Central employees
-
గుడ్న్యూస్ : డీఏ పెంపుకు కేంద్రం అంగీకారం
7th Pay Commission Updates కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ! దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కరువు భత్యం చెల్లింపుపై కేంద్రం స్పందించింది. ఎటువంటి కోతలు లేకుండా ఉద్యోగులు ఊహించనట్టుగానే కరవు భత్యాన్ని పెంచింది. దీంతో 54 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. 7వ వేతన ఒప్పందం సంఘం సిఫార్సులను కేంద్రం పరిగణలోకి తీసుకుంది. దీంతో ప్రస్తుతం ఉద్యోగులకు చెల్లిస్తున్న కరువు భత్యం (డియర్నెస్ అలవెన్స్ డీఏ)ను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన డీఏను 2021 నుంచి అమలు చేయనున్నారు. కరోనా కల్లోలం కారణంగా 2020 జనవరి నుంచి డీఏ పెంపు పెండింగ్లో ఉంది. ఇప్పటికే మూడు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. మరోవైపు 2021 జులై నుంచి కొత్త డీఏను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై పడింది. దీంతో ప్రభుత్వం డీఏ పెంచేందుకు అంగీకరించింది. మరోవైపు పెన్షనర్లకు సంబంధించి డీఆర్ పెంపుపై ఎటువంటి ప్రకటన రాలేదు. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా కాటు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కష్టం కాలంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు షాక్ ఇచ్చింది కోవిడ్-19 సంక్షోభంతో ఆర్థిక వ్యవస్థపై భారం పెరిగిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు డీఏ (డియర్నెస్ అలవెన్స్) చెల్లింపులను నిలిపివేసింది. 4 శాతం నుంచి 12 శాతానికి పెంచుతూ మార్చి13 నాటి కేంద్ర కేబినెట్ నిర్ణయం అమలును నిలిపివేసింది. తద్వారా కేంద్ర ఖజానాపై 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ సుమారు 27,000 కోట్ల రూపాయలు భారాన్ని తగ్గించుకోనుంది. 2020 జనవరి 1 నుంచి జూన్ వరకు ఇది వర్తిస్తుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయంతో సుమారు 49.26 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 61.17 లక్షల మంది పెన్షనర్లను ప్రభావితం చేస్తుంది. పెరుగుతున్నధరల కనుగుణంగా దీన్ని సంవత్సరానికి రెండుసార్లు సవరిస్తారు. తదుపరి సమీక్ష జూలైలో ఉండనుంది కరోనా సంక్షోభం, మార్చి 24 నుంచి లాక్డౌన్ అమలవుతున్న కారణంగా పన్నుల నుండి వచ్చే ఆదాయం తగ్గిపోయింది. ఉత్పత్తుల ఖర్చులు పెరిగాయి. నిధుల కొరత నేపధ్యంలో ప్రభుత్వం ఎక్కువగా ఖర్చులను తగ్గించుకుంటోంది. అన్ని శాఖలకు కేటాయించిన బడ్జెట్లో 40 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి, మంత్రులు, అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుల జీతాలను ప్రభుత్వం ఇప్పటికే 30 శాతం తగ్గించింది. ఎంపీ లాడ్స్ నిధులను కూడా రెండు సంవత్సరాలు నిలిపివేసింది. దీంతోపాటు కరోనా బాధితులను, నష్టపోయిన ప్రజానీకాన్ని ఆదుకునేందుకుగాను కేంద్ర ప్రభుత్వోద్యోగుల (రెవెన్యూ శాఖ) ఒక రోజు వేతనాన్ని కోత విధించి ఈ నిధులను పీఎం కేర్స్ జాతీయనిధికి జమ చేయాలని కేంద్రం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు తమ ఉద్యోగుల జీతాలను తగ్గించిన సంగతి తెలిసిందే. (ఆసియాలో అపర కుబేరుడుగా అంబానీ) చదవండి : చెల్లింపుల జోష్ : వొడాఫోన్ ఐడియా జంప్ కరోనా కల్లోలం : జీడీపీపై ఫిచ్ షాకింగ్ అంచనాలు -
భగ్గుమన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు
చెన్నై: కేంద్ర మంత్రి వర్గం ఆమోదించిన 7 వ వేతన సంఘం సిఫారసుల ఆమోదం పై నిరసనల సెగ అప్పుడే రగిలింది. తమిళనాడులోని చెన్నై లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నిరసనకు దిగారు. బుదవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన సిఫారసులపై భగ్గుమన్న కేంద్ర ప్రబుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ సిఫారసులకు ఆమోదం లభించినప్పటికీ ఉద్యోగులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అరకొరా చెల్లింపులను ఆమోదించారని, కంటితుడుపు చర్యగా ఉన్నాయని ఆరోపించారు. అయితే సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ 7వ వేతన సంఘం సిఫారసుల ఆమోదంపై స్పందించారు. తాను తన సూచనలు అందించాననీ, వాటిలో కొన్నింటికి ఆమోదం లభించిందని తెలిపారు. ఇక మిగిలిన వ్యవహారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చూస్తారని వ్యాఖ్యానించారు. కాగా గతం కంటే తక్కువగా అంటే గత 60 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 14.2 శాతం ఫిట్మెంట్ను సిఫారసు చేసి ఉద్యోగులను అవమానించిందని గతంలో కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఎల్పీజీ విధానాల్లో భాగంగా ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్లు 16 శాతం కంటే ఉద్యోగులకు ఫిట్మెంట్ ఇవ్వవద్దనే షరతులు విధించిన నేపథ్యంలోనే ఈ సిఫారసులని వాదించాయి. ఏడో వేతన సంఘం అంతకు మించి చేస్తుందని ఉద్యోగులు ఆశిస్తే ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని విమర్శించాయి. దీనిపై దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని కూడా హెచ్చరించాయి.