నారు.ఇదీ చదవండి: పరుష పదజాలం, భారీ లక్ష్యాలు.. సెబీ చీఫ్ పనితీరుపై లేఖప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్న ప్రయాణికుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు ఆశించినమేర వృద్ధి చెందడం లేదు. దాంతో చాలామంది ప్రయాణికులు దూర ప్రయాణాలకు ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఎంచుకుంటున్నారు. వారాంతాలు, సెలవులు, పండగల సమయాల్లో వీరి తాకిడి ఎక్కువగా ఉంటుంది. కంపెనీలు అందుకు అనువుగా సర్వీసులు నడుపుతూ లాభాలు గడిస్తున్నాయి. ఈ రంగంలో ఇప్పటికే అంతర్జాతీయంగా సేవలందిస్తున్న ఫ్లిక్స్‌బస్ అనే జర్మన్ కంపెనీ దక్షణాది రాష్ట్రాల్లో సేవలు ప్రారంభించడం విశేషం. 2011లో స్థాపించిన ఈ కంపెనీ యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా వంటి దాదాపు 40 దేశాల్లో సర్వీసులు నడుపుతోంది. 4 లక్షల రూట్లలో 5000 ప్రదేశాలకు ప్రయాణికులను చేరవేస్తోంది. -
Sankranti Rush: ప్రయాణికుల జేబులు ఖాళీ చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్
పట్నంబజారు(గుంటూరుఈస్ట్): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గుంటూరు జిల్లాలోని ప్రైవేట్ ట్రావెల్స్ అడ్డుఅదుపూ లేకుండా దోచుకుంటున్నాయి. నిబంధనలను యథేచ్ఛగా అతిక్రమిస్తున్నారు. గుంటూరు జిల్లాలో సుమారు 150 వరకు ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైతోపాటు ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు తరలివస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ధరలకు అనుగుణంగానే టికెట్ ధరలు ఉండాలనే రవాణాశాఖ అధికారుల సూచనలను ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఖాతరు చేయని పరిస్థితులు కనపడుతున్నాయి. బుక్ చేస్తే.. మరో ధర ప్రైవేట్ ట్రావెల్స్‌లో టికెట్లు బుక్ చేసుకునేందుకు అనేక రకాల యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆ యాప్‌లు ఓపెన్ చేయగానే ఒక ధర.. అన్ని ఆప్షన్స్ పూర్తి చేసిన తర్వాత బుక్ చేసుకునే సమయానికి మరో ధర వస్తోంది. మంగళగిరికి చెందిన ఓ విద్యార్థిని పండుగ నిమిత్తం బెంగళూరు నుంచి సొంత ఊరికి వచ్చేందుకు టికెట్ బుక్ చేసుకుంది. ముందు టికెట్ ధర రూ 1700 చూపించిన క్రమంలో బుక్ చేసే సరికి రూ.2400 అయింది. ఇంచుమించుగా యాప్‌ల్లో ఇదే పరిస్థితి కనపడుతోందని చెబుతున్నారు. ఆన్లైన్లోనే ఇదే విధంగా వ్యవహరిస్తే.. సాధారణంగా ఒక కార్యాలయానికి వెళ్లి టికెట్ బుక్ చేసుకునే వారి పరిస్థితి ఇక చెప్పాల్సిన పనిలేదు. ఆర్టీఓ అధికారులు సూచించిన ధరల కంటే అధికంగా దోచుకుంటున్నారు. సమావేశాలకే పరిమితం నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు చేపట్టాల్సిన ఆర్టీఓ అధికారులు మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. అధిక ధరలతో ప్రయాణికులను దోపిడీ చేస్తున్నా.. తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తనిఖీలు చేస్తున్నామని పేరుకే తప్ప.. ఎక్కడా పట్టించుకున్న పాపాన పోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మోటార్ వెహికల్ నిబంధనల ప్రకారం ఆర్టీసీ బస్టాండ్‌కు రెండు కిలోమీటర్ల లోపు ప్రైవేట్ బస్సులు ఉండకూడదని ఆదేశాలు ఉన్నప్పటీకీ ఆర్టీఓ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే వాదనలు లేకపోలేదు. మంగళవారం ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులతో సమావేశం నిర్వహించి అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని డీటీసీ హెచ్చరించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద సాయంత్రం సమయంలో ప్రైవేట్ బస్సుల వలన ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతున్నప్పటీకీ కనీసం ట్రాఫిక్ పోలీసులు స్పందించకపోవటం గమనార్హం. తనిఖీలు నిర్వహిస్తున్నాం జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. మంగళగిరి టోల్ ప్లాజా, పేరేచర్ల మరిన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నాం, వాటిని మరింత ముమ్మరం చేస్తాం. స్పెషల్ డ్రైవ్ చేపట్టి అధిక ధరలకు టికెట్ విక్రయాలు లేకుండా చేస్తాం. ప్రయాణికులు సైతం అధిక ధరలు డిమాండ్ చేస్తే మా దృష్టికి తీసుకుని రావాలని కోరుతున్నాం. – షేక్ కరీం, డీటీసీ -
బాబోయ్ ప్రైవేట్ ట్రావెల్స్.. అడ్డంగా దోచేస్తున్నారు
ప్రత్తిపాడు(గుంటూరు): సంక్రాంతి పండగ పేరు చెప్పి ప్రయాణికులను నిలవునా దోచుకునేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ సిద్ధమయ్యాయి. హైదరాబాద్ నుంచి జిల్లాకు, జిల్లా నుంచి హైదరాబాద్‌కు వచ్చి వెళ్లే టికెట్ ధరలను ఇష్టారాజ్యం పెంచేశాయి. అడ్డగోలుగా ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. ఇదేమని అడిగే నాథులు కనపడడం లేదు. అధికారయంత్రాంగం కూడా చోద్యం చూస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా అయితే గుంటూరు నుంచి హైదరాబాద్‌కు నాన్ ఏసీ బస్సుకు రూ.400, ఏసీ బస్సుకు రూ. 500, స్లీపర్ ఏసీ బస్సుకు రూ.700, హైదరాబాద్ నుంచి గుంటూరుకు నాన్ఏసీ రూ.400, ఏసీ రూ.500, స్లీపర్ ఏసీ రూ.800 డిమాండ్‌ను బట్టి కొంచెం అటుఇటుగా చార్జీలు ఉంటాయి. అయితే ఇప్పుడు సంక్రాంతి పేరు చెప్పి ఈ టికెట్ల వెలను ఆయా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు అమాంతం పెంచేశాయి. ఒక్కో టికెట్‌పై అదనంగా రూ.400 నుంచి రూ.1,000 వరకూ దోచుకుంటున్నాయి. ఆయా ట్రావెల్స్ తమ ఆన్లైన్ వెబ్సైట్లలో పెంచిన ధరలను ప్రదర్శిస్తున్నాయి. రాష్ట్రంలోని నలుమూలల నుంచి లక్షల మంది ప్రజలు బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌లో నివసిస్తుంటారు. కొందరు స్వగ్రామాల నుంచి వెళ్లి హైదరాబాద్‌లో స్థిరపడిన వారూ ఉంటారు. తెలుగునాట పెద్ద పండుగైన సంక్రాంతికి వీరంతా స్వగ్రామాలకు రావడం సహజం. దీంతో సంక్రాంతి సమయంలో సగం హైదరాబాద్ ఖాళీ అవుతుంది. ఈనేపథ్యంలో ఒక్కసారిగా ప్రజలు సంక్రాంతి సెలవులకు స్వగ్రామాలకు పయనమయ్యే అవకాశాలు ఉండటంతో ట్రావెల్స్ యాజమాన్యాలు దోపిడీకి తెరలేపాయి. అయినా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి గుంటూరుకు ధరలు ఇలా (రూపాయల్లో).. బస్సు రకం సాధారణ ధర పండగ ముందు చార్జి నాన్ఏసీ 300–500 1,000 నాన్ ఏసీ స్లీపర్ 600–700 1.000 ఏసీ 540 1,200 స్లీపర్ ఏసీ 700–800 1,400/1,500 గుంటూరు నుంచి హైదరాబాద్‌కు ధరలు ఇలా(రూపాయల్లో).. . బస్సు రకం సాధారణ ధర పండగ ముందు చార్జి నాన్ఏసీ 400 900–1,500 నాన్ ఏసీ స్లీపర్ 600 1000–1,500 ఏసీ 500–700 1,150–1,500 స్లీపర్ ఏసీ 800–900 1,300/2,500 ప్రత్యేక బృందాలతో తనిఖీలు సంక్రాంతి నేపథ్యంలో ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. స్పెషల్ బృందాలు వేస్తున్నాం. ముమ్మరంగా తనిఖీలు చేస్తాం. ప్రైవేట్ ట్రావెల్స్ అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తే పెద్ద ఎత్తున అపరాధ రుసుములు విధిస్తాం. అవసరమైతే బస్సులు సీజ్ చేస్తాం. – శివ నాగేశ్వరరావు, ఎంవీఐ, చిలకలూరిపేట ధరలు నియంత్రించాలి సంక్రాంతి పండగ సందర్భంగా ప్రైవేట్ ట్రావెల్స్ రెట్టింపు ధరలకు టిక్కెట్లు విక్రయిస్తున్నాయి. అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. అడిగేవారు లేకపోవడంతో వారి ఇష్టారాజ్యమైంది. అధికారులు ధరలను నియంత్రించాలి. వెంటనే తనిఖీలు చేపట్టాలి. – సాధినేని కోటేశ్వరరావు (పెద గొట్టిపాడు) చదవండి: అమెరికాను మేము ఓడించగలం అనడానికి ఇదే గుర్తు: తాలిబన్లు -
చలో ఆంధ్రా!
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో స్థిరపడ్డ ఏపీకి చెందిన వారిని ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలన్నీ పోటీపడుతున్నాయి. తెలంగాణలో సెటిలైన చాలా మందికి ఏపీలోని సొంతూళ్లలోనూ ఓట్లున్నాయి. దీంతో వీరికి ఎక్కడ లేని డిమాండ్ పెరిగింది. వీళ్లను తమవైపు తిప్పుకునేందుకు పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నెల 11న పోలింగ్ ఉండటంతోపాటు శుక్రవారం సెలవు పెట్టుకుంటే, శని, ఆది సెలవు దినాలు కలసి వస్తున్నాయి. దీంతో సెటిలర్లను సొంతూళ్లకు రప్పించేందుకు ఏపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. తమ ప్రాంత ఓటర్లు అధికంగా ఉండే చోట సామాజిక వర్గాలు, ఊళ్ల వారీగా వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలు పంపుతున్నారు. ఏప్రిల్ 9 నుంచే ఉచితంగా తీసుకెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేశారు. ఓటేశాక తిరిగి తీసుకొచ్చే బాధ్యత కూడా వీరిదే. దారిలో టిఫిన్లు, భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నారు. మందుబాబులకు ప్రత్యేక సదుపాయం కూడా కల్పిస్తున్నారు. ఓటుకు రూ.3000 వరకు చేతిలో పెడుతున్నారు. ఓటరుకు ప్రయాణ చార్జీల పోటు సాక్షి, అమరావతి/సాక్షి, బెంగళూరు: ఓటు హక్కు వినియోగించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి సొంత ఊర్లకు రానున్న ఓటర్లకు ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణ చార్జీల మోత మోగిస్తున్నాయి. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో ఉన్న తెలుగువారు పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో సొంత రాష్ట్రానికి బయలు దేరుతున్నారు. చెన్నై, బెంగళూరుల నుంచి బస్సుల్ని బుక్ చేసుకుందామంటే టిక్కెట్టు ధర రూ.3 వేలకు పైగా ఉంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు టిక్కెట్టు ధర సాధారణ రోజుల్లో రూ.500 నుంచి రూ.600 వరకు ఉంటే, ప్రస్తుతం ఈ ధర రూ.1,500 వరకు ఉంది. ఎన్నికల నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ 7 వేల ప్రత్యేక బస్సుల్ని నడుపుతోంది. హైదరాబాద్ నుంచి 250 బస్సుల్ని ప్రత్యేకంగా నడుపుతున్నారు. అయితే పండగ సీజన్లో మాదిరిగా 150 శాతం అధికంగా చార్జీలు వసూలు చేస్తుండటంపై ప్రయాణీకులు మండిపడుతున్నారు. ఇక బెంగళూరులో ఉన్న తెలుగువారు, విద్యార్థులు, ఐటీ, ప్రైవేటు ఉద్యోగులు ఓటు వేసేందుకు ఏపీకి తరలివస్తున్నారు. రద్దీ వల్ల రైళ్లలో, బస్సుల్లోనూ వారం ముందే సీట్లన్నీ బుక్ అయిపోయాయి. ప్రజల డిమాండ్‌ను ఆసరాగా తీసుకున్న ప్రైవేటు ట్రావెల్స్ చార్జీలను భారీగా పెంచేశాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
'సంక్రాంతికి అదనపు బస్సు చార్జీలు ఉండవు'
హైదరాబాద్: సంక్రాంతికి అదనపు బస్సు చార్జీలు ఉండవని ఆంధప్రదేశ్ రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. ఇప్పుడున్న టికెట్ ధరల ప్రకారమే బస్సులు నడుపుతామని, అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రైవేటు ట్రావెట్ ఆపరేటర్లు టికెట్ ధరలు పెంచితే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో 99 రహదారుల అభివృద్ధి కోసం రూ. 472 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు.