cheated women
-
సహజీవనం చేసి.. తల్లిని చేశాడు.. ఆస్తిలో భాగం కావాలి.. తర్వాత ఏం జరిగిందంటే?
గోరంట్ల(శ్రీసత్యసాయి జిల్లా): మహిళను మోసగించిన ఓ వ్యక్తిపై మండల పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. సీఐ సుబ్బారాయుడు తెలిపిన మేరకు.. గోరంట్లకు చెందిన ట్రాన్స్‌కో ఏఈ ప్రభాకర్ గతేడాది మేలో మృతి చెందారు. ఈయన మరణించిన కొన్నిరోజులకే.. తనతో సహజీవనం చేసి ఇద్దరు పిల్లలకు తల్లిని చేశాడంటూ మండలంలోని కరావులపల్లికి చెందిన సంధ్యాబాయి ప్రభాకర్ భార్య రుక్మిణీదేవితో వచ్చి వాపోయింది. చదవండి: బాలుడు పాడుపని.. ఇంటర్ బాలికను ఇంటికి తీసుకెళ్లి.. ఆస్తిలో తనకూ భాగం కావాలని వాగ్వాదానికి దిగి ప్రభాకర్‌కు చెందిన ఒక ఇంట్లో దిగింది. ఆమెను ఎలాగైనా ఇంటి నుంచి ఖాళీ చేయిస్తానని అయితే, తనకు రూ.5 లక్షలు ఇవ్వాలని గోరంట్లకు చెందిన గాండ్ల జగన్ చెప్పడంతో రుక్మిణీదేవి ఆ మేరకు డబ్బు అందజేసింది. ఎన్నిరోజులైనా సమస్యను పరిష్కరించకపోవడంతో డబ్బు వెనక్కివ్వాలని గాండ్ల జగన్‌ను మంగళవారం రుక్మిణీ దేవి నిలదీసింది. ఆయన బెదిరింపులకు దిగడంతో పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదు మేరకు జగన్‌పై ఐపీసీ 420, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
ఆరో పెళ్లికి సిద్ధమైన బాబా.. ఐదో భార్య ఫిర్యాదుతో
లక్నో: రహస్యంగా ఒకరి తర్వాత ఒకరు చొప్పున ఐదుగురిని వివాహం చేసుకోవమే కాక వారికి విడాకులు ఇవ్వకుండానే ప్రస్తుతం ఆరో వివాహానికి సిద్ధపడ్డ దొంగ బాబాను కాన్పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలు.. ఉత్తరప్రదేశ్ షహనాజ్‌పూర్‌కు చెందిన అనూజ్ చేతన్ కథేరియా అనే వ్యక్తికి 2005లో మొదటి సారి వివాహం అయ్యింది. పెళ్లి తర్వాత భార్యను చిత్రహింసలకు గురి చేస్తుండటంతో ఆమె అతడి నుంచి విడిపోయి వేరుగా ఉంటుంది. ప్రస్తుతం వీరి విడాకులు కేసు ఇంకా కోర్టులోనే ఉంది. ఇదిలా ఉండగానే 2010లో అనూజ్ రెండో వివాహం చేసుకున్నాడు. కొద్ది కాలం తర్వాత ఆమె అనూజ్ వేధింపులు తట్టుకోలేక అతడి నుంచి విడిపోయింది. నాలుగేళ్ల తర్వాత అనూజ్ మూడో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు మూడో భార్యకు తెలియకుండా ఆమె బంధువును నాలుగో వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత అనూజ్ నిజ స్వరూపం తెలియడంతో అతడు నాలుగో వివాహం చేసుకున్న మహిళ ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఈ క్రమంలో 2019లో అనూజ్ ఐదో సారి వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజులు బాగానే ఉన్నప్పటికి ఆ తర్వాత ఐదో భార్యను వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో అతడికి గతంలోనే నాలుగు సార్లు వివాహం అయినట్లు తెలిసింది. అప్పటి నుంచి ఐదో భార్య అనూజ్ నుంచి వేరుగా ఉండసాగింది. కొద్ది రోజుల క్రితం అనూజ్ 6వ సారి పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం కాస్త అతడి ఐదో భార్యకు తెలిసింది. వెంటనే కాన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అనూజ్‌ని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో అనూజ్ మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా తాను వీరందరిని మోసం చేశానని తెలిపాడు. లక్కీ పాండేగా పేరు మార్చుకుని.. తప్పుడు అడ్రెస్లు ఇస్తూ.. మహిళలను మోసం చేసేవాడనని వెల్లడించాడు. తనను తాను ప్రభుత్వ ఉద్యోగి, క్లర్క్, టీచర్, తంత్రగాడిగా పరిచయం చేసుకుని బాధితులను ఏమార్చి వారిని వివాహం చేసుకునే వాడినని తెలిపాడు. అలానే సమస్యలతో తన ఆశ్రమానికి వచ్చే మహిళలను ట్రాప్ చేసి లొంగదీసుకునేవాడినని పోలీసుల దర్యాప్తులో వెల్లడించాడు అనూజ్ . చదవండి: 4 రోజుల్లో పెళ్లి.. రోడ్డు పక్కన పెళ్లి కూతురు శవం -
‘నేను లండన్‌లో ఉంటా, మిమ్మల్నే పెళ్లి చేసుకుంటా’
సాక్షి, బెంగళురు(బనశంకరి): నేను లండన్‌లో నివసిస్తుంటా, మిమ్మల్నే పెళ్లి చేసుకుంటానని నమ్మించిన వంచకుడు ఓ మహిళ నుంచి రూ.10.13 లక్షలు స్వాహా చేశాడు. బెంగళూరు గురురాఘవేంద్ర లేఔట్ నివాసి తానియా రై బాధిత మహిళ. కొద్దిరోజుల క్రితం ప్రేమ్ బసు అనే వ్యక్తి ఒక పెళ్లి సంబంధాల వెబ్సైట్లో పరిచయమయ్యాడు. లండన్‌లో ఉంటున్నట్లు చెప్పాడు. మీరు నచ్చారని, భారత్‌కు వచ్చి వివాహం చేసుకుంటానని చెప్పడంతో మహిళ నిజమేననుకుంది. మరుసటి రోజు ఆమె మొబైల్‌కు ఫోన్ చేసిన వ్యక్తి ఢిల్లీ విమానాశ్రయ అధికారి అని పరిచయం చేసుకున్నాడు. లండన్ నుంచి ప్రేమ్బసు వచ్చారని, అతడి వద్ద కరోనా నెగిటివ్ రిపోర్టు లేదని, రూ.2 కోట్ల నగదు ఉందని, దీనికి సరైన పత్రాలు లేకపోవడంతో అతడిని అరెస్ట్ చేశామని చెప్పాడు. అతడిని విడుదల చేయాలంటే కొంత పన్ను కట్టాలన్నాడు. తానియా రై అతనికి సాయం చేద్దామని రూ.10.13 లక్షల నగదును ఖాతాలోకి బదిలీ చేసింది. తరువాత ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ అని రావడంతో బాధితురాలికి దిక్కుతోచలేదు. సైబర్ క్రైం పీఎస్‌లో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. చదవండి: స్విగ్గీ డెలివరీ బాయ్‌ని చితకబాది.. నగదు చోరీ -
కానిస్టేబుల్‌నంటూ టిప్‌టాప్‌గా ముస్తాబై..
కరప(తూర్పుగోదావరి): టిప్‌టాప్‌గా ముస్తాబై, స్కూటర్‌పై దర్జాగా వచ్చి, దుస్తులు కొనుగోలు చేసి, కరప పోలీసు స్టేషన్‌కు కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ని అని చెప్పి అరువు పేరుతో ఉడాయించింది ఓ మహిళ. పోలీసు పేరుతో వ్యాపారికి టోకరా ఇచ్చిన ఘటన కరపలో చోటుచేసుకుంది. బాధిత వ్యాపారి నక్కా శ్రీనివాస్ కథనం ప్రకారం.. కరప గ్రామానికి చెందిన నక్కా శ్రీనివాస్ డిగ్రీ చదువుకున్నా ఉద్యోగం రాకపోవడంతో రెడీమేడ్ వస్త్ర దుకాణంతో స్వయం ఉపాధి కల్పించుకున్నాడు. రెండు వారాల క్రితం ఆ దుకాణానికి ఒక మహిళ వచ్చి యజమానితో ఆకర్షణీయంగా మాట్లాడి, రూ.3,300 విలువ చేసే దుస్తులు తీసుకుంది. వ్యాపారి సొమ్ములు అడగగా కరప పోలీసు స్టేషన్‌కు కొత్తగా వచ్చానని, రేపు డ్యూటీకి వచ్చినప్పుడు తీసుకువచ్చి, ఇచ్చేస్తానని నమ్మకంగా చెప్పింది. ఆ వ్యాపారి ఆమె మొబైల్ నంబరు, ఇవ్వాల్సిన బాకీ బుక్‌లో నోట్ చేసుకున్నాడు. వచ్చిన స్కూటర్ నంబరు కూడా (ఏపీ 05 డీసీ, 9813) నోట్ చేసుకున్నాడు. రెండు వారాలవుతున్నా బాకీ ఇవ్వకపోవడంతో తనకిచ్చిన మొబైల్ నంబరు 9849700844కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్‌లో ఉంది. కరప స్టేషన్లో అడిగితే అటువంటి వారు ఇక్కడ పని చేయడంలేదని చెప్పడంతో మహిళ చేతిలో మోసపోయినట్టు గ్రహించి, లబోదిబోమంటున్నాడు. కరప ఎస్సై డి.రామారావును వివరణ కోరగా బాధితుడు నుంచి ఫిర్యాదు రాలేదన్నారు. మొబైల్ నంబర్‌ను ఆరా తీయగా ఉపేంద్ర అనిల్‌కుమార్ పేరుపై తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా చిరునామాతో ఉందని, స్కూటర్ నంబర్ ప్రకారం ఏసుబాబు బాలి, ఏలేశ్వరం పేరున రిజిస్టర్ అయి ఉన్నట్టు కరప ఎస్సై తెలిపారు. -
ఉద్యోగమని మోసం చేసిన డీఎస్పీ!
సాక్షి, పట్నంబజారు (గుంటూరు): ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి మోసం చేసిన సెంట్రల్ ఇంటిలిజెన్స్ డీఎస్పీతో పాటు మరో వ్యక్తిపై కేసు నమోదైంది. పట్టాభీపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమరావతికి చెందిన బొమ్మనబోయిన ఇంద్రాణి ప్రస్తుతం విద్యానగర్‌లో నివాసం ఉంటున్నారు. భర్త నాగేంద్రనాథ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా, ఆమె గృహిణిగా ఉంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. పీజీ చదివి ఖాళీగా ఉంటున్న ఆమెకు వరుసకు మామయ్య అయిన తెల్లగడ్డల సత్యనారాయణ తనకు పరిచయం ఉన్న సెంట్రల్ ఇంటిలిజెన్స్‌లో డీఎస్పీగా పనిచేస్తున్న కొరడా నాగశ్రీనివాసరావు ద్వారా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో గ్రూప్–2 కేడర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. రూ. 15 లక్షలు ఒకసారి, పలుమార్లు ఖర్చుల నిమిత్తం రూ. 8 లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకపోగా, నేడు రేపు అంటూ వాయిదా వేస్తున్న క్రమంలో డీఎస్పీ నాగశ్రీనివాసరావు ఇటువంటి పనులు చేస్తుంటాడని, డబ్బులు తీసుకుని మోసం చేస్తుంటాడని సమాచారం తెలిసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతోపాటు తన భర్తకు పరిచయం ఉన్న పాలకొల్లు రాజేశ్వరరావుకు తక్కువ వడ్డీకు డబ్బులు ఇప్పిస్తామని నమ్మబలికి పర్సంటేజీ కింద రూ. 9 లక్షలు, ఖర్చుల నిమిత్తం రూ. 14వేలు తీసుకున్నారని ఆరోపించారు. అతనికి సంబంధించి చెక్కులు కూడా ఇచ్చారని, అయితే అవి చెల్లకపోగా, ఉద్యోగం, రుణం కూడా రాలేదని, తమను మోసం చేసిన డీఎస్పీ నాగశ్రీనివాసరావుతో పాటు, తెల్లగడ్డల సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వైద్యం పేరుతో క్షుద్ర పూజలు
మంచాల : వైద్యం పేరుతో క్షుద్ర పూజలు చేసి అమాయక ప్రజల నుండి లక్షలు దండుకున్న సంఘటన మంచాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు... యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం చిన్నకాపర్తి గ్రామానికి చెందిన కోడి శ్రీనివాస్ పదేళ్ల క్రితం మంచాల గ్రామానికి ఆర్ఎంపీ వైద్యుడిగా వలస వచ్చి అక్కడే నివాసం ఉంటున్నాడు. వైద్యం కోసం వచ్చిన ప్రజలకు నాటు వైద్యం చేసేవాడు. అధిక సంపాదన ఆశతో అమాయక ప్రజలను నమ్మించి క్షుద్ర పూజలు చేస్తుండేవాడు. మహబూబ్ నగర్‌కు చెందిన ఓ మహిళ నగరంలోని కర్మన్‌ఘట్‌లో స్థిరపడింది. పదిహేను సంవత్సరాల వయస్సు గల ఆమె కుమారుడి మానసికస్థితి మార్పు విషయంలో నగరంలో అనేక వైద్యశాలలను సంప్రదించినా ఫలితం లేదు. దీంతో యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడం గ్రామంలోని అజీజ్‌బాబా అనే మంత్రగాడిని ఆశ్రయించింది. అతడికి సుమారు రూ.50వేల వరకు సమర్పించుకుంది. అయినా నయం కాకపోవడంతో అజీజ్‌బాబా మంచాలలో ఉంటున్న శ్రీనివాస్ వద్దకు పంపించాడు. ఖచ్చితంగా అతడు నయం చేస్తాడని చెప్పాడు. బాబా మాటలు నమ్మిన ఆ మహిళ తన కుమారుడిని తీసుకొని వచ్చి శ్రీనివాస్‌ను ఫిబ్రవరి నెలలో కలిసింది. నయం చేస్తానని చెప్పి ఆమెను వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి క్షుద్ర పూజలు చేయడం ప్రారంభించాడు. అందుకు ఆమె వద్ద నుండి రూ.లక్షకు పైగా వసూలు చేశాడు. ఈమధ్య కాలంలో ఆమె తన కొడుకుని తీసుకొని దుబాయిలో ఉంటున్న తన భర్త వద్దకు వెళ్లింది. దీంతో శ్రీనివాస్‌కు అందుబాటులోకి రాలేదు. అయితే శ్రీనివాస్ మాత్రం బాధితురాలి బంధువులకు ఫోన్ చేసి మీ కొడుకుకు నయం చేశాను, నాకు మరిన్ని డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. లేకుంటే మీ కొడుకుని తిరిగి అనారోగ్యానికి గురిచేస్తానని బెదిరించాడు. దీంతో భయాందోళనకు చెందిన ఆ మహిళ సోమవారం మంచాలకు వచ్చి క్షుద్ర పూజలు చేసిన శ్రీనివాస్‌ను కలిసింది. ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగి గొడవ జరిగింది. దీంతో బాధితురాలు మంచాల పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మంచాల సీఐ గంగారాం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాడు. పోలీసుల అదుపులో... క్షుద్ర పూజలు చేసి అమాయక ప్రజల నుండి డబ్బులు వసూలు చేసిన ఆర్ఎంపీ వైద్యుడు శ్రీని వాస్, అతనితో పాటు కొయ్యలగూడంకు చెందిన అజీజ్ బాబాను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి వివరాలు తెలియజేస్తామని సీఐ తెలిపారు. -
ప్రేమ పేరుతో కానిస్టేబుల్ మోసం
మొయినాబాద్(చేవెళ్ల) : ఇంటిపక్కనే ఉంటున్న యువతిని ఓ యువకుడు రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వెంట తిప్పుకున్నాడు. పెళ్లికి ప్రియురాలు ఒత్తిడి చేసినప్పుడల్లా దాటవేస్తూ వచ్చాడు. కట్నానికి ఆశపడి వేరొకరిని పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. విషయం తెలిసి ప్రియురాలు పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో ఇప్పుడు కాదుపొమ్మన్నాడు. ఈ దుర్మార్గానికి పాల్పడింది ఓ కానిస్టేబుల్. ఈ సంఘటన మండల పరిధిలోని చిన్నమంగళారంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నమంగళారం గ్రామానికి చెందిన తలారి శ్రీనివాస్(26) చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. చిన్నమంగళారం గ్రామంలోనే తన ఇంటి పక్కనే ఉండే ఓ యువతిని రెండు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వెంటతిప్పుకున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని యువతి ఏడాదిగా శ్రీనివాస్‌ను ఒత్తిడి చేస్తుండగా.. దాటవేస్తూ వచ్చాడు. ఇదే విషయమై కొన్ని రోజుల క్రితం యువతి చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ తనను ప్రేమిస్తున్నాడని తెలిపింది. గ్రామ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటానని ఒప్పుకోవడంతో అప్పట్లో కేసు నమోదు చేయలేదు. కాగా ఇటీవల కానిస్టేబుల్ శ్రీనివాస్ కట్నానికి ఆశపడి మరో యువతిని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నట్లు ప్రియురాలికి తెలిసింది. దీంతో తనను పెళ్లి చేసుకుంటానని, మళ్లీ పెళ్లి చూపులు ఎందుకు చూస్తున్నావంటూ నిలదీసింది. శ్రీనివాస్ పెళ్లికి నిరాకరించడంతో పాటు నీతో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడంతో తనకు న్యాయం చేయాలని యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ఐఆర్ఎస్ అధికారినంటూ..
గుంటూరు: తానో రెవెన్యూ శాఖ అధికారినని చెప్పుకుంటూ ఓ వ్యక్తి పెళ్లిపేరుతో పలువురు మహిళలను మోసగించిన సంఘటన శనివారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన వెంకటరత్నాకర రెడ్డి తాను ఐఆర్ఎస్ అధికారనని చెప్పి పలువురు మహిళలను నమ్మించాడు. వారందరినీ వివాహం చేసుకున్న తర్వాత పెద్ద మొత్తంలో నగదు, బంగారం కాజేసి కనిపించకుండా పోయాడు. ఇతని బాధితుల్లో ఎన్ఆర్ఐలు, ఓ సినీ నిర్మాత కూడా ఉన్నట్లు సమాచారం. గుంటూరు,హైదరాబాద్ లలో రత్నాకర్ పై బ్యాంకు దొంగతనంతో పాటు పలు కేసులు ఉన్నాయి. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కేసుకు సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సివుంది.