క్రెడిట్ కార్డు వినియోగదారులకు శుభవార్త
న్యూఢిల్లీ: క్రెడిట్ కార్డు నగదు లావాదేవీపై కేంద్రం తీపి కబురు చెప్పింది. రూ.2లక్షలు అంతకన్నా మించిన నగదు లావాదేవీలపై ఉన్న నిబంధనలు క్రెడిట్‌కార్డు బిల్లు చెల్లింపుదారులకు వర్తించవని స్పష్టం చేసింది. ప్రభుత్వం, బ్యాంకింగ్ కంపెనీ, పోస్ట్ ఆఫీస్ పొదుపు బ్యాంకు లేదా కో-ఆపరేటివ్ బ్యాంకు ద్వారా రసీదులను రూ .2 లక్షల పరిమితి వర్తించదని రెవిన్యూ విభాగం విడుదల చేసిన ఒక నోటిఫికేషన్ లో తెలిపింది. బ్యాంకింగ్ రంగానికి, అలాగే గ్రామీణ ప్రాంతానికి అవసరమైన ఉపశమనం కల్పించనున్నామని నాంజియా అండ్ కో డైరెక్టర్ శైలేష్ కుమార్ తెలిపారు.బ్యాంకులు నియమించిన బిజినెస్ కరస్పాండెంట్లు, ప్రీపెయిడ్ ఉపకరణాల ద్వారా ఆయా బిల్లులను చెల్లించవచ్చని రెవెన్యూశాఖ స్పష్టం చేసింది.
రూ. 2 లక్షల లేదా అంతకంటే ఎక్కువ నగదు లావాదేవీలపై పరిమితులు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు, బ్యాంకులు నియమించిన వ్యాపార ప్రతినిధులు మరియు ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ జారీచేసేవారికి వర్తించంటూ ఆదాయపన్నుశాఖ భారీ ఊరటనిచ్చింది. తాజా నోటిఫికేషన్ ద్వారా ఆదాయపన్ను శాఖ పరిధినుంచి అయిదు అంశాలను మినహాయించింది. అయితే బ్యాంకులు, కో-ఆపరేటివ్ బ్యాంకుల తరపున పనిచేసే బిజినెస్ కరస్పాండెంట్లు, ఒకటి అంతకన్నా ఎక్కువ క్రెడిట్ బిల్లు చెల్లింపులకు కంపెనీ లేదా సంస్థ ఇచ్చే రసీదులు, ప్రీపెయిడ్ పేమెంట్ పరికరాల ద్వారా చేసే చెల్లింపులు, రిటైల్ అవుట్లెట్లు నిర్వహించే వైట్ లేబుల్ ఏటీఏంలు ఇచ్చే రసీదులు.. ఐటీ చట్టం 1961 సెక్షన్ 10 క్లాజ్ (17ఏ) ప్రకారం వ్యక్తి మొత్తం ఆదాయంలో ఇది కలవబోదని తెలిపింది.
కాగా 2017 , ఏప్రిల్ 1 నుంచి అమలయ్యేలా 2017 ఆర్థిక బిల్లు ప్రకారం రూ.2లక్షలు, ఆ పైన ట్రాన్సాక్షన్స్‌పై నిబంధనలు విధించింది. అక్రమ లావాదేవీలను నివారించేందుకు, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేదిశగా ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకుంది. ఇలాంటి లావాదేవీలపై 100 శాతం జరిమానా చెల్లించాల్సిందేనని హెచ్చరించిన సంగతి తెలిసిందే.