casual
-
గార్డెన్ కుర్తీ
నిజానికి వీటి పేరు లాన్ కుర్తీస్‌ఎంత ఎండ ఉన్నా అందమైన గడ్డిపువ్వుల్లామెరిసిపోతుంటాయి.జీన్స్, పలాజో, లెగ్గింగ్, జెగ్గింగ్‌స్లిమ్ ఫిట్, టైట్ ఫిట్..బాటమ్‌గా ఏది ఎంచుకున్నాపైన ఈ టాప్ వేసుకుంటే చాలు గార్డెన్ అంత ముచ్చటగా ఉంటుంది. ►ఈ లాన్ కుర్తీలు ఎవరికైనా నప్పుతాయి. వయసు తేడాలు అవసరం లేదు. చూడటానికి ఫ్రాక్లా ముచ్చటగా ఉంటాయి. వేసుకుంటే మాత్రం స్టైలిష్‌గా కనిపిస్తాయి. కంఫర్ట్‌లో ప్రత్యేకం అనిపిస్తాయి. గాఢమైన రంగులు, ప్రింట్లు పెద్దగా హంగామా లేనివి ఎంచుకోవాలి. వీటికి లైట్ ట్రౌజర్, ధోతీ ప్యాంట్ బాటమ్‌గా ధరించాలి. క్యాజువల్‌గా బయటకు వెళ్లినా, ఈవెనింగ్ పార్టీ అయినా లాన్ డ్రెస్సింగ్ సమ్మర్‌కి సరైన ఎంపిక అవుతుంది. ►ఆభరణాల హంగులు అవసరం అని భావిస్తే ఫ్యాషన్ జ్యువెల్రీలో భాగంగా సిల్వర్, ఉడెన్.. ఆభరణాలను ఎంచుకోవాలి. అవి కూడా చాలా డ్రెస్‌ను హైలైట్ చేసేలా ఉండేలి. ►డ్రెస్ ఎంపికలోనే ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తుంది కాబట్టి వీటికి జ్యువెలరీ హంగులు అవసరం లేదు. సాదా సీదా హెయిర్ స్టైల్, ఫుట్‌వేర్ ఎంపికలు ఈ గార్డెన్ కుర్తీలకు బెస్ట్ ఎంపిక. . -
రెండు నెలలు సాధారణ వర్షపాతమే
న్యూఢిల్లీ: ఈ సీజన్లో మిగిలిన రెండు నెలలు ఆగస్టు, సెప్టెంబర్లలో రుతుపవనాలు సాధారణంగానే ఉంటాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనా వేసింది. జూలై చివరి నాటికి బిహార్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశమంతా సమాన స్థాయిలో వర్షపాతం నమోదైందని పేర్కొంది. వచ్చే రెండు నెలలు ఇదే విధమైన ఆశాజనక పరిస్థితి కొనసాగుతుందని తెలిపింది. ‘ఆగస్టులో దీర్ఘకాల సగటు(ఎల్పీఏ) 9 శాతం అటుఇటుగా 96 శాతంగా నమోదుకావచ్చు. జూన్‌లో వేసిన అంచనాల కన్నా అధికంగానే ఉండొచ్చు. రుతుపవనాల రెండో అర్ధభాగంలో దేశవ్యాప్తంగా 95 శాతం ఎల్పీఏ(అటుఇటుగా 8 శాతం)తో వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి’ అని ఐఎండీ ప్రకటించింది. వర్షపాతం 96–104 శాతం ఎల్పీఏ మధ్య ఉంటే, ఆ పరిస్థితిని సాధారణ రుతుపవనాలుగా భావిస్తారు. ఎల్పీఏ 90–96 శాతం మధ్య ఉంటే, దాన్ని సాధారణం కన్నా తక్కువ వర్షపాతంగా పరిగణిస్తారు. -
ఈసారి వర్షపాతం సాధారణమే
న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశంలో నైరుతి రుతుపవనాలు సాధారణంగానే ఉంటాయని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ బుధవారం అంచనా వేసింది. దక్షిణ రాష్ట్రాలతో పాటు ఈశాన్య ప్రాంతాల్లో కొన్ని చోట్ల మాత్రం సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు తెలిపింది. రుతుపవనాల లాంగ్ పీరియడ్ యావరేజీ(ఎల్పీఏ) వంద శాతంగా ఉండేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. ఎల్పీఏ 96–104 శాతం మధ్య ఉంటే సాధారణ వర్షపాతంగా పరిగణిస్తారు. 90–96 శాతం మధ్య నమోదైతే సాధారణం కన్నా దిగువ స్థాయిగా భావిస్తారు. ఈ ఏడాది సాధారణం కన్నా ఎక్కువ వర్షాలు కురిసేందుకు అవకాశాలు 20 శాతమని, అంతకు దిగువ స్థాయిలో నమోదయ్యేందుకు కూడా 20 శాతం అవకాశాలున్నట్లు స్కైమెట్ తెలిపింది. జూన్‌లో అధిక, జూలైలో సాధారణ, ఆగస్టులో సాధారణం కన్నా తక్కువగా వర్షపాతం నమోదయ్యేందుకు అవకాశాలున్నట్లు పేర్కొంది. సెప్టెంబర్‌లో రుతుపవనాలు మళ్లీ పుంజుకుంటాయని అంచనా వేసింది. బిహార్, ఒడిశా, జార్ఖండ్ లాంటి రాష్ట్రాలు సీజన్ అంతా సాధారణ వర్షపాతమే పొందుతాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా కరవు, లోటు వర్షపాతం ఏర్పడేందుకు అవకాశాలు లేవని తెలిపింది. అయితే ఏప్రిల్ అంచనాల్లో స్కైమెట్ రాబోయే రోజుల్లో మార్పులు చేసే అవకాశాలున్నాయి. -
పెద్దాసుపత్రిలో ఇది ‘క్యాజువల్’
ఆత్మకూరు ప్రాంతానికి చెందిన వలి గుండె సంబంధ సమస్యతో అల్లాడిపోతున్నాడు. జొహరాపురానికి చెందిన శ్రీరాములు ఛాతీ నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. రాత్రి 8 గంటల సమయంలో విధుల్లో ఉండాల్సిన వైద్యుల పత్తా లేదు. 8.30 గంటలు దాటినా వస్తారో రారో కూడా తెలియని పరిస్థితి. సమయం గడిచే కొద్దీ కుటుంబ సభ్యుల్లో ఆందోళన అధికమవుతోంది. క్షణ.. క్షణం నరకమే. కాస్త సూటూబూటూ వేసుకొని ఎవరు కనిపించినా డాక్టరే వచ్చారేమోననే ఆతత. ప్రాణం విలువ అలాంటిది. ఈ విషయం తెలిసిన వైద్యులేమో నింపాదిగా నిర్ణీత సమయానికి గంట తర్వాత అక్కడికి చేరుకోవడం చూస్తే పెద్దాసుపత్రిలో వైద్య సేవలు ఏ స్థాయిలో అందుతున్నాయో అర్థమవుతోంది. కర్నూలు(టౌన్): ఐదు జిల్లాలకు పెద్దదిక్కుగా ఉన్న కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో అడుగడుగునా నిర్లక్ష్యమే. రోగుల ప్రాణం వీరికి పూచిక పుల్లతో సమానం. కొందరు వైద్యులు వృత్తిని దైవంగా భావిస్తున్నా.. మరికొందరి తీరు ఆసుపత్రి పరువును బజారున పడేస్తోంది. ఇక్కడి వైద్యులు నాడి పడితే.. మొండి వ్యాధులు కూడా నయమవుతాయనే ప్రఖ్యాతి.. క్రమంగా మసకబారుతోంది. విధులకు సక్రమంగా హాజరు కావాలని.. సమయ పాలనే పాటించాలనే విషయం ఇక్కడ కొందరికే వర్తిస్తుంది. ప్రధానంగా అత్యవసర విభాగంలో పరిస్థితి దారుణంగా ఉంటోంది. ప్రాణాపాయ స్థితిలోని రోగులు వచ్చే ఈ విభాగంలో ప్రాణం పోతోందంటే కూడా స్పందించని దయనీయ పరిస్థితి నెలకొంది. బుధవారం రాత్రి ఇద్దరు రోగులు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి రాగా.. ఒక్క వైద్యుడు కానీ, స్టాఫ్ నర్సులు కానీ అందుబాటులో లేరు. రాత్రి 8 గంటలకే విధులకు హాజరు కావాల్సి ఉన్నా.. వీరి జాడ లేకపోయింది. అక్కడి పరిస్థితిని రోగుల కుటుంబ సభ్యులు సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు షడ్రక్, జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డిల దష్టికి తీసుకెళ్లారు. ఇరువురూ వెంటనే అక్కడికి చేరుకొని వాస్తవ పరిస్థితిని సూపరింటెండెంట్‌కు ఫోన్లో తెలియజేశారు. ఆయన ఆదేశాలతో సీఎస్ఆర్ఎం శ్రీనివాసులు క్యాజువాలిటీకి చేరుకొని వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. దాదాపు గంట తర్వాత ప్రత్యక్షమైన వైద్యులు రోగుల సేవకు ఉపక్రమించడం గమనార్హం. పత్తాలేని డ్యూటీ డాక్టర్ రాత్రి 8 గంటల సమయంలో విధుల్లో ఉండాల్సిన డ్యూటీ డాక్టర్ మంజుల 9 గంటల వరకు కూడా విధుల్లోకి రాకపోవడం గందరగోళానికి తావిచ్చింది. అసలు వస్తారో రారో కూడా తెలియని పరిస్థితి. మరోవైపు క్యాజువాలిటీ మంచాలన్నీ రోగులతో కిక్కిరిసి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడం పట్ల రోగుల బంధువులు అసహనం వ్యక్తం చేశారు. కనీసం సమాధానం చెప్పేందుకు పీజీ వైద్యులు కూడా లేకపోవడం చూస్తే ఈ అత్యవసర విభాగం ఏ స్థాయిలో సేవలందిస్తుందో అర్థమవుతుంది. చస్తే కానీ పట్టించుకోరా.. సామాన్య రోగులను పెద్దాసుపత్రిలో ఏమాత్రం పట్టించుకోవడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు షడ్రక్, జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి ఆసుపత్రిలో విలేకరులతో మాట్లాడుతూ క్యాజువాలిటీలో కూడా రోగులను పట్టించుకోకపోవడం చూస్తే అత్యవసరం వైద్యం ఏ స్థాయిలో చేస్తున్నారో అర్థమవుతోందన్నారు. రోగులను తరలించేందుకు బాయ్‌లు కూడా లేరని.. ఇంజెక్షన్ చేసేందుకు నర్సింగ్ విద్యార్థులు కూడా అందుబాటులో లేకపోవడం చూస్తే పెద్దాసుపత్రి పరిస్థితి ఎలా తయారయిందో తెలుస్తోందన్నారు.