
సాక్షి, అమరావతి: రాజధాని డిజైన్లపై సినీ దర్శకుడు రాజమౌళితో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్చలు జరిపారు. హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు ఆదివారం తన నివాసంలో రాజమౌళితో సమావేశమై రాజధానిలో నిర్మించనున్న అసెంబ్లీ, హైకోర్టు డిజైన్ల గురించి మాట్లాడారు. రాజధాని పరిపాలనా నగరంలో నిర్మించే అసెంబ్లీ భవన డిజైన్ గురించి మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్‌కు సలహాలిచ్చే బాధ్యతను రాజమౌళికి అప్పగించిన విషయం తెలిసిందే.
ఫోస్టర్స్ సంస్థ రూపొందించిన డిజైన్లకు రాజమౌళి కొన్ని మార్పులు సూచించారు. దాని ప్రకారం తయారు చేసిన డిజైన్లపై చర్చించడంతో పాటు ప్రత్యేకంగా అసెంబ్లీ కోసం తాను రూపొందించిన డిజైన్లపై సీఎంకు రాజమౌళి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ నెల 13న నార్మన్ ఫోస్టర్స్ సంస్థ తుది డిజైన్లు సమర్పించేందుకు వస్తున్న నేపథ్యంలో రాజమౌళితో చంద్రబాబు సమావేశమయ్యారు. రాజమౌళి డిజైన్లు, ఫోస్టర్స్ డిజైన్లపై 13న చర్చించి సీఎం ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందని సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment