చందనాఖన్‌కు ‘సీసీఎల్ఏ’ అదనపు బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చందనాఖన్‌కు భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్(సీసీఎల్ఏ)గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీసీఎల్ఏగా ఉన్న ఐవైఆర్ కృష్ణారావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా నియమితులైన నేపథ్యంలో ఆ స్థానం ఖాళీ అయింది. కాగా, కృష్ణారావు సీఎస్‌గా నియమితులైన విషయాన్ని నోటిఫై చేస్తూ ప్రభుత్వం బుధవారం మరో జీవో జారీ చేసింది.