byareji
-
గోదారిపై ‘గొలుసు కట్టలు’
రిటైర్డ్ ఇంజనీర్ టి.హనుమంతరావు ‘స్టెప్ లేడర్ టెక్నాలజీ’ రూపకల్పన రాష్ట్రంలో 750 కిలోమీటర్ల పొడవున గోదావరి ప్రవాహం 15-20 కిలోమీటర్ల దూరం చొప్పున 30 బ్యారేజీలు నది నిండా నీటి నిల్వ.. గ్రావిటీతోనే నీటి సరఫరా 18 లక్షల ఎకరాల సాగుకు అవకాశం ఏడాది పొడవునా 4,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జల రవాణా, చేపల పెంపకం, పర్యాటకానికీ వీలు ముంపు ఉండదు.. పూడిక చేరదు.. ఖర్చూ తక్కువ హైదరాబాద్: భారీ డ్యామ్‌లు కడితే.. భా రీగా ముంపు ఉంటుంది, చాలా భూమి కావా లి, వేల కోట్లలో నిధులూ కావాలి. నిర్వాసితుల సమస్య సరేసరి. తక్కువ వ్యయంతోనే, ముంపు లేకుండానే.. మరెన్నో ప్రయోజనాలు అందించే ప్రత్యామ్నాయ విధానం ‘స్టెప్ లేడర్ టెక్నాలజీ’ని ప్రఖ్యాత ఇంజనీర్ టి.హనుమంతరావు రూపొందించారు. ఈ విధానంలో వరుస బ్యారేజీలు నిర్మిస్తే.. భారీ డ్యామ్‌ల వల్ల లభించే ప్రయోజనాలన్నీ ముంపు లేకుండానే పొందవచ్చు. తెలంగాణలో గోదావరి 750 కిలోమీటర్ల పొడవునా ప్రవహిస్తుంది. శ్రీరాంసాగర్ దిగువన ‘సోన్’ నుంచి భద్రాచలం వరకు గోదావరి మీద వరుసగా 30 బ్యా రేజీలను ‘స్టెప్‌లేడర్ టెక్నాలజీ’ ఆధారంగా నిర్మిస్తే.. మొత్తం నది అంతా పొడవైన రిజర్వాయర్‌గా మారిపోతుందని హనుమంతరావు చెబుతున్నారు. 300 టీఎంసీల లైవ్ స్టోరేజీకి అవకాశం ఉంటుందని... 450 టీఎంసీల నీటి వినియోగించుకుని 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చంటున్నారు. ఏడాది పొడవునా 4,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికీ వీలుంటుందని వివరిస్తున్నారు. ఇదీ పరిజ్ఞానం.. 700 కిలోమీటర్ల పొడవునా గోదావరి మీద 30 బ్యారేజీలు నిర్మించాలి. ఒక్కోదాని మధ్య 15-25 కి.మీ. దూరం ఉంటుంది. వీటిల్లో ఒక్కోదిగువ బ్యారేజీ నుంచి దానికన్నా ఎగువన ఉండే బ్యారేజీవరకు నీరు నిల్వ ఉంటుం ది. అంటే సుమారు 600 కి.మీ. పొడవునా నీరునిల్వ ఉంటుంది. ఒక్కో బ్యారేజీలో సగటున 10 టీఎంసీల చొప్పున 300 టీఎంసీల నీరుంటుంది. ఒక్కో బ్యారేజీ కింద గ్రావిటీ ద్వారానే 60 వేల ఎకరాలకు నీరివ్వచ్చు. అంటే 30 బ్యారేజీలు కలిపి 18 లక్షల ఎకరాలను సాగు చేయొచ్చు. ఏడాది పొడవునా నీటి నిల్వ ఉంటుంది కాబట్టి.. భూగర్భ జల మట్టం పెరుగుదలకు దోహదం చేస్తుంది. ముంపు ఉండదు ఈ విధానంలో ఒక్క గ్రామం కూడా ముంపునకు గురికాదు. నీటి నిల్వ గోదావరి వరద ప్రవాహస్థాయి దాటదు. నదీ ప్రవాహ ప్రాం తంలోనే 300 టీఎంసీల నుంచి 450 టీఎంసీ ల నీటినిల్వ ఉంటుంది. ఈస్థాయిలో నీటి విని యోగానికి రెండు భారీ రిజర్వాయర్లు అవసరం. అలాంటి భారీ డ్యామ్‌ల వల్ల ముంపు చాలా ఎక్కువగా ఉంటుంది. పూడిక సమస్య లేనట్లే.. సాధారణంగా బ్యారేజీల నిర్మాణంలో రివర్ బెడ్ లెవల్ (నదీ గర్భం) మీద ‘బాడీవాల్’ నిర్మిస్తారు. ఫలితంగా పూడిక చేరుతుంది. కొన్నేళ్లకు బ్యారేజీ నిల్వ సామర్థ్యం తగ్గిపోతూ ఉంటుంది. అదే ‘స్టెప్‌లేడర్ టెక్నాలజీ’లో బాడీ వాల్ నిర్మించాల్సిన అవసరం లేదు. రివ ర్ బెడ్ మీద ‘యాప్రాన్ (స్తంభాలు వంటివి)’లు నిర్మించి... వాటిని ఆధారంగా చేసుకుని రేడియల్ గేట్లు ఏర్పాటు చేస్తారు. ఈ రేడియల్ గేట్ల ఎత్తు నదీ ప్రవాహస్థాయిని బట్టి 12 నుంచి 18మీటర్లు ఉంటుంది. పూడిక పేరుకుం టే గేట్లు ఎత్తినప్పుడు కిందకు వెళ్లిపోతుంది. భారీగా విద్యుదుత్పత్తి.. బ్యారేజీల నిర్మాణం పూర్తయిన తర్వాత గోదావరిలో నీటి ప్రవాహ స్థాయి 4-15 మీటర్లు, బ్యారేజీవద్ద 13-15మీటర్లు ఉంటుంది. విద్యుదుత్పత్తికి ఈ ఎత్తు సరిపోతుంది. ఒక్కో బ్యారే జీ వద్ద 100 నుంచి 200 మెగావాట్ల (సరాసరి 150మెగావాట్ల) విద్యుదుత్పత్తికి వీలుంటుం ది. మొత్తం 4,500 మెగావాట్ల విద్యుత్ ఏడాది పొడవునా ఉత్పత్తి చేయవచ్చు. ఖర్చు తక్కువే.. ఒక్కో బ్యారేజీకి రూ.800 కోట్ల నుంచి రూ. వెయ్యి కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. విద్యుదుత్పత్తి కూడా బ్యారేజీ డిజైన్‌లో భాగంగానే ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వం భారీగా ఖర్చుచేసే పరిస్థితి లేకుంటే.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో అయినా చేపట్టవచ్చు. ఒక్కో బ్యారేజీ వద్ద సరాసరిన 150 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అవకాశం ఉంటుంది కాబట్టి.. ప్రైవేటు సంస్థలు ఒక్కో బ్యారేజీ మీద రూ.600 కోట్లదాకా పెట్టుబడికి ముందుకు వస్తాయి. జల రవాణాకు అనుకూలం జల రవాణాకూ అవకాశం కల్పించేలా బ్యారేజీ డిజైన్ ఉంటుంది. ఏడాది పొడవునా సుమారు 100 మిలియన్ టన్నుల సరుకుల రవాణా చేయవచ్చని అంచనా. రోడ్డు రవాణాతో పోలిస్తే జల రవాణా చౌక. కేంద్రం జల రవాణా అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో రవాణా రంగం నుంచీ పెట్టుబడులు ఆకర్షించడానికి అవకాశముంది. విద్యుత్‌తో పాటు జల రవాణా వస్తే పరిశ్రమలు వస్తాయి. ఫలితంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. చేపలతో ఆదాయం ఏడాది పొడవునా 600 కిలోమీటర్లకుపైగా నీటి నిల్వ ఉంటుంది కాబట్టి చేపల ఉత్పత్తికి అనుకూలం. నదిలో నిరంతర ప్రవాహానికి బ్యారేజీ డిజైన్‌లో అవకాశం ఉంది. ఫలితంగా ‘ఫిష్ లేడర్’ ఏర్పడుతుంది. చేపల ఉత్పత్తి వల్ల ఏటా కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతుంది. పర్యాటకానికి తోడ్పాటు జల రవాణా అభివృద్ధి చెందితే పర్యాటక రంగం కూడా వేగంగా వృద్ధి చెందుతుంది. దానివల్ల స్థానికులకు ఉపాధి, ప్రభుత్వానికి ఆదాయం రెండూ లభిస్తాయి. -
కర్ణాటక జల చౌర్యానికి అంతేది?
కృష్ణా, భీమా నదులపై అక్రమ బ్యారేజీల నిర్మాణం గుల్బర్గా జిల్లాలోనే 13కు పైగా బ్యారేజీల ఏర్పాటు శరవేగంగా కొనసాగుతున్న గిరిజాపూర్ బ్యారేజీ పనులు మాగనూర్: వర్షాలు కురవకపోయినా ఎప్పుడూ నదితీర ప్రాంత ప్రజలకు సాగు, తాగునీటిని అందించే కృష్ణా, భీమా జీవనదులు జీవచ్ఛవంలా మారాయి. చుక్కనీళ్లు లేక రాళ్లు తేలాయి. ఈ ప్రాజెక్టులకు ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ర్ట ప్రభుత్వాలు పది కిలోమీటర్లకు ఒక బ్యారేజీ చొప్పున అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో ఈ పరిస్థితి దాపురించింది. తెలంగాణ ప్రాంతానికి రెండు కిలోమీటర్ల దూరంలో కర్ణాటక ప్రభుత్వం రాయిచూర్ జిల్లాలోని గిరిజాపూర్ గ్రామం వద్ద కృష్ణానదిపై మరో అక్రమ బ్యారేజీ నిర్మాణం ప్రారంభించింది. దీనికి గత నెల 28న అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పాటూ రూ.150 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ బ్యారేజీ పొడవు 1170 మీటర్లు (1.35 కిలోమీటర్లు). దీనికి 194 గేట్లు బిగించనున్నారు. ఈ బ్యారేజీ నిర్మాణ పనులను బెంగళూరుకు చెందిన రఘు ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు కర్ణాటక ప్రభుత్వం అప్పగించింది. ఈ బ్యారేజీ నిర్మాణాన్ని యుద్ధప్రతిపాదికన చేపట్టి 24 నెలల్లోనే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. శక్తినగర్‌లోని కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు నీటిని అందించేందుకే ఈ బ్యారేజీ నిర్మాణం ప్రారంభించారు. ఇందులో అధికారికంగా ఒక టీఎంసీ నీటిని మాత్రమే నిల్వ ఉంచుతామని అక్కడి అధికారులు చెబుతున్నా, అదనంగా మరో టీఎంసీ నీటిని నిల్వ ఉంచే అవకాశం ఉంది. అదనంగా నిల్వ చేసే నీటిని లిఫ్ట్‌లతో రైతుల పొలాలకు నీరందించే ప్రయత్నంలో ఉన్నారు. దీనివల్ల తెలంగాణ ప్రాంతానికి తీరని నష్టం వాటిల్లనుంది. వర్షాకాలంలో వరదలు వచ్చిన సమయంలో ఈ బ్యారేజీల నుండి నీటిని దిగువకు విడుదల చేస్తారు. ఆ తరువాత నవంబర్, డిసెంబర్ నెలలో వరద తగ్గుతుంది. ఆ సమయంలో పైన ఉన్న ఈ బ్యారేజీలకు గేట్లు మూసేసి వచ్చే నీటిని నిల్వచేసుకుంటారు. దీంతో దిగువన ఉన్న ఎత్తిపోతల పథకాలకు, ప్రాజెక్టులకు నీరురాక ఇబ్బందులు ఏర్పడనున్నాయి. మూడు జిల్లాలకు నష్టం కర్ణాటక నిర్మిస్తున్న గిరిజాపూర్ ప్రాజెక్టువల్లా దిగువన ఉన్న 17 ఎత్తిపోతల పథకాలకు నీరందకుండా పోయే ప్రమాదముంది. అదే విధంగా తాగునీటికోసం కృష్ణానదిపై ఆధారపడిన మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు రానున్నాయి. నిబంధనల ప్రకారమే నిర్మిస్తున్నామంటున్న కర్ణాటక నదులపై బ్యారేజీల నిర్మాణానికి కేంద్ర జలవనరుల శాఖ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని కర్ణాటక అధికారులు వాదిస్తున్నారు. వాస్తవానికి ప్రాజెక్టు నిర్మాణ సమయంలో భూమి ముంపునకు గురైతేనే కేంద జలవనరుల శాఖ అనుమతులు అవసరమని.. ఇప్పుడు కర్ణాటక నిర్మించిన ఏ ప్రాజెక్టులోనూ భూమి ముంపునకు గురికానందున అనుమతి అవసరం లేదని వాదిస్తోంది. ప్రస్తుతం వారు నదిలో మాత్రమే నీటిని నిల్వ చేసుకుంటున్నారు. వీటికి లిఫ్ట్‌లు ఏర్పాటు చేయడంతో పాటూ రెతులు సొంతంగా మోటర్లు ఏర్పాటు చేసుకొని ఆ నీటిని వాడుకుంటున్నారు. కానీ ఎక్కడా భూములు, గ్రామాలు ముంపునకు గురికాలేదు. తాము కేవలం నదిలోనే నీటిని నిల్వ ఉంచుకొని నీటిని వాడుకుంటున్నాం కాబట్టి వీటికి అనుమతులు అవసరం లేదని వాదిస్తున్నారు. పదేళ్ల నుంచి బ్యారేజీల నిర్మాణం కృష్ణా, భీమా నదులపై కర్ణాటక ప్రభుత్వం పదేళ్ల క్రితం నుంచే బ్యారేజీల నిర్మాణాలు ప్రారంభించింది. భీమా నదిపై ఇటీవల నిర్మించిన గూడూర్, సన్నత్తిగి, యాద్గిర్ బ్యారేజీలు, కృష్ణానదిపై గూగల్, తింతిని వద్ద నిర్మించిన బ్రిడ్జికి గేట్లను అమర్చింది ఈ మధ్య కాలంలోనే. సన్నత్తి వద్ద నిర్మించిన బ్యారేజీలో నాలుగు టీఎంసీల నీటిని నిల్వ ఉంచుతున్నారు. దీనిని 2005 లో ప్రారంభిం చి, 2011లో పూర్తిచేశారు. దీని పొడవు 665 మీటర్లు. యాద్గిర్ వద్ద నిర్మించిన బ్యారేజీలో అదనంగా 1.01 టీఎంసీ నీటిని నిల్వ ఉంచుతున్నారు. దీనిని 2003 లో ప్రారంభించి 2005లో పూర్తిచేశారు. ఈ బ్యారేజీ పొడవు 425 మీటర్లు. యాద్గిర్, శాపూర్ పట్టణాలకు తాగునీటి సౌకర్యం కూడా ఈ బ్యారేజీ నుంచి కల్పిస్తున్నారు. కృష్ణానదిపై నారాయణపూర్ ప్రాజెక్టు దిగువన తింతిని వద్ద నిర్మించిన బ్యారేజీలో ఒక టీఎంసీకి పైగా నీటిని నిల్వచేసే సామర్థ్యం ఉంది. దీని దిగువన గూగల్ వద్ద నిర్మించిన బ్యారేజీలో రెండు టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నారు. గూగల్ బ్యారేజీ దిగువన గిరిజాపూర్వద్ద ప్రస్తుతం నూతనంగా మరో బ్యారేజీని కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తోంది. దీనిలో కూడా రెండు టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ విధంగా కర్ణాటక భీమా నదిపై గుల్బర్గా జిల్లాలోనే 13 బ్యారేజీలు, యాద్గిర్ జిల్లాలో నాలుగు బ్యారేజీలు నిర్మించింది. -
‘గోదావరి’పై బ్యారేజీ!
22 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించాలని యోచన దేవాదుల దిగువన నిర్మించేలా ప్రతిపాదన అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశం హైదరాబాద్: గోదావరి నదీ జలాల్లోని నిర్ణీత వాటాలను సంపూర్ణంగా వినియోగించుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ దిశగా ముందడుగు వేస్తోంది. ఈ మేరకు దేవాదుల ఎత్తిపోతల పథకానికి దిగువన బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించింది. ఈ బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి సమగ్ర అధ్యయన నివేదిక (డీపీఆర్) తయారీకి ఆదేశిస్తూ మంగళవారం నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీచేశారు. నీటి నిల్వ సామర్థ్యం ఎంత పెంచుకుంటే అంతమేర నీటిని సాగుకు వినియోగించుకోవచ్చని ప్రభుత్వం మొదటి నుంచి చెబుతూనే ఉంది. గోదావరిలో రాష్ట్రానికి 854.67 టీఎంసీల మేర నీటిని వినియోగించుకునే అవకాశమున్నా కేవలం 400 టీఎంసీల నీటినే వాడుకుంటోంది. మిగిలిన 400 నుంచి 500 టీఎంసీల నీటిని వాడుకలోకి తేవాలంటే బ్యారేజీల నిర్మాణం అవసరమని నిపుణులు కమిటీ కూడా సూచించింది. దుమ్ముగూడెం నుంచి ప్రాణహిత వరకు కనీసం 6 బ్యారేజీలైనా నిర్మాణం చేయాలని కమిటీ ప్రతిపాదించింది. ఈ మేరకే దేవాదుల ఎత్తిపోతలకు దిగువన ఏటూరునాగారం మండల పరిధిలోని గంగారం గ్రామం వద్ద బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించింది. బ్యారేజీ నిర్మాణ డీపీఆర్ కోసం రూ.64.30 లక్షలు కేటాయిస్తూ ఉత్తర్వులిచ్చింది. 22 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు అవసరమైన పంప్‌హౌజ్ నిర్మాణం, రిజర్వాయర్ల నిర్మాణానికి సంబంధించి సమగ్ర సర్వే చేయాలని వివరించింది. -
బ్యారేజీలతో జల‘సిరి’
కృష్ణా, గోదావరి జలాల సద్వినియోగానికి బ్యారేజీలతో ప్రయోజనం రాష్ర్ట ప్రభుత్వానికి నీటి పారుదల శాఖ నిపుణుల కమిటీ నివేదిక దుమ్ముగూడెం నుంచి ప్రాణహిత వరకు ఆరు బ్యారే జీలకు ప్రతిపాదన కృష్ణా పరిధిలోనూ నిర్మించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన కమిటీ మిడ్‌మానేరు, ఎల్లంపల్లి, కంతానపల్లి రిజర్వాయర్ల పూర్తికి సిఫారసు వాటితో 100 టీఎంసీల నీటి నిల్వకు ఆస్కారముందన్న నిపుణులు సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాలను వాటా మేరకు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే రాష్ర్టంలో మరిన్ని బ్యారేజీల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వానికి నీటి పారుదల శాఖ నిపుణుల కమిటీ సూచించింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వాటిని వెంటనే పూర్తి చేయాలని కూడా పేర్కొంది. నీటి నిల్వ సామర్థ్యాన్ని ఎంతగా పెంచుకుంటే అంతగా నీటిని సాగు ప్రయోజనాలకు మళ్లించుకోవచ్చని తేల్చింది. నదుల్లో వరద ఉండే కనిష్ట రోజుల్లో గరిష్ట నీటిని ఒడిసి పట్టుకునేందుకు బ్యారేజీల నిర్మాణం అత్యావశ్యకమని ఉద్ఘాటించింది. గోదావరి, కృష్ణా నదుల్లో లభ్యత నీటిని సమర్థంగా వినియోగించుకునేందుకు ప్రాజెక్టుల్లో రీ ఇంజనీరింగ్ జరపాలని నిర్ణయించిన రాష్ర్ట ప్రభుత్వం.. ఆ దిశగా అధ్యయనానికి రిటైర్డ్ ఇంజనీర్లతో నిపుణుల కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీ రెండు రోజుల పాటు కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలోని ప్రాజెక్టులను పరిశీలించి ప్రాథమిక నివేదికను రూపొందించింది. గోదావరి పరిధిలో మరో ఆరు బ్యారేజీలు, కృష్ణా పరిధిలోనూ పలు బ్యారేజీలను అదనంగా నిర్మించాల్సిన అవసరముందని కమిటీ నొక్కి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు కమిటీ చైర్మన్ శ్యాంప్రసాద్ రెడ్డి, ఇతర సభ్యులు బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ను కలసి ప్రాథమిక నివేదికను అందజేశారు. ఈ సమావేశంలో సర్వే సంస్థ ‘వ్యాప్కోస్’ ప్రతినిధులు కూడా పాల్గొని ‘ప్రాణహిత’ ప్రత్యామ్నాయంపై వివరించినట్లు తెలిసింది. కృష్ణా పరిధిలోనూ మరిన్ని.. ఇక కృష్ణా నదిలో రాష్ట్రానికి 267 టీఎంసీల వరకు నీటిని వాడుకునే వెసలుబాటు ఉంది. ఇక్కడ ఇంకా 200 టీఎంసీల వరకు నీటిని వాడుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నా యి. ఇందుకోసం కల్వకుర్తి, భీమా, నెట్టెం పాడు, కోయిల్‌సాగర్‌తో పాటు కొత్తగా పాల మూరు ఎత్తిపోతల ప్రాజెక్టులను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. వీటితో సుమారు 160 టీఎంసీల మేర నీటిని వాడుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రాజెక్టుల పరిశీలన జరిపిన నిపుణుల కమిటీ.. సర్కారుకు పలు సిఫార్సులు చేసింది. మొదట తుంగభద్ర నుంచి రాజోలిబండ డైవర్షన్ స్కీమ్(ఆర్డీఎస్) వద్ద 16 టీఎంసీల మేర నీటిని వాడుకునే అవకాశమున్న దృష్ట్యా అక్కడ బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని సూచించింది. దీని కోసం అవసరమైతే కర్ణాటకను ఒప్పించాలని సూచించింది. ఇక కల్వకుర్తి ప్రాజెక్టు పరి ధిలో 35 టీఎంసీల నీటి వినియోగం కోసం మరో రెండు బ్యారేజీలు నిర్మించాలని, జూరాల ప్రాజెక్టు రివర్ బ్యాంకులో గుర్రంగడ్డ వద్ద మరో బ్యారేజీని, నెట్టెంపాడులో మరో 2 బ్యారేజీలను నిర్మించాలని పేర్కొంది. బ్యారేజీల నిర్మాణం త్వరితగతిన జరగాలంటే భూసేకరణ, పునరావాస చర్యలను ముందు పూర్తి చేసి తర్వాతే టెండర్లకు వెళ్లాలని కమిటీ కీలక సూచన చేసింది. గోదావరి పరిధిలో అనువైన ప్రాంతాలు గోదావరిలో నికర, వరద జలాలు కలిపి లభ్యతగా ఉన్న 1,400 టీఎంసీల నీటిలో రాష్ట్రానికి 854.67 టీఎంసీల మేర వినియోగించుకునే అవకాశముంది. అయితే ప్రస్తుతం 400 టీఎంసీల మేరకే రాష్ర్టం వినియోగించుకుంటోంది. మిగతా వాటాను కూడా వాడుకలోకి తేవాలంటే బ్యారేజీల నిర్మాణం అవసరమని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. దుమ్ముగూడెం మొదలుకుని ప్రాణహిత వరకు కొత్తగా 6 బ్యారేజీలనైనా నిర్మించాలని ప్రతిపాదించింది. అప్పుడే గోదావరి బేసిన్లో ఎక్కడైనా నీటిని నిల్వ చేసుకుని వాడుకునే వెసలుబాటు ఉంటుందని పేర్కొంది. దుమ్ముగూడెం వద్ద ఒకటి, కంతనపల్లి-దుమ్ముగూడెం మధ్య, కంతానపల్లి, ఇచ్ఛంపల్లి, కాళేశ్వరంతో పాటు ప్రాణహితలో భాగంగా ఉన్న తుమ్మిడిహెట్టి బ్యారేజీకి 70 కిలోమీటర్ల దిగువన వేమునిపల్లి వద్ద బ్యారీజీల నిర్మాణానికి అనువైన స్థలాలు ఉన్నాయని కమిటీ తేల్చింది. అయితే వాటి సామర్థ్యం ఎంత ఉండాలన్న దానిపై మాత్రం కమిటీ ఇంకా నిర్ధారణకు రాలేదు. మేమునిపల్లి వద్ద మాత్రం 5 టీఎంసీల బ్యారేజీని నిర్మించవచ్చని పేర్కొంది. మూడు రిజర్వాయర్లతో 100 టీఎంసీల నిల్వ.. గోదావరి బేసిన్లో 350 టీఎంసీల నీటిని వాడుకునే ఉద్దేశంతో 7 భారీ ప్రాజెక్టులను చేపట్టినా అవి పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాకపోవడంతో లక్ష్యం నెరవేరలేదు. ప్రధానంగా దేవాదుల, ఎల్లంపల్లి, రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్, ప్రాణహిత-చేవెళ్ల, కంతానపల్లి, కాళేశ్వరం, ఎస్సారెస్పీ వర ద కాల్వ, మిడ్‌మానేరు ప్రాజెక్టులపై సర్కారు దృష్టి సారిం చింది. అయితే గోదావరి నీటిని నిల్వ చేసుకునేందుకు మిడ్‌మానేరు(25.87 టీఎంసీలు), కంతానపల్లి(50 టీఎంసీలు), ఎల్లంపల్లి(24 టీఎంసీలు) ప్రాజెక్టుల పరిధిలోని రిజర్వాయర్లను వెంటనే పూర్తి చేయాలని కమిటీ అభిప్రాయపడింది. దీనివల్ల 100 టీఎంసీల నీటి నిల్వకు అవకాశం ఏర్పడుతుం ది. ప్రభుత్వం మన సు పెడితే రిజర్వాయర్లను ఏడాదిలో పూర్తి చేయొచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. కంతానపల్లిని పూర్తి చేస్తే దేవాదుల ఎత్తిపోతలకు, ఎస్సారెస్పీ స్టేజ్-1, స్టేజ్-2కు నిల్వ నీటిని ఉపయోగించుకునే అవకాశం ఉం టుందని పేర్కొంది. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలో స్టేజ్-2 పనులు పూర్తయినా, స్టేజ్-1 పనులు కొనసాగుతుండటంతో ఆ పనులను వెంటనే పూర్తి చేయాల్సి ఉంది. మిడ్‌మానేరులో పునరావాస సమస్యలను పరిష్కరిస్తే పనులు ముందుకు సాగే అవకాశముందని కమిటీ విశ్లేషించింది. -
తొలి అడుగు
మొదలైన కంతనపల్లి బ్యారేజీ నిర్మాణ పనులు ముందుగా గోదావరి నీటి మళ్లింపునకు మట్టి, ఇసుక కట్టల ఏర్పాటు ఏటూరునాగారం, న్యూస్‌లైన్ : ఏటూరునాగారం మండలంలోని కంతనపల్లి గ్రామం వద్ద గోదావరి నదిపై బ్యారేజీ నిర్మాణ పనులు మొదలయ్యూయి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కంతనపల్లి ప్రాజెక్టు పనులకు తొలి అడుగు పడింది. బ్యారేజీ నిర్మాణం మొదటి దశలో రూ.1800 కోట్లతో టెండర్ దక్కించుకున్న ఎస్ఈడబ్ల్యూ, రిత్విక్ కంపెనీలు సంయుక్తంగా పనులు ప్రారంభించాయి. గోదావరి నదిపై 172 గేట్లతో 3.5 కిలో మీటర్ల పొడువుతో బ్యారేజీని నిర్మించనున్నారు. బ్యారేజీ నిర్మాణం ప్రదేశంలో నీటిని మూడు పాయలుగా విభజించేందుకు రెండు రోజులుగా మట్టికట్టలు, ఇసుక కట్టలను నిర్మిస్తున్నారు. నీటి ప్రవాహాన్ని మళ్లించడం వల్ల పనులు చేసుకునే వీలు కలుగుతుంది. నీటిని మళ్లించిన తర్వాత బ్యారే జీ నిర్మాణ ప్రదేశంలో ఉన్న బండరాళ్లను తొలగించనున్నారు. వర్షాకాలం రానుండడంతో ముందస్తుగా కావాల్సిన ఇసుకను తరలిస్తున్నారు. బ్యారేజీ నిర్మాణ పనులకు ఉపయోగించే యంత్రాలను అవతలి ఒడ్డుకు తరలించేందుకు కూడా మట్టితో రోడ్డు పనులు చేపట్టారు. అంతేకాకుండా యంత్రాలు, నిర్మాణ పనులు చేసే సిబ్బంది కోసం తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు. పనులను సైట్ ఇన్చార్జ్ జయప్రకాశ్ పర్యవేక్షిస్తున్నారు.