camera click
-
మాస్క్‌లు లేవు.. భౌతిక దూరం బాధే లేదు...
‘పిట్ట బతుకూ ఎంత హాయి’ అంటూ ప్రముఖ రచయిత, గాయకుడు గోరటి వెంకన్న పాటందుకుంటే ఏదో అనుకున్నాం. కానీ ఈ పక్షుల సమూహాన్ని చూస్తుంటే ‘నిజమే ఎంత హాయి’ అనిపిస్తుంది ఎవరికైనా. మాస్క్‌లు లేవు... భౌతిక దూరం బాధే లేదు... మందు, మాకూ చింతే లేదు... వ్యాక్సినేషన్ గొడవ అంతకన్నా లేదు. ‘కలిసి ఉంటే కలదు సుఖం’ అనే మాటను మరచిపోయి ఏడాదిన్నరకుపైనే దాటిపోయింది. సరదాగా మీలా కూర్చొని నాలుగు కబుర్లు... మనసారా నవ్వులు ఊసే లేదు. వరుస మరణాలు సంభవిస్తే ‘పిట్టల్లా రాలిపోతున్నారు’ అనే వాళ్లం. కానీ ఇప్పుడు మా ‘నవ’ జాతే కూలిపోతోంది... మీ కిలకిలా రావాలు ఎప్పటిలానే వసంత రుతువును తలపిస్తోంది. మీలో ఉరకలెత్తే ఆ ఉత్సాహం... సంతోషం మా సొంతమయ్యేదెప్పుడో... ‘ఉందిలే మంచి కాలం ముందూముందునా... అందరూ సుఖపడాలి నందానందనా’ అని ఆలపించుకుంటూ... ఆ కాలం కోసం ఎదురు చూస్తున్నామని గుమిగూడిన విహంగాల గుంపును చూసినవారు అభిలషించారు. జిల్లా కేంద్రమైన విజయనగరంలోని గురజాడ అప్పారావు రోడ్డు మార్గంలో ఓ ఫ్లెక్సీ ఐరన్ రాడ్లపై ఈ దృశ్యం ‘సాక్షి’ కెమెరా కంటపడగానే ‘క్లిక్’మంది. – సత్యనారాయణ, సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం Photo Feature: రెడీ టు టేకాఫ్.. తిరుగు ప్రయాణానికి సిద్ధం -
కెమెరాను కాకి ఎత్తుకెళ్లింది.. అద్భుత వీడియో
-
కెమెరాను కాకి ఎత్తుకెళ్లింది.. అద్భుత వీడియో
నార్వే : ఓ వ్యక్తికి తాను కొత్త కెమెరా తీసుకున్నాన్న ఉత్సాహం కాసేపు కూడా నిలవలేదు. అత్యంత దగ్గర నుంచి షూట్ చేద్దామని టైమ్ సెట్ చేసి ఉంచగా దానిని దొంగ ఎత్తుకెళ్లారు. అయితే ఆ దొంగ మనిషి కాదండోయ్ ఓ కాకి. అవును నార్వేకు చెందిన జెల్ రాబర్ట్సన్ అనే వ్యక్తి సముద్రపు కాకిని అతి సమీపంలో నుంచి తన కెమెరాలో బందించాలని అనుకున్నాడు. అందులో భాగంగా ఇంటి బయట కంటెగోడపై కెమెరాను పెట్టి దానికి సమీపంలో బ్రెడ్‌ముక్కలు వేశాడు. తొలుత అక్కడి వచ్చిన కాకులు బ్రెడ్ ముక్కలు తిన్నాయి. అయితే, వాటిల్లో ఒక కాకి నేరుగా ఆ 4 కె కెమెరా వద్దకు వెళ్లి తొలుత ముక్కుతో పొడిచింది. అనంతరం దానిని నోట కరుచుకొని అనూహ్యంగా ఎత్తుకెళ్లింది. ఆ సమయంలో ఆ కెమెరాలో డ్రోన్ వీడియో మాదిరిగా రికార్డ్ అయింది. ఆ కెమెరా కాస్త అతడి ఇంటికి సమీపంలోని గుట్టల ప్రాంతంలో పడేయగా అది దాదాపు ఐదు నెలల తర్వాత దొరికింది. ఆ కాకి కెమెరాను ఎత్తుకెళ్లే సమయంలో రికార్డయిన వీడియోను అతడు సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అది కాస్త పెద్ద వైరల్ అయ్యి లక్షల మంది వీక్షించారు. -
మైమరపించిన బుద్ధ భగవానుడు
పండు వెన్నెల్లో ప్రకాశించే నిలువెత్తు మూర్తి...అమావాస్యపు అంధకారాన్ని జయించే విజయస్ఫూర్తి...వెలుగు మబ్బుల్లో ఉదయించే ఉషోదయ దీప్తి...చిమ్మచీకట్లను సైతం చీల్చే కాంతి కిరణాల వ్యాప్తి...రంగులలోకపు వైభవాన్ని మైమరపించే భగవానుడి కీర్తి... హుస్సేన్‌సాగర్ నడుమ.. అదే బుద్ధుడు. అదే మూర్తి. ఒకనాడు వెన్నెల సోనలా, మరొకరోజు వెలుగుల వానలా... ఉదయపు వేళ ఉషస్సులా సాయంసంధ్యలో యశస్సులా... వాతావరణం సంతరించుకుంటున్న వర్ణాలకు థీటుగా మెరిసిపోతూన్న దృశ్యాల్ని ‘సాక్షి’ కెమెరా ‘క్లిక్’ మనిపించింది.