నవంబర్ నుంచి సీఏ సిలబస్ మార్పు
- ఐసీఏఐ జాతీయ అధ్యక్షుడు
దేవరాజ్ రెడ్డి వెల్లడి
లబ్బీపేట: దేశవ్యాప్తంగా ఈ ఏడాది నవంబర్ నుంచి సీఏ సిలబస్‌లో మార్పులు తీసుకురానున్నట్లు ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) జాతీయ అధ్యక్షుడు ఎం.దేవరాజ్ రెడ్డి తెలిపారు. ఐసీఏఐ విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో ‘జ్ఞానశిఖర’ పేరుతో చార్టెడ్ అకౌంటెంట్స్ సబ్ రీజినల్ కాన్ఫరెన్స్ శనివారం విజయవాడలో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా దేవరాజ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఐసీఏఐ ఇచ్చే సిలబస్‌తో మూడేళ్లపాటు ప్రణాళికాబద్ధంగా ఆర్టికల్స్ చేస్తేనే సీఏ పూర్తి చేయడం సాధ్యమవుతుందన్నారు. రైల్వేలో డబుల్ అకౌంటింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఐసీఏఐ విజయవాడ చాప్టర్ చైర్మన్ కె.శివరామకుమార్, వైస్ చైర్మన్ జి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.