చెరువులను పరీశీలించిన జేసీ
జగదేవ్పూర్: మండలంలోని చేబర్తి పెద్ద చెరువును గురువారం మధ్యాహ్నం జేసీ వెంక్రటాంరెడ్డి, గడ అధికారి హన్మంతరావుతో కలిసి చెరువును పరిశీలించారు. అలాగే సీఎం దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో కూడవెల్లి ఆధునీకరణ, కుంటలను పరిశీలించారు. చేబర్తి పెద్ద చెరువు నిండటంతో హర్షం వ్యక్తం చేశారు. చెరువు నీటి నిల్వ సామర్థ్య విషయాలను ఇరిగేషన్ అధికారులను ఆడిగితెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాల వల్ల చెరువు, కుంటలోకి ఎక్కువ శాతం వచ్చి చేరిందన్నారు. చేబర్తి చెరువు నిండడం వల్ల ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలకు మేలు జరుగుతుందన్నారు. చేబర్తి గ్రామస్తులు మాట్లాడుతూ మా గ్రామంలో వాగు పుట్టింది మా ఊరి పేరే పెట్టాలని, కూడవెల్లి కాదని జేసీ దృష్టికి తీసుకపోయారు. దీనిపై జేసీ స్పందిస్తూ పేరు మార్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రాంచంద్రం, సర్పంచ్ బాల్రెడ్డి, నీటిపారుదల శాఖ ప్రత్యేక అధికారి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.