campaigne
-
టి20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీ ప్రచారకర్తగా బోల్ట్
దుబాయ్: అథ్లెటిక్స్ దిగ్గజం, ఆల్‌టైమ్ గ్రేట్ ఉసేన్ బోల్ట్ ఇప్పుడు కొత్తగా క్రికెట్‌కు ప్రచారం కల్పించేందుకు సిద్ధమయ్యాడు. జమైకాకు చెందిన బోల్ట్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) త్వరలో జరిగే టి20 ప్రపంచకప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. జూన్ 1 నుంచి జరిగే ఈ టోర్నీ వెస్టిండీస్, అమెరికాలలో జరగనున్న నేపథ్యంలో విండీస్ జట్టులో భాగమైన జమైకా దేశ ప్లేయర్ బోల్ట్‌ను ఎంచుకుంది.కొన్నేళ్ల క్రితమే ఆటకు వీడ్కోలు పలికిన ఫాస్టెస్ట్ స్ప్రింటర్ బోల్ట్ పేరిటే ప్రస్తుతం 100 మీటర్లు, 200 మీటర్లు ప్రపంచ రికార్డులు నమోదై ఉన్నాయి. ‘ఈ కొత్త పాత్ర పట్ల చాలా సంతోషంగా ఉంది. అంబాసిడర్ హోదాలో ప్రపంచకప్ కోసం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. క్రికెట్‌ను ఎంతో ప్రేమించే కరీబియన్ దేశం నుంచి వచ్చిన నా మదిలో క్రికెట్‌కు ప్రత్యేక స్థానం ఉంది.వరల్డ్ కప్ అమెరికాలో జరగడం క్రికెట్ మార్కెట్‌ను మరింత విస్తరించేలా చేస్తుంది. అయితే టోర్నీలో మాత్రం నేను వెస్టిండీస్ జట్టుకు మద్దతు పలుకుతా’ అని బోల్ట్ వెల్లడించాడు. జూన్ 1 నుంచి 29 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పోటీపడనున్నాయి. -
మైకులు బంద్.. అందరి దృష్టి దుబ్బాకపైనే..
సాక్షి, సిద్దిపేట: నెల రోజులుగా మైకుల మోతలు, నాయకుల ప్రచారాలు... ఆరోపణలు– ప్రత్యారోపణలు, సవాళ్లతో హోరెత్తిన దుబ్బాక నియోజకవర్గం ఆదివారం సాయంత్రానికి ఒక్కసారిగా మూగబోయింది. 3న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఆదివారంతో ప్రచార పర్వానికి తెరపడింది. చివరి రోజు కావడంతో అన్ని పార్టీల నాయకులు నియోజకవర్గవ్యాప్తంగా పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. సభలు, సమావేశాలు, రోడ్‌షోలు, మోటారు సైకిల్ ర్యాలీలు, ధూంధాం కార్యక్రమాలు నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రచారసారథి, మంత్రి హరీశ్‌రావు ఉదయం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి 18 ప్రశ్నలతో కూడిన లేఖను సంధించారు. వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం నియోజకవర్గం అంతా కలియతిరిగి సభలు, సమావేశాలు, రోడ్ షోల్లో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫేస్ బుక్, జూమ్ ద్వారా కార్యకర్తలతో మాట్లాడారు. కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి దుబ్బాకలో విలేకరుల సమా వేశంలో టీఆర్ఎస్, బీజేపీలను దుయ్యబట్టారు. ఈ రెండు పార్టీల నాయకలు ఒకే గూటి పక్షులని విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా రోడ్‌షోలు నిర్వహించారు. టీఆర్ఎస్, బీజేపీలను ఓడించి రాష్ట్రానికి పట్టిన శని వదిలించాలని ఎంపీ రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుతోపాటు, నిజామాబాద్ ఎంపీ అరవింద్ రోడ్‌షోలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేగుంట మండలంలో రోడ్‌షో నిర్వహించి టీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు చేశారు. ఆఖరిరోజు కావడంతో నాయకులు ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచారంలో నిమగ్నమయ్యారు. 2,500 మంది పోలీసులు దుబ్బాక ఉప ఎన్నికపై మొత్తం రాష్ట్రం దృష్టి కేంద్రీకృతమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. గత నెల 26న సిద్దిపేటలో నోట్ల కట్టల లొల్లి సంఘటనతో తలెత్తిన ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకొని బందోబస్తు పెంచారు. రెండు బెటాలియన్ల సీఆర్పీఎఫ్ బలగాలు, ఏపీఎస్పీ బెటాలియన్లతోపాటు రాష్ట్రంలోని పది జిల్లాల నుంచి పోలీసులకు దుబ్బాక నియోజకవర్గంలో డ్యూటీలు వేశారు. హోంగార్డు నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు మొత్తం 2,500 మంది పోలీసులను మోహరించారు. 89 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రచారానికి వచ్చిన స్థానికేతరులు అందరూ ఆదివారం సాయంత్రం 6 గంటల తర్వాత నియోజకవర్గం వదిలి వెళ్లిపోవాలని ఆదేశించారు. -
ట్రెండింగ్‌లో ‘మై నేమ్ ఈజ్’
వాషింగ్టన్: డెమొక్రాటిక్ ఉపాధ్యక్ష అభ్యర్ధి కమలాహారిస్ పేరును రిపబ్లికన్ సెనేటర్ తప్పుగా పలకడం ఆమె మద్దతుదారులకు ఆగ్రహం తెప్పించింది. ఇందుకు నిరసనగా బైడెన్ బృంద ఏసియన్ అమెరికన్ పసిఫిక్ ఐలాండర్ కోఆర్డినేటర్ అమిత్ జాని ఆరంభించిన ‘‘మై నేమ్ ఈజ్..’’ క్యాంపైన్ ట్రెండింగ్‌లో నిలిచింది. జార్జియాకు చెందిన రిపబ్లికన్ సెనేటర్ డేవిడ్ పెర్డ్యూ ఇటీవల ఒక ర్యాలీలో కమలా హారిస్ పేరును వ్యంగంగా ఉచ్ఛరించారు. ‘‘ఖ మ లా? ఖ మ్మ లా? కమలా మలా మాలా? ఏమో నాకు తెలీదు.. ఏదో ఒకటిలే’’ అని ఆయన ర్యాలీలో కమలా హారిస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. దీంతో పలువురు సోషల్ మీడియాలో తమ పేరు ఉత్పత్తి, అర్థాన్ని వివరిస్తూ పోస్టులు పెట్టడం ఆరంభించారు. డేవిడ్ కావాలనే కమలా పేరును అలా పలికారని, నాలుగేళ్లు తనతో పనిచేసిన తోటి సెనేటర్ పేరును గుర్తుంచుకోలేరా? అని కమలా మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ #MyN్చఝ్ఛఐటహ్యాష్ట్యాగ్తో పోస్టులు ట్రెండ్ అవుతున్నాయి. పలువురు సెలబ్రెటీలు కూడా ఈ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు చేశారు. డేవిడ్ సమర్థకులు మాత్రం ఈ ఆగ్రహాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. సెనేటర్ డేవిడ్ తెలీక కమలా పేరును తప్పుగా పలికారని, ఇందులో ఎలాంటి దురర్ధం లేదని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. గతంలోకూడా కమలా పేరును కొందరు కావాలని తప్పుగా పలకడం గమనార్హం. -
వాడివేడిగా నారాయణఖేడ్‌లో ‘ఆర్టీసీ’ ఎలక్షన్స్
ఆర్భాటంగా ఎన్నికల ప్రచారం గుర్తింపు కోసం తలపడుతున్న యూనియన్లు నారాయణఖేడ్: ఆర్టీసీలో జరుగుతున్న గుర్తింపు ఎన్నికల్లో ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు వివిధ కార్మిక సంఘాలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే డిపో ఆవరణంలో ఎన్నికల సందడి మొదలైంది. ఈనెల 19న పోలింగ్ జరగనున్నాయి. ఇప్పటి వరకు ఎన్‌ఎంయూదే ఆధిపత్యం నారాయణఖేడ్‌లో ఆర్టీసీ డిపో 1987వ సంవత్సరంలో ఆవిర్భవించింది. డిపో ఆవిర్భావం నుంచి ఎక్కువసార్లు నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్ఎంయూ)నే ఆధిపత్యం కొనసాగిస్తోంది. 1991లో ఒకసారి భారతీయ మజ్దూర్‌సంఘ్(బీఎంఎస్) గెలుపొందింది. ఇదిలా ఉండగా, గత ఏడాది ఎన్నికల్లో నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) గెలిచింది. టీఎంయూ ఏర్పాటు అనంతరం ఎన్ఎంయూ భారీగా పతనమైంది. ఎన్‌ఎంయూలో చాలామంది నాయకులు, కార్మికులు టీఎంయూలో చేరడంతో ఆ యూనియన్ బలపడింది. ఈసారి కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు టీఎంయూ ప్రయత్నిస్తుండగా.. ఆ యూనియన్ను మట్టికరిపించాలని మిగతావారు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. డిపోలో 327 మంది కార్మికులు ఓటర్లుగా ఉన్నారు. గట్టిపోటీ ఇవ్వనున్న టీఎంయూ ఎన్నికల్లో రాష్ట్రస్థాయి గుర్తింపునకు క్టాస్–3కు తెలుపురంగు ఓటరు స్లిప్పుపై, రీజినల్æస్థాయిలో గుర్తింపునకు క్లాస్–6 పింక్‌కార్డు ఓటరు స్లిప్పుపై ఓటేయాల్సి ఉంది. రీజియన్ స్థాయిలో గెలిచిన యూనియన్ అధికారికంగా స్థానిక డిపోల్లో అధికారిక యూనియన్‌గా చలామణి అవుతుంది. నారాయణఖేడ్ డిపోలో టీఎంయూ మాత్రమే స్వతహాగా క్లాస్–3, క్లాస్–6కు పోటీ చేస్తోంది. కాగా, ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ), బీఎంఎస్, ఎన్ఎంయూ యూనియనుల్లు జేఏసీగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. ఈ మూడు యూనియన్లు రీజియన్ స్థాయిలో క్లాస్–6కు ఐక్యంగా పోటీలో ఉన్నాయి. రాష్ట్రస్థాయిలో క్లాస్–3కి మాత్రం విడివిడిగా పోటీకి దిగుతున్నారు. ఇప్పటికే టీఎంయూతో కలిసి టీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తిరుపతయ్య, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్.. యూనియన్ తరపున బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అధికారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నందున కార్మికులంతా టీఎంయూకు ఓటేసి గెలిపించాలని, తమ సమస్యల పరిష్కారానికి టీఎంయూ మాత్రమే ప్రత్యామ్నాయమని హామీలిచ్చారు. కాగా, బీఎంఎస్ నుంచి రీజియన్ కార్యదర్శి మెట్టు రాఘవులు, ఎంప్లాయీస్ యూనియన్ నుంచి జిల్లా కార్యదర్శి కాన్షీరాం, ఎన్ఎంయూ జిల్లా అధ్యక్షుడు రాములు ప్రచారాన్ని నిర్వహించారు. టీఎంయూ నాయకులు కార్మికుల వద్ద ముడుపులు వసూలు చేస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.