Cc lining
-
ఇది నిజాంసాగర్ కాలువే...!
సాక్షి, నందిపేట్(నిజామాబాద్): రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోంది. కానీ సాగునీటి సరఫరా కోసం నిర్మించిన కాలువలు, తూములకు మరమ్మతులు చేయించడానికి నిధులను మాత్రం మంజూరు చేయడం లేదు. దీంతో తూములు, కల్వర్టులు, కాలువలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ప్రధాన కాలువల్లో పిచ్చి మొక్కలు పేరుకుపోవడంతో నీరు దిగువకు చేరకుండా అడ్డుపడే ప్రమాదం ఉంది. అంతేకాకుండా షట్టర్లు విరిగి పోవడం, మరికొన్నింటిని దొంగలు ఎత్తుకెళ్లడంతో నీరు వృథా అయ్యే ప్రమాదం ఉంది. మరికొన్ని చోట్ల కాలువల్లో ఇసుక మేటలు పెడుతున్నాయి. కాల్వ నిర్మాణం చేపట్టి సంవత్సరాలు గడుస్తున్న అధికారులు మరమ్మతులు చేపట్టకపోవడం ఆశ్చర్యకరం. ప్రధాన కాలువలే కాకుండా పంటపొలాలకు సాగునీరు అందించడానికి పిల్ల కాలువలు సైతం ఏర్పాటు చేశారు. కానీ అవి ప్రస్తుతం కనుమరుగవుతున్నాయి. కాలువల మరమ్మతుల కోసం ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోతుందని రైతులు వాపోతున్నారు. నందిపేట మండలం పరిధిలో డిస్ట్రిబ్యూటరి కెనాల్ 74 ప్రధాన కాలువ 19కిలోమీటర్ల పొడవునా ఉంటుంది. దీనికి 11 సబ్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి. కానీ వీటిలో నాలుగింటికి మాత్రమే షట్టర్లు ఉన్నాయి. ఈ ప్రధాన కాలువ ద్వారా నందిపేట, మాక్లూర్ మండలాల్లోని సుమారు 26 గ్రామాలకు సాగునీరు అందించాలి. కాని ప్రతి సంవత్సరం నందిపేట మండలంలోని ఆంధ్రనగర్, వెల్మల్, అయిలాపూర్, కంఠం గ్రామాలకు మాత్రమే నీరు చేరుతుంది. నిజాంసాగర్ ప్రధాన కాలువలు, పిల్లతూములు, తూములు, షట్టర్లు మరమ్మతులు కాగితాలకే పరిమితం అయ్యాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రధాన కాలువతో పాటు 82 డిస్ట్రిబ్యూటర్ కాలువల జంగల్ కటింగ్, తూముల మరమ్మతులు, ఇసుక మేటలను వెంటనే తొలగించాలి. కానీ ఇప్పటివరకు పనులు సక్రమంగా జరిగిన దాఖలాలు లేవు. దీంతో పంటపొలాలలకు నీరు చేరకుండా పోతుంది. తూములకు అడ్డంగా ఉన్న షట్టర్లు మరమ్మతులను పూర్తి చేయించాలి.. నిజాంసాగర్ ప్రధాన కాలువతో పాటు డిస్ట్రిబ్యూటరీలు, తూములు, షట్టర్లు, కాలువ కట్టలకు ఉన్న గండ్లు, లీకేజీల కోసం ఇరిగేషన్ అధికారులు రీసర్వే చేయాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా ఎస్టిమేషన్ తయారు చేయాలి. విడతల వారీగా నిధులు మంజూరు చేసి పనులు త్వరగా పూర్తి చేయాలి. –బండి నర్సగౌడ్, రైతు, బజార్ కొత్తూర్ చివరి ఆయకట్టు వరకు నీరందించాలి.. నిజాంసాగర్ కాలువలకు మరమ్మతులు చేపట్టాలి. ఇందులో భాగం గా కాల్వలకు సీసీ లైనింగ్ పనులతో పాటు లీకేజీలను సరిచేయాలి. చివరి ఆయకట్టు వరకు నీరందించాలి. నీటి సరఫరా చేసేందుకు నియమించిన గ్యాంగ్మెన్లు విధులు సక్రమంగా నిర్వహించేటట్లు చర్యలు తీసుకుని అన్ని గ్రామాలకు నీరందించాలి. –ఉమ్మెడ, రైతు, నందిపేట -
ఆధునికీకరణ పనులు వేగిరం చేయాలి
విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడి సాగర్ ఎడమ కాల్వ సీసీ లైనింగ్ పనుల పరిశీలన హాలియా : ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆధునికీకరణ పనులను వేగవంతం చేయాలని, పనుల నాణ్యతలో రాజీపడోద్దని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహకారంతో మండలంలోని హాలియా వద్ద మొదటి ప్యాకేజీ కింద కొనసాగుతున్న సీసీ లైనింగ్ పనులను శుక్రవారం మంత్రి జగదీష్‌రెడ్డి పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును ఎన్ఎస్పీ అధికారులతో కలసి చర్చించారు. అదేవిధంగా మండలంలోని ఇబ్రహింపేట గ్రామం వద్ద సాగర్ ఎడమ కాల్వపై నూతనంగా నిర్మిస్తున్న వంతెన పనులను పరిశీలించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు ఎడమ కాల్వ ద్వారా చెరువులను నింపే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. సాగర్ జలాశయం నుంచి ఎడమ కాల్వ ద్వారా నీటి విడుదల చేసి పెద్దదేవులపల్లి, అనాజిపురం, దోసపాడు చెరువులను నింపి అటు నుంచి సూర్యాపేటకు తాగునీరందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. హాలియా నుంచి వేములపల్లి వరకు ఎడమ కాల్వపై ప్రయాణం దోసపాడు చెరువు ద్వారా సూర్యాపేటకు తాగునీరు అందించే క్రమంలో సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల చేస్తే ఎదురయ్యే ప్రతిబంధకాలను అంచ నా వేయడం కోసం మంత్రి జగదీశ్‌రెడ్డి మండలంలోని హాలియా నుంచి వేములపల్లి మండల కేంద్రం వరకు సాగర్ ఎడమ కాల్వపై ప్రయాణీంచారు. ఎడ మ కాల్వ పరిధిలో ఆయా ప్యాకెజీల్లో గతంలో, ప్రస్తుతం జరుగుతున్న పను లు, కాల్వ స్థితిగతులను పరిశీలించారు. కాల్వకు నీటి విడుదల చేసే విషయంలో మరోసారి ఎన్ఎస్పీ అధికారులతో మాట్లాడినాక ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. మంత్రి వెంట జెడ్పీ చైర్మన్ బాలు నాయక్, సీఈ పురుషోత్తమ్మరాజు, ఎస్ఈ విజయభాస్కర్, ఈఈ విష్ణు ప్రసాద్, డీఈ సురేందర్‌రెడ్డి, జేఈ రమేశ్‌రెడ్డిలు ఉన్నారు. జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు కృషి హాలియా : రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో తలెత్తిన తీవ్ర తాగునీటి ఎద్డడి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హాలియాలో సాగర్ ఎడమ కాల్వపై మొదటి ప్యాకేజీలో జరుగుతున్న ఆధుకికీకరణ పనులను పరిశీలించిన మంత్రి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వర్షాభావం వల్ల జిల్లాలోని జలాశయాల్లో నీరు అడుగంటిపోవడంతో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొన్నదన్నారు. జలాశయాల్లో నీరు లేక మంచినీటి స్కీమ్‌లు పనిచేయని కారణంగా మిర్యాలగూడ, నల్లగొండ, సూర్యాపేట వంటి పట్టణాల్లో తీవ్ర నీటి ఎద్దడి దాపురించిందని పేర్కొన్నారు. ప్రధాన పట్టణాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఆయన వెంట నాగార్జున సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ పురుషోత్తమరాజు, ఎస్ఈ విజయబాస్కర్, ఈఈ విష్ణు ప్రసాద్, డీఈ సురేందర్‌రెడ్డి, జేఈ రమేశ్‌రెడ్డిలతో పాటు టీఆర్ఎస్ నాయకులు కేవీ రామారావు, ఎక్కలూరి శ్రీనివాసరెడ్డి, పోచం శ్రీనివాస్‌గౌడ్, ఎన్నమళ్ల సత్యం, వర్రా వెంకట్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి తదితరులు ఉన్నారు. -
చకచకా
నాగార్జునసాగర్ ఆధునికీకరణలో భాగంగా మొదటి ప్యాకేజీ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2016 జూలై నాటికి పనులు పూర్తికావాల్సి ఉంది. ఇప్పటికే 90 శాతం సీసీ లైనింగ్ పూర్తికాగా, కేవలం నాలుగు కిలోమీటర్ల మేర పెండింగ్‌లో ఉంది. హాలియా : ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహకారంతో చేపట్టిన నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆధునికీకరణ పనులు మొదటి ప్యాకేజీలో శరవేగంగా జరుగుతున్నాయి. 2016 జూలై నెలాఖరు నాటికి కాల్వ పనులు పూర్తి కావాల్సి ఉంది. అంటే మరో ఏడాది సమయమే ఉండటంతో పనులు ఊపందుకున్నాయి. ఎడమ కాల్వలో అల్వాల, తెట్టేకుంట, కొత్తపల్లి గ్రామాల వద్ద నీటికి అక్కడక్కడ అడ్డుకట్టలు వేయడంతోపాటు పేరుకుపోయిన షిల్ట్‌ను తొలగిస్తున్నారు. మరోవైపు కాల్వ సీసీ లైనింగ్, కాల్వకట్టపై మట్టిపోసే పనులు నిర్వహిస్తున్నారు. పనులు ఇలాగే కొనసాగితే మరో నెల నుంచి రెండు నెలలలోపే మొదటి ప్యాకేజీ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. 4 కిలోమీటర్ల మేర సీసీ లైనింగ్.. ఆధునికీకరణ పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ఎడమ కాల్వను ఐదు ప్యాకేజీలుగా విడదీశారు. 0 నుంచి 29.291 కిలోమీటర్ వరకు మొదటి ప్యాకేజీగా నిర్ణయించారు. 95.49కోట్ల రూపాయలతో పనులు చేపట్టారు. ఇప్పటికే 90 శాతం సీసీ లైనింగ్ పూర్తయ్యింది. మరో 4 కిలోమీటర్ల మేర (తెట్టెకుంట నుంచి అల్వాల వరకు) సీసీ లైనింగ్ పనులు మిగిలి ఉన్నాయి. అదే విధంగా డీప్‌కట్‌లో షాట్‌క్రీట్ పనులు 1.5 కిలోమీటర్లు మిగిలాయి. -
నల్లవాగు.. ఆశల సాగు!
కల్హేర్: జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టు నల్లవాగుపై పలు గ్రామాల ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన టీఆర్ఎస్ ప్రభుత్వం నల్లవాగు పూర్తిస్థాయిలో పారేలా చూస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కింది ఆయకట్టు రైతులు మాత్రం దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. గండ్లు, బుంగలు పడిన కాలువల కారణంగా చివర ఆయకట్టు భూములకు నీరు చేరడం లేదు. దీంతో సారవంతమైన భూములు బీడుగా మారాయి. ప్రాజెక్టు కింది భాగంలోని ఎమర్జెన్సీ కెనాల్ కూడా పూర్తిగా ధ్వంసమైంది. సీసీ లైనింగ్ పగిలి కాలువల్లో నీటి ప్రవాహం జరగడం లేదు. రెండేళ్ల క్రితాలువల మరమ్మతులు చేపట్టినా పనుల్లో నాణ్యత లోపించడం వల్ల ప్రజా ధనం వృథా కావడం మినహా ఆయకట్టు రైతులకు మేలు చేకూరింది లేదు. నల్లవాగు ప్రాజెక్టు నీటి సామర్థ్యం 1,493 అడుగులు. ప్రస్తుతం 1,483 అడుగులు ఉంది. చివరి ఆయకట్టుకు నీరు చేరాలంటే దెబ్బతిన్న కాలువలకు మరమ్మతులు తప్పనిసరి. గండ్లు, బుంగలు పడి కాలువలు శిథిలమయ్యాయి. వీటిని ఆధునికీకరించేందుకు 2009-10 ఆర్థిక సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ. 14.19 కోట్లు మంజూరు చేశారు. అప్పట్లో జరిగిన పనుల్లో నాణ్యత లోపించింది. దీంతో సిమెంట్ కట్టడాలు బీటలు వారాయి. పోచాపూర్, బీబీపేట, ఖాజాపూర్ రోడ్డు, మార్డి, కృష్ణపూర్ గ్రామాల వద్ద సిమెంట్ లైనింగ్‌కు గండ్లు పడ్డాయి. కొన్నిచోట్ల కాలువల మధ్య పిచ్చి మొక్కలు పెరిగాయి. ఫలితంగా చివరి ఆయకట్టుకు నీరు చేరని పరిస్థితి నెలకొంది. రైతుల అగమ్యగోచరంగా మారింది. ప్రాజెక్టును నమ్ముకొని పంటలు సాగు చేస్తే మునిగిపోవడం ఖాయమని భావించిన రైతులు బోర్లు వేసుకుంటున్నారు. ఖరీఫ్ సాగుకు నీటిని విడుదల చేసే ముందే శిథిలమైన కాలువలను బాగుచేయాలని ఆయకట్టు రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 5 వేల ఎకరాలకు పైగా ఆయకట్టు 1967లో కల్హేర్ మండలం సుల్తానాబాద్ వద్ద రూ. 98 లక్షలతో నల్లవాగు ప్రాజెక్టు నిర్మించారు. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి శీలం సిద్ధారెడ్డి ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 1,493 అడుగులు. కుడి కాలువ పరిధిలో సుల్తానాబాద్, గోసాయిపల్లి, పోచాపూర్, బీబీపేట, మార్డి, ఖానాపూర్(కె), కృష్ణాపూర్, ఇందిరానగర్, కల్హేర్ గ్రామాలు వస్తాయి. ఈ గ్రామాల్లో 4,100 ఎకరాలు ఆయకట్టు ఉంది. ఎడమ కాల్వ పరిధిలో బోక్కస్‌గాం, అంతర్గాం, నిజామాబాద్ జిల్లా మార్దండ, తిమ్మనగర్ గ్రామాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో 1,230 ఎకరాల ఆయకట్టు ఉంది. కాలువలు బాగుపడకపోవడంతో ఆయకట్టు రైతులు లబోదిబోమంటున్నారు.