Chaitali
-
ఖైదీల రూటు జ్యూట్ వైపు
కలకత్తా వాసి చైతాలి దాస్ వయసు 50 ఏళ్లు. గోల్డెన్ ఫైబర్‌గా పిలిచే జ్యూట్ పరిశ్రమను స్థాపించడంలోనే కాదు అందుకు తగిన కృషి చేసి గోల్డెన్ ఉమన్‌గా పేరొందింది చైతాలి. ముఖ్యంగా ఖైదీలతో కలిసి జనపనార ఉత్పత్తులను తయారు చేస్తూ, వ్యాపారిగా ఎదిగి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. ‘జనపనారను పర్యావరణ అనుకూలమైన, విస్తృతంగా అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. ఇది మన సాంస్కృతిక గొప్పతనాన్నీ పెంచుతుంది. నా ఫౌండేషన్ ద్వారా ఖైదీలను ఆదుకోవాలనే లక్ష్యంగా పెట్టుకున్నాను’ అని వివరించే చైతాలి ఆలోచనలు మన దృష్టి కోణాన్ని కూడా మార్చుతుంది. చైతాలి మొదలు పెట్టిన ప్రయాణం ఆమె మాటల్లోనే... ‘‘నేను పుట్టి పెరిగింది పశ్చిమ బెంగాల్‌లోని అలీపూర్. మా ఇల్లు సెంట్రల్ జైలు, ప్రెసిడెన్స్ కరెక్షనల్ హోమ్ మధ్య ఉండేది. ఎందుకో తెలియదు కానీ ఆ జైలు జీవితం గడుపుతున్నవారి గురించి తెగ ఆలోచించేదాన్ని. మా నాన్న లాయర్ కావడం కూడా అందుకు మరో కారణం. నాన్నతో కలిసి ఆయన ఆఫీసుకు, పోలీస్ స్టేష¯Œ కు, సెంట్రల్ జైలుకు వెళ్లడం వల్ల నాలో అక్కడి వాతావరణం ఒక ఉత్సుకతను రేకెత్తించేది. జైలు గోడల లోపలి జీవితం ఆశ్చర్యపోయేలా చేసేది. కటకటాల వెనుక ఉన్న జీవితాలను, అక్కడ వాళ్లు ఎలా ఉంటారో చూపించే సినిమాలను చూడటం స్టార్ట్ చేశాను. రాత్రిళ్లు నిద్రపోయాక మా ఇంటికి సమీపంలో ఉన్న జూ నుంచి పులుల గర్జనలు వినిపించేవి. అర్ధరాత్రి సమయాల్లో పోలీసుల విచారణ, ప్రజల అరుపులు, కేకలు వినిపిస్తుండేవి. ఆ శబ్దాలు నాలో భయాన్ని కాకుండా దృష్టికోణాన్ని మార్చాయి. శాశ్వత ముద్ర నా చిన్నతంలో కొన్నిసార్లు మా నాన్నగారు కోర్టుకు తీసుకెళ్లారు. మొదటిసారి వెళ్లినప్పుడు నిందితులను కోర్టు హాలుకు తీసుకురావడం, పోలీసు వ్యాన్‌లో నుంచి వ్యక్తులు దిగడం గమనించాను. నా ఉత్సుకత తారస్థాయికి చేరుకుంది. మా నాన్న సహోద్యోగులలో ఒకరిని ‘ఎవరు వాళ్లు’ అని అడిగాను. తప్పు చేసినవారిగా ముద్రపడి, పర్యవసనాలను ఎదుర్కొనేవారు అని చెప్పారు. నేను అక్కడే నిలబడి గమనిస్తూ ఉన్నాను. వారి కుటుంబ సభ్యులు వారి వైపు పరిగెత్తుకుంటూ రావడం, ఆ వెంటనే వారి మధ్య ఉద్వేగభరితమైన సంభాషణలు విన్నాను. వారి బాధలు చూస్తుంటే ఏదైనా సాయం చేయాలనిపించేది. స్వచ్ఛంద సంస్థలతో కలిసి.. కాలక్రమంలో చదువుతోపాటు ఇతరులకు సాయం చేసే మార్గం కోసం చాలా అన్వేషించాను. అందులో భాగంగా వివిధ ఎన్జీవోలతో కలిసి పనిచేశాను. 2015లో చైతాలి రక్షక్ ఫౌండేషన్‌కు పునాది పడింది. ఈ ఫౌండేషన్ మగ, ఆడ ఖైదీలు, ఇతర నిరుపేద మహిళలకు సాధికారత కల్పించడంపై దృష్టి పెడుతుంది. మొదటిసారి కరెక్షనల్ హోమ్‌లో నా పనిని ప్రారంభించాను. మొదట్లో స్పోకెన్ ఇంగ్లిషుపై దృష్టి పెట్టాను. మహిళలు, ఖైదీలతో కుకీలను తయారు చేయించడం, యోగాను పరిచయం చేయడం, చెక్కపనిలో పాల్గొనడం, పెయింటింగ్ సెషన్లు నిర్వహించడం వంటి అనేక ప్రాజెక్ట్‌లు చేపట్టాను. ఆ ప్రాజెక్ట్‌లు విభిన్న కార్యక్రమాలను ప్రతిబింబించేవి. అంతర్జాతీయంగా... బెంగాల్ జనపనార పరిశ్రమలో సుమారు 40 లక్షల మంది ఉన్నారు. నేను, ఖైదీలతో జనపనార ఉత్పత్తులను రూపొందించడంలో నిమగ్నమై ఉన్నాను. వివిధ ప్రదేశాలలో వారి సృజనాత్మక ఉత్పత్తులను ప్రదర్శనకు పెడుతుండేదాన్ని. ఆ తర్వాత వివిధ ఈ–ప్లాట్ఫార్మ్స్, జాతీయ– అంతర్జాతీయ వేదికలపైకి కూడా వారి జనపనార ఉత్పత్తులను తీసుకెళ్లాను. ౖఖైదీలకు శిక్షణ ఇవ్వడానికి నేషనల్ జ్యూట్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఎన్జెబి)తో కనెక్ట్ అయ్యాను. శిక్షణ ద్వారా ఉత్పత్తులు కూడా పెరిగాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా జ్యూట్ ఉత్పత్తుల తయారీలో దాదాపు మూడు వేల మంది ఖైదీలకు శిక్షణ ఇచ్చాం. దీంతో ఈ ప్రాజెక్ట్ ‘రూట్ టు జ్యూట్’గా రూపుదిద్దుకుంది. ముఖ్యంగా దీనిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇంక్యుబేట్ చేసింది. మా స్టార్టప్ హస్తకళలు, రగ్గులు, హ్యాండ్‌బ్యాగులు వంటి జనపనార ఉత్పత్తులను తయారు చేస్తుంది. 2021 జనవరి 7న రూపొందించిన అతిపెద్ద జ్యూట్ బ్యాగ్ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. యువత కోసం.. ప్రత్యేకంగా విభిన్నరకాల ఉత్పత్తులను అందిస్తున్నాం. ఫ్యాషన్‌లో భాగంగా యువతకు చూపుతున్నాం. యూనివర్శిటీ లేదా కాలేజ్ నుండి బయటికి వచ్చే విద్యార్థులు జ్యూట్ బ్యాగ్‌లను ధరించి వెళుతుండగా చిత్రీకరించి ప్రదర్శిస్తుంటాం. ఇది వారిలో ఆసక్తిని పెంచుతుంది. తప్పు చేసిన వారిని ప్రజలు నేరస్తులుగా చూస్తారు. అయినప్పటికీ ఈ వ్యక్తులు ఉత్పత్తులను రూపొందించడంలో నిమగ్నమైనప్పుడు వారి అవగాహనలో మార్పు కలుగుతుంది. జనం కూడా వారిని అభినందించడం ప్రారంభిస్తారు. ఇలా క్రమంగా అందరిలోనూ అంగీకారం పెరుగుతుంది. తప్పు చేసినవారు లేదా దోషులుగా ముద్రపడిన వ్యక్తులు కూడా మార్పు చెందగలరు’ అని తన కృషి ద్వారా చూపుతోంది చైతాలి. -
అత్తారింటికి దారిదే...
భర్త మరుగుదొడ్డి కట్టించడంలేదని, కట్టించాకే తిరిగి వస్తానని చెప్పి పుట్టింటికి వెళ్లిపోయింది ప్రియాంక. ఆమెది ఉత్తరప్రదేశ్‌లో కంచన్కుయా గ్రామం. అదే రాష్ట్రంలో ఈ నెల పదిహేనో తేదీన ఖేసియా అనే ఊళ్లో నీలమ్, కళావతి, షకీనా, నిరంజన్, గుడియా అనే ఆరుగురు కొత్త కోడళ్లు అత్తింట్లో టాయ్‌లెట్ లేదని పుట్టింటికి వెళ్లిపోయారు. సరిగ్గా అదే రోజు మహారాష్ట్రలో చందా అనే ఒక వధువు తనకు వేరే ఏమీ వద్దనీ, రెడీమేడ్ మరుగుదొడ్డిని పెళ్లికానుకగా ఇవ్వమని బంధువులను అడిగి మరీ సాధించుకుంది. చందా, మిగతా మహిళలు చూపిన ఈ చొరవ మన గ్రామాల్లోనూ ప్రతి మహిళకూ స్ఫూర్తిదాయకం కావాలని సాక్షి ‘ఫ్యామిలీ’ ఆకాంక్షిస్తోంది. మనకు స్వాతంత్య్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలలోనూ సామాజికంగా, సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించాం. చట్టసభల్లో స్త్రీలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నాం... కానీ స్త్రీ స్వేచ్ఛగా తిరగగలిగే పరిస్థితిని సాధించుకోవడం కోసం ఏమీ చేయలేకపోతున్నాం. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లిన స్త్రీ క్షేమంగా తిరిగి వస్తుందనే భరోసా తెచ్చుకోలేకపోతున్నాం. అత్యవసరాలైన కాలకృత్యాలకోసం సైతం మన పల్లెటూళ్లలో ఆడవాళ్లు బహిర్భూమికి వెళ్లవలసి వస్తుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతున్నాం తప్పితే టాయిలెట్ నిర్మాణానికి చొరవ తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో టాయిలెట్ కోసం చందా అనే నవ వధువు చొరవ చూపడం తాజా ఉదంతం. చొరవ చూపక తప్పలేదు మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో జరిగిన ఓ పెళ్లిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. యావత్మాల్ జిల్లాలోని మోజర్ కు చెందిన కృష్ణకుమార్ మాకోడెతో అకోలా జిల్లా కారంజా రమజాన్పూర్ (నయా అందురా)కి చెందిన చందా అలియాస్ చైతాలి గలాఖే (రాఠోడ్)కు మే 15న వివాహం నిశ్చయమైంది. తాను కోడలిగా అడుగుపెట్టబోయే ఇంట్లో మరుగుదొడ్డిలేదని, పెళ్లయి అత్తగారింటికెళ్తే ఆ అవసరం కోసం ఆరుబయటకే వెళ్లాలన్న విషయం వధువుకు తెలిసింది. ఈ పరిస్థితి రాకూడదంటే, అత్తగారింట్లో కూడా మరుగుదొడ్డి ఉండి తీరాలనుకుంది. దాంతో, మొహమాటాన్ని వదిలి పెట్టి, తనకు పెళ్లి కానుకగా రెడీమేడ్ మరుగు దొడ్డిని ఇవ్వాలని తల్లిదండ్రులను, ఇతర బంధువులను కోరింది. ఆమె కోరికను తీర్చాలనుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు పెళ్లికి ముందే ఓ రెడీమేడ్ మరుగుదొడ్డిని సిద్ధం చేశారు. శుక్రవారం వివాహం అనంతరం కానుకలకు బదులుగా రెడీమేడ్ మరుగుదొడ్డిని ఆమె పెదనాన్న గజానన్ నాడే ఆమెకు అందించారు. నో ప్రాఫిట్, నో లాస్... ఇదిలా ఉంటే, ఈ రెడీమేడ్ టాయిలెట్లకు గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరుగుతోందని, రెడీమేడ్ టాయిలెట్లను పెళ్లిలో కానుకలుగా ఇవ్వాలనుకునేవారికి ‘నో ప్రాఫిట్, నో లాస్’ ప్రాతిపదికన ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు రెడీమేడ్ టాయిలెట్ మ్యానుఫ్యాక్చరర్ అరవింద్ దేతే తెలిపారు. ఆనందంగా ఉంది... కాబోయే అత్తారింట్లో మరుగుదొడ్డిలేదని తెలిసి చాల బాధవేసింది. అంతే! ఎవరు, ఏమి అనుకున్నా ఫర్వాలేదు కాని, నాకు పెళ్లి కానుకలకు బదులుగా రెడీమేడ్ మరుగుదొడ్డిని ఇవ్వాలని పట్టుబట్టాను. దీనికి మా కుటుంబసభ్యులతోపాటు బంధువులూ అంగీకరించి నా గౌరవాన్ని మరింత పెంచారు. ఇది నాకెంతో ఆనందాన్నిచ్చింది. - వధువు చందా స్వచ్ఛత ‘ఐకాన్’... పెళ్లి కానుకగా రెడీమేడ్ మరుగుదొడ్డిని అందుకుని వధువు చందా స్వచ్ఛభారత్‌కు ఐకాన్‌గా మారిందని బ్లాక్ డెవలప్ మెంట్ ఆఫీసర్ ఉమేష్ దేశ్‌ముఖ్ అభివర్ణించారు. కానుక విషయం తెలుసుకున్న ఆయన మరికొందరు అధికారులతో కలసి పెళ్లి మంటపానికి చేరుకుని, వధూవరులను ఆశీర్వదించారు. ఆడపిల్లలందరూ చందాను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. - గుండారి శ్రీనివాస్, సాక్షి, ముంబై వధువు చందాకి కానుకగా వచ్చిన టాయిలెట్ దేశవ్యాప్తంగా టాయిలెట్ అవసరాల కోసం యాభై శాతానికిపైగా ఇప్పటికీ బహిర్భూమిపై ఆధారపడక తప్పడం లేదు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలలో అధిక భాగం ఆరుబయట టాయిలెట్‌కి వెళ్లినప్పుడే జరుగుతున్నట్లుగా సర్వేల్లో తేలింది. ♦ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా వివిధ కారణాల వల్ల మృత్యువాత పడుతున్న ఏడులక్షల మంది చిన్నారుల్లో బహిరంగ మలవిసర్జన కారణంగా అంటువ్యాధులు సోకి మరణిస్తున్న వారు రెండు లక్షలమంది ఉంటారని అంచనా. ♦ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సగటున 42 శాతం మందికే టాయిలెట్లు ఉన్నాయి. ♦ దేశంలోనే అతి పేద రాష్ర్టంగా పేరు పొందిన బీహార్‌లో గ్రామీణ ప్రాంతాలలో దాదాపు 85 శాతం మందికి టాయిలెట్లు లేవట. ♦ బీహార్‌లో గత సంవత్సరం నమోదైన రేప్ కేసులలో 870 కేసులు బహిరంగ టాయిలెట్‌కి వెళ్లిన వారిపైన జరిగినట్లుగా నమోదైంది. ♦ యూపీలో బహిర్భూమికి వెళ్లిన ఇద్దరు యువతులు ఇటీవల అత్యాచారానికీ, హత్యకూ గురయ్యారు. ♦ దేశవ్యాప్తంగా నమోదవుతున్న రేప్ కేసులలో కనీసం 500 కేసులు బాధిత మహిళలకు ఇంటిలో టాయిలెట్ ఉంటే జరిగేవి కావని అంటున్నారు పోలీసులు. -
'టాయ్‌లెట్' కోరిన వధువుకు 10 లక్షల నజరానా
ముంబై: పెళ్లికానుకగా బంగారు ఆభరణాలకు బదులు టాయ్‌లెట్ కావాలని కోరిన మహారాష్ట్రకు చెందిన అమ్మాయికి 10 లక్షల రూపాయల నజరానా ప్రకటించారు. అలోకా జిల్లా అందురా గ్రామానికి చెందిన చైతలీ గలాఖే అనే అమ్మాయికి యవత్మాలా జిల్లాకు చెందిన దేవేంద్ర మకోడే అనే అబ్బాయితో ఇటీవల పెళ్లి జరిగింది. అత్త వారింట్లో మరుగుదొడ్డి లేదన్న సంగతి తెలుసుకొని.. ఇంట్లో కచ్చితంగా ఉండాల్సిందేనని పెళ్లికి ముందు స్పష్టంగా చెప్పడంతో ఆ ఏర్పాటు చేశారు. పుట్టింటివారు, మెట్టింటివారు కలిసి అన్ని వసతులు ఉన్న ఓ టాయిలెట్ (ప్రిఫ్యాబ్రికేటెడ్)ను కట్నకానుకలతో కలిపి ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సులభ్ ఇంటర్నేషనల్ నిర్వాహకులు చైతలీకి 10 లక్షల రూపాయల నగదు బహుమతి ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఆకర్షితురాలైన చైతలీని వారు అభినందించారు. -
ఆలోచన ఉంటే..!
ముంబై: ‘ఆలోచన ఉంటే.. మరుగుదొడ్డి వస్తుంది..’ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఓ ప్రకటనలో ఇటీవల టీవీల్లో ఎక్కువగా వినిపిస్తున్న డైలాగ్ ఇది! అయితే ఈ అమ్మాయికి ఆలోచనే కాదు.. అడిగే సత్తా కూడా ఉంది. అత్తింటి వారింట్లో మరుగుదొడ్డి లేదన్న సంగతి తెలుసుకొని పెళ్లి సమయంలోనే అడిగేసింది. ఇంట్లో మరుగుదొడ్డి ఉండాల్సిందేనని స్పష్టంగా చెప్పడంతో అత్తింటివారు, పుట్టింటివారు చకచకా ఆ ఏర్పాటు చేశారు. పెళ్లి సమయంలో ఇచ్చే నగలు, ఆభరణాలు, కట్నకానుకలతోపాటు ఓ తాత్కాలిక ‘టాయిలెట్’ను కూడా పెట్టారు. మహారాష్ట్రలోని అలోకా జిల్లా అన్దురా గ్రామానికి చెందిన చైతలీ గలాఖే అనే అమ్మాయికి దేవేంద్ర మకోడే అనే అబ్బాయితో ఇటీవల పెళ్లి జరిగింది. పెళ్లి కుదిరిన తర్వాత.. అత్తారింట్లో మరుగుదొడ్డి లేదన్న సంగతి చైతలీకి తెలిసింది. దీంతో ఆమె మరుగుదొడ్డి కావాల్సిందేనని ధైర్యంగా అడిగింది. దీంతో పుట్టింటివారు, మెట్టింటివారు కలసి అన్ని వసతులున్న ఓ టాయిలెట్ (ప్రిఫ్యాబ్రికేటెడ్)ను కట్నకానుకలతో కలిపి ఇచ్చారు. కానుకల్లో ఉన్న ఈ టాయిలెట్‌ను చూసి ఆశ్చర్యపోవడం పెళ్లికి వచ్చిన వారి వంతైంది! ‘‘పెళ్లిలో సాధారణంగా ఇచ్చే వస్తువులన్నింటి కన్నా నిజానికి టాయిలెటే ముఖ్యం. అందుకే అది ఉండాల్సిందేనని అడిగా. మా నాన్న, మామగారు కలసి దాన్ని కొనిచ్చారు’’ అని చైతలీ చెప్పింది. -
పెళ్లి కానుకగా 'మరుగుదొడ్డి'!
ముంబై: 'ఆలోచన ఉంటే.. మరుగుదొడ్డి వస్తుంది..' కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఓ ప్రకటనలో ఇటీవల టీవీల్లో ఎక్కువగా వినిపిస్తున్న డైలాగ్ ఇది! అయితే మహారాష్ట్రకు చెందిన ఈ అమ్మాయికి ఆలోచనే కాదు అడిగే సత్తా కూడా ఉంది. అత్తింటి వారింట్లో మరుగుదొడ్డి లేదన్న సంగతి తెలుసుకొని పెళ్లి సమయంలోనే అడిగేసింది. ఇంట్లో మరుగుదొడ్డి ఉండాల్సిందేనని స్పష్టంగా చెప్పడంతో అత్తింటివారు, పుట్టింటివారు చకచకా ఆ ఏర్పాటు చేశారు. పెళ్లి సమయంలో ఇచ్చే నగలు, ఆభరణాలు, కట్నకానుకలతోపాటు ఓ తాత్కాలిక 'టాయిలెట్'ను కూడా పెట్టారు. మహారాష్ట్రలోని అలోకా జిల్లా అందురా గ్రామానికి చెందిన చైతలీ గలాఖే అనే అమ్మాయికి యవత్మాలా జిల్లాకు చెందిన దేవేంద్ర మకోడే అనే అబ్బాయితో ఇటీవల పెళ్లి జరిగింది. పెళ్లి కుదిరిన తర్వాత అత్తారింట్లో మరుగుదొడ్డి లేదన్న సంగతి చైతలీకి తెలిసింది. దీంతో ఆమె మరుగుదొడ్డి కావాల్సిందేనని ధైర్యంగా అడిగింది. ''అత్తవారింటికి పెళ్లి కానుకలుగా తీసుకువెళ్లేవాటిలో టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, బంగారు ఆభరణాలు వంటివి ఉండాలని నేను అనుకోవడంలేదు. రెడీమేడ్ టాయిలెట్ మాత్రం ఉండాలని నేను అనుకుంటున్నాను'' అని ఆ పెళ్లి కూతురు చైతలీ చెప్పింది. దీంతో పుట్టింటివారు, మెట్టింటివారు కలిసి అన్ని వసతులు ఉన్న ఓ టాయిలెట్ (ప్రిఫ్యాబ్రికేటెడ్)ను కట్నకానుకలతో కలిపి ఇచ్చారు. పెళ్లి కానుకలలో ఉన్న ఈ టాయిలెట్‌ను చూసి ఆశ్చర్యపోవడం పెళ్లికి వచ్చిన వారి వంతైంది! ఆలోచనతోపాటు అడిగే సత్తా ఉంటే మరుగుదొడ్డి వచ్చేస్తుందని చైతలీ రుజువు చేసింది.