Charges Stroke
-
కొత్త ఏడాదిలో మెట్రో చార్జీల మోత
-
Telangana: భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు
7.5- 8 శాతం వరకు పెంచే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీ కలిపి 6 శాతం వసూలు రాష్ట్రంలో 2013 నాటి నుంచీ ఇవే ఫీజులు.. ప్రస్తుతం రాష్ట్రంలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలో 6 శాతాన్ని చార్జీగా వసూలు చేస్తున్నారు. ఇందులో 5.5 శాతం స్టాంపు డ్యూటీ, 0.5 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు కింద తీసుకుంటున్నారు. అదనంగా ప్రతి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌కు రూ.100 చొప్పున యూజర్ చార్జీ, 0.01 శాతం మ్యుటేషన్ ఫీజు వసూలు చేస్తున్నారు. తాజా నిర్ణయం అమల్లోకి వస్తే.. 6.5 శాతం నుంచి 7 శాతం వరకు స్టాంపు డ్యూటీ, ఒక శాతం రిజిస్ట్రేషన్ ఫీజు కింద తీసుకుంటారు. యూజర్ చార్జీ, మ్యుటేషన్ ఫీజు యథాతథంగా ఉంటాయని సమాచారం. రూ.250 కోట్లు రిజిస్ట్రేషన్ విలువలు, చార్జీలు రెండూ పెంచితే.. ప్రతి నెలా సుమారు రూ.250 కోట్ల మేర అదనపు ఆదాయం సమకూరుతుందని అధికారుల అంచనా. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ ఫీజులను పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలను పెంచాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో రిజిస్ట్రేషన్ల ఫీజును కూడా సవరించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ఫీజు కింద భూమి లేదా ఆస్తి విలువలో 6 శాతం వసూలు చేస్తుండగా.. దీనిని 7.5 శాతం నుంచి 8 శాతం వరకు పెంచే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 7-8 శాతం రిజిస్ట్రేషన్ ఫీజును వసూలు చేస్తుండటం, రాష్ట్రంలో దాదాపు ఎనిమిదేళ్లుగా ఒక్కసారి కూడా ఈ ఫీజులు పెంచకపోవడం నేపథ్యంలో.. ఈసారి ఫీజుల పెంపుదల ప్రతిపాదనను సీరియస్‌గానే పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే భూముల విలువలను పెంచుతున్న సమయంలోనే రిజిస్ట్రేషన్ ఫీజును కూడా పెంచితే.. ప్రజలపై భారం పడినట్టు అవుతుందనే తర్జనభర్జన కూడా జరుగుతున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి మంగళవారం జరుగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెప్తున్నాయి. ప్రతి నెలా అదనంగా రూ.250 కోట్లు: భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలు, చార్జీల పెంపుపై రిజిస్ట్రేషన్ల శాఖ, ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు పూర్తి చేశాయి. రాష్ట్రంలో ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల ఆదాయం నెలకు రూ.500 కోట్లకు అటూఇటుగా ఉంది. తాజాగా విలువలు, చార్జీల పెంపు అమల్లోకి వస్తే.. ఆదాయం 50 శాతం మేర పెరుగుతుందని అధికారులు లెక్కలు వేశారు. అంటే నెలనెలా అదనంగా రూ.250 కోట్లు వస్తాయని.. మొత్తంగా నెలకు రూ.750 కోట్ల చొప్పున ఏడాదికి రూ.9 వేల కోట్లు సమకూరుతాయని అంచనా వేశారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.12,500 కోట్ల వరకు సమకూర్చుకోవాలని ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించడం గమనార్హం. ఆ లెక్కన మరో రూ.3,500 కోట్లు ఎలా సమకూర్చుకుంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది. చార్జీలతో భారమనే అభిప్రాయం భూములు, ఆస్తుల విలువలు పెంచితే.. వాటి ఆధారంగా రుణాలు కూడా కాస్త ఎక్కువగా, సులువుగా లభించే వెసులుబాటు ఉంటుందన్న అభిప్రాయముంది. అందువల్ల విలువల సవరణ వల్ల కట్టే చార్జీ పెరిగినా.. క్రయవిక్రయదారులు పెద్దగా ఇబ్బందిపడే అవకాశం ఉండదని అధికార వర్గాలు అంటున్నాయి. అదే ఫీజు కూడా పెంచితే భారం పెరిగిందనే భావన ఏర్పడుతుందని పేర్కొంటున్నాయి. ఈ రెండు రకాల వాదనలపై కేబినెట్ భేటీలో కూలంకషంగా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. గతంలో రెండేళ్లకోసారి.. పట్టణ ప్రాంతాల్లో ఆగస్టు 1 నుంచి, గ్రామీణ ప్రాంతాల్లో ఏప్రిల్ 1 నుంచి వర్తించేలా భూములు, ఆస్తుల విలువలను సవరించేవారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు ఈ సవరణ జరగలేదు. ప్రస్తుతం ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి భూముల విలువలు పెంచాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంటే.. ఈ కేబినెట్ సమావేశంలోనే దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెప్తున్నాయి. రెండూ పెంచితే ఎలా? భూములు, ఆస్తుల విలువల పెంపుతో సరిపెడితే రిజిస్ట్రేషన్ శాఖకు ఓ మోస్తరుగా మాత్రమే ఆదాయం పెరుగుతుంది. అదే చార్జీలు కూడా పెంచితే గణనీయంగా ఆదాయం సమకూరుతుంది. కానీ రెండూ పెంచితే ప్రజలపై భారం ఒక్కసారిగా పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు రూ.లక్ష ధరతో ఒక ఎకరం వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ జరిగితే.. ప్రస్తుత విధానం ప్రకారం రూ.6 వేలు (6 శాతం) చార్జీల కింద కడితే సరిపోతుంది. ఇదే ఎకరం భూమి రిజిస్ట్రేషన్ విలువను రూ.4 లక్షలకు పెంచితే.. ప్రస్తుత చార్జీల ప్రకారమే రూ.24 వేలు కట్టాల్సి వస్తుంది. ఇదే సమయంలో చార్జీలను 8 శాతానికి పెంచితే.. రూ.32 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే భారం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రెండింటినీ పెంచడంపై ప్రభుత్వ వర్గాలు తర్జనభర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగాలు, కోవిడ్‌పైనా.. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రిజిస్ట్రేషన్ చార్జీలు, భూముల విలువ పెంపుతోపాటు 50 వేల ఉద్యోగాల భర్తీ, రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, వానాకాలం సీజన్ మొదలైన నేపథ్యంలో వ్యవసాయ స్థితిగతులు, పాఠశాలలు, పుస్తకాల పంపిణీ, ఇతర విద్యారంగ సమస్యలపై చర్చించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. -
జియో షాక్..కాల్ చేస్తే.. బాదుడే!
న్యూఢిల్లీ: ఇప్పటిదాకా ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత కాల్స్ సదుపాయం అందిస్తున్న టెలికం సంస్థ రిలయన్స్ జియో (జియో) తాజాగా చార్జీల వడ్డనకు తెరతీసింది. ఇక నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే వాయిస్ కాల్స్‌పై నిమిషానికి 6 పైసల చొప్పున చార్జీలు విధించనున్నట్లు బుధవారం ప్రకటించి కస్టమర్లకు షాకిచ్చింది. కాల్ టెర్మినేషన్ చార్జీలకు సంబంధించి అనిశ్చితే చార్జీల విధింపునకు కారణమని ఒక ప్రకటనలో వివరించింది. బుధవారం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీనివల్ల ఇతర నెట్‌వర్క్‌లకు వాయిస్ కాల్స్ చేయదల్చుకునే వారు ఐయూసీ టాప్–అప్ వోచర్స్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. టాప్ అప్ వోచర్స్ విలువకు సరిసమానమైన డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్లు, దీంతో నికరంగా యూజరుపై చార్జీల భారం ఉండబోదని జియో తెలిపింది. కాల్ టెర్మినేషన్ చార్జీలు అమల్లో ఉన్నంత వరకూ 6 పైసల చార్జీల విధింపు కొనసాగనున్నట్లు పేర్కొంది. వాట్సాప్, ఫేస్‌టైమ్‌కు మినహాయింపు.. జియో యూజర్లు ఇతర జియో ఫోన్లకు, ల్యాండ్లైన్లకు చేసే కాల్స్‌కు, వాట్సాప్, ఫేస్‌టైమ్ తదితర యాప్స్ ద్వారా చేసే కాల్స్‌కు దీన్నుంచి మినహాయింపు ఉంటుంది. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి వచ్చే ఇన్కమింగ్ కాల్స్ ఉచితంగానే కొనసాగుతాయని జియో పేర్కొంది. ప్రస్తుతం జియో యూజర్లు కేవలం డేటాకు మాత్రమే చార్జీలు చెల్లిస్తున్నారు. దీనితో దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా వాయిస్ కాల్స్ చేసుకునే సదుపాయాన్ని పొందుతున్నారు. తాజా పరిణామంతో జియో యూజర్లు ఇతర నెట్‌వర్క్‌లకు వాయిస్ కాల్స్ చేయాలంటే రెగ్యులర్ రీచార్జితో పాటు తప్పనిసరిగా టాప్–అప్ వోచర్స్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిబంధనల్లో అనిశ్చితి వల్లే.. సాధారణంగా ఇతర నెట్‌వర్క్‌ల నుంచి వచ్చే కాల్స్‌ను తమ కస్టమర్లకు అందించినందుకు గాను టెలికం సంస్థలు తమ పోటీ సంస్థల నుంచి నిర్దిష్ట చార్జీలు (ఐయూసీ) వసూలు చేస్తుంటాయి. గతంలో నిమిషానికి 14 పైసలుగా ఉన్న ఈ చార్జీలను జియో వచ్చిన తర్వాత టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ 2017లో 6 పైసలకు తగ్గించేసింది. ఇతర కంపెనీలు గగ్గోలు పెట్టినప్పటికీ 2020 జనవరి కల్లా ఐయూసీని పూర్తిగా ఎత్తివేయనున్నట్లు అప్పట్లో పేర్కొంది. అయితే, తాజాగా ఇందుకు సంబంధించిన గడువును పొడిగించాల్సిన అవసరంపై ట్రాయ్ చర్చాపత్రాన్ని విడుదల చేసింది. ఇదే ఐయూసీపై అనిశ్చితికి తెరతీసిందని జియో ఆరోపించింది. తమ నెట్‌వర్క్‌పై వాయిస్ కాల్స్‌ను ఉచితంగానే అందిస్తున్నప్పటికీ .. ఐయూసీ చార్జీల కింద పోటీ సంస్థలు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలకు గడిచిన మూడేళ్లలో ఏకంగా రూ. 13,500 కోట్ల మేర చెల్లింపులు జరపాల్సి వచ్చిందని తెలిపింది. మిస్డ్ కాల్స్ బాగోతం.. పోటీ సంస్థలు 4జీ కస్టమర్లకు వాయిస్ టారిఫ్‌లను తగ్గించినప్పటికీ, 35–40 కోట్ల మంది 2జీ కస్టమర్లపై నిమిషానికి రూ. 1.50 చొప్పున చార్జీలు విధిస్తున్నాయని జియో ఆరోపించింది. 1 జీబీ డేటాకు కనీసం రూ. 500 వసూలు చేస్తున్నాయని పేర్కొంది. దీని కారణంగా ఎయిర్టెల్, వొడాఫోన్–ఐడియా యూజర్లు .. జియో కస్టమర్లకు మిస్డ్ కాల్స్ ఇవ్వడం మొదలుపెట్టారని జియో పేర్కొంది. తద్వారా జియో యూజర్లు సదరు మిస్డ్ కాల్స్ చేసిన వారికి తమ నెట్వర్క్ నుంచి తిరిగి కాల్స్ చేస్తున్నారని, తమపై ఐయూసీ భారం గణనీయంగా పడుతోందని పరోక్షంగా తెలిపింది. తమ నెట్‌వర్క్‌కు నిత్యం 25–30 కోట్ల మిస్డ్ కాల్స్ వస్తుంటాయని, 65–70 కోట్ల నిమిషాల అవుట్గోయింగ్ కాల్స్ నమోదవుతుంటాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్రాయ్ తాజా చర్యల కారణంగా వాటిల్లిన నష్టాలను భర్తీ చేసుకునేందుకే నిమిషానికి 6 పైసల చార్జీని ప్రవేశపెట్టాల్సి వచ్చిందని వివరించింది. ‘ట్రాయ్ చర్చాపత్రంతో నియంత్రణ సంస్థ నిబంధనల విషయంలో అనిశ్చితి నెలకొంది. దీంతో తప్పనిసరై ఆఫ్–నెట్ మొబైల్ వాయిస్ కాల్స్‌పై నష్టాలను భర్తీ చేసుకునేందుకు నిమిషానికి 6 పైసల చార్జీలను విధించాల్సి వస్తోంది. ఐయూసీ చార్జీలు అమల్లో ఉన్నంత కాలం ఇది కొనసాగించాల్సి రానుంది. ఐయూసీ టాప్ అప్ వోచర్‌కు సరిసమానంగా అదనపు డేటా అందించడం జరుగుతుంది. తద్వారా నికరంగా కస్టమర్లపై టారిఫ్ పెంపు భారమేమీ ఉండబోదు‘ అని జియో తెలిపింది. మరోవైపు, ఐయూసీ పొడిగింపుపై కేవలం చర్చాపత్రాన్ని ప్రవేశపెట్టినంత మాత్రాన ట్రాయ్‌పై జియో విమర్శలకు దిగడం సరికాదని సీనియర్ ట్రాయ్ అధికారి వ్యాఖ్యానించారు. కొత్త ఐయూసీ ప్లాన్లు ఇవే.. ఇతర నెట్‌వర్క్‌లకు వాయిస్ కాల్స్ కోసం జియో కొత్తగా నాలుగు ఐయూసీ ప్లాన్స్‌ను(టాప్ అప్స్) ప్రవేశపెట్టింది. ప్లాన్స్‌కి సరిపడా డేటా ఉచితంగా ఇస్తున్నందున ఈ ఏడాది డిసెంబర్ 31 దాకా యూజర్లపై నికరంగా అదనపు భారం ఉండబోదని జియో తెలిపింది. ఇక పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు కూడా అఫ్–నెట్వర్క్ కాల్స్‌పై నిమిషానికి 6 పైసల జార్జీలు వర్తిస్తాయి. తదనుగుణంగా ఉచిత డేటా లభిస్తుంది. కొత్త ఐయూసీ ప్లాన్లు.. ► రూ. 10 ప్లాన్: 124 నిమిషాలు. 1 జీబీ డేటా. ► రూ. 20 ప్లాన్: 249 నిమిషాలు. 2 జీబీ డేటా. ► రూ. 50 ప్లాన్: 656 నిమిషాలు. 5 జీబీ డేటా. ► రూ. 100 ప్లాన్: 1,362 నిమిషాలు. 10 జీబీ డేటా. ఐయూసీని మరింత తగ్గించే ఎత్తుగడలు: ఎయిర్టెల్ ఇతర నెట్‌వర్క్‌లకు వాయిస్ కాల్స్‌పై చార్జీలు వసూలు చేయాలన్న జియో నిర్ణయంపై పోటీ సంస్థ భారతి ఎయిర్టెల్ స్పందించింది. ఐయూసీని బలవంతంగా మరింత తగ్గించేందుకు ఈ ఎత్తుగడలు వేస్తోందంటూ ఆరోపించింది. జియో పేరు ప్రత్యేకంగా ప్రస్తావించకుండా ఎయిర్టెల్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ట్రాయ్ వల్లే చార్జీలు విధించాల్సి వస్తోందనే భావన కలిగించేలా తమ పోటీ సంస్థ వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించింది. నిజానికి ఐయూసీ పొడిగింపు అంశం కొత్తదేమీ కాదని, గతంలో చార్జీలను తగ్గించినప్పుడే ఈ అంశాన్ని ట్రాయ్ ప్రస్తావించిందని ఎయిర్టెల్ స్పష్టం చేసింది. దేశీయంగా 2జీ యూజర్లు భారీగా ఉన్నారని, నిర్వహణ ఖర్చులతో పోలిస్తే ప్రస్తుతం 6 పైసలుగా ఉన్న టెర్మినేషన్ చార్జీలు చాలా తక్కువని పేర్కొంది. మరోవైపు, ఐయూసీపై జియోది అనవసరమైన తొందరపాటు చర్యగా వొడాఫోన్ ఐడియా అభివర్ణించింది. టెలికం రంగంలో సంక్షోభాన్ని పరిష్కరించే సత్వర చర్యల నుంచి దృష్టి మరల్చే ప్రయత్నంగా వ్యాఖ్యానించింది. -
ప్రయాణీకులపై భారం మోపేందుకు సిద్ధమైనా ఏపీఎస్ ఆర్టీసీ
-
చార్జీల మోత వెనుక.. ‘ప్రైవేటు’ హస్తం
సాక్షి, హైదరాబాద్ : అసలే సంక్రాంతి సీజన్ ..హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు వెళ్లేవారికి ఇది ఎంతో ఒత్తిడికి గురిచేసే కాలం. ఈ నేపథ్యంలోనే ప్రైవేటు రవాణా సంస్థలు ఇష్టారాజ్యం రేట్లతో ప్రయాణికుల జేబులు కొల్లగొడుతుండటం రివాజుగా మారిపోయింది. ఆర్టీసీ కూడా రద్దీ వేళల దృష్ట్యా కొంచెం ఎక్కువే వసూలు చేస్తుంటుంది. దీంతో పాటు విమాన చార్జీలు కూడా వేలకు వేలు పెరిగాయంటూ కొన్ని మాధ్యమాలు, ఓ చానల్ చేసిన ప్రచారం అందర్నీ బెంబేలెత్తించింది. అదీ బెంగళూరుకు రూ. 80 వేలు, విజయవాడకు రూ.50వేలు, రాజమండ్రికి రూ.70వేలు, విశాఖకు రూ.75 వేలు అంటూ బుధవారం మీడియాలో జరిగిన ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. తాజాగా శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో ఓ ప్రముఖ దినపత్రిక (సాక్షి కాదు) దాదాపుగా ఇలాంటి వార్తనే ప్రచురించడంతో గందరగోళానికి కారణమైంది. తెలంగాణలో ఆర్టీసీ 50 శాతానికి మించి అధిక చార్జీలు వసూలు చేయడం లేదు. పండుగ వేళల్లో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి తిరు గు ప్రయాణంలో ఖాళీగా రావాల్సి ఉన్నందుకే తాము ఆ మొత్తం వసూలు చేస్తున్నామని ఆర్టీసీ చెప్తోంది. వెబ్‌సైట్‌ను చూపి.. ఈ ప్రచారానికి ఊతమిచ్చింది విమాన టికెట్లు బుక్‌చేసే టికెట్ బుకింగ్ అగ్రిగేటర్ వెబ్సైట్ కావడం విశేషం. అందులోని లొసుగుల ఆధారంగా విమానయాన చార్జీలపై దుష్ప్రచారానికి కొన్ని వర్గాలు తెగబడ్డాయని విమానయాన సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి. వీరి వెనుక ప్రైవేటు రవాణా సంస్థలు ఉన్నాయని వారి వాదన. వాస్తవానికి విమానాల్లో మిగిలి పోయిన సీట్ల మొత్తం చార్జీని ఆ వెబ్సైట్ చూపిస్తుంది. అయితే చూసేందుకు అది ఒకే సీటు చార్జీలా కనిపిస్తుంది. ఇలా టికెట్ల మోత మోగిందని ప్రచారం రాజుకుంది. లీగల్ చర్యలకు సిద్ధమవుతోన్న సంస్థలు.. ఈ ప్రచారం వల్ల చాలామంది విమాన ప్రయాణికులు ప్రైవేటు బస్సులవైపు మళ్లారు. దీనిపై సదరు టికెట్ అగ్రిగేటింగ్ సంస్థకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తమ సంస్థను ఆధారంగా చూపి తప్పుడు వార్తలు ప్రసారం చేసినందుకు త్వరలోనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెబ్సైట్ ప్రతినిధులు స్పష్టంచేశారు. తమ విమాన సంస్థలపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఆ సంస్థలు కూడా ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. వారు త్వరలోనే కేంద్ర విమానయానశాఖకు ఫిర్యాదు చేయబోతున్నారు. వాస్తవ చార్జీలు ఇవీ.. వాస్తవానికి మనదేశంలోని ఏ ప్రాంతానికైనా టికెట్ ధర రూ.5వేలకు మించదు. ఆకస్మికంగానో, లేదా అదనపు సౌకర్యాలున్న వాటిలో ప్రయాణించినా మరో రూ. 3– 4 వేలే అదనం కాగా... గరిష్టంగా 9 వేలు దాటదు. ఆఫర్లు ద్వారా..లేదా నెల ముందే బుక్ చేసుకుంటే ఈ ప్రయాణం రూ.రెండువేలలోపే ఉండే అవకాశాలూ ఉన్నాయి. ఇందులోనే జీఎస్టీ, సర్వీసుచార్జీలు, బీమా అన్నీ కలిపి ఉంటాయి.తాజాగా ఉన్న విమానయాన చార్జీలు గమనిస్తే ఈ విషయం అర్థం అవుతుంది. -
చార్జీల పెంపుతోనే మనుగడ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక చేయూత ఇవ్వకపోవడంతో పాటు కనీసం బడ్జెట్లో కేటాయించిన నిధులు కూడా పూర్తిస్థాయిలో మంజూరు చేయకపోవడంతో కార్మికుల జీతాలకు సైతం నానా తిప్పలు పడి సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆర్టీసీ ప్రక్షాళనకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ తాజా సమావేశంలో చార్జీల పెంపు ప్రస్తావనకు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ప్రతిపాదన గతేడాదే వచ్చినా ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. సంస్థ ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతున్న తరుణంలో ఇప్పుడు మరోసారి టికెట్ల పెంపు చర్చకు రావడం గమనార్హం. పెరుగుతున్న డీజిల్ ధరలు, నిర్వహణ వ్యయం, కార్మికుల వేతనాల పెంపు, వడ్డీల చెల్లింపు వంటి అంశాలు ఆర్టీసీకి తీవ్ర ఆర్థిక భారంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో చార్జీల పెంపు అనివార్యంగా మారిందని పలువురు నిపుణులు అభిప్రాయపడినట్లు తెలిసింది. పలు కార్మిక సంఘాలు కూడా పెంపునకు సుముఖంగానే ఉన్నాయి. అయితే ఆ పెంపుదల హేతుబద్ధంగా ఉండాలని స్పష్టం చేస్తున్నాయి. ఇందుకోసం కమిటీ వేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశాయి. అదే సమయంలో ఆర్టీసీని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు బడ్జెట్లో కనీసం ఒక శాతం నిధులను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయినా ఈసారి పెంపు లోక్‌సభ ఎన్నికల దాకా ఉండకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఖాళీ స్థలాలన్నీ తాకట్టు...! ప్రభుత్వపరంగా ఆర్టీసీకి ఇంతవరకూ ఎలాంటి ఆర్థికసాయం అందలేదు. ఇప్పుడున్న రూ. 3 వేల కోట్ల అప్పులపై ఏటా రూ. 250 కోట్ల వరకు వడ్డీల కింద చెల్లిస్తున్నారు. మరోవైపు ఇటీవల 16 శాతం ఐఆర్ పెరిగింది. దీంతో కార్మికుల వేతనాలు సర్దుబాటు పెద్ద సమస్యగా మారింది. విధిలేని పరిస్థితుల్లో క్రెడిట్ అండ్ కార్పొరేట్ సొసైటీకి చెల్లించాల్సిన వివిధ రకాల రికవరీ నిధులను సంస్థ మళ్లిస్తూ వస్తోంది. ఇలా పేరుకుపోయిన బకాయిలు చెల్లించేందుకు ఇటీవల జూబ్లీ బస్టాండు సమీపంలోని స్థలాన్ని ఆర్టీసీ తాకట్టు పెట్టినట్లు సమాచారం. దీనికి ప్రభుత్వం పూచీకత్తుగా నిలవడంతో ఆర్టీసీ రూ. 500 కోట్లు అప్పులు తెచ్చుకోగలిగింది. ఇందులో నుంచి రూ.80 కోట్లు (మొత్తం రూ. 500 కోట్లు) తిరిగి సీసీఎస్‌కు చెల్లించింది. సంస్థ తన పరిధిలో ఉన్న ఖాళీ స్థలాలను చాలావరకు బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టింది. అయితే ఇలా తాకట్టు పెట్టుకుంటూపోతే చివరికి ఏమీ మిగలదని, ఆర్టీసీ భవితవ్యం గందరగోళంలో పడుతుందని సిబ్బంది, కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇతర సంస్థలంటేనే మక్కువ... రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆర్టీసీపై సవతి తల్లిప్రేమ ప్రదర్శిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుశాఖకు ప్రభుత్వం దాదాపు రూ. 800 కోట్లు మంజూరు చేసి దాదాపు 15 వేల వాహనాల కొనుగోలుకు సహకరించింది. విమానయానాన్ని ప్రోత్సహించేందుకు విమాన ఇంధనంపై 16 శాతంగా ఉన్న వ్యాట్‌ను 1 శాతానికి కుదించిన సర్కారు ఆర్టీసీకి సరఫరా చేసే డీజిల్‌పై మాత్రం దాదాపు 27 శాతం వ్యాట్ విధిస్తోంది. మరోవైపు హైదరాబాద్‌లో మెట్రో రైలు సర్వీసుల ప్రారంభంతో ఆర్టీసీ రోజుకు లక్ష మందికిపైగా ప్రయాణికులను కోల్పోతోంది. అయితే పర్యావరణ కోణంలో మెట్రోను స్వాగతించాలని ఆర్టీసీ కార్మికులు చెబుతున్నా కనీసం సంస్థకు ఆర్థిక చేయూత ఇవ్వకపోవడంపై పెదవి విరుస్తున్నారు. అలాగే ప్రైవేటు ట్రావెల్స్ వల్ల రోజుకు ఆర్టీసీకి రూ. కోటికిపైగా నష్టం వాటిల్లుతున్నా ప్రభుత్వం వాటి నియంత్రణపై దృష్టి సారించట్లేదని మండిపడుతున్నారు. ఆర్టీసీ నష్టాలకు కారణాలేంటి? – విభజన తర్వాత పంపకాల్లో వచ్చిన రూ. 2 వేల కోట్లకుపైగా అప్పులు – ఏపీఎస్ఆర్టీసీతో టీఎస్ఆర్టీసీ అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకోలేకపోవడంతో ఏపీఎస్ఆర్టీసీ బస్సులు తెలంగాణలో తిరిగినంతగా తెలంగాణ బస్సులు ఆంధ్రలో తిరగలేక భారీగా ఆదాయం నష్టపోతుండటం – 2015లో ఒకేసారిగా 5 వేల మందిని రెగ్యులరైజ్ చేయాల్సి రావడం, ఇటీవల 16 శాతం ఐఆర్‌తో అదనపు ఆర్థికభారం పడటం – టికెట్టేతర ఆదాయం పెంపుదలపై టీఎస్ఆర్టీసీ దృష్టి సారించకపోవడం – కొంతకాలంగా శాశ్వతంగా ఎండీ, ప్రస్తుతం మంత్రి, చైర్మన్ లేకపోవడం వల్ల కూడా సంస్థ ఆదాయం పెంచుకునే అన్వేషణలో వెనకబడిందని కార్మికులు అభిప్రాయపడుతున్నారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి ఇలా (అంకెలు రూ. కోట్లలో) ఏడాది బడ్జెట్ కేటాయింపులు విడుదల చేసిన నిధులు నష్టాలు 2014–15 – – 240 2015–16 400 210 750 2016–17 650 265 770 2017–18 995 325 620 2018–19 975 330 (సెప్టెంబర్ వరకు) 461 (నవంబర్ వరకు) మొత్తం 3,020 1,030 2,841 ఆర్టీసీ యూనియన్లతో నిపుణుల కమిటీ భేటీ... ఆర్టీసీ ప్రక్షాళనకు, సంస్థను లాభాల బాట పట్టించేందుకు ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ శుక్రవారం వివిధ కార్మిక సంఘాలతో సమావేశమైంది. ఎంజీబీఎస్‌లో జరిగిన ఈ భేటీకి ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) నుంచి రాజిరెడ్డి, బాబు, నరసింహన్ హాజరయ్యారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎమ్‌యూ) నుంచి నాగేశ్వరరావు, కమలారెడ్డి, నరేందర్, మలానా, అశోక్ కమిటీతో సమావేశమయ్యారు. సీఐటీయూ నుంచి శ్రీనివాసరావు, ఏవీ రావు, రవీందర్‌రెడ్డిలు భేటీ అయ్యారు. వారందరితో కమిటీ విడివిడిగా చర్చలు జరిపింది. ఈ సందర్భంగా సంస్థను లాభాల పట్టించేందుకు ఆయా సంఘాలు తమ కార్యచరణను నివేదిక రూపంలో విడివిడిగా సమర్పించాయి. -
హమాలీ చార్జీల పెంపు: ఈటల
సాక్షి, హైదరాబాద్ : పౌర సరఫరాల శాఖలో పని చేస్తున్న హమాలీలకు చార్జీలు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. సమ్మె చేస్తున్న హమాలీ సంఘాలతో గురువారం మంత్రి ఈటల చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..హమాలీల చార్జీలను గతం కంటే రూ.3 అదనంగా పెంచుతున్నామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం హమాలీ చార్జీలను క్వింటాలుకు రూ.8 నుంచి రూ.12కు, 2016లో రూ.15కు పెంచిం దని మంత్రి తెలిపారు. ప్రస్తుతం పెరిగిన చార్జీలతో గ్రామీణ ప్రాంతాల్లో క్వింటాలుకు రూ.18, పట్టణ ప్రాంతా ల్లో రూ.18.50 హమాలీలకు అందనుంది. దసరా బోనస్‌ను రూ.4వేల నుంచి 4,500కు, చనిపోయిన కార్మికుని దహన సంస్కారాలకు ఇచ్చే మొత్తాన్ని రూ.10వేల నుంచి రూ.20వేలకు పెంచుతూ మంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల హమాలీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. -
భూ వినియోగ మార్పిడి చార్జీల బాదుడు
సాక్షి, హైదరాబాద్: భూ వినియోగ మార్పిడి చార్జీలు భారీగా పెరిగాయి. నగరాలు, పట్టణాలు, పట్టణాభివృద్ధి సంస్థల మాస్టర్ ప్లాన్‌లో నివాస, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ/కన్జర్వేషన్/గ్రీన్ బెల్ట్, రిక్రియేషనల్ జోన్లలోని భూములను సంబంధిత కేటగిరీ కాకుండా ఇతరత్ర అవసరాలకు వినియోగించుకోవడానికి అనుమతించేందుకు ప్రభుత్వం వసూలు చేస్తున్న అభివృద్ధి చార్జీలు 25 శాతం నుంచి 100 శాతం వరకు పెరిగాయి. బుధవారం ఈ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా), యాదగిరిగుట్ట, వేములవాడ, బాసర టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీలతో సహా రాష్ట్రంలోని ఇతర అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల మాస్టర్ ప్లాన్లలోని భూ వినియోగ మార్పిడికి ఇకపై వసూలు చేసే కొత్త చార్జీలను ఉత్తర్వుల్లో పొందుపరిచారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ మినహాయిస్తే.. హెచ్ఎండీఏ పరిధిలోని మునిసిపాలిటీలతో పోల్చితే గ్రామ పంచాయతీల్లో చార్జీలు తక్కువగా ఉన్నాయి. తాజాగా మున్సిపాలిటీలతో సమానంగా గ్రామ పంచాయతీల్లోని భూముల భూ వినియోగ చార్జీలను పెంచారు. హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భారీగా నిధులను సమకూర్చుకోడానికి ప్రభుత్వం ఈ చార్జీలను పెంచిం ది. ఈ చార్జీల ద్వారా హెచ్ఎండీఏ ఏటా రూ.వందల కోట్లు ఆర్జిస్తోంది. యాదగిరిగుట్ట భూములపై కూడా.. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ ఆథారిటీ పరిధిలో భూ వినియోగ మార్పిడి చార్జీలను దాదాపు హెచ్ఎండీఏ పరిధిలోని చార్జీలకు సమానంగా పెంచారు. యాదగిరిగుట్ట పరిధిలో చ.మీ. స్థలానికి రూ.120 నుంచి రూ.200 వరకు చార్జీలను వసూలు చేయనున్నారు. కమర్షియల్, రెసిడెన్షియల్ కేటగిరీలకు మార్చేందుకు చ.మీ.కు రూ.200 అభివృద్ధి చార్జీని విధించనున్నారు. గుట్ట పరిధిలో పరిశ్రమల కేటగిరీకి మార్పు కోసం మాత్రం చ.మీ.కు రూ.120 చార్జీని ఖరారు చేశారు. వేములవాడ, బాసర ఆలయాభివృద్ధి సంస్థల పరిధిలోనూ మున్సిపల్ కార్పొరేషన్లు/మున్సిపాలిటీల్లో చ.మీ.కు రూ.90 నుంచి రూ.120 వరకు చార్జీలను వసూలు చేయనున్నారు. నివాస కేటగిరీ నుంచి వాణిజ్య, పారిశ్రామిక కేటగిరీలకు మార్చేందుకు రూ.120 చార్జీలు విధించనున్నారు. గ్రామ పంచాయతీల్లో చ.మీ.కు రూ.40 నుంచి రూ.60 వరకు వసూలు చేయనున్నారు. ఇతర నగరాలు, పట్టణాల్లో.. హెచ్ఎండీఏ, కుడాలతో సహా రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల్లో కూడా భూ వినియోగ మార్పిడి చార్జీలు పెరిగాయి. ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలు, గ్రేడ్-1, 2, 3 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో రూ.10 నుంచి రూ.135 వరకు భూ వినియోగ చార్జీలు విధించనున్నారు.