రీపోలింగ్‌కు సర్వం సిద్ధం
కేపీహెచ్‌బీ కాలనీ, న్యూస్‌లైన్ : కూకట్పల్లి నియోజకవర్గంలో 371/ఎ పోలింగ్ కేంద్రంలో మంగళవారం నిర్వహించనున్న రీ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి.వి. గంగాధర్‌రెడ్డి తెలిపారు. వసంత్‌నగర్‌లోని ఐడీపీఎల్ హౌసింగ్ సోసైటీ లైబ్రరీ భవనంలో రీ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ఓటర్ల సౌకర్యార్థం టెంట్లు వేసి, డ్రమ్ములతో మంచినీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఓటర్లు కేవలం అసెంబ్లీ ఓటు హక్కును మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుందన్నారు. పోలింగ్ స్టేషన్ పరిధిలో పురుషులు 441, మహిళలు 394 వెరసి 835 మంది ఓటర్లు ఉన్నారు. గత నెల 30వ తేదిన నిర్వహించి న సార్వత్రిక ఎన్నికల్లో 462 ఓట్లు పోలయ్యాయి. డివిజన్ పరిధిలోని శ్రీలా పార్క్ ఫ్రైడ్, విశ్వంబర, శిల్పాఎవెన్యూ, ఎస్ఎంఆర్ హైట్స్ ఫ్లాట్లలో నివసించే ప్రజలు రీ పోలింగ్‌లో ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. రీ పోలింగ్ సందర్బంగా వసంత్‌నగర్ కాలనీలో పోలీసులు పలు సెంటర్లలో వాహనాలు తనిఖీ చేశారు.