వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
లేపాక్షి : వినాయక చవితి నిమజ్జనంలో అపశ్రుతి నెలకొంది. మండల కేంద్రానికి చెందిన చాకలి క్రిష్టప్ప(40) అనే వ్యక్తి వినాయక విగ్రహాల ఊరేగింపులో ఉన్నఫళంగా మృతిచెందాడు. వినాయక విగ్రహాలను తిలకిస్తూనే కింద పడిపోయాడు.
వెంటనే లేపాక్షి ప్రభుత్వ ఆస్పత్రికి తీసికెళ్లగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కాగా మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ విషయంపై ఎస్ఐ శ్రీధర్‌ను వివరణ కోరగా వినాయక విగ్రహాలను తిలకించిన తర్వాత ఇంటికి వెళ్లి చనిపోయాన్నారు.