cell phone thief
-
‘టక్కరి దొంగ’.. ఎవరికీ అర్థం కాకుండా కొట్టేశాడు!
సాక్షి, హైదరాబాద్: గాంధీభవన్‌లో టక్కరిదొంగ దొరికాడు. బీసీల కులగణన లెక్కలు తేలాయని, ఎస్సీల వర్గీకరణకు తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) ఆమోదం లభించిందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబురాల్లో ఉంటే ఓ దొంగ తన చేతివాటానికి పనిచెప్పాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 8 సెల్ఫోన్లను కార్యకర్తల జేబుల్లోంచి ఎవరికీ అర్థం కాకుండా కొట్టేశాడు. అయినా అతని చౌర్యదాహం తీరలేదేమో ఇంకా ఫోన్లు దొరుకుతాయని ప్రయత్నాలు చేస్తుండగా ఓ ఫొటోగ్రాఫర్ (Photographer) కంటపడటంతో ఆ దొంగ పట్టుబడ్డాడు.మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన పీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్ (Mahesh Kumar Goud) తన గన్‌మెన్‌ను సన్మానించడంతో వెలుగులోకి వచ్చింది. బాణసంచాలు కాలుస్తూ, స్వీట్లు పంచుకుంటూ కార్యకర్తలు బిజీగా ఉన్న సమయంలో సెల్ఫోన్లను కొట్టేస్తున్న ఆ దొంగను ఫొటోగ్రాఫర్ హరీశ్ చొరవతో పట్టుకున్నందుకు తన గన్‌మెన్ దేవరాజ్‌ను శాలువాతో సన్మానించారు. దొంగను హ్యాండిల్ చేసిన విధానాన్ని మహేశ్‌గౌడ్ అభినందించారు.సచివాలయం వద్ద మాజీ సర్పంచ్ల అరెస్ట్ తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ సచివాలయం ఎదుట ఉరితాళ్లతో నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్, నేతలు గుంటి మధుసూదన్‌రెడ్డి, రాంపాక నాగయ్య, కేశబోయిన మల్లయ్య, నెమలి సుభాష్ గౌడ్, మెడబోయిన గణేష్, బొల్లం శారదలను అరెస్టు చేసి కాంచన్‌బాగ్, షాయినాయత్‌గంజ్ పోలీస్స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా యాదయ్య గౌడ్ మాట్లా డుతూ 13 నెలలుగా అనేక రూపాల్లో ఉద్యమాలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. మాజీ సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకున్నా కనికరం లేదన్నారు.చిరకాల ఆకాంక్ష నెరవేరింది మాదిగల చిరకాల ఆకాంక్ష నెరవేరిందని, ఎస్సీ వర్గీకరణకు చట్ట బద్దత కల్పించిన రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డికి మాదిగ సంఘాల ఫ్రంట్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాదిగ సంఘాల ఫ్రంట్ ప్రతినిధులు, తెలంగాణమాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజు మాదిగ, తెలంగాణ మాదిగ హక్కుల దండోరా అధ్యక్షుడు జన్ను కనకరాజు మాదిగ తదితరులు మాట్లాడారు.చదవండి: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారురాష్ట్రంలో మొత్తం ఎస్సీ జనాభా 17.43 శాతం ఉన్నట్లుగా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్లు 17శాతం పెంచుతూ మాదిగ జనాభాకు తగినట్లుగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అలాగే దశాబ్దాల కాలంగా మాదిగలు నష్టపోయిన రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. సమావేశంలో లాయర్ మల్లన్న, బొక్కల వెంకటస్వామి పాల్గొన్నారు. -
సెల్‌ఫోన్ దుకాణంలో చోరీ
చౌటుప్పల్(మునుగోడు) : మండల కేంద్రంలోని చిన్నకొండూరు చౌరస్తాలో ఇటీవల ఏర్పాటు చేసిన ఎంఎం సెల్‌ఫోన్ దుకాణంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. ఈ దొంగతనం ఏ అర్ధరాత్రో జరుగలేదు. జన సంచారం బాగా ఉన్న పదిన్నర గంటలకే దొంగలు తమ పనిని మొదలు పెట్టారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. దుకాణ యజమాని సొప్పరి శంకర్ వేరే ప్రాంతంలో ఉన్న షాపును ఇటీవలనే ఈ చౌరస్తాలోకి మార్చాడు. తను తీసుకున్న మడిగె మూడంతస్తులు ఉన్నప్పటికీ అందులో వేరే దుకాణాలు ఏర్పాటు చేసే విధంగా లేకపోవడంతో మడిగె మొత్తం వీరి ఆధీనంలోనే ఉంది. యజమానితోపాటు పని వాళ్లు సైతం ఒకేసారి బయలుదేరుతారు. అందులో భాగంగా గత రాత్రి విపరీతమైన చలి కారణంగా తొమ్మిదిన్నర ప్రాంతంలో దుకాణా న్ని మూసేసి వెళ్లిపోయారు. ఉదయం పది గంటల ప్రాంతంలో దుకాణం తెరిచిన తర్వాత దొంగతనం విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అం దించారు. దొంగలుపై అంతస్తు నుంచి వచ్చి డోరు ను పగులగొట్టి దుకాణంలోనికి ప్రవేశించారు. తమ వెంట తెచ్చుకున్న గ్లౌజులను చేతులకు వేసుకోవడంతో పాటు దుకాణంలో ఉన్న పాత కవర్లు, ద్విచక్ర వాహనం హెల్మెట్‌ను తలకు ధరించారు. మరో కవర్లును కాళ్లకు వేసుకున్నారు. చాలా విలువైన సామ్సంగ్, వీవో, రెడ్మీ కంపెనీలకు చెందిన 20 సెల్ఫోన్లను ఎత్తుకెళ్లారు. పనిలో పనిగా అక్కడే ఉన్న 30 వేల విలువైన ల్యాప్‌టాప్, కౌంటర్లో ఉన్న 39వేల నగదును ఎత్తుకెళ్లారు. సెల్ఫోన్ల విలువ సుమారుగా 2.50లక్షల వరకు ఉంటుందని బాధితుడు పేర్కొన్నాడు. ఎక్కడ కూడా తమ వేలి ముద్రలు నమోదు కాకుండా పక్కాగా వ్యవహరించారంటే వారు ఆరితేరినవారుగా పలువురు అనుమానిస్తున్నారు. దొంగతనం దృశ్యాలన్నీ సీసీకెమెరాలో రికార్డయ్యాయి. ఘటనా స్థలాన్ని రాచకొండ కమిషనరేట్ క్రైమ్ అడిషనల్ డీసీపీ సలీమా, స్థానిక ఏసీపీ రామోజు రమేష్, సీఐ నవీన్‌కుమార్, ఎస్ఐ నవీన్‌బాబులు సందర్శించారు. ప్రింగర్‌ప్రింట్‌లో కొంతమేరకు ప్రింట్లను సేకరించారు. ఈ మేరకు బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ నవీన్‌బాబు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
భర్త చోరీ చేశాడు..భార్య తిరిగి అప్పగించింది..
పెనమలూరు : భర్త ఓ దుకాణంలో సెల్‌ఫోన్ చోరీ చేయగా, ఈ విషయం తెలుసుకుని భార్య దుకాణం యజమానురాలికి సమాచారం ఇచ్చి తిరిగి ఫోన్‌ను పోలీసులకు అప్పగించింది. కానూరు మురళీనగర్‌కు చెందిన కె.రామకృష్ణ కొద్ది రోజుల కిందట విజయవాడ గాంధీనగర్ వెళ్లాడు. అక్కడ జనరల్ స్టోర్‌లో వస్తువులు కొన్న సమయంలో దుకాణం యజమానురాలు చెక్కా దుర్గాభవానీ సెల్‌ఫోన్ చోరీ చేశాడు. రామకృష్ణ భార్య శ్యామలాగౌరీకి అనుమానం వచ్చి భర్తను నిలదీసింది. సరైన సమాధానం చెప్పక పోవటంతో ఫోన్లో ఉన్న ఓ నంబన్‌కు ఫోన్ చేయగా దుర్గాభవానీ లైన్లోకి వచ్చింది. ఈ ఫోన్ తనదేనని ఇటీవల చోరీ జరిగిందని తెలిపింది. శ్యామల ఫోన్‌ను పోలీసులకు అప్పగించంది. సీఐ దామోదర్ ఫోన్ యజమానురాలికి అందచేశారు. -
కొట్టేసింది ఒకరైతే.. కొట్టింది మరొకరిని
బీజింగ్(చైనా): ఎంతో ఇష్టపడి కొనుకున్న ఫోన్ పోయిందని ఓ వ్యక్తి తీవ్ర స్థాయిలో ఆవేశానికి లోనయ్యాడు. చోరీ చేసిన వ్యక్తిలానే కనిపించడంతో మరో వ్యక్తిని పట్టుకొని ఇష్టమెచ్చినట్టు కొట్టాడు. తీరా అతను చోరీ చేసింది కాదని తేలింది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో సదరు వ్యక్తిపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. బీజింగ్‌లోని రద్దీగా ఉన్న సబ్ వే లో ఓ వ్యక్తి మొబైల్ ఫోన్‌ను దుండగుడు చోరీ చేశాడు. అనంతరం వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఈ క్రమంలో వెంటనే తేరుకున్న ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తి దుండగుడి కోసం వెతకసాగాడు. అదే మార్గంలో నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తిని పట్టుకొని చోరీ చేసింది నువ్వే అంటూ ఇష్టమోచ్చినట్టు దాడికి దిగాడు. పోలీసులను పిలవండి..అంటూ సదరు వ్యక్తి ఎంత ప్రాధేయపడ్డా అతన్ని కింద కూర్చోపెట్టి, నా ఫోన్ నాకివ్వూ అంటూ అందరూ చూస్తుండగానే కొట్టాడు. ఫ్లీజ్ సహాయం చేయండి అంటూ అతను రోదిస్తున్నా, మొహంపై పిడుగుద్దులు గుద్దుతూ అరుపులతో హడలెత్తించాడు. అక్కడ చాలా మంది ఎదో విచిత్రం జరుగుతుందా అన్నట్టు చూశారే కానీ, ఒక్కరు కూడా పోలీసులను పిలవడానికి ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో ఓ అమాయకున్ని పట్టుకుని అంతదారుణంగా కొడతారా అంటూ..దాడికి దిగిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.