ప్రతీకార దాడి.. 11మంది మృతి
బమాకో: మాలిలో కొంతమంది ప్రత్యేక వాదులు చేసిన దాడుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన పెద్ద సంచలనం సృష్టించడమేకాకుండా అక్కడ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. గత వారంలో జరిగిన కాల్పుల ఘటనకు ప్రతిగా తాజా ఘటన తలెత్తినట్లు తెలుస్తోంది. అజావద్ మూమెంట్ అనే ఒక తిరుగుబాటు సంస్థకు చెందిన మౌసా అగ్ అట్టాహర్ అనే వ్యక్తి మాట్లాడుతూ సెంట్రల్ మాలీకి సమీపంలోని టెనెన్కో అనే పట్టణంపై దాడి చేసినట్లు తెలిపాడు.
ప్రభుత్వం గతవారం తమపై బలగాలతో చేయించిన దాడులుగా ప్రతీకారంగానే తాము దాడులకు పాల్పడినట్లు చెప్పాడు. తమ సత్తా ఏంటో చూపించాలని, తాము కూడా దాడులు చేయగలమని, పాలనను స్తంభింపచేయగలమని అటు పాలక వర్గాలకు, పార్టీలకు నిరూపించాలనే ఈ చర్యకు దిగామని వివరించాడు. కాగా, చనిపోయిన వారంతా కూడా తిరుగుబాటుదేరులేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.