busy life
-
ఇది కూడా స్టేటస్ సింబలే..!
బోస్టన్: సొంతిల్లు, నగలు, కార్లు... ఇలా అంతస్తును, హోదాను ప్రదర్శించుకునేందుకు బోలెడన్ని ఉన్నాయి. ఈ జాబితాలో తాజాగా మరొకటి చేరింది. అదే...‘నేను చాలా బిజీ’..అని నలుగురి ముందూ చెప్పుకోవటం, అలా అందరికీ కనిపించటం అట. హార్వర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ విషయాన్ని తేల్చారు. ఎప్పుడూ హడావుడిగా, ఒకే సమయంలో ఎన్నో పనులు చేస్తున్నట్లు కనిపించటం, తను చాలా ముఖ్యమైన వ్యక్తి అని అందరికీ చూపుకోవటం ప్రస్తుతం జనానికి బాగా ఫ్యాషన్ అయిపోయిందని వారు చెబుతున్నారు. సాయంత్రం సమయాల్లో గోల్ఫ్ ఆడటం, లేదా సెలవు రోజుల్లో రిసార్టుల్లో, బీచ్‌లో సరదాగా గడపటం వంటివి ధనవంతులమని చెప్పుకోవటానికి సూచికగా తీసుకుంటున్నారట. ‘నాకంటూ జీవితం లేకుండా పోయింది’ అనో ‘అర్జంటుగా నాకు విశ్రాంతి కావాలి’ అనో అనటం కూడా హోదాను తెలుపుకునేందుకు ఇటువంటి వారు తరచుగా అంటుంటారని వారి పరిశీలనలో తేలింది. అలాగే, ఆహారాన్ని, కావల్సిన సరుకులను ఆన్లైన్లో ఆర్డరిచ్చి తెప్పించుకోవటం కూడా ఇటువంటి వారికి స్టేటస్ సింబల్‌గా కనిపిస్తుంటాయి. సినిమాలు, పత్రికలు, పాపులర్ టీవీ షోలు కూడా ఎక్కువగా డబ్బున్న వారి గురించి, వారు ఎలా విలాసాల్లో మునిగి తేలుతున్నారనే విషయాలనే చూపిస్తుంటాయని పరిశోధకుల బృందంలో ఒకరైన హార్వర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నీరూ పహారియా అన్నారు. నిత్యం పనుల్లో బిజీగా ఉండే వారిని చూపించటం కంటే కోటీశ్వరులు తమ ఖాళీ సమయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? వాళ్లు టెన్నిస్, పోలో ఆడుతున్నారా? లేక సముద్ర విహారం చేస్తున్నారా? అనే విషయాలపై ఎక్కువ దృష్టిపెట్టాయని ఆమె తెలిపారు. వీరు వాడే వస్తువులు, సేవలు కూడా ఉన్నతస్థాయి వర్గానికి చెందినవిగా పరిగణిస్తున్నారని వెల్లడించారు. అమెరికాలో చేపట్టిన ఈ పరిశోధన సారాంశాన్ని కన్జ్యూమర్ రీసెర్చి పత్రిక ఇటీవల ప్రచురించింది. -
లవ్ యువర్ లివర్
జీర్ణవ్యవస్థకూగ కాలేయానికీ అవినాభావ సంబంధం ఉంది. శరీరంలో వేస్ట్ మేనేజ్మెంట్ వ్యవస్థను పకడ్బందీగా నిర్వహించడంలో కాలేయం పాత్ర కీలకమైంది. అలాంటి కాలేయం విషయంలో చేసే తప్పులు మనిషిని రోగాల రొంపిలోకి దింపుతున్నాయి. శరీరంలో వెలువడే టాక్సిన్స్ (విష పదార్థాలను) సైతం విసర్జన ప్రక్రియ ద్వారా బయటకు పంపించి నిలువెత్తు శరీరానికి ఆప్తుడిగా ఉండే కాలేయం (లివర్) ఆపదలో పడిపోతోంది. బిజీలైఫ్‌లో కొట్టుమిట్టాడుతున్న నగరజీవి తమకు తెలియకుండానే లివర్‌ను ముప్పులోకి నెడుతున్నాడని చెబుతున్నారు వైద్యులు. నగరంలో రోజూ పదివేల మంది పేషెంట్లు ఆస్పత్రులకు వెళ్తుంటే అందులో 2 వేల మంది జీర్ణవ్యవస్థ, లివర్‌కు సంబంధించిన జబ్బులతో బాధపడుతున్నవారే. మిగతా అవయవాల పరిస్థితి పక్కన పెడితే లివర్‌ను కాపాడుకోవడమనేది పక్కాగా మన చేతుల్లోనే ఉంటుందంటున్నారు డాక్టర్లు. లివర్ మీద ప్రెషర్ పెంచకుండా జాగ్రత్తలు తీసుకుంటే మనిషి మనుగడకు ఢోకా ఉండదని చెబుతున్నారు ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజీ సర్జన్, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జన్ డా.ఆర్వీ రాఘవేంద్రరావు. లివర్‌కు ముప్పు ఇక్కడ్నుంచే * నగరంలో రోజురోజుకూ మద్యం సేవించే వారి సంఖ్య ఎక్కువవుతోంది. మితిమీరి మద్యం సేవించడం కారణంగా చాలా మంది లివర్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. * హెపటైటిస్ బీ, హెపటైటిస్ సీ సోకినపుడు లివర్ జబ్బులకు కారణమవుతున్నాయి. * కొన్ని జన్యుపరమైన సమస్యలు కూడా లివర్ డ్యామేజ్‌కు కారణం అవుతున్నాయి. * కొన్ని సార్లు ఇన్ఫెక్షన్ల కారణంగా కాలేయంలో చిన్న చిన్న సిస్ట్స్ (చిన్న చిన్న బుగ్గలు) ఏర్పడుతున్నాయి. ఇవి ప్రమాదానికి దారితీస్తున్నాయి. * ఆల్కహాల్ దీర్ఘకాలంగా వాడితే సిరోసిస్ ఆఫ్ లివర్ వస్తోంది. అంటే లివర్ పనితీరు తగ్గిపోవడం, పూర్తిగా పనిచేయకుండా పోతుంది. * పస్తుతం ఎక్కువగా చిన్నపిల్లల్లో లివర్‌కు సంబంధించి హెపటో బ్లాస్టోమా, పెద్దవారిలో హెపటో సెల్యులర్ కార్సినోమా వస్తోంది * నగరాల్లో ఈటింగ్ హాబిట్స్ కూడా లివర్‌ను ఇబ్బంది పెడుతున్నాయి. * పదేళ్లలో రకరకాల కారణాల వల్ల లివర్ కేన్సర్ తీవ్రమవుతున్నట్టు స్పష్టమైంది. నివారణ మన చేతుల్లోనే.. * లివర్‌ను కొద్దిగా తీసి ఇతరులకు అమర్చినా మళ్లీ పూర్వస్థితిని చేరుకునే అవయవం ఇదొక్కటే. అం టే శరీరంలో ఇలాంటి సహాయకారి మరొకటి లేదు. దీన్ని కాపాడుకోవడంలో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. * మద్యానికి దూరంగా ఉండటం మంచిది. * మద్యం సేవించే వారు తరచూ లివర్ టెస్ట్ చేయించుకోవాలి. లేదంటే ఈఎస్‌ఎల్‌డీ (ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్-దీన్నే ఆల్కలిక్ లివర్ సిరోసిస్ అంటాం) వస్తే ప్రమాదం. * ఏ వయసు వారైనా హెపటైటిస్ బీ, హెపటైటిస్ సీ వైరస్‌లకు ఇంజెక్షన్లు వేయించుకోవాలి. * ఈ వైరస్లు ఉన్నాయో లేవో పరీక్షలు చేయించుకుని వ్యాక్సిన్ వేయించుకోవాలి. * మేనరికం సంబంధాలు చేసుకుని ఉంటే వారు జెనెటిక్స్ కౌన్సెలింగ్ తీసుకోవాలి. * వీలైనంత వరకూ వేపుళ్లు, ప్రిజర్వేటివ్ ఫుడ్స్‌ను తీసుకోవడం తగ్గించాలి * ఒంట్లో కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలి * వీలైనంత వరకూ మాంసాహారాన్ని తగ్గించి తినడం మంచిది -
స్నేహితులుంటే... దురలవాట్లు దూరం!
స్నేహాల వల్ల దురలవాట్లు వస్తాయనేది పాతమాట... సరైన స్నేహితులు లేకపోవడం కూడా దురలవాట్లకు దారితీయవచ్చనేది పరిశోధకులు చెప్పిన కొత్తమాట! మనసుకు దగ్గరైన స్నేహితుడితో కాసేపు గడిపినా, సరదాగా ముచ్చటించినా మనకు కలిగే ఆనందం అలాంటిలాంటిది కాదు. ఈ బిజీ లైఫ్‌లో ఎంతో ఊరటనిచ్చే శక్తి స్నేహితులకు ఉంటుంది. అయితే మనసుకు మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా స్నేహం ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు బ్రిగ్హమ్ యంగ్యూనివర్సిటీ అధ్యయనకర్తలు. ప్రతిమనిషికీ కొంత మంది మంచి స్నేహితులుంటారు. అయితే ఉద్యోగం కోసమో, నివాసం కోసమో కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు స్నేహితుల కొరత వస్తుంది. మనవాళ్లు ఎవరైనా దగ్గర ఉంటే బావుండుననే భావన మనసును మెలిపెడుతూ ఉంటుంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే కొత్త అలవాట్లు అలవడే అవకాశం కూడా ఉంటుందని అధ్యయనకర్తలు అంటారు. ఒంటరితనం, మనసులోని మాట చెప్పుకోవడానికి మరో మనిషి లేకపోవడం మందు, సిగరెట్లను స్నేహితులుగా చేసే అవకాశాలు కూడా ఉంటాయని అంటున్నారు. అందుకే కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు వీలైనంత కలివిడిగా వ్యవహరించి, మన మనస్తత్వానికి సెట్ అయ్యే స్నేహితులను సంపాదించుకోవాలని వారు సూచిస్తున్నారు. -
సాక్షి షాపింగ్ ప్లస్.. స్పెషల్ ప్రోగ్రాం
పెళ్లికైనా, పండగకైనా ముందు చేయాల్సిన పని.. షాపింగ్! ఎన్ని రోజులు తిరిగినా షాపింగ్ ఓ పట్టాన పూర్తికాదు. ఈ బిజీలైఫ్‌లో అంతటైం కేటారుుంచే పరిస్థితులు లేవు. హడావుడిలో షాపింగ్ కానిచ్చేసి.. తర్వాత రోజు ‘ఫలానా చోట ముప్పయ్ శాతం డిస్కౌంట్ ’ అని ఏ పేపర్లోనో చూసి నీరుగారిపోతాం. ముందే తెలిస్తే ఎంత బాగుండు అని అనుకుంటాం. మీ షాపింగ్‌ను ఈజీ చేయడానికి సాక్షి టీవీ ‘సాక్షి షాపింగ్ ప్లస్’ పేరుతో ముందుకొస్తోంది. బిస్కట్ నుంచి బంగారం వరకు.. కాఫీ నుంచి కంప్యూటర్ దాకా. లక్స్సబ్బు నుంచి లగ్జరీ కారు వరకు అన్ని వివరాలతో ప్రతి శనివారం సాయంత్రం 6.30 గంటల కు స్పెషల్ ప్రోగ్రాం ప్రసారం చేయునుంది. ఇదే కార్యక్రవుం ఆదివారం వుధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి ప్రసారం అవుతుంది. నగరంలో ఏ మాల్లో ఎలాంటి వెరైటీలు వచ్చాయో, ఎంత డిస్కౌంట్‌కి లభిస్తున్నాయో.. అన్ని వివరాలను ఈ ప్రోగ్రాం మీ కళ్లముందు ఉంచనుంది. రోజుకో ట్రెండ్‌తో మార్కెట్ చేసే హంగామాలో ఏవి కొత్తవో, ఏవి ప్రత్యేకమైనవో తెలుసుకోవాలంటే ‘సాక్షి షాపింగ్ ప్లస్’ వీక్షిస్తే సరిపోతుంది. -
ఓటేస్తాం
నగర రాజకీయాలను ప్రక్షాళన చేస్తాం ఇదీ ‘గ్రేటర్’ యువత మనోగతం ‘సాక్షి’ సర్వేలో వెల్లడి సాక్షి, సిటీబ్యూరో : గజి‘బిజీ’ జీవితం.. ట్రాఫికర్.. బద్ధకం.. అలసత్వం.. కారణమేదైనా నగరజీవులు ఓటింగ్ ప్రక్రియకు కాస్త దూరమే!. అందుకే సిటీలో ఓట్లకు, పోలింగ్‌కు పొంతన ఉండదు. కానీ ప్రస్తుత సార్వత్రిక ఎన్నిక ల్లో ఈ సీన్ మారనుందనే అనిపిస్తోంది. సోషల్నెట్వర్క్ మీడియా పుణ్యమా అని యువతలో చైతన్యం రగిలింది. ఓటుపై అవగాహన కలి గింది. ఓట్ల శాతమూ పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు, అవినీతి రహిత సమాజాన్ని స్థాపించేందుకు ఈసారి ఓటుహక్కు ను విధిగా వినియోగించుకుంటామని, బిజీలైఫ్లోనూ ఓటు వేసేందు కు సమయం కేటాయిస్తామని యువత ఘంటాపథంగా చెబుతోంది. యువత ఆశయాలు, ఆలోచనలు, అభిరుచులకు అనుగుణంగా పనిచేసే పార్టీలనే ఆదరిస్తామంటోంది. నగర రాజకీయాలను ప్రక్షాళన చేస్తామంటోంది. హోరాహోరీగా జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై ‘సాక్షి ’ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. యువత నిర్మొహమాటంగా అభిప్రాయాలు వ్యక్తం చేసింది. నగరవ్యాప్తంగా 18-25 ఏళ్ల మధ్యనున్న వెయ్యిమంది యువతను వివిధ అంశాలపై ప్రశ్నించగా, వారి అభిప్రాయాలిలా ఉన్నాయి.