chainsnaching
-
హుండీని పెకలించి చోరీకి యత్నం
దొడ్డబళ్లాపురం: దొడ్డ పట్టణంలోని దర్జీపేటలో ఉన్న పాండురంగ విఠల దేవాలయంలో మంగళవారం అర్ధరాత్రి ఆటోలో వచ్చిన నలుగురు దొంగలు దేవాలయం ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి లోపలకు చొరబడ్డారు. పెద్ద హుండీని అతి కష్టంమీద పెకలించి బయటకు తీసుకువచ్చి ఆటోలో ఎత్తడానికి ప్రయత్నిస్తుండగా దేవాలయం ఎదురుగా ఉన్న ఇంట్లో వారు గట్టిగా కేకలు వేయడంతో హుండీ అక్కడే వదిలి ఆటోతో సహా పరారయ్యారు. చోరీ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆలయాల్లో నగలు చోరీ శివమొగ్గ: బసవనగంగూరు గ్రామంలోని గుళ్లమ్మ, మాతంగమ్మ దేవాలయాల్లో చోరీ జరిగింది. మంగళవారం రాత్రి దొంగలు చొరబడి దేవతామూర్తులకు అలంకరించిన రూ.లక్ష విలువైన బంగారు నగలు, హుండీలోని కానుకలను ఎత్తుకెళ్లారు. 14 బైక్‌లు స్వాధీనం యశవంతపుర: దేవస్థానాల వద్ద పార్కింగ్ చేసిన బైక్‌లను చోరీ చేస్తున్న మైసూరు జిల్లా శ్రీరంగపట్టణకు చెందిన శివకుమార్ అనే దొంగను చంద్రాలేఔట్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.11.35 లక్షల విలువైన 14 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఇతను జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తూ బైక్ చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: కిడ్నీకి రూ.4 కోట్లని.. అమాయకులకు ఆఫ్రికా ముఠా ఎర) -
హడలెత్తించిన చైన్ స్నాచర్లు
శ్రీకాకుళం : జిల్లాలో చైన్‌స్నాచర్ల ఆగడాలు పెరుగుతున్నాయి. ఒంటరిగా వెళుతున్న మహిళలే లక్ష్యంగా దాడులు చేసి వారి వద్ద గల బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్నారు. పథకం ప్రకారం ద్విచక్రవాహనాలపై వచ్చి.. దొంగతనాలు చేస్తున్నారు. శుక్రవారం జిల్లాలో మూడు చోట్ల పట్టపగలే ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఇచ్ఛాపురం: పట్టపగలే మహిళమెడలో బంగారు పుస్తెల తాడును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించిన ఘటన కలకలం రేపింది. పట్టణంలో బాసుదేవపేటలో విశ్రాంత ఉపాధ్యాయుడు కొణతాల మోహన్‌రావు, భార్య జానకి నివసిస్తున్నారు. ఆమె శుక్రవారం ఉదయం 5 గంటలకు ఇంటి వద్ద పూలు కోస్తుండగా గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చారు. ఒకరు వాహనం దిగి వెనుక నుంచి వచ్చి మెడలోని 2 తులాల బంగారు పుస్తెల తాడును లాక్కొని పరారయ్యారు. ఈ ఘటనలో పుస్తెల తాడు తెగిపోవడంతో అందులోని పుస్తెలు, పూసలు కిందపడిపోయాయి. వెంటనే జానకి గట్టిగా అరవడంతో భర్త, కుమారుడు బయటకి వచ్చారు. వారిని వెంబడించే సరికి దుండగులు ద్విచక్రవాహనంపై వేగంగా పారిపోయారని భర్త మోహన్‌రావు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్ఐ బి.మంగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 15 నిమిషాల వ్యవధిలో ఇద్దరిపై దాడి కాశీబుగ్గ: 15 నిమిషాల వ్యవధిలో ఇద్దరు మహిళలపై పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో దుండగులు దాడిచేసి మూడు తులాల బంగారు తాడును లాక్కెళ్లిపోయారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం జరిగింది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు జామియా మసీదుకు చెందిన రాజేశ్వరి శుక్రవారం రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నారు. వెనుక నుంచి వచ్చిన ఇద్దరు దొంగలు పథకం ప్రకారం.. 3 తులాల బంగారు గొలుసును దొంగిలించేందుకు ప్రయత్నించాడు. ఆమె గట్టిగా ప్రతిఘటించడంతో నెట్టేసి పారిపోయారు. ఈ దృశ్యాలు పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు ఇంటి బయట ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఇది మరో ఘటనలో 15 నిమిషాల వ్యవధిలో మధ్యాహ్నం భోజనం తీసుకుని వస్తున్న ఉషారాణిపై దాడిచేసి 3 తులాల బంగారు తాడును దొంగిలించుకుపోయారు. ఆమె విలపిస్తు కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. పలాస–కాశీబుగ్గలో ఇంతవరకు సుమారుగా నాలుగేళ్లలో 30 గొలుసు దొంగతనాలు జరిగాయి. జిల్లా యంత్రాంగంపై ఎస్పీ ఆగ్రహం జిల్లా ఎస్పీ త్రివిక్రమ వర్మ అధికారులపై మండిపడ్డారని విశ్వసనీయ సమాచారం. తరచూ గొలుసు దొంగతనాలు జరుగుతున్నా వాటిని అదుపు చేయకపోవడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లాలో అత్యధికంగా పలాస–కాశీబుగ్గ, ఇచ్ఛాపురంలో జరుగుతున్నాయని నిందితులను పట్టుకోవాలని అదేశాలు జారీచేశారు. -
గొలుసు దొంగల అటకట్టిస్తాం
ఎస్పీ ఆకే రవికృష్ణ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : గొలుసు దొంగల ఆటకట్టించేందుకు ప్రత్యేక మఫ్టీ పోలీసు బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. సీబీజెడ్, హంక్, పల్సర్ లాంటి హైస్పీడు బైక్‌లతో కూడా నగరంలో నిఘా ఉంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం బిర్లాగేటు సమీపంలో జరిగిన చైన్ స్నాచింగ్ సంఘటన స్థలాన్ని ఎస్పీ సందర్శించి బాధితురాలి ఇంటికెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గొలుసు దొంగల బారిన పడకుండా మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిరునామా అడుగుతూ మాటల్లో పెట్టి సులువుగా గొలుసులు లాక్కెళ్లుతున్నారని అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆభరణాలు ధరించిన మహిళలు అవి బయటకు కనిపించకుండా చీర కొంగు లేదా చున్నీ కప్పుకోవాలని సూచించారు. కాలనీల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే 100 డయల్ చేయాలని, లేదంటే స్థానిక పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆయన వెంటనే మూడో పట్టణ సీఐ మధుసూదన్‌రావు ఉన్నారు. -
గురవయ్య తోటలో చైన్‌స్నాచింగ్
ప్రొద్దుటూరు క్రై : స్థానిక గురవయ్యతోటలో శుక్రవారం సాయంత్రం చైన్ స్నాచింగ్ జరిగింది. రామసుబ్బమ్మ అనే వద్ధురాలు నేతాజినగర్‌లో నివాసం ఉంటోంది. ఆమె కూతురు వరలక్ష్మి ఓ అపార్ట్మెంట్ సమీపంలో ఉంటోంది. ఈ క్రమంలో ఆమె శుక్రవారం సాయంత్రం తన కూతురు వద్దకు నడుచుకుంటూ బయలుదేరింది. అపార్ట్మెంట్ వద్దకు వెళ్లగానే ఇద్దరు యువకులు మోటార్ బైక్‌లో వచ్చి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని వెళ్లారు. దుండగులు లాక్కొనే ప్రయత్నంలో వద్ధురాలు గొలుసును గట్టిగా పట్టుకోగా, ఆమె కింద పడిపోయింది. విషయం తెలియడంతో షీ టీమ్ సభ్యులు హుటాహుటిన సంఘటనా స్థలానికి వెళ్లారు. బంగారు గొలుసు సుమారు 3.5 తులాలు ఉంటుందని రామసుబ్బమ్మ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.