ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్
సాక్షి, హైదరాబాద్ : పౌర సరఫరాల శాఖలో పని చేస్తున్న హమాలీలకు చార్జీలు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. సమ్మె చేస్తున్న హమాలీ సంఘాలతో గురువారం మంత్రి ఈటల చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..హమాలీల చార్జీలను గతం కంటే రూ.3 అదనంగా పెంచుతున్నామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం హమాలీ చార్జీలను క్వింటాలుకు రూ.8 నుంచి రూ.12కు, 2016లో రూ.15కు పెంచిం దని మంత్రి తెలిపారు.
ప్రస్తుతం పెరిగిన చార్జీలతో గ్రామీణ ప్రాంతాల్లో క్వింటాలుకు రూ.18, పట్టణ ప్రాంతా ల్లో రూ.18.50 హమాలీలకు అందనుంది. దసరా బోనస్‌ను రూ.4వేల నుంచి 4,500కు, చనిపోయిన కార్మికుని దహన సంస్కారాలకు ఇచ్చే మొత్తాన్ని రూ.10వేల నుంచి రూ.20వేలకు పెంచుతూ మంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల హమాలీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment