Changes in the environment
-
భారత ఉపఖండం వల్ల భూమిపై అనేక మార్పులు!
వాషింగ్టన్: భారత ఉపఖండం కారణంగా భూమిపై అనేక పెను మార్పులు చోటుచేసుకున్నాయన్న విషయం మీకు తెలుసా..? 5 కోట్ల ఏళ్ల క్రితం ఆసియా ఖండం, భారత ఉపఖండం విడివిడిగా ఉండేవని మీరు ఎప్పుడైనా చదివారా..? అప్పట్లో ఆసియా ఖండం, భారత ఉపఖండం మధ్యలో ఉండే టెథీస్ అనే పురాతన సముద్రం గురించి మీరు విన్నారా..? అయితే మీరు 5 కోట్ల ఏళ్ల క్రితం భూమిపై జరిగిన మార్పులు తెలుసుకోవాల్సిందే. సరిగ్గా 5 కోట్ల ఏళ్ల కిందట భారత ఉపఖండం ఆసియా ఖండాన్ని ఢీకొట్టి.. ప్రస్తుత ఆసియా ఖండంలా ఏర్పడింది. ఈ ఘటన ద్వారానే ఖండాల స్థితిగతులు, ప్రపంచ వాతావరణంతోపాటు ఇంకా మరెన్నో మార్పులు భూమిపై చోటుచేసుకున్న విషయాన్ని శాస్త్రవేత్తలు గతంలోనే గుర్తించారు. అయితే తాజాగా దీని కారణంగానే ప్రపంచ సముద్రాల్లో ఆక్సిజన్ స్థాయిలు పెరిగినట్లు కనుగొన్నారు. దీంతో భూమిపై జీవించడానికి అవసరమైన పరిస్థితులు ఏర్పడ్డాయని అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీకి చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థి ఎమ్మా కాస్ట్ తెలిపారు. దీనికోసం 7 కోట్ల ఏళ్ల క్రితం నాటి అతిసూక్ష్మ సముద్రపు గవ్వలను ఉపయోగించి సముద్రాల్లోని నైట్రోజన్‌ను రికార్డు చేశారు. అప్పటి నైట్రోజన్ పరిస్థితులను పోల్చి చూశారు. అలాగే పురాతన సముద్రాల్లో ఉండే 15ఎన్ –14ఎన్ నైట్రోజన్ పరిస్థితులను పునర్ నిర్మించారు. అనంతరం అప్పటి ఆక్సిజన్ స్థాయిల్లో మార్పులను గమనించారు. దీన్ని బట్టి అప్పట్లో 15ఎన్–14ఎన్ నైట్రోజన్ స్థాయిలు అత్యధికంగా ఉండేవని, దీంతో సముద్రాల్లో ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉండేవని గుర్తించారు. ఈ పరిశోధన వివరాలను బట్టి భవిష్యత్తులో సముద్రాల్లో ఆక్సిజన్ స్థాయిలు భూమిపై ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో ఊహించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. -
రైతు ఆదాయం 25% తగ్గొచ్చు
న్యూఢిల్లీ: వాతావరణంలో మార్పుల కారణంగా రైతుల ఆదాయం రాబోయే కొన్నేళ్లలో 20 నుంచి 25 శాతం వరకు తగ్గొచ్చని ఆర్థిక సర్వే పేర్కొంది. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, సాంకేతికతను ఉపయోగించడం, సమర్థవంతమైన నీటిపారుదల వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ ప్రతికూల పరిస్థితిని కొంతవరకు అధిగమించొచ్చంది. ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయాలంటే వ్యవసాయ, సర్కారీ విధానాల్లో సమూల మార్పులు అవసరమని సర్వే పేర్కొంది. వ్యవసాయదారుల రాబడిని పెంచడంతోపాటు, ఆ రంగంలో సంస్కరణలు తీసుకురావడం కోసం జీఎస్టీ మండలి తరహాలో ఓ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సర్వే సూచించింది. ఎరువులు, విద్యుత్తుపై రైతులకు ఇస్తున్న రాయితీని కూడా ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానంలో అందజేయాలని సూచించింది. ప్రస్తుతం దేశంలో 45 శాతం పంట భూమికే సాగునీటి వసతి ఉండగా, ఈ విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందంది. మధ్యప్రదేశ్, గుజరాత్‌లు మినహా మిగతా రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ రీతిలో సాగునీటి వసతి ఉన్న భూమి అంతంత మాత్రంగానే ఉందని సర్వే పేర్కొంది. సాగునీటి వసతిని మెరుగుపరిచేందుకు అధిక నిధులను కేటాయించాలని ఆర్థిక సర్వే సిఫారసు చేసింది. రైతులు నష్టపోకుండా ఉండేందుకు మరింత ప్రభావ వంతమైన, సమర్థవంతమైన పంట బీమా సదుపాయాలను తీసుకురావాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే గుర్తుచేసింది. రైతులు కేవలం వ్యవసాయంపైనే ఆధారపడకుండా, అనుబంధ రంగాలైన పాడి, మత్స్య పరిశ్రమలవైపు కూడా వెళ్లేలా వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరింత ఆకర్షవంతమైన విధానాలు రూపొందించాలంది. వ్యవసాయ రంగంలో ఇప్పటికే స్త్రీలు కీలక భూమిక పోషిస్తున్నప్పటికీ వారి పాత్ర మరింత పెరగాలనీ, మహిళా రైతులకు రుణాలు, భూమి, విత్తనాలు సులభంగా లభించేలా విధానాలు ఉండాలని ఆర్థిక సర్వే పేర్కొంది. -
అలర్జిక్ రైనైటిస్ తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 25 ఏళ్లు. చాలాకాలంగా చల్లగాలి, దుమ్ముధూళి సోకిన వెంటనే ముక్కుకారడం, వెంటనే తుమ్ములు ఎక్కువగా రావడం జరుగుతోంది. కళ్లలో దురద, నీరుకారడం వంటి సమస్యలతో బాధపడుతన్నాను. డాక్టర్‌ను అడిగితే అలర్జిక్ రైనైటిస్ అన్నారు. హోమియో చికిత్స ద్వారా దీనికి శాశ్వత చికిత్స వీలవుతుందా? - రవి, వరంగల్ అలర్జిక్ రైనైటిస్‌తో బాధపడే వారి పరిస్థితిని వాతావరణంలో మార్పులు, చల్లగాలి, దుమ్ముధూళి, ఇతర వాతావరణ కాలుష్యం వంటి సమస్యలు మరింత దుర్భరం చేస్తాయి. ఈ సమస్య ఉన్నవారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తరచూ దీని బారిన పడుతూనే ఉంటారు. అలర్జిక్ రైనైటిస్ అంటే... మనకు సరిపడని పదార్థాలు శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు ముక్కులోని శ్లేష్మం పొర వాపునకు గురవుతుంది. ఇలా వాపునకు గురికావడాన్ని అలర్జిక్ రైనైటిస్ అంటారు. కారణాలు: అలర్జీని కలిగించే పదార్థాలు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ సాధారణ స్థాయికి మించి ప్రతిక్రియ జరుపుతుంది. దాని వల్ల అలర్జిక్ రైనైటిస్ సమస్య వస్తుంది పూలమొక్కల నుంచి వెలువడే పుప్పొడి రేణువులు ఈ సమస్యకకు ప్రధానమైన కారణమని చెప్పవచ్చు దుమ్ము ధూళి జంతుకేశాలు, బూజు, కుటుంబ చరిత్ర వంటి అంశాలు ఈ సమస్యకు ఇతర కారణాలుగా చెప్పవచ్చు పొగతాగే అలవాటు, కొన్ని రసాయనాలు, వాతావరణంలోని కాలుష్యాలు, సుగంధద్రవ్యాల వంటివి అలర్జిక్ రైనైటిస్ సమస్యను ప్రేరేపిస్తాయి. లక్షణాలు: ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, విపరీతంగా తుమ్ములు, ముక్కులో అంగిలిలో దురద, కళ్ల నుంచి నీరుకారడం, కళ్లు దురదగా ఉండటం, ముఖంలో వాపు, దగ్గు, తరచూ తలనొప్పి, నీరసం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స: హోమియో చికిత్సలతో ఎలాంటి శ్వాసకోశవ్యాధులనైనా తగ్గించవచ్చు. జనెటిక్ కన్స్టిట్యూషన్ పద్ధతిలో అందించే ఈ చికిత్సలో రోగి శారీరక, మానసిక లక్షణాలను, శరీర తత్వాన్ని పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. రోగనిరోధక వ్యవస్థలలో గల అసమతౌల్యతను సరిచేయడం ద్వారా అలర్జిక్ రైనైటిస్ సమస్యను మళ్లీ తిరగబెట్టకుండా నయం చేయడం సాధ్యమవుతుంది. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ ఇన్నాళ్ల తర్వాతా తిరగబెడుతుందా? క్యాన్సర్ కౌన్సెలింగ్ నేను దాదాపు పన్నెండేళ్ల క్రితం కిడ్నీలో క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్నాను. మళ్లీ ఇటీవలే నడుము నొప్పి వస్తుంటే వైద్య పరీక్షలు చేయించుకున్నాను. రిపోర్ట్‌లను పరిశీలించాక డాక్టర్ బోన్ క్యాన్సర్ అని చెప్పారు. అది కిడ్నీ నుంచి వెన్నుకు పాకిందంటున్నారు. పన్నేండేళ్ల తర్వాత క్యాన్సర్ మళ్లీ తిరగబెడుతుందా? అది నయమయ్యే అవకాశం ఉందా? - సతీశ్‌కుమార్, నంద్యాల కిడ్నీ క్యాన్సర్ లేదా మరికొన్ని క్యాన్సర్లు చికిత్స తీసుకున్నప్పటికీ తిరగబెట్టే అవకాశం ఉంది. అది ఐదేళ్లు, పదేళ్లు, పదిహేను లేదా ఇరవై ఏళ్ల తర్వాతైనా కావచ్చు. అయితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు క్యాన్సర్‌పై అదుపు సాధించేందుకు అనేక చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ఇక మీ విషయానికి వస్తే మీరు వెన్నుకు రేడియేషన్ చికిత్స తీసుకోవచ్చు. ఎక్స్-నైఫ్ ఎస్ఆర్ఎస్తో క్యాన్సర్‌ను అదుపు చేయవచ్చు. ఈ చికిత్స ప్రక్రియ వల్ల ఎలాంటి దుష్ర్పభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) కూడా ఉండవు. నొప్పిని కూడా తక్షణం నివారించవచ్చు. మా అమ్మగారికి 68 ఏళ్లు. ఆమెకు గర్భాశయ ముఖద్వార (సర్విక్స్) క్యాన్సర్ వచ్చింది. మొదటి దశ (స్టేజ్-1)లో ఉందని డాక్టర్ తెలిపారు. మాకు తెలిసిన డాక్టర్లను సంప్రదిస్తే రెండు మార్గాలు తెలిశాయి. మొదటిది... శస్త్రచికిత్స. రెండోది రేడియోథెరపీ. మేం కాస్త అయోమయంలో ఉన్నాం. శస్త్రచికిత్స అన్నా, రేడియోథెరపీ అన్నా భయంగా కూడా ఉంది. దయచేసి మాకు తగిన మార్గాన్ని సూచించగలరు. - యోగేశ్వరరావు, కాకినాడ మొదటి దశ సర్విక్స్ క్యాన్సర్‌ను సర్జరీ లేదా రేడియోథెరపీ ద్వారా నయం చేయగలం. అయితే చాలా సందర్భాల్లో దీనికి మొదట శస్త్రచికిత్స చేసి, తర్వాత రేడియోథెరపీ ఇస్తారు. మీరు రేడియోథెరపీయే కోరుకుంటే అది కూడా సాధ్యమే. చాలా సందర్భాలలో సర్జరీ చేయాల్సిన అవసరం రాకపోవచ్చు. ఇటీవల రేడియేషన్ టెక్నాలజీలలో వచ్చిన పురోగతి వల్ల రేడియోథెరపీ వల్ల ఇతర దుష్ర్పభావాలు కూడా దాదాపు ఉండవు. మీరు నిర్భయంగా రేడియోథెరపీ చేయించుకోండి. -
మంచం పట్టిస్తున్న మలేరియా
పాల్వంచ : మలేరియా జ్వరాలు విజృభిస్తున్నాయి. ఇటీవల వర్షాలు పడి వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు వైరల్‌జ్వరాలతో విలవిలాడుతున్నారు. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రోజురోజుకు మలేరియా జ్వరపీడిత రోగులు పెరుగుతుండడం గమనార్హం. ఏరియా ఆస్పత్రి పరిధిలోని ములకలపల్లి మండలం నుంచి జ్వరపీడితులు ఎక్కువగా వస్తున్నారు. ఒక్కరోజే ములకలపల్లి మండలం వేమకుంట నుంచి వాడే మహేష్, గుగులోతు మహేష్, పుసుగూడెంకు చెందిన సడియం రమేష్, కమల, సీతారంపురానికి చెందిన కుర్సం రాజ మ్మ, కేసరి రామలక్ష్మి, రాంమూర్తి, సుబ్బనపల్లికి చెందిన సోడు భద్రమ్మ, చింతపాడుకు చెందిన మిడియం జోగమ్మ, నగేష్, పాల్వంచ మండలం కిన్నెరసానికి చెందిన మేకల నరేష్ తదిరులకు మలేరియా ఉన్నట్లు గుర్తించి చికిత్స నిర్వహిస్తున్నారు. బెడ్లు ఉన్నా అందించని వైద్యులు జ్వరాలబారిన పడిన వారికి ప్రత్యేకంగా అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌ఓ పుల్లయ్య పాల్వంచ ఏరియా ఆస్పత్రికి 30 పడకలను అందించారు. అయితే వీటిని ఇక్కడి వైద్య సిబ్బంది రోగులకు ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. అంతేగాక ఏరియా ఆస్పత్రికి సుమారు రూ.6 లక్షలతో ఎక్స్‌రే మిషన్ వచ్చి రెండు నెలలు గడుస్తున్నా వాటిని అందుబాటులోకి తెచ్చి వినియోగించడంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. -
భానుడు భగభగ
మండుతున్న సూరీడు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు రహదారులు నిర్మానుష్యం పెరుగుతున్న వడదెబ్బ మృతులు పోచమ్మమైదాన్ : భానుడు భగ్గు మంటున్నాడు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు గరిష్టస్థారుుకి చేరుకుంటున్నారుు. వాతావరణంలో పెనుమార్పులు సంభవించడంతో ఏప్రిల్ చివరి వారంలో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు మొదటి వారంలోనే నమోదవుతున్నాయి. ప్రజలు ఉదయం 10 గంటల తరువాత బయటకురావడానికి జంకుతున్నారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత బయటకు వస్తున్నారు. సూర్య ప్రతాపానికి మధ్యాహ్నం రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నారుు. ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే మే నెలలో ఎలా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సూర్య @40 డిగ్రీలు వారం రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నారుు. శుక్రవారం 39.5 డిగ్రీలు నమోదు కాగా, శనివారం 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వేడి నుంచి కాపాడుకోవడానికి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక ప్రజలు ముందస్తుగా శీతల పానీయూల వైపు పరుగులు తీస్తున్నా రు. ఇళ్లలో కూలర్లు, ఏసీ లు అమర్చుకుంటున్నా రు. బయటకు వెళ్లేటప్పు డు గొడుగు, టోపీలు, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని వెళ్తున్నారు. ఇప్పటికి ఐదుగురి మృతి ఈ వేసవి సీజన్లో ఇప్పటివరకు వడదెబ్బతో ఐదుగురు మృతి చెందారు. ఈ నెల 2న నెక్కొండకు చెందిన పసునూటి రాములు(65), గుడూరుకు చెందిన గుగులోతు దాని (70), మార్చి 28న కురవి మండలం మోద్గులగూడేనికి చెందిన చింతిరాల రాములు (58) మృతిచెందారు. తాజాగా ఆదివారం నర్సింహులపేటకు చెందిన బిక్షం(60), కొడకండ్ల మండలం రత్యాతండాకు చెందిన సునీత మృతిచెందారు. -
ఖరీఫ్ రైతుకు దోమపోటు
పెరిగిన వ్యయం..తగ్గనున్న దిగుబడి గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో తెగులు తడిసి మోపెడైన ఖర్చులు నష్టాలు తప్పవంటున్న రైతన్నలు గుడివాడ : ఈ ఏడాది ఖరీఫ్‌లో దోమపోటు రైతుల్ని నిలువునా ముంచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దీని తీవ్రత ఉందని రైతులు చెబుతున్నారు. నివారణ కోసం ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోయిందని ఆవేదన చెందుతున్నారు. దీని ప్రభావం వల్ల జిల్లావ్యాప్తంగా వరి దిగుబడిలో 10 నుంచి 20 శాతం తగ్గుదల ఉంటుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి సాగుచేస్తే చివరికి దోమపోటు దెబ్బతీసిందని రైతులు వాపోతున్నారు. నాట్లలో జాప్యం.. వాతావరణంలో మార్పుల వల్లే... ఈ ఏడాది ఖరీఫ్ సాగు కోసం కాలువలకు సకాలంలో నీరు విడుదల చేయలేదు. వర్షాలు కూడా పడకపోవడంతో నాట్లు జాప్యమయ్యాయి. ఆలస్యంగా విడుదల చేసిన కొద్దిపాటి సాగునీటిని పొలంలోకి ఎక్కించడానికి ఆయిలింజన్ల కోసం రైతులు వేలాది రూపాయలు ఖర్చు చేశారు. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో కూడా నాట్లు వేయాల్సి వచ్చిందని రైతులు చెబుతున్నారు. దీనికితోడు అక్టోబర్‌లో పడిన వర్షాలు, వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల వరిలో దోమపోటు విపరీతంగా వచ్చి పంటను తీవ్రంగా నష్టపరిచిందని రైతులు వివరిస్తున్నారు. చేతికందిన పంట నోటికాడికి రాకుండా పోతుందనే ఆందోళనతో దోమపోటు నివారణకు ఎకరానికి సగటున రూ.3 వేలతో రసాయనాలు పిచికారీ చేశామని చెబుతున్నారు. దీంతో దోమపోటు కొంత అదుపులోకి వచ్చినా అన్నిచోట్లా దాదాపు 20 శాతం పంటను నాశనం చేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీపీటీలు, 1061, 1010 రకాలు వేసిన రైతులు దోమపోటు వల్ల తీవ్రంగా నష్టపోయారు. 1010 రకం వేసిన రైతులకు దోమపోటుకు పచ్చపురుగు తోడై పంటను నాశనం చేస్తోందని చెబుతున్నారు. మొదటి నుంచి ఎలుకల నివారణకు ఎకరానికి దాదాపు రూ.2 వేలకు పైగా ఖర్చు చేశామని పేర్కొంటున్నారు. ఇప్పటికే ఎకరానికి ఎరువులు, పురుగు మందుల కోసం సాగు ఖర్చు ఎకరాకు దాదాపు రూ.20 వేలు దాటిందని రైతులు చెబుతున్నారు. ఇంత ఖర్చుచేసినా తెగుళ్ల కారణంగా దిగుబడి తగ్గితే లాభాల మాట దేవుడెరుగు కనీసం ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని అంటున్నారు. తగ్గనున్న దిగుబడి... ఈ ఏడాది జిల్లాలో 5 లక్షల 77 వేల 630 ఎకరాల్లో ఖరీఫ్ వరిసాగు జరిగిందని వ్యవసాయ అధికారులు వివరిస్తున్నారు. దోమపోటు కారణంగా ఎకరానికి మూడు నుంచి ఐదు బస్తాల దిగుబడి తగ్గుతుందని వారు పేర్కొంటున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో ఎకరానికి 25 బస్తాల నుంచి 30 బస్తాల వరకు దిగుబడి రావచ్చని ప్రయోగాత్మక పంటల అంచనాలో నిర్ణయించినట్లు, దోమపోటు ప్రభావంతో ఇది మూడు బస్తాల నుంచి ఐదు బస్తాల మేర తగ్గనున్నట్లు చెబుతున్నారు. దోమ కారణంగా రసం పీల్చినందున కనీసం గడ్డి కూడా పనికి రాకుండా పోతుందని పేర్కొంటున్నారు.