caved
-
మట్టి పెళ్లలు విరిగిపడి.. ఐదుగురి మృతి
అహ్మదాబాద్: గుజరాత్లో విషాదం చోట చేసుకుంది. మెహసానా జిల్లాలోని కడి పట్టణ సమీపంలో శనివారం ఓ నిర్మాణ స్థలంలో మట్టిపెళ్లలు విరిగిపడిన ఘటన ఐదుగురు కార్మికులు మృతి చెందారు. జిల్లా కేంద్రానికి 37 కిలోమీటర్ల దూరంలోని జసల్‌పూర్ గ్రామంలో కార్మికులు భూగర్భ ట్యాంకు కోసం గొయ్యి తవ్వుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.Five Labourers Killed in Construction Site Collapse in Gujarat's Mehsana District #Mehsana #Gujarat #ConstructionCollapseMishap @INCGujarat @AAPGujarat https://t.co/UBMZgVKjXQ— Vibes of India (@vibesofindia_) October 12, 2024క్రెడిట్స్: Vibes of India ప్రమాద స్థలంలో ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కడి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రహ్లాద్‌సిన్హ్ వాఘేలా తెలిపిన వివరాల ప్రకారం.. పట్టిపెళ్లలు కూలిపోవడంతో పలువురు కార్మికులు మృతిచెందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐదు మృతదేహాలను వెలికితీశాం. ముగ్గురికిపైగా కార్మికులు చిక్కుకున్నారని తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావటానికి అధికారులు కృషి చేస్తున్నారు. -
ఢిల్లీలో కుంగిన రోడ్డు.. మూడు నెలల్లో మూడోసారి
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జనక్ పురి ప్రాంతంలోని ప్రధాన రహాదారిపై రోడ్డు కుంగిపోయిన సంఘటన ఈరోజు ఉదయం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం ఢిల్లీ జనక్ పురి ప్రధాన రహదారి ఒక్కసారిగా కుంగిపోవడంతో రోడ్డు మధ్యలో పెద్ద గుంత ఏర్పడింది. కనీసం నాలుగు గజాల వ్యాసం పొడవు, వెడల్పుతో వృత్తాకారంలో గజం లోతు గుంత ఏర్పడటంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురై పరుగులు తీశారు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై పెద్దగా ఏర్పడిన గొయ్యి చుట్టూ బ్యారికేడ్లను ఏర్పాటుచేసి ట్రాఫిక్ మళ్లించారు. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. #WATCH | A large portion of road caved in Delhi's Janakpuri area this morning. No injuries were reported. pic.twitter.com/otjQitTJix — ANI (@ANI) July 5, 2023 అంతకుముందు మే 3న ఢిల్లీ ఖురేజీ ఖాస్ కేవ్స్ వద్ద, మార్చి 31న ప్రెస్ ఎన్ క్లేవ్ రహదారిపై హౌజ్ రాణి రెడ్ లైట్ ప్రాంతం వద్ద కూడా ఇదేవిధంగా రోడ్లు కుంగిపోయిన సంఘటనలు తెలిసిందే. మూడు నెలల వ్యవధిలోనే మూడుసార్లు రోడ్లు కుంగిపోయిన సంఘటనలు ఢిల్లీ అధికారులను కలవర పెడుతున్నాయి. ఇది కూడా చదవండి: కుక్కను కారులోనే వదిలి తాజ్‌మహల్ చూసి వచ్చారు.. తిరిగొచ్చి చూస్తే.. -
ప్రారంభించిన 4 నెలలకే కుంగిన రోడ్డు.. ‘అట్లుందటి ప్రభుత్వ పనితనం’
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగుళూరులో ఓ సర్వీస్ రోడ్డు ఆదివారం కుంగిపోయింది. ప్రారంభించిన నాలుగు నెలలకే రోడ్డుపై ఇలా గుంతలు పడటం గమనార్హం. బెంగళూరులోని తూర్పు శివారు ప్రాంతాలను ఐటీ హబ్‌లోని ఇతర ప్రాంతాలకు కలిపేలా కుందనహళ్లి అండర్‌పాస్ నిర్మించారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికే(బీబీఎంపీ) రూ. 19.5 కోట్లతో ఈ అండర్‌పాస్‌ను నిర్మించింది. ఇందులో భాగంగా వేసిన సర్వీస్ రోడ్డు ఆదివారం కుంగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా బీజేపీ ప్రభుత్వంలోని అవినీతే దీనికి కారణమంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ విరుచుకుపడింది. ప్రభుత్వ నాసిరకపు పనికి ఇది నిదర్శమని మండిపడింది. కాంట్రాక్టర్ నుంచి ‘40 శాతం’ కమీషన్ అంటూ బీజేపీపై కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే నాగరాజు యాదవ్ విమర్శించారు. సంబంధిత కాంట్రాక్టర్‌తోపాటు ప్రభుత్వ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బెంగళూరు నగరానికి ప్రత్యేక మంత్రి కావాలని తాము డిమాండ్ చేస్తున్నామని.. బెంగళూరు ఇంచార్జీ అయిన సీఎం బసవరాజ్ బొమ్మై ఆ బాధ్యతలు నెరవేర్చడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు.. #WATCH: Another day, another road in Bengaluru. A section of road caves in near NPS Kengeri. Officials have taken up restoration work. While @chairmanbwssb says it's because of leakage from a water pipe, the issue persists across the city. pic.twitter.com/v1LJ7hr3H1 — Suraj Suresh (@Suraj_Suresh16) October 10, 2022 ప్రస్తుతం కుంగిపోయిన రోడ్డుపై అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఈ పనులు పూర్తి కావడానికి మరికొన్ని రోజులు పట్టనుంది. మరోవైపు రోడ్డు లోపల పైప్ లైన్ పగలడం వల్ల గత కొన్ని రోజులుగా నీరు చేరి రోడ్డు కుంగిందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ తెలిపారు. బెంగళూరు వాటర్ సప్లై, సీవేజ్ బోర్డు పగిలిన పైప్‌లైన్‌ను సరిచేసినట్లు చెప్పారు. ఈ ఘటనకు కాంట్రాక్టర్ బాధ్యత వహిస్తూ.. ఉచితంగా రోడ్డుకు మరమ్మత్తులు చేయనున్నట్లు బెంగుళూరు మున్సిపల్ అధికారులు తెలిపారు. -
ఆ గుహ ఇక మ్యూజియం
మే సాయ్: వైల్డ్‌బోర్స్ సాకర్ జట్టుకు చెందిన 12 మంది పిల్లలు, కోచ్ చిక్కుకుపోయిన తామ్ లువాంగ్ గుహలో సహాయక చర్యలు చేపట్టిన ప్రాంతాన్ని మ్యూజియంగా మార్చనున్నట్లు చియాంగ్‌రాయ్ ప్రావిన్సు గవర్నర్ నరోంగ్‌సక్ తెలిపారు. ఈ ప్రాంతం త్వరలోనే థాయ్‌లాండ్‌లో ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సహాయక చర్యల్లో భాగంగా నిపుణులు వాడిన పరికరాలు, డైవింగ్ సూట్లు, యంత్రాలను సందర్శనకు ఉంచనున్నట్లు నరోంగ్‌సక్ తెలిపారు. ఇక్కడ అమర్చిన భారీ పైపుల్ని, యంత్రాలను దాదాపు 50 మంది సిబ్బంది తొలగిస్తున్నారని, ఈ పనులు ఆదివారం వరకూ కొనసాగుతాయని వెల్లడించారు. ప్రస్తుతం గుహలో నీటి ప్రవాహం పెరుగుతున్నందున లోపల యంత్రాలు ఉన్నప్పటికీ ఎవ్వరినీ అనుమతించడం లేదన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన డైవర్, అనస్థీషియా నిపుణుడు రిచర్డ్ హారిస్ లేకుంటే ఈ మిషన్ విజయవంతం అయ్యేది కాదన్నారు. గుహలో 13 మంది సజీవంగా ఉన్నట్లు మొట్టమొదట గుర్తించిన బ్రిటిష్ డైవర్ జాన్ వాలంథెన్కు థాయ్ వాసులు ఘనంగా వీడ్కోలు పలికారు. స్వదేశానికి వెళ్లేందుకు జాన్ బుధవారం సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగానే అక్కడి ప్రజలందరూ లేచినిల్చుని కరతాళ ధ్వనులతో ఆయన్ను సాగనంపారు. సహాయక చర్యల్లో పాల్గొన్న డైవర్లు, నిపుణుల్ని కీర్తిస్తూ పలు స్థానిక పత్రికలు కథనాలను ప్రచురించాయి. జూన్ 23న తామ్ లువాంగ్ గుహలోకి వెళ్లిన 13 మంది నీటి ప్రవాహం కారణంగా లోపల చిక్కుకున్నారు. చివర్లో తప్పిన పెనుముప్పు.. తామ్ లువాంగ్ గుహలో సహాయక చర్యల్లో పాల్గొన్న డైవర్లు చివరి నిమిషంలో పెనుప్రమాదాన్ని ఎదుర్కొన్నారని థాయ్ నేవీ సీల్స్ సీనియర్ కమాండర్ ఒకరు తెలిపారు. గుహలో చివరి విద్యార్థి, కోచ్‌లను బయటకు తీసుకురాగానే నీటిని బయటకు పంపింగ్ చేసే యంత్రాలు ఆగిపోయాయి. ఆ సమయంలో గుహలో దాదాపు 20 మంది డైవర్లున్నారు. చివరికి పరిస్థితి చేయిదాటకముందే డైవర్లందరూ సురక్షితంగా బయటకు రాగలిగారని పేర్కొన్నారు. తామ్ లువాంగ్ ఘటన ఆధారంగా సినిమా తీస్తామని ‘ప్యూర్ ఫ్లిక్స్’ సంస్థ భాగస్వామి మైఖేల్ స్కాట్ ఇప్పటికే ప్రకటించారు. -
వారంలో నిర్వాసితులకు ప్యాకేజీల చెల్లింపు
పాతగుంటూరు: వారం రోజుల్లో పులిచింతల నిర్వాసితులకు చెల్లించాల్సిన ప్యాకేజీలను పూర్తిచేస్తామని పులిచింతల ప్రాజెక్టు యూనిట్-2 స్పెషల్ కలెక్టర్ వేణుగోపాల్ చెప్పారు. స్థానిక నగరంపాలెంలోని పులిచింతల ప్రాజెక్టు యూనిట్-2 కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ బోదనం, కేతవరం, పులిచింతల, కామేపల్లి మొదటి ఫేజ్‌లో ముంపునకు గురికానున్నాయని తెలిపారు. ఈ గ్రామాల్లో 1932 మందికి ప్యాకేజీ కింద రూ. 60 కోట్లు చెల్లించాల్సి ఉందని, ఇప్పటికే 595 మందికి రూ.20 కోట్లు చెల్లించారని, ఇంకా 1337 మందికి రూ.40 కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పారు. అందులో వందమందికి ఆన్లైన్ ప్రక్రియ జరుగుతోందని, 1240 మందికి ప్యాకేజీలు వారం రోజుల్లో ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. నిర్వాసిత కుటుంబాల్లో 2012 డిసెంబర్ 30 నాటికి 18 సంవత్సరాలు నిండినవారికి అచ్చంపేట మండలం నీలేశ్వరపాలెం పునరావాసకేంద్రంలో ప్లాట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. యూనిట్-1 పరిధిలో కోళ్ళూరు, గొల్లపేట, చిట్యాల, చిట్యాల తండా ఫస్ట్ ఫేజ్ ముంపుగ్రామాల జాబితాలో ఉన్నాయి. 2,309 మందిలో 1,075 మందికి ప్యాకేజీలు అందజేశామన్నారు. 804 మందికి ఆన్లైన్ ప్రక్రియ జరుగుతోందని తెలిపారు. ప్రాజెక్టులో 11 కేఎంసీల నీటిని నిల్వ చేస్తే ఎనిమిది గ్రామాలు పూర్తిగా మునిగే అవకాశం ఉందని చెప్పారు. ఎమ్మాజిగూడెం గ్రామంలో 128 గృహాలకు అంచనాలు వేసి గజిట్ పబ్లికేషన్ కూడా పూర్తయిందని, ఈ గృహాలకు రూ. 1.74 కోట్లు చెల్లించాల్సి ఉందని, వారం రోజుల్లో నిర్వాసితుల ఖాతాల్లో జమ చేస్తామని పేర్కొన్నారు. ఈ నెలాఖరు కల్లా నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామని తెలిపారు.