ఆర్టీసీ రూ. 2,600 కోట్ల నష్టంలో ఉంది: సిద్దా | APSRTC losses Rs. 2600 crores, says state transport minister Sidda Raghava Rao | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ రూ. 2,600 కోట్ల నష్టంలో ఉంది: సిద్దా

Published Thu, Jun 26 2014 2:39 PM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM

ఆర్టీసీ రూ. 2,600 కోట్ల నష్టంలో ఉంది: సిద్దా - Sakshi

ఆర్టీసీ రూ. 2,600 కోట్ల నష్టంలో ఉంది: సిద్దా

ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణ సంస్థ రూ.2,600 కోట్ల నష్టంలో ఉందని ఆ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి సిద్దా రాఘవరావు వెల్లడించారు. గురువారం ఆయన హైదరాబాద్లో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఆర్టీసీకి రోజుకు రూ. 2.75 కోట్ల నష్టం వస్తుందని తెలిపారు. నష్టాల నుంచి ఆర్టీసీని గట్టెక్కించడం కోసం 15 శాతం ఛార్జీలు పెంచాలని అధికారులు కొరుతున్నారని చెప్పారు.

 

ఛార్జీల పెంపుపై తాము సుముఖంగా లేమని ఆయన స్సష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలలో రహదారుల నిర్మాణానికి చర్యలు చేపడతామని ఆయన చెప్పారు. అలాగే రాష్ట్రంలోని ప్రతి మండలాన్ని జిల్లా కేంద్రానికి అనుసంధానం చేసేందుకు చర్యలు చేపడతామని సిద్దా రాఘవరావు వివరించారు.    

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement