Business Transaction
-
జోరుగా చిల్లర దందా....
నిజామాబాద్ అర్బన్ : జిల్లా కేంద్రంలో ప్రధానంగా చిల్లర వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. వ్యాపార లావాదేవీల్లో చిల్లర ఎంతో అవసరంగా మారడం తో వ్యాపారస్తులు చిల్లరను కొనుగోలు చేస్తున్నారు. చిల్లర వ్యాపారంలో కిరాణషాపు యజమానులు, భిక్షాటన చేసేవారు ప్రధానంగా ఉన్నారు. కిరాణ షాపు యజమానులు బ్యాంకుల నుంచి చిల్లరను తీసుకొని ఇతర వ్యాపారస్తులకు విక్రయాలు చేస్తున్నారు. రూ. 100 చిల్లరకు రూ. 15 నుంచి రూ. 20 కమీషన్ తీసుకుంటున్నారు. డిమాండ్‌ను బట్టి ఈ కమీషన్లో పెరుగుదల, తగ్గుదల ఉంటుంది. మొత్తానికి 15 రూపాయలకుపైబడే కమీషన్ ఉంటుంది. ఇలా చి ల్లరను రూ. 100 చొప్పున మూటకట్టి వ్యాపార సముదాయాలు, హోటళ్లు, టీపాయింట్లు, షో రూంలు, వైన్స్ లు, బెకరీలు, ఇ తర వ్యాపారస్తులకు కమీష న్ పద్ధతి మీద మార్పిడి చేస్తున్నా రు. కేవలం ఇదే వ్యాపారం కొనసాగిస్తున్నవారు సుమారు 100 మంది వరకు ఉంటా రు. అదే విధంగా పట్టణంలో భిక్షాటన చేసేవారు ఈ చిల్లర దందాను నడిపిస్తారు. వంద రూపాయలకుగాను రూ. 8 కమీషన్ తీసుకొని దుకాణాదారులకు చిల్లర ను అందిస్తున్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో సాయంత్రం వేళ ఈ దందా కొనసాగుతుంది. ఉదయమంతా భిక్షాటన చేసి రాత్రి ఏడు గంటలకు ముందుగానే మాట్లాడుకున్న హోటల్, వ్యాపార సముదాయానికి వెళుతారు. ఆ రోజు వారికి భిక్షాటనలో లభించిన చిల్లరను వ్యాపారులకు ఇచ్చి కమీషన్ తీసుకుంటారు. ఇలా పలువురు వ్యాపారస్తులు కూడా అవసరార్థం భిక్షాటన చేసేవారిని చిల్లర కోసం సంప్రదిస్తారు. ఈ చిల్లర దందా నెలకు రూ. 2 కోట్ల వరకు ఉంటుందని వ్యాపార వర్గాల వారు అంచనా వేస్తున్నారు. జిల్లాలోని 5,380 వ్యాపార సముదాయాలు రిజిష్టర్ అయి ఉన్నాయి. ఈ చిల్లర మార్పిడి జరుగుతున్న దుకాణాలు 4 వేల వరకు ఉన్నాయి. ప్రతి రోజు 15 రూపాయల లేదా 20 రూపాయల వరకు కమీషన్ తీసుకొని చిల్లర మార్పిడి చేస్తుండడంతో రోజుకు రూ. 60 వేలకు పైగా కమీషన్ దందా కొనసాగుతోంది. ఇలా నెలకు సుమారు రూ. 2 కోట్ల కమీషన్దందానే నడుస్తుందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. భలే గిరాకీ.. భిక్షాటన చేసేవారు వ్యాపారస్తులకు అవసరం తీర్చేవారుగా మారారు. జిల్లా కేంద్రంలో బస్టాండ్, రైల్వేస్టేషన్, దేవాలయాలు, ఇతర ప్రధాన కేంద్రాల వద్ద భిక్షాటన చేసేవారు రోజులో ఒక్కొక్కరు సుమారు రూ. 200 నుంచి రూ. 300 వరకు సంపాదిస్తారు. వీరు సాయంత్రం ఒప్పందం చేసుకున్న వ్యాపారుల వద్దకు వెళ్లి కమీషన్‌కు చిల్లర నాణేలను అందజేస్తారు.గతంలో వంద రూపాయలకు ఐదు రూపాయల కమీషన్ ఉండేది. వ్యాపారుల డిమాండ్ పెరగడంతో కమీషన్‌ను ఎనిమిది రూపాయలకు పెంచారు. బ్యాంకుల, యజమానుల ఒప్పందం.. కొందరు కిరాణషాపు యజమానులు, మరి కొందరు చిల్లర దుకాణాదారులు చిల్లరను విక్రయించే బ్యాంకులతోనే ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. బ్యాంకు వారు కూడా కేవలం వారికే చిల్లరను విక్రయిస్తున్నారు. బ్యాంకు అధికారులు సైతం రూ. 6 చొప్పున కమీషన్ తీసుకొని ఒప్పందం చేసుకున్న వారికే మార్పిడి చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి బ్యాంకులో ఎలాంటి కమీషన్ లేకుండానే చిల్లరను అందజేయాల్సి ఉంటుంది. రూ. 100 పైబడి చిల్లరను బ్యాంకు అధికారులు అందిస్తున్నారు. ఈ చిల్లరపై ప్రధానంగా ఎవరు దృష్టి పెట్టకపోవడమే కారణం. -
ఏదీ రైతుసేవ...?
- గజ్వేల్ మార్కెట్‌యార్డులో అక్రమార్కులదే రాజ్యం - యార్డు ఆదాయానికి ఏటా లక్షల్లో గండి - అభివృద్ధి పనుల పేరిట నిధుల దుర్వినియోగం గజ్వేల్: ఆదాయపరంగా జిల్లాలోనే రెండో స్థానాన్ని ఆక్రమించి తెలంగాణలోనే ప్రధాన మార్కెట్ యార్డుగా ఉన్న గజ్వేల్‌లో ‘రైతు సేవ’ ముసుగులో ఆక్రమాలకు తెర లేచింది. వ్యాపారుల మాయాజాలం కారణంగా ప్రతిఏటా మార్కెట్ యార్డు ఆదాయానికి లక్షల్లో గండిపడుతోంది. యార్డులోనే వ్యాపార లావాదేవీలన్నీ సాగాలనే నిబంధనలు అమలుకు నోచుకోవడం లేదు. మరోపక్క అభివృద్ధి పేరిట జరుగుతున్న పనుల తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ వ్యవహారంపై ప్రత్యేక కథనం. గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, తూప్రాన్ మండలాల రైతుల ప్రయోజనాల కోసం గజ్వేల్‌లో 19ఏళ్ల క్రితం మార్కెట్ కమిటీ ఏర్పాటైంది. ప్రతిసారి ఆదాయపరంగా సిద్దిపేట తర్వాత స్థానాన్ని సాధిస్తూ జిల్లాలో రెండోస్థానంలో నిలుస్తోంది. పత్తి క్రయవిక్రయాలకు సంబంధించి తెలంగాణలోనే ప్రధాన మార్కెట్‌గా ఆవిర్భవించింది. రైతు సేవ కోసం నిర్మించిన ఈ యార్డు అక్రమాలకు నిలయంగా మారటం ఆందోళన కలిగిస్తోంది. రైతుల అవతారంలో వ్యాపారులు గజ్వేల్‌లో యార్డులో తక్కువ ధరకు కొనుగోలు చేసిన వేలాది క్వింటాళ్ల పత్తిని బినామీ పట్టాదారు పాసు పుస్తకాల జిరాక్స్‌లను సమర్పించి సీసీఐకి ఎక్కువ ధరకు విక్రయించుకోవడం పరిపాటిగా మారింది..ఆపై ఎలాంటి లావాదేవీలు జరపనట్లుగా మార్కెట్ ఫీజు యథేఛ్చగా ఎగవేస్తున్నారు. ఫలితంగా యార్డు ఆదాయానికి లక్షల్లో గండిపడుతోంది. పత్తి దిగుబడులు రైతుల చేతికందే సీజన్లో ఇక్కడ సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేస్తారు. ఎప్పటిలాగే 2012 అక్టోబర్ 8న సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటైంది. కానీ ఏనాడు ఈ కేంద్రం సక్రమంగా లావాదేవీలను చేపట్టలేదు. ఈ పరిస్థితిని అవకాశంగాా మలుచుకుంటున్న వ్యాపారులు రైతుల వద్ద కొనుగోలు చేసిన ఉత్పత్తులకు క్వింటాల్‌కు రూ.3600నుంచి 3700వరకు ధర చెల్లించారు. 40కిలోల సంచిపై తరుగు పేరిట 2కిలోల వరకు కోత విధించారు. ఈ విధంగా సేకరించిన వేలాది క్వింటాళ్ల పత్తిని తామే రైతులమని బినామీ పట్టాదారు పాసుపుస్తకాలను సృష్టించి రూ.3900క్వింటాల్ చొప్పున సీసీఐకి అమ్ముకున్నారు. ఆ నెలలో సీసీఐ ద్వారా 70వేల క్వింటాళ్లకు పైగా కొనుగోళ్ల జరిగాయి. ఇందులో సుమారు 60వేలకుపైగా క్వింటాళ్లకుపైగా ప్రైవేట్ వ్యాపారులే విక్రయించగా. ఈ 60వేల క్వింటాళ్లు (ఒక్కో క్వింటాల్ ధర రూ.3900చొప్పున లెక్కిస్తే) తాము వ్యాపార లావాదేవీలు జరిపామని రికార్డులు చూపితే ఒక్కో క్వింటాల్‌కు ఒక శాతం చొప్పున సుమారు 23లక్షలకుపైగా మార్కెట్ ఫీజు చెల్లించాల్సివుండగా అది పూర్తిగా ఎగవేశారు. ఈ విషయాన్ని అప్పట్లో ‘సాక్షి’ బయటపెట్టగా అధికారులు తూతూమంత్రంగా విచారణ చేపట్టి వదిలేశారు. నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట గత కొన్నేళ్లక్రితం వ్యాపారులకు చెందిన దుకాణాల ముందు భాగంలో నిర్మించిన సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత లోపించింది. ఈ పనులు చేపట్టే సందర్భంలో అధికారుల నుంచి సరైన పర్యవేక్షణ కొరవడటం కారణంగా ఈ దుస్థితి తలెత్తింది. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన సీసీ పూర్తిగా కంకర తేలి రైతులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్న తరుణంలో ఈ సీసీపైనే 4 ఇంచులు మందంతో కొత్తగా సీసీ వేశారు. 91మీటర్ల పొడవునా ఈ పనులు సాగాయి. నిజానికి ముందుగా మార్కెటింగ్ శాఖ అధికారులు ముందుగా 135మీటర్ల పొడవునా ఈ పనులు చేపట్టాలనుకొని , ఇందుకోసం రూ.35లక్షల వెచ్చించాలనుకొని ఆదరాబాదరాగా నిర్ణయించారు. ఈ క్రమంలో ఇంజినీరింగ్ శాఖ ఎస్ఈ యార్డును సందర్శించి 91మీటర్లు పనులు చేపడితే సరిపోతుందని సూచించడంతో ఈ పనులు అంచనా వ్యయం రూ.20లక్షలకే పరిమితమైంది. మిగిలిన రూ.15లక్షలతో ఓపెన్ ఫ్లాట్‌ఫారాల పక్కన కొత్తగా సీసీ రోడ్ల నిర్మించి వృథా ఖర్చును కొంతవరకు అరికట్టగలిగారు. ఏదీఏమైనా నాణ్యత లోపించిన పాత పనికి రూ.20లక్షలు వెచ్చించాల్సి వచ్చింది. ‘బహిరంగబేరం’ యథాతథం యార్డులో మొత్తం 35కుపైగా ట్రేడింగ్ లైసైన్స్లుండగా యార్డులో కేవలం 10మంది వ్యాపారులకు మించి క్రయవిక్రయాలు జరపడంలేదు. గతేడాది కొన్ని నెలలు బహిరంగబేరం నిర్వహించకుండా హడావిడి చేసిన అధికారులు ప్రస్తుతం పట్టించుకోపోవడంతో మిగితాలెసైన్స్దారులు యార్డు పక్కనే తూప్రాన్ రోడ్డుపై సొంతమడిగెలు నిర్మించుకొని యథేచ్ఛగా ‘బహిరంగ బేరం’ నిర్వహిస్తున్నారు.