career fair
-
మాదాపూర్ కేరీర్ ఫేయిర్‌లో విదేశీ వర్సిటీ ప్రతినిధులతో ఉత్సాహంగా విద్యార్థులు (ఫొటోలు)
-
లెక్క అర్థమైపోయింది
ఎన్నో ఆశలతో కెరీర్ ఆరంభించి, టేకాఫ్ సరిగ్గా లేకపోతే నిరుత్సాహపడిపోతాం. నటి కియారా అద్వానీకి ఇలానే జరిగింది. హిట్, బ్రేక్ రావడానికి ఆమెకు కాస్త టైమ్ పట్టింది. ఈ విషయం గురించి కియారా అద్వానీ మాట్లాడుతూ – ‘‘కష్టకాలం అంటారు కదా! కెరీర్ మొదట్లో నాకు అలాగే అనిపించింది. తరువాత ఏమిటనేది ఆలోచించుకోలేని, తెలుసుకోలేని పరిస్థితి అది. బాగా ఆలోచించిన మీదట ‘ఒక్క సినిమా’తోనే కెరీర్ అయిపోదని అర్థమైంది. సినిమాలు రిలీజయ్యే ప్రతి శుక్రవారం ముఖ్యం అనే లెక్క అర్థమైపోయింది. ఇక అప్పటి నుంచి ఒక్క సినిమా ఫ్లాప్ అయితే ఏదో జరిగిపోయిందన్నట్లుగా కాకుండా ‘బోలెడన్ని సినిమాలున్నాయి కదా’ అనేది మనసులో పెట్టుకున్నాను. నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. నన్ను నేను నమ్మాను. మన కాళ్ల మీద మనం నిలబడగలమనే ధైర్యం వచ్చింది. వచ్చిన ప్రతి అవకాశాన్నీ శక్తివంచన లేకుండా సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అలాగే పని చేస్తున్నాను. అది వర్కవుట్ అయింది. ఇవాళ ఏదైనా కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారంటే ఏ హీరోయిన్ని తీసుకుందాం అనే లిస్ట్‌లో దర్శక – నిర్మాతలు నా పేరు కూడా పరిశీలిస్తున్నారు. నేను కూడా ప్రతి పాత్రనూ కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తున్నా. ఉదాహరణకు, ఒక సినిమాలో ఒకలా ఏడ్చాననుకోండి.. ఇంకో సినిమాలో వేరే రకంగా ప్రయత్నిస్తున్నాను. ఏడుపు అనే కాదు.. నవ్వడం, బాడీ లాంగ్వేజ్.. ఇలా అన్నీ డిఫరెంట్‌గా ఉండేలా చూసుకుంటున్నాను’’ అన్నారు. తెలుగులో ‘భరత్ అనే నేను’తో హిట్ అందుకున్న కియారా ఆ తర్వాత ఇక్కడ అవకాశాలు దక్కించుకోగలుగుతున్నారు. ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్‌సింగ్’తో అక్కడా హిట్ సాధించారు. ఇక ఓటీటీలో ‘లస్ట్ స్టోరీస్’లో బోల్డ్‌క్యారెక్టర్‌తో భేష్ అనిపించుకున్నారు కియారా. ప్రస్తుతం హిందీలో ‘భూల్ భులయ్యా 2’, ‘జగ్ జగ్ జీయో’, ‘మిస్టర్ లేలే’ చిత్రాల్లో నటిస్తున్నారామె. -
ఉజ్వల భవిష్యత్‌కు భరోసా
కాజీపేట అర్బన్: వరంగల్ నిట్ క్యాంపస్ నుంచే చక్కని ఉద్యోగావకాశాలను సొంతం చేసుకునేందుకు ఓ విద్యార్థి నడుంబగించాడు. ఉన్నత విద్య, క్యాంపస్ ఇంటర్వ్యూల్లో విజయం సాధించేందుకు నిష్ణాతులచే సలహాలు సూచనలు అం దించేందుకు సరికొత్తగా నిట్ వరంగల్ కెరీర్ సెల్ ను ఏర్పాటు చేసి ఔరా అన్పించుకున్నాడు. నిట్‌లోని కెమికల్ వి భాగంలో మూడో సంవత్సరం చదువుతున్న ప్రశాంత్ రాంశెట్టి స్టూడెంట్ కౌన్సిల్ సౌజన్యంతో నిట్ వరంగల్ కెరీర్ సెల్‌ను ప్రారంభించాడు. కౌన్సిల్ ప్రధాన కార్యదర్శిగా విద్యార్థులతో మమేకమై వారి సమస్యలు పరిష్కరిస్తూ బాసటగా నిలుస్తున్నాడు. జనవరి 18న కెరీర్ సెల్ ప్రారంభమై విద్యార్థుల సేవలో దూసుకుపోతోంది. ఎస్ఎంపీతో అవగాహన సదస్సు... స్టూడెంట్ మెంటర్షిప్ ప్రోగ్రాం పేరిట వివిధ కళాశాల్లో ఉన్నత విద్య, క్యాంపస్ ఇంటర్వ్యూల్లో విజయం సాధించేందుకు గాను సూచనలు, సలహాలు ఇస్తున్నాడు. క్యాంపస్ ఇంటరŠూయ్వల ద్వారా ఎంపికైన వారితో సందేశాలు ఇప్పిస్తున్నాడు. ప్రపంచంలోనే ప్రాచుర్యం పొందిన గ్లాస్ మార్ట్ కంపెనీ సెయింట్ గోబెన్కు ఎంపికైన అక్షిత, మయంక్ నిట్‌లోని విద్యార్థులకు అవగాహన కల్పించారు. మన్హతన్ రివ్యూ పేరిట జీఆర్ఈ, జీమ్యాట్, టోఫెల్లో విజయం సాధించి పీజీ, పీహెచ్డీ, ఎంబీఏలో అవకాశం సాధించేందుకు నినిపుణులచే సలహాలు ఇప్పిస్తున్నాడు. స్టూడెంట్ సపోర్ట్ సర్వీస్ వరంగల్ నిట్‌లో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి స్టూడెంట్ సపోర్ట్ సర్వీస్‌ను రూపొందించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు సీనియర్లచే బోధిస్తున్నారు. రీసెర్చ్ మెథడాలజీ పేరిట నూతన పరిశోధనలపై మెళకువలను నిట్ డైరెక్టర్ ఎన్వీ.రమణారావు పవర్‌పాయింట్ ప్రెజ ంటేషన్ ఇస్తున్నారు. కెరీర్ సెల్ ద్వారా ‘ఇండిస్పెన్సెబుల్ రీసెర్చ్ టూల్స్’ పేరిట నిట్ పూర్వవిద్యార్థి డాక్టర్ కోటేశ్వర్‌రెడ్డి ఆన్లైన్లో సలహాలు అందిస్తున్నారు.. దుబాయ్ నుంచి స్కైప్ యాప్ సాయంతో ఆధునిక యంత్రాలపై అవగాహన కల్పించారు. అవకాశాలు కల్పిస్తాం.. నిట్ వరంగల్స్ కెరీర్ సెల్ ద్వారా విద్యార్థులకు వివిధ రంగాల్లో అవకాశాలు అందించేందుకు కృషి చేస్తున్నా. వేసవి సెలవుల్లో ఐఐటీ ముంబాయి, ఢిల్లీకి వెళ్లాను. అక్కడ కెరీర్ సెల్, ఎస్‌ఎంపీలను ఏర్పాటు చేసి విద్యార్థులకు సేవలందిస్తున్నారు. వరంగల్ నిట్‌లో సైతం అటువంటి వేదికను రూపొందించా. ఆన్లైన్లో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందిస్తున్నా. ఉన్నత విద్య, ఐఏఎస్, యూపీఎస్సీలపై అవగాహన అందించేందుకు కెరీర్ సెల్ తోడ్పడుతుంది. సాయంత్రం వేళ్లల్లో నిట్ డైరెక్టర్, స్టూడెంట్ కౌన్సిల్ ప్రోత్సాహంతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నా. – ప్రశాంత్ రాంశెట్టి, నిట్ విద్యార్థి,ఎస్ఎంపీ, కెరీర్ సెల్ వ్యవస్థాపకుడు -
టెక్కలి ఆదిత్య కాలేజీలో కెరీర్ అరేనా
-
హోం సైన్స్‌తో ఉపాధి అవకాశాలు
‘సాక్షి’ కెరీర్ ఫెయిర్‌కు అనూహ్య స్పందన శ్రీనగర్‌కాలనీ, న్యూస్‌లైన్: ఇంటర్మీడియట్ తర్వాత మెడిసిన్, ఇంజినీరింగ్ కోర్సులే కాకుండా, త్వరగా ఉపాధిని, ఉద్యోగాన్ని అందించే విభిన్న కోర్సులు అందుబాటులో ఉన్నాయని, వాటిని ఎంచుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని సైఫాబాద్‌లోని హోం సైన్స్ కెరీర్స్ కాలేజ్ ప్రొఫెసర్ ఎస్.ఎల్. కామేశ్వరి తెలిపారు. బంజారాహిల్స్‌లోని సుల్తాన్ ఉల్ ఉలుమ్ ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజులుగా టెన్త్, ఇంటర్ తర్వాత విద్యార్థులకు పలు రకాల కోర్సులపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సాక్షి కెరీర్ ఫెయిర్‌కు ఆదివారం అనూహ్య స్పందన లభించింది. ఫెయిర్‌లో భాగంగా జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథులుగా ప్రొఫెసర్ ఎస్.ఎల్. కామేశ్వరి, వైఎస్సార్ నిథిమ్ డెరైక్టర్ నారాయణరెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొ. కామేశ్వరి మాట్లాడుతూ.. హోం సైన్స్ ద్వారా అనేక ఉపాధి అవకాశాలు పొందవచ్చునని, జీవితంలో త్వరగా స్థిరపడవచ్చని సూచించారు. హోం సైన్స్‌లో ఉన్న పలు రకాల కోర్సులను వివరించారు. అనంతరం నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత హోటల్, టూరిజం రంగంలో మంచి అవకాశాలున్నాయని, దీనికి సంబంధించిన కోర్సులు చేయడం ఉత్తమమని పేర్కొన్నారు. ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్న వాటిపై అవగాహన విద్యార్థులకు పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. విద్యార్థులకు ఆ దిశగా సాక్షి మీడియా కెరీర్ ఫెయిర్‌ను నిర్వహించటం అభినందనీయమన్నారు. సమావేశానికి హాజరైన పలువురు విద్యార్థుల అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఫెయిర్ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఏ రంగం ఎంచుకోవాలో.. కెరీర్లో ఉన్నత శిఖరాలు అందుకోవాలంటే ఎలాంటి విద్యను అభ్యసించాలో తెలియదు. ఇక్కడికొచ్చాక యానిమేషన్, ఫ్యాషన్ రంగాల్లో ఉన్న అవకాశాలు, ఇంటర్ తర్వాత ఏ కోర్సులు కెరీర్‌కి దోహదపడతాయో అర్థమయ్యింది. - ఫాతిమా, ఇంటర్ సాక్షికి అభినందనలు.. ఇంటర్ తర్వాత ఏ కోర్సుల్లో చేరితే బాగుంటుందా తెలియక తికమకపడ్డా. ఇక్కడకు వచ్చిన పలువురు విద్యావంతుల ద్వారా కెరీర్లో స్థిరపడటానికి ఏ కోర్సులో చేరాలో తెలుసుకున్నా. ఇలాంటి కార్యక్రమం ద్వారా కెరీర్‌పై అవగాహన కల్పించినందుకు సాక్షికి అభినందనలు. - శివాని, ఇంటర్