buses seize
-
కొనసాగుతున్న ఆర్టీఏ తనిఖీలు
హైదరాబాద్: ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారులు మరోసారి కొరడా ఝళిపించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్ బస్సులపై దాడులు నిర్వహించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణ చార్జీలు అధికంగా వసూళ్లు చేయడంతో పాటు రవాణాశాఖ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారని ప్రైవేట్ ట్రావెల్స్‌లపై ఆర్టీఏ అధికారులు మళ్లీ దాడులు ప్రారంభించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగర శివార్లలో ఆర్టీఏ తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 11 బస్సులపై కేసు నమోదు చేయగా, మరో 4 బస్సులను అధికారులు సీజ్ చేశారు. కేశినేని, ఎస్వీఆర్, కావేరి, మేఘన ట్రావెల్స్ బస్సులు సీజ్ చేశారు. -
పర్మిట్ లేని స్కూల్ బస్సులు సీజ్
హైదరాబాద్ : ఆర్టీఏ అధికారులు స్కూలు బస్సుల ఫిట్‌నెస్‌పై దృష్టి సారించారు. రాజేంద్ర నగర్లో గురువారం ఉదయం ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫిట్నెస్ లేకుండా నడుపుతున్న అయిదు స్కూల్ బస్సులను అధికారులు సీజ్ చేశారు. నేటి నుంచి పాఠశాలలు పున:ప్రారంభం అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలో ఆర్టీఏ అధికారుల దాడులు నిర్వహించి పర్మిట్ లేని స్కూల్ బస్సులను సీజ్ చేస్తున్నారు. -
ఎల్బీనగర్లో 8 ప్రైవేట్ బస్సులు సీజ్
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ ఎల్బీనగర్లో విజయవాడ నుండి వస్తున్న వాహనాలను ఆర్టీఎ అధికారులు శుక్రవారం తెల్లవారుజామున ఆపి తనిఖీలు నిర్వహించారు. పర్మిట్, ఫిట్నెస్ లేని 8 ప్రైవేటు బస్సులను సీజ్ చేశారు. ఇందులో ఎస్వీఆర్, తిరుమల, కావేరి, భాను, మార్నింగ్‌స్టార్ ట్రావెల్స్ బస్సులు ఉన్నాయి. ప్రయాణికులను మార్గ మాధ్యలోనే దింపేసి బస్సులను సీజ్ చేశారు. ఆర్టీఎ అధికారుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు మెదక్ జిల్లా జహీరాబాద్ చెక్‌పోస్ట్ వద్ద పర్మిట్ లేని 5 బస్సులను ఆర్టీఎ అధికారులు సీజ్ చేశారు.