జనానికేం తెలుసు ఉండేలు దెబ్బ..
సాధారణంగా పోలీసులంటే ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తారు.. అయితే మనం హరియాణాలోని హిస్సార్ జిల్లాకు వెళ్తే మాత్రం పోలీసులు ఇలా తుపాకీ స్థానంలో ఉండేలు పట్టుకుని ప్రాక్టీస్ చేస్తూ.. కనిపిస్తారు. గొడవలు వంటివి జరిగినప్పుడు జనాన్ని అదుపు చేయడానికి రబ్బరు బులెట్లు, టియర్ గ్యాస్ కంటే ఉండేలే బెటరన్నది వీరి అభిప్రాయం. కారం పొడి నింపిన ప్లాస్టిక్ బాల్స్‌ను ఉండేలుతో జనం మీదకు ప్రయోగిస్తారన్నమాట. ‘రబ్బరు, ప్లాస్టిక్ బులెట్ల వల్ల దెబ్బ గట్టిగా తగులుతుంది. ఒక్కోసారి ప్రాణాపాయం కూడా. అదే కారంపొడిని చల్లితే చాలు.. జనం చెల్లాచెదురైపోతారు. కారం పొడితో పనికాకుంటే మార్బుల్ బాళ్లను ఉపయోగించాలని చూస్తున్నాం. మార్బుల్ బాల్స్‌ను సైతం బాగా రెచ్చిపోయేవారిపైనే ప్రయోగిస్తాం. పరిస్థితి మరీ అదుపు తప్పితే తప్ప.. రబ్బరు బులెట్లను వాడకూడదని నిర్ణయించాం’ అని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనిల్ కుమార్ రావ్ అన్నారు.