భానుడు భగభగ
మండుతున్న సూరీడు
గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు
రహదారులు నిర్మానుష్యం పెరుగుతున్న వడదెబ్బ మృతులు
పోచమ్మమైదాన్ : భానుడు భగ్గు మంటున్నాడు. ఏప్రిల్ మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు గరిష్టస్థారుుకి చేరుకుంటున్నారుు. వాతావరణంలో పెనుమార్పులు సంభవించడంతో ఏప్రిల్ చివరి వారంలో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు మొదటి వారంలోనే నమోదవుతున్నాయి. ప్రజలు ఉదయం 10 గంటల తరువాత బయటకురావడానికి జంకుతున్నారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత బయటకు వస్తున్నారు. సూర్య ప్రతాపానికి మధ్యాహ్నం రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నారుు. ఇప్పుడే ఎండలు ఇలా ఉంటే మే నెలలో ఎలా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
సూర్య @40 డిగ్రీలు
వారం రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నారుు. శుక్రవారం 39.5 డిగ్రీలు నమోదు కాగా, శనివారం 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వేడి నుంచి కాపాడుకోవడానికి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక ప్రజలు ముందస్తుగా శీతల పానీయూల వైపు పరుగులు తీస్తున్నా రు. ఇళ్లలో కూలర్లు, ఏసీ లు అమర్చుకుంటున్నా రు. బయటకు వెళ్లేటప్పు డు గొడుగు, టోపీలు, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని వెళ్తున్నారు.
ఇప్పటికి ఐదుగురి మృతి
ఈ వేసవి సీజన్‌లో ఇప్పటివరకు వడదెబ్బతో ఐదుగురు మృతి చెందారు. ఈ నెల 2న నెక్కొండకు చెందిన పసునూటి రాములు(65), గుడూరుకు చెందిన గుగులోతు దాని (70), మార్చి 28న కురవి మండలం మోద్గులగూడేనికి చెందిన చింతిరాల రాములు (58) మృతిచెందారు. తాజాగా ఆదివారం నర్సింహులపేటకు చెందిన బిక్షం(60), కొడకండ్ల మండలం రత్యాతండాకు చెందిన సునీత మృతిచెందారు.