
'సంక్రాంతికి అదనపు బస్సు చార్జీలు ఉండవు'
హైదరాబాద్: సంక్రాంతికి అదనపు బస్సు చార్జీలు ఉండవని ఆంధప్రదేశ్ రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు తెలిపారు. ఇప్పుడున్న టికెట్ ధరల ప్రకారమే బస్సులు నడుపుతామని, అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ప్రైవేటు ట్రావెట్ ఆపరేటర్లు టికెట్ ధరలు పెంచితే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో 99 రహదారుల అభివృద్ధి కోసం రూ. 472 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. జాతీయ రహదారిపై ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు.