బీజేపీ నేత ప్రేమ్‌సింగ్ రాథోడ్‌పై నిర్భయ కేసు
హైదరాబాద్: బీజేపీ నేత ప్రేమ్‌సింగ్ రాథోడ్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.... కంటోన్మెంట్లో అక్రమ కట్డడాల కూల్చివేతల్లో భాగంగా గత నెల 21వ తేదీన ప్యారడైజ్ సమీపంలోని అగ్రసేన్ భవన్లో ఇటీవల నిర్మించిన భననాన్ని అధికారులు కూల్చివేసారు. దీనికి నిరసనగా మాజీ ఎంపీ గిరిష్సంఘీ సహా, ప్రేమ్‌సింగ్‌రాథోడ్ మరి కొందరు అగ్రసేన్భవన్లో అనుమతి లేకుండా సమావేశం నిర్వహించారు. దీంతో పాటు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. ఈ విషయమై వీరిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
అనంతరం అక్రమ కట్టడాలను కూల్చివేయడంలో కీలక పాత్ర వహించిన కంటోన్మెంట్ సీఈవో సుజాతాగుప్తా వ్యక్తిగత, వైవాహిక జీవితంపై ప్రేమ్‌సింగ్ వివాదస్పదవ్యాఖ్యలు చేశారు. ప్రేమ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఆమె బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గత నెల 26వ తేదిన ప్రేమ్‌సింగ్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.