Capital Designs
-
అప్పుడు రాజమౌళి..ఇప్పుడు దగ్గుబాటి
సాక్షి, అమరావతి: రాజధాని డిజైన్లకోసం ఇంతకుముందు సినీ దర్శకుడు రాజమౌళితో సంప్రదింపులు జరిపిన సీఎం చంద్రబాబునాయుడు తాజాగా రాజధానిలో ప్రతిపాదించిన మీడియా సిటీ నిర్మాణానికి సంబంధించి మరో సినీ ప్రముఖుడు దగ్గుబాటి సురేష్‌బాబుతో చర్చలు జరిపారు. సీఆర్డీఏ సమీక్షా సమావేశానికి ఆయన్ను ఆహ్వానించి సలహాలు తీసుకున్నారు. గురువారం సచివాలయంలో జరిగిన సీఆర్డీఏ సమీక్ష సమావేశంలో మీడియా సిటీ నిర్మాణం, రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి చంద్రబాబు.. సురేష్‌బాబుతో చర్చించారు. మీడియా సిటీలో 25 ఎకరాల్లో మూవీ స్టూడియో ఏర్పాటు ప్రతిపాదన గురించి సీఆర్డీఏ అధికారులు వివరించగా.. హైదరాబాద్‌లో కేంద్రీకృతమైన తెలుగు సినీ పరిశ్రమను రాష్ట్రంలో ఎలా అభివృద్ధి చేయాలనేదానిపై సురేష్‌బాబు సూచనలు ఇచ్చారు. సినీ, టీవీ పరిశ్రమ హైదరాబాద్‌కే పరిమితమైందని, ఏపీలోని స్థానిక నైపుణ్యతను, కళాకారులు, సాంకేతిక నిపుణులను వినియోగించుకుంటే మరో ఏడాదిన్నరలో పరిశ్రమను ఇక్కడ అభివృద్ధి చేయవచ్చని పేర్కొన్నారు. సీఎం మాట్లాడుతూ మీడియా సిటీ నిర్మాణం సృజన, కంటెంట్‌పైనే ఆధారపడబోతోందని చెప్పారు. రాజధానిలో తొమ్మిది నగరాల నిర్మాణానికి సంబంధించి తొమ్మిది కమిటీలను ఏర్పాటు చేసి వాటి అభివృద్ధికి సలహాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బీఎల్‌ఎఫ్‌కు రెండు దీవులు: కృష్ణా నదిలో ఉన్న ఏడు దీవుల్లో ముఖ్యమైన రెండింటిని యూఈఏకి చెందిన బిజినెస్ లీడర్స్ ఫోరమ్ (బీఎల్ఎఫ్)కు ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం తరఫున సీఆర్డీఏ.. బీఎల్‌ఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా రెండు దీవుల్లో సుమారు 500 ఎకరాల్లో గోల్ఫ్ కోర్స్, కన్వెన్షన్ సెంటర్, హోటల్ కాంప్లెక్స్, రిసార్ట్ విల్లాల ఏర్పాటుకు బీఎల్ఎఫ్ చైర్మన్ రామ్ బుక్సాని ప్రతిపాదనలిచ్చారు. సీఆర్డీఏ పరిధిలోని దీవుల అభివృద్ధి, సుందరీకరణ ప్రాజెక్టులు, నగరాల అభివృద్ధిలో జాప్యం లేకుండా పనులు వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రకాశం బ్యారేజ్ పరిసరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ మంత్రి నారాయణ, సీఆర్డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, ఏడీసీ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. -
రాజధాని డిజైన్లపై రాజమౌళి సూచనలు తిరస్కరణ
-
రాజధాని డిజైన్లపై రాజమౌళితో బాబు చర్చలు
సాక్షి, అమరావతి: రాజధాని డిజైన్లపై సినీ దర్శకుడు రాజమౌళితో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్చలు జరిపారు. హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు ఆదివారం తన నివాసంలో రాజమౌళితో సమావేశమై రాజధానిలో నిర్మించనున్న అసెంబ్లీ, హైకోర్టు డిజైన్ల గురించి మాట్లాడారు. రాజధాని పరిపాలనా నగరంలో నిర్మించే అసెంబ్లీ భవన డిజైన్ గురించి మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్‌కు సలహాలిచ్చే బాధ్యతను రాజమౌళికి అప్పగించిన విషయం తెలిసిందే. ఫోస్టర్స్ సంస్థ రూపొందించిన డిజైన్లకు రాజమౌళి కొన్ని మార్పులు సూచించారు. దాని ప్రకారం తయారు చేసిన డిజైన్లపై చర్చించడంతో పాటు ప్రత్యేకంగా అసెంబ్లీ కోసం తాను రూపొందించిన డిజైన్లపై సీఎంకు రాజమౌళి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ నెల 13న నార్మన్ ఫోస్టర్స్ సంస్థ తుది డిజైన్లు సమర్పించేందుకు వస్తున్న నేపథ్యంలో రాజమౌళితో చంద్రబాబు సమావేశమయ్యారు. రాజమౌళి డిజైన్లు, ఫోస్టర్స్ డిజైన్లపై 13న చర్చించి సీఎం ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందని సీఆర్డీఏ అధికారులు తెలిపారు. -
అసెంబ్లీ మినహా రాజధాని డిజైన్లన్నీ ఖరారు
సాక్షి, అమరావతి: అసెంబ్లీ మినహా రాజధాని భవనాల డిజైన్లన్నీ ఖరారయ్యాయని సీఎం చంద్రబాబునాయుడు వెల్లడించారు. సంక్రాంతికి అటు ఇటుగా రాజధానిలో ప్రభుత్వ శాశ్వత భవనాల నిర్మాణ పనులను ప్రారంభిస్తామని చెప్పారు. విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్న ఆయన శుక్రవారం రాత్రి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. రాజధాని డిజైన్ల రూపకల్పనలో సినీ దర్శకుడు రాజమౌళి విలువైన సూచనలు చేశారన్నారు. డిజైన్ల ఖరారులో ఆయన కీలకంగా వ్యవహరించారని చెప్పారు. మరో 40 రోజుల్లో అసెంబ్లీ భవన డిజైన్‌నూ ఖరారు చేస్తామని తెలిపారు. ప్రపంచంలో అత్యుత్తమ సచివాలయం, అత్యున్నత పరిపాలన నగరాల డిజైన్లు మనవే అవుతాయని చెప్పారు. -
మార్పులతో డిజైన్లకు ఆమోదం
సాక్షి, అమరావతి: రాజధాని డిజైన్ల వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. నార్మన్ ఫోస్టర్ సంస్థ రూపొందించిన తుది డిజైన్ల పట్ల సీఎం చంద్రబాబునాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తంగా ఈ డిజైన్లకు ఆమోదం తెలిపిన సీఎం అదే సందర్భంలో కొన్ని మార్పులు సూచించారు. హైకోర్టు ఆకృతికి దాదాపుగా ఓకే చెప్పిన చంద్రబాబు అసెంబ్లీ ఆకృతిలో మరికొన్ని మార్పులు చేయాలని కోరారు. విదేశీ పర్యటనలో భాగంగా లండన్‌లో పర్యటిస్తున్న సీఎం బుధవారం మరోసారి ఆయన నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతినిధులతో విడతలవారీగా సమావేశమయ్యారు. సంస్థకు చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ నార్మన్ రాబర్ట్ ఫోస్టర్తోనూ మాట్లాడారు. మరోవైపు సచివాలయం డిజైన్లకు ఆమోదం తెలియజేశారు. ఆ మేరకు సచివాలయాన్ని ఐదు టవర్లుగా నిర్మించనున్నారు. పలు సంస్థల అధిపతులతో సీఎం భేటీ.. లండన్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు బృందం పలు సంస్థల అధిపతులతో సమావేశమైంది. ఇందులో భాగంగా పంచదారకు ప్రత్యామ్నాయంగా సహజసిద్ధ చక్కెర(నేచురల్ స్వీటనర్)ను ఆహార, పానీయాల పరిశ్రమలకు అందిస్తున్న ప్యూర్ సర్కిల్ సంస్థ సీఈవో మెగోమెట్ మసగోవ్తో భేటీ అయింది. మసగోవ్ స్పందిస్తూ.. వచ్చేనెల మొదటివారంలో తమ బృందాన్ని రాష్టానికి పంపిస్తామని, నవంబర్ నెలాఖరులో తాను అమరావతికి వస్తానని తెలిపారు. యూకేలోని గ్లోబల్ కార్పొరేట్ బ్యాంకింగ్ సంస్థ శాంటండర్ ఇండియా డెస్క్ డైరెక్టర్ ఎడ్వర్ట్ డిక్సన్, ఎక్స్‌పోర్ట్స్ ఏజెన్సీ ఫైనాన్స్ అధిపతి ఫిలిప్స్‌తో సీఎం సమావేశమయ్యారు. కాగా, అమరావతిలో నెలకొల్పే హెల్త్ సిటీ ప్రాజెక్టు పనుల్ని డిసెంబర్ నుంచి మొదలుపెడతామని ఇండో–యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కు చెందిన అజయ్ రాజన్‌గుప్తా తెలిపారు. టెలిమేటిక్ అండ్ బయోమెడికల్ సర్వీసెస్(టీబీఎస్) గ్రూప్ చైర్మన్, యూకేఐబీసీ విదేశీ వ్యవహారాల జీఎం నికోలా పాంగెర్తో సీఎం సమావేశమై ఏపీలో మెడికల్ ఎక్విప్మెంట్ తయారీ కర్మాగారాన్ని నెలకొల్పాలని కోరారు.యూకే మంత్రి(సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్) ప్రీతి పటేల్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణం తదితర అంశాల్ని వివరించారు. -
రాజధాని డిజైన్లపై లండన్‌లో సమాలోచనలు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన డిజైన్లపై సీఎం చంద్రబాబునాయుడు లండన్‌లో నార్మన్ ఫోస్టర్ బృందంతో మంగళవారం రాత్రి సమావేశమయ్యారు. విదేశీ పర్యటనలో భాగంగా దుబాయ్ నుంచి మంగళవారం లండన్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. సినీ దర్శకుడు రాజమౌళితో కలసి ఫోస్టర్ బృందాన్ని కలుసుకున్నారు. రాత్రి బాగా పొద్దుపోయేవరకూ ప్రత్యేకంగా చర్చలు జరిపారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి లండన్‌కు చెందిన నార్మన్ పోస్టర్ సంస్థ ఇప్పటివరకు ఐదారుసార్లు డిజైన్లు రూపొందించినా అవి సీఎంను ఆకట్టుకోలేకపోవడం తెలిసిందే. మరోసారి రూపొందించిన డిజైన్లపై నార్మన్ పోస్టర్ సంస్థ అధినేత లార్డ్ ఫోస్టర్‌తో నేరుగా చంద్రబాబు, రాజమౌళి సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా డిజైన్లను వారు స్వయంగా పరిశీలించారు. అయితే ఎలాంటి డిజైన్ అయితే బాగుంటుందనే విషయమై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ సమావేశంలో రాజమౌళితోపాటు సీఎం చంద్రబాబు కూర్చోగా ఉన్నతాధికారులు వారి వెనుక నిల్చోవడం గమనార్హం. లండన్ ప్రజా రవాణా వ్యవస్థ పరిశీలన.. అంతకుముందు సీఎం చంద్రబాబు తన బృందంతో కలసి లండన్ రవాణా విభాగం సెంట్రల్ కమాండ్ సెంటర్‌ను సందర్శించారు. భవిష్యత్తులో అమరావతిలో వాహనాల రద్దీ పెరుగుతుందనే అంచనాతో లండన్ తరహా రవాణా వ్యవస్థను నెలకొల్పే విషయమై అధ్యయనం చేశారు. లండన్ తరహా రవాణా వ్యవస్థను అమరావతిలో ఏర్పాటు చేసే అవకాశాల్ని పరిశీలించాలని రాష్ట్ర అధికారులకు సీఎం సూచించారు. ఈ సందర్భంగా లండన్ నగరంలో రైలు, బస్సు, కార్లు, భూగర్భ రైల్వే, ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలన్నింటినీ కమాండ్ సెంటర్ నుంచి నియంత్రించే విధానాన్ని అక్కడి అధికారులు సీఎం బృందానికి వివరించారు. లండన్‌లో 86 లక్షలకుపైగా జనాభా ఉండగా, ప్రతిరోజూ సెంట్రల్ లండన్‌కు 12 లక్షలమంది వచ్చి వెళ్తుంటారని, అక్కడ నివసించేవారి సంఖ్య లక్షమందేనని చెప్పారు. లండన్ తరహాలోనే అమరావతిలోనూ అక్కడ నివసించేవారికన్నా నిత్యం అనేక పనులతో వచ్చి వెళ్లేవారి సంఖ్యే అధికంగా ఉండే అవకాశముంటుందని, దానికి తగ్గట్టుగా ఇప్పటినుంచే పటిష్ట వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కాగా, లండన్ చేరుకున్న చంద్రబాబును యూకేలోని భారత డిప్యూటీ హైకమిషనర్ దినేశ్ కె.పట్నాయక్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాజధానికి సంబంధించిన వివరాలను సీఎం ఆయనకు వివరించారు. -
డిజైన్లు ఎంపిక చేయలేని స్థితిలో ఉండడం దారుణం
-
రాజధాని డిజైన్లు ఇచ్చిన నార్మన్ ఫోస్టర్
సాక్షి, అమరావతి: ప్రభుత్వం సూచించిన మార్పుల ప్రకారం రాజధాని పరిపాలనా నగరం డిజైన్లను మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ సంస్థ సీఆర్డీఏకు సమర్పించింది. లండన్ నుంచి వచ్చిన సంస్థ ప్రతినిధులు మంగళవారం విజయవాడలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో తాము రూపొందించిన డిజైన్లపై అధికారులకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ప్రజెంటేషన్‌పై మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్, మాస్టర్‌ప్లాన్ అధికారులు చర్చలు జరిపారు. అసెంబ్లీ భవనం డిజైన్ దాదాపు ఖరారు కావడంతో ప్రధానంగా హైకోర్టు భవనంపైనే ఫోస్టర్ సంస్థ దృష్టిపెట్టి పలు డిజైన్లు రూపొందించినట్లు తెలిసింది.సచివాలయ భవనానికి సంబంధించి కొన్ని డిజైన్లను ఫోస్టర్ ప్రతినిధులు అధికారుల ఎదుట ఉంచినట్లు సమాచారం. ఈ డిజైన్లను బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదుట పెట్టనున్నారు. -
కమిటీల సూచనలను డిజైన్ల సంస్ధకు అందజేస్తాం
-
రాజధాని డిజైన్లకు మళ్లీ మార్పులు
సాక్షి, అమరావతి : మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ ఇచ్చిన రాజధాని పరిపాలనా నగరం వ్యూహ డిజైన్లకు సీఎం చంద్రబాబు మళ్లీ కొన్ని మార్పులు సూచించారు. రెండురోజుల క్రితం ఫోస్టర్ సంస్థ ఇచ్చిన డిజైన్లపై జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో చర్చించారు. పాలనా నగరం మీదగా నిర్మించాలనుకుంటున్న జలమార్గం, అందుకు అవసరమైన నీరు, రాజధాని భవిష్యత్తు జల అవసరాలు, పులిచింతల ప్రాజెక్టు దిగువన నిర్మించబోయే బ్యారేజీ నుంచి వచ్చే నీటిపై జలవనరుల శాఖ, బ్లూ, గ్రీన్ కన్సల్టెంట్లతో చర్చించి తుది ప్రణాళికకు స్పష్టమైన రూపు ఇవ్వాలని బాబు సూచించారు. మరోవైపు ఫోస్టర్ ఇచ్చిన వ్యూహ డిజైన్లను శనివారం అసెంబ్లీలో ప్రదర్శించాలని సమావేశంలో నిర్ణయించారు.