cbcid enquiry
-
సీళ్లు సేఫ్.. బంగారం ‘ఉఫ్’
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎనిమిదేళ్ల క్రితం ఒక ప్రైవేటు సంస్థ నుంచి సీబీఐ సీజ్ చేసిన 400 కిలోల బంగారంలో 103 కిలోల మేర మాయమైన సంఘటన కలకలం సృష్టిస్తోంది. దీంతో ఉలిక్కిపడిన సీబీఐ ఒక ఎస్పీ ర్యాంక్ అధికారి ఆధ్వర్యంలో మొత్తం ఘటనపై అంతర్గత విచారణకు సిద్ధమైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై మరోవైపు సీబీసీఐడీ(తమిళనాడు) విచారణకు మద్రాసు హైకోర్టు ఆదేశించింది. ఆరునెలల్లో విచారణ పూర్తి చేసి చార్జిషీటు దాఖలు చేయాలని సూచించింది. స్థానిక పోలీసులు విచారణ జరిపితే తమ పరువు పోతుందన్న సీబీఐ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఇది సీబీఐకి అగ్ని పరీక్ష సమయమని వ్యాఖ్యానించింది. ఏం జరిగింది? చెన్నై ఎన్ఎస్సీ బోస్ రోడ్డులోని సురానా కార్పొరేషన్‌తో కొందరు స్వదేశీ, విదేశీ ఉన్నతాధికారులు, వ్యాపార సంస్థలు లోపాయికారి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని, ఎంఎంటీసీ అధికారుల అండతో ఈ కంపెనీ బంగారం, వెండిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించడంతో 2012లో సీబీఐ సదరు సంస్థలో సోదాలు చేసి దాదాపు 400.47 కిలోల బంగారు బిస్కెట్లు, నగలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. ఆ బంగారాన్ని సురానా కార్యాలయంలోని లాకర్లో భద్రం చేసి సీలువేశారు. ఈ లాకరుకు సంబంధించిన 72 తాళం చెవులను, స్వాధీనం చేసుకున్న బంగారు వివరాల జాబితాను చెన్నైలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు అప్పగించారు. సురానా అనేక బ్యాంకుల్లో రూ.1,160 కోట్లను రుణంగా పొంది తిరిగి చెల్లించకపోవడంతో ఆ సంస్థ ఆస్తులను స్వాధీనం చేసుకుని నిర్వహించేందుకు బ్యాంకుల తరఫున రామ సుబ్రమణియం అనే వ్యక్తిని జాతీయ కంపెనీ లా బోర్డు ప్రత్యేకాధికారిగా నియమించింది. సీబీఐ స్వాధీనం చేసుకున్న బంగారాన్ని రుణ బకాయి చెల్లింపు కింద తమకు అప్పగించాలని ఆయన కోర్టులో పిటిషన్ వేసి అనుమతి పొందారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో లాకర్‌ను తెరిచిచూడగా లోపల ఉంచిన మొత్తం 400.47 కిలోల బంగారులో 103.86 కిలోల బంగారం తగ్గింది. ఈఘటనపై ప్రత్యేకాధికారి రామసుబ్రమణియం మద్రాసు హైకోర్టులో వేసిన పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. బం గారం మాయమైన ఘటనపై సీబీసీఐడీకి ఫిర్యాదు చేయాలని రామసుబ్రమణియంకు కోర్టు సూచించింది. ఈ ఫిర్యాదును అనుసరించి ఎస్పీ హోదాకు తక్కువగాని అధి కారి విచారణ చేయాలని పేర్కొంది. సీబీఐ ఏమంటోంది? ఇప్పటికే సీబీఐ ఈ విషయమై అంతర్గత విచారణకు ఎస్పీ స్థాయి అధికారిని నియమించింది. అయితే కోవిడ్ నిబంధనలు, లాక్డౌన్ తదితర కారణాల వల్ల ఈ విచారణ పూర్తికాలేదని సంస్థ వర్గాలు తెలిపాయి. బంగారం తమ సొంత వాల్టుల(మల్ఖనా) నుంచి మాయమై ఉంటే సీబీఐ వెంటనే చర్యలు తీసుకునేదని, కానీ ఇప్పుడు మాయమైన బంగారం సురానా కంపెనీ లాకర్ నుంచి మాయం కావడంతో ఏం జరిగిందో లోతైన విచారణ జరగాలని సీబీఐ అధికారులు చెప్పారు. ఇదే సమయంలో సురానా సంస్థ కోర్టును ఆశ్రయించిందని, తాము ఆదేశించే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోర్టు చెప్పిందని వెల్లడించారు. 2012లో ఈ రైడ్‌లో పాల్గొన్న అధికారులు కొందరు రిటైరయ్యారని, కోవిడ్ లాక్డౌన్ సమయంలో వారిని విచారించడం కుదరలేదని వివరించారు. బంగారమా? గంజాయా? వేసిన సీళ్లు వేసినట్లుండగానే బంగారం మాయం కావడంపై విచారించిన హైకోర్టు పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ కోర్టు లేదా సీబీఐ సొంత వాల్టుల(మల్ఖనా) నుంచి చోరీ జరిగితే ఎలాంటి చర్యలు తీసుకునేవారని హైకోర్టు విచారణలో భాగంగా ప్రశ్నించింది. అదే జరిగితే స్థానిక పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించి పోలీసు దర్యాప్తు జరిపేవారని, సదరు పోలీసులు పట్టుకున్న బంగారం 296.66 కిలోలేనని, తప్పుగా 400.47 కిలోలుగా ఎంటర్ చేశారని నిర్ధారించేవాళ్లని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఇంకా ఇలాంటి వాదన రాకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నది. వ్యత్యాసం కొన్ని గ్రాములైతే ఏదో ఒక సమాధానం చెప్పవచ్చని, కానీ వంద కిలోల బంగారం తేడా రావడం ఎలా జరుగుతుందో ఎంత ఆలోచించినా అర్ధం కావడం లేదని, గంజాయి లాగా బంగారం బరువు కాలంతో పాటు తగ్గదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. -
నిగ్గు తేల్చేనా?
అక్రమ మైనింగ్ విచారణపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో ఇంటి దొంగలను రక్షించేందుకు అధికార పార్టీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో విచారణ బాధ్యతలను సీబీఐకి అప్పగిస్తే ఎక్కడ గుట్టురట్టవుతుందోననే భయంతో.. తమ చెప్పుచేతల్లో ఉండే సీబీ సీఐడీకి ఇచ్చినట్టు సమాచారం. ఇప్పటి వరకు మైనింగ్ అధికారులు చేపట్టిన విచారణ నివేదిక ఆధారంగానే సీబీసీఐడీ దర్యాప్తు చేయనుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన విచారణలో మైనింగ్ తిమింగలంపై కాకుండా.. కేవలం అమాయకపు చేప పిల్లలపైనే కేసులు నమోదు చేశారు. సాక్షి, గుంటూరు: ఏ రోజుకారోజు కొత్త పాత్రలు ప్రవేశిస్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే అక్రమ మైనింగ్ వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. అక్రమ మైనింగ్‌లో ప్రత్యక్ష, పరోక్షంగా సంబంధాలు ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయనకు మద్దతుగా నిలిచిన ప్రభుత్వ పెద్దల వివరాలు బయటపడకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నారు. వాస్తవానికి హైకోర్టు ఆగ్రహంతో పల్నాడు ప్రాంతంలోని పిడుగురాళ్ల మండలం కేసానుపల్లి, దాచేపల్లి మండలం నడికుడి, కోనంకి గ్రామాల్లో నాలుగేళ్లుగా అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే విచారణ చేపట్టిన మైనింగ్ అధికారులు అక్రమ మైనింగ్‌కు సూత్రధారులైన అధికార పార్టీ ఎమ్మెల్యే, మైనింగ్ మాఫియాను రక్షించడంలో భాగంగా వారి వద్ద పనిచేసే కూలీలు, ట్రాక్టర్ డ్రైవర్లు, సూపర్వైజర్లను బలిపశువులను చేస్తున్నారు. ఈ క్రమంలో రూ.వందల కోట్ల విలువ చేసే తెల్లరాయిని దోచేశారంటూ 17 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కథ ఇక్కడితో ఆగలేదు.. 13న పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో పనిచేసిన తహసీల్దార్లు, వీఆర్వోలు, గ్రామ కార్యదర్శులు, మైనింగ్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి మైనింగ్ డీడీ, ఏడీపై సస్పెన్షన్ వేటు వేయడం, అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని సీబీసీఐడీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అక్రమార్కులను తప్పించేందుకనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం లా అండ్ ఆర్డర్ పోలీసులు సీబీసీఐడీ అధికారులకు అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు వివరాలను అప్పగించినట్టు తెలుస్తోంది. ïసీబీసీఐడీ ఏడీజీ అమిత్ గార్గ్ నేతృత్వంలో, డీఐజీ కాలిదాసు రంగారావు పర్యవేక్షణలో ఎనిమిది మంది డీఎస్పీలు, 14 మంది సీఐలు ఎనిమిది బృందాలుగా ఏర్పడి అక్రమ మైనింగ్‌పై విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. 20 ప్రశ్నలు సంధించిన పోలీస్ శాఖ.. హైకోర్టు ఆదేశాల మేరకు అక్రమ మైనింగ్‌పై సర్వే నిర్వహించిన మైనింగ్ అధికారులు 31 లక్షల మెట్రిక్ టన్నులు తెల్లరాయిని అక్రమంగా తవ్వి దోచేశారంటూ 17 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిపై కేసు నమోదు చేసిన పోలీస్ శాఖ మైనింగ్ అధికారులకు 20 ప్రశ్నలు సంధించింది. అయితే వీటికి మైనింగ్ అధికారులు ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేదు. ఆ ప్రశ్నలతో సహా ఇప్పటి వరకూ జరిగిన మొత్తం విచారణను నివేదిక రూపంలో సీబీసీఐడీ అధికారులకు అందజేసినట్లు తెలుస్తోంది. మైనింగ్ అ«ధికారులు పెట్టిన కేసులపైనే విచారణ.. అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో నాలుగేళ్లుగా జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై విచారణకు సిద్ధమైన సీబీసీఐడీ నిజాలను నిగ్గు తేలుస్తుందా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అనుమానాలను బలపరుస్తూ సీబీసీఐడీ అక్రమ మైనింగ్‌పై మొదటి నుంచి కొత్తగా దర్యాప్తు చేపట్టకుండా మైనింగ్ అధికా>రులు ఎమ్మెల్యే, మైనింగ్ మాఫియాను రక్షించడంలో భాగంగా అమయాకులపై పెట్టిన కేసుల విచారణను కొనసాగించనునన్నట్లు విశ్వసనీయ సమాచారం. అక్రమ మైనింగ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన మైనింగ్ డీడీ, ఏడీలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పెట్టిన కేసులపై దర్యాప్తు కొనసాగిస్తే అసలు నేరస్థులు బయట వచ్చే పరిస్థితి ఉంటుందా అనేది పెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది. అసలు దొంగలు బయటపడతారా..? పల్నాడు ప్రాంతంలో అక్రమ మైనింగ్ వ్యవహారం నుంచి ఎమ్మెల్యే, అతని ముఖ్య అనుచరులను తప్పించడంలో భాగంగా ప్రభుత్వం ఇప్పటి వరకు శతవిధాల ప్రయత్నించింది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో మైనింగ్ అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్‌ల పాత్ర ఉన్నట్టు బయటపడుతుండటంతో సీబీఐకు విచారణ అప్పగిస్తే నిజాలు నిగ్గుతేలుతాయనే భయంతో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సీబీసీఐడీకు విచారణ బాధ్యతలు అప్పగించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ వైపు అధికార పార్టీ ఒత్తిళ్లు, పోలీస్ శాఖలోని కొంత మంది అధికారుల పాత్ర అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని నీరుగార్చేందకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీబీసీఐడీ అయినా నిజాలు నిగ్గు తేల్చి అసలు దొంగలను పట్టుకుంటుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. -
లాటరీ పేరుతో కుచ్చుటోపీ
తణుకు : ‘కోకాకోలా డ్రాలో మీ మొబైల్ నెంబర్‌కు లాటరీ తగిలింది.. 50 వేలు పౌండ్లు గెలుచుకున్నారు. తక్షణమే మీ వివరాలను ఫలానా మెయిల్ ఐడీకు పంపించండి’ అంటూ ఇటీవలి కాలంలో పలువురు సెల్ఫోన్లకు మెసేజ్‌లు వస్తున్నాయి. వీటికి స్పందించి వివరాలు పంపితే మాత్రం పన్నులు కట్టాలని, ఖర్చులకని రూ.లక్షల్లో ఎరవేసి దోచుకుంటూ కుచ్చుటోపీ పెడుతున్న సంఘటనలు నమోదవుతున్నాయి. తాజాగా తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన దార్ల వెంకటసూర్యనారాయణ ఇదే తరహా మోసానికి గురై సుమారు రూ.1.40 లక్షలు చెల్లించి చేతులు కాల్చుకున్నారు. అయితే లాటరీ ముసుగులో ఇలాంటి తరహా మోసాలకు పాల్పడుతున్న సంజయ్‌కుమార్‌పై సీబీసీఐడీ అధికారులు చేపట్టిన దర్యాప్తులో భాగంగా సూర్యనారాయణ తాను కూడా మోసపోయానని గ్రహించి లబోదిబోమంటున్నాడు. మోసం ఇలా.. నోకియా సంస్థ నిర్వహించిన లాటరీలో రూ.6 కోట్ల మేర లాటరీ తగిలిందని చెబుతూ సుమారు నాలుగేళ్ల క్రితం సూర్యనారాయణకు సెల్ఫోన్లో మెసేజ్ వచ్చింది. దీనికి స్పందించిన సూర్యనారాయణ తన వివరాలను పంపించాడు. ఇతన్ని నమ్మించేలా రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి మెసేజ్ చేస్తున్నట్లుగా లాటరీ మొత్తం చెల్లించడానికి ముందుగా ఖర్చులు, పన్నులు చెల్లించాలని రూ.20 వేలు చొప్పున రెండు పర్యాయాలు చెల్లించాలని కోరడంతో సూర్యనారాయణ అలాగే పంపించాడు. తిరిగి గతేడాది రూ. 98 వేలు చెల్లించాలని మరో మెయిల్ రావడంతో తణుకు ఐసీఐసీఐ బ్యాంకు నుంచి ఆన్లైన్ ద్వారా చెల్లించాడు. అప్పటి నుంచి ఎలాంటి సమాధానం రాకపోగా.. ఇటీవల సీబీసీఐడీ అధికారులు సూర్యానారాయణ బ్యాంకు ఖాతా లావాదేవీలపై ఆరా తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గతేడాది డిసెంబరులో రూ.15 లక్షలు సూర్యనారాయణ ఖాతాలో జమ కాగా.. వారం రోజుల అనంతరం తిరిగి వేరే ఖాతాలోకి మళ్లించినట్లు లావాదేవీలు స్పష్టం చేస్తున్నాయి. అధికారుల ఆరా.. జోద్‌పూర్‌కు చెందిన సంజయ్‌కుమార్ పలువురి నుంచి ఇదే తరహాలో లాటరీ పేరుతో రూ.కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టినట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తడంతోనే అధికారులు ఇతని కదలికలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. శ్రీసాయి ఎంటర్ప్రైజెస్, జోద్పూర్ బ్రాంచి నుంచి సూర్యనారాయణ ఖాతాకు రూ.15 లక్షలు జమ కావడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. ఇందులో భాగంగానే సూర్యనారాయణ లావాదేవీలను పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు గత వారంలో రాజమండ్రి సీబీసీఐడీ కార్యాలయానికి పిలిపించి విచారించినట్లు తెలుస్తోంది. సూర్యనారాయణ ఖాతాలో జమ అయిన రూ.15 లక్షలను అతనికి తెలియకుండా మరో ఖాతాకు ఎవరు మళ్లించారు అనేది అంతు చిక్కడంలేదు. డబ్బులు ఇప్పించాలి.. ఆన్లైన్లో లాటరీ తగిలిందని ఇందుకు పన్నులు, ఖర్చుల రూపంలో డబ్బులు పంపించమని కోరడంతో రూ.1.40 లక్షలు చెల్లించా. అయితే ఇప్పుడు ఇదంతా మోసమని తెలుస్తోంది. దీనిపై విచారణ చేసి తాను చెల్లించిన డబ్బులు తిరిగి ఇప్పించాలని అధికారులను అభ్యర్థించాను. – దార్ల వెంకటసూర్యనారాయణ, బాధితుడు, దువ -
తెలంగాణ సీఎంఆర్ఎఫ్లో నకిలీ బిల్లుల స్కాం
-
తెలంగాణ సీఎంఆర్ఎఫ్లో నకిలీ బిల్లుల స్కాం
తెలంగాణ సీఎం సహాయనిధిలో అక్రమాలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సీరియస్ అయ్యారు. కొన్ని ఆస్పత్రులు నకిలీ బిల్లులు పెట్టి సొమ్ము చేసుకున్న వ్యవహారం ఆయన దృష్టికి రావడంతో దీనిపై సీబీసీఐడీ విచారణకు ఆదేశించారు. నకిలీ బిల్లులతో తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండులో చేతివాటం చూపించినట్లు వెలుగుచూసింది. దీనిపై ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. నిజమైన పేదలు వైద్యం చేయించుకోడానికి ఇబ్బంది పడుతుంటే వారికి సాయం చేసేందుకు ఉద్దేశించిన సీఎంఆర్ఎఫ్ గత కొన్ని రోజులుగా కొన్ని ఆస్పత్రుల్లో దుర్వినియోగం అవుతోంది. ఉదారంగా సాయం చేస్తుందని తెలుసుకున్న కొందరు వ్యక్తులు నకిలీ బిల్లులు సృష్టించి సొమ్ము చేసుకున్న వ్యవహారం సీఎం దృష్టికి వచ్చింది. గత ఏడు నెలల్లో జరిగిన విషయాలపై సీబీసీఐడీ దర్యాప్తు చేయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఎవరెవరి ప్రమేయం ఉందో విచారణ జరిపి నిజనిర్ధారణ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సీఎం వ్యక్తిగత కార్యదర్శి కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు.