chemical reaction
-
వాటర్‌తో గోల్డ్! వాట్ ఏ టైమింగ్
నీటిని బంగారంగా మార్చేసేయొచ్చు. కానీ, కొన్ని షరతులు వర్తిస్తాయి. టైమింగ్‌తో కొన్ని మూలకాలను ఉపయోగించి తయారు చేశారు. అయితే అది కొన్ని సెకండ్లు మాత్రమే. ఈ అరుదైన ప్రయోగం టైంలో ‘టైమింగ్’ మరీ ముఖ్యం అంటున్నారు చెక్ రిపబ్లిక్ సైంటిస్టులు. ప్రేగ్ లోని చెక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు నీటిని బంగారం, మెరిసే లోహంగా మార్చేసి చూపించారు. కొన్ని క్షణాల పాటు నీటి బిందువును బంగారంగా మార్చారు. సాధారణంగా లోహాలు కాని చాలా వస్తువుల్ని.. లోహాలుగా మార్చొచ్చన్నది ఎప్పటి నుంచో ఉన్నదే. అయితే, దానికి ఎక్కువ పీడనం అవసరమవుతుంది. ఓ వస్తువులోని అణువులు, పరమాణువులను గ్యాప్ లేకుండా అత్యంత దగ్గరకు చేరిస్తే.. ఆ వస్తువు లోహంగా మారుతుంది. దాని చుట్టూ ఉండే బాహ్య ఎలక్ట్రాన్లు విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి. నీటి విషయంలో.. నీటి విషయంలోనూ అధిక పీడనం ద్వారా జరుగుతుందని.. లోహంగా మార్చాలంటే కోటిన్నర అట్మాస్ఫియర్స్ పీడనం అవసరమవుతుందని సైంటిస్టులు తేల్చారు. కానీ, ఈసారి ప్రయోగంలో అంత పీడనం అవసరం లేకుండా.. లోహంగా మార్చే ఉపాయాన్ని చెక్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు గుర్తించారు. కొన్ని క్షార (ఆల్కలీ) లోహాల నుంచి ఎలక్ట్రాన్లను తీసుకుని.. నీటిపై ప్రయోగించి సుసాధ్యం చేశారు. సిరంజీ సాయంతో.. పిరియాడిక్ టేబుల్లోని గ్రూప్-1లో ఉన్న సోడియం, పొటాషియం వంటి మూలకాలతో అది సాధ్యమవుతుందని గుర్తించారు చెక్ యూనివర్సిటీ సైంటిస్టులు. ఓ సిరంజీలో సోడియం, పొటాషియం ద్రావణాన్ని తీసుకున్నారు. దానిని ఓ వాక్యూమ్ (పీడనం) చాంబర్ లో పెట్టారు. కానీ, ఆ మూలకాలకు నీటి చుక్క తగిలితే పేలే స్వభావం ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు నీరు, ఆ మూలకాల మధ్య ప్రతిచర్య నిదానంగా సాగేలా చూసుకున్నారు. తర్వాత ఆ సిరంజీ నుంచి నిదానంగా ఆ ద్రావణం బిందువులను విడుదల చేసి.. నీటి ఆవిరితో చర్య జరిపేలా చూశారు. అంతే కొన్ని క్షణాల పాటు ఆ నీటి బిందువు బంగారంగా.. ఆ వెంటనే మెరిసే లోహంగా మారిపోయింది. రిస్క్ ఉంది అయితే, ఇది చాలా రిస్క్ తో కూడుకున్న పని అంటున్నారు శాస్త్రవేత్తలు. మూలకాలు పేలకుండా ఉండాలంటే.. నీటితో వాటిని ప్రతిచర్య జరిపించే టైమింగే చాలా ముఖ్యమని చెప్పారు. నీరు, లోహాల మధ్య జరిగే రియాక్షన్ కన్నా ఎలక్ట్రాన్ల ప్రవాహం చాలా వేగంగా ఉంటుందని, కాబట్టి, జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని సైంటిస్టులకు సూచిస్తున్నారు. ‘నేచర్’ జర్నల్‌లో గురువారం ఈ పరిశోధనలకు సంబంధించిన ఆర్టికల్ పబ్లిష్ అయ్యింది. -
క్షమించుకుందాం రా!
నేడు ప్రపంచ క్షమా దినం సరిగ్గా 2014 యేళ్ల క్రితం... రాతి కట్టడాల నడుమ రోమ్ నగరంలోని దారుల మీద అక్కడక్కడా రక్తపు చారల ఆనవాళ్లు. తమకు అతి దగ్గరగా ఉన్న ‘వ్యక్తి’ని అరాచకంగా చంపేశారని కొందరు ఏడుస్తున్నారు. ‘‘తప్పు చేశామా?’’... ఇనుప కవచాల వెనుక ఉన్న కరకు గుండెల్లో అపరాధభావం మొలకెత్తసాగింది. మూడు రోజులుగా నగరంలో ఈ పెనుగులాట జరుగుతుండగా... ఊహకందని విధంగా చావుని చీల్చుకుని వారి మధ్యకు వచ్చాడు ఆ వ్యక్తి ‘క్షమించడానికి’! ఆ ఒక్క క్షమాపణ... ఆ వ్యక్తిని దేవుణ్ని చేసింది. ఆ ఒక్క క్షమాపణ... ఒక కొత్త శకానికి నాంది పలికింది. మనం చేసిన పనిని తనదని చెప్పి క్రెడిట్ కొట్టేసే పై ఆఫీసర్ ఇంకా పెకైదుగుతాడు. అర్ధ రూపాయికే ఆకాశాన్ని నేలకు దింపి, అక్కడ నీకు ఇల్లిప్పిస్తానని ఎన్నికలప్పుడు వాగ్దానం చేసిన నాయకుడు... తీరా ఎన్నికలయ్యాక వెండికంచంలో బంగారాన్ని భోంచేస్తూ మొండి చేయి చూపిస్తాడు. నిన్నే పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, నువ్విచ్చిన కాస్ట్లీ గిఫ్టును చక్కగా తీసుకుని, మర్నాడు సెంటీమీటరు మందమున్న పెళ్లికార్డును చేతిలో పెట్టి... ‘మా ఇంట్లో నాకు తెలీకుండా పెళ్లి కుదిర్చేశారు, చేసుకోకపోతే చచ్చిపోతామంటున్నారు, అందుకే చేసుకోక తప్పడం లేదు’ అని చెప్పేసి చేతులు దులుపుకుంటారు. వీరందరి మీద పగ.. కోపం.. ఉద్రేకం. దాచుకోవడమెందు? పగ తీర్చేసుకోండి. మనసు అనే గన్ తీసుకుని, క్షమాపణ అనే బుల్లెట్‌ని వారి గుండెల్లోకి దింపండి. బిక్కచచ్చిపోతారు దెబ్బకి. మీరు చూపించే దయకి, ఒక్కసారిగా వణుకు పుడుతుంది వారికి. ‘వాడిని క్షమించు. అంతకు మించిన శిక్ష ప్రపంచంలో మరేదీ లేదు’ అంటాడు ఆస్కార్ వైల్డ్. నిజమే. క్షణికావేశంలో నీ కోపం బయటపడితే, క్షమాపణ నీ క్యారెక్టర్ని బయటకు తెస్తుంది. క్షమాపణ ఓ మందులాంటిది. అది అవతలివాడిలోని అపరాధభావంతో కలిసి ఒక కెమికల్ రియాక్షన్ జరిగినట్టు వాడిలోని క్రూరత్వాన్ని నశింపజేసి, మంచితనాన్ని బయటకు తెస్తుంది. ఉదాహరణల కోసం వెతక్కండి. మీరే ఉదాహరణగా నిలవండి. మిమ్మల్ని తిట్టినా, కొట్టినా, అష్టకష్టాలు పెట్టినా క్షమించి చూడండి. కృష్ణుణ్ని కర్ణుడు క్షమించినట్టు, బిడ్డని తండ్రి క్షమించినట్టు, ప్రకృతి మనుషుల్ని క్షమించినట్టు, మీకు చేయిచ్చిన వారందరినీ చెయ్యెత్తి క్షమించండి... చెంపదెబ్బ కన్నా గట్టిగా తగులుతుంది. మిమ్మల్ని వద్దనుకున్నవారిని కూడా మీకు మరింత దగ్గర చేస్తుంది! - జాయ్ -
కృంగిపోవడం ఒక రసాయనిక చర్య
వివేకం కృంగిపోవడం వల్ల కావాలనుకున్నవన్నీ మీ నుంచి జారిపోతాయి. మీరు ఉల్లాసంగా ఉండాలనుకున్నా ఉండలేరు. ఇంకేదో గందరగోళం లోపల జరుగుతూ ఉంటుంది. మీ అంచనాలు నిజం కాకపోవటమే కృంగిపోవటానికి కారణం. ఈ కృంగిపోవడం అనేది ఒక రసాయనిక చర్య. మీరు ఒక స్పష్టమైన మానసిక అవగాహనా స్థాయితో, జాగరూకతతో ఉంటే ఈ రసాయనికత దానంతటదే కుదుటబడుతుంది. కానీ, ప్రస్తుతం అటువంటి జాగరూకత మీకు లేదు. స్టాక్ మార్కెట్ కూలిపోతే ఎంతోమంది కృంగిపోతారు. ప్రతిరోజూ గ్రాఫ్‌పై గీతలు పైకి పోవడం చూస్తుంటే వాళ్ల స్థితి కూడా పైకి వెళుతుంది. కానీ, ఈ రోజు గ్రాఫ్ కిందకి పడిపోవడం వారు చూశారు, అంతే! వారి మానసిక స్థితి కూడా పడిపోయింది. వారు ఏమి జరుగుతుందని అంచనా వేసుకున్నారో, అది జరగలేదు. అదే వారి మానసిక స్థితికి కారణం. కృంగిపోవడం అనే పదాన్ని మీ మానసిక స్థితిని గురించి చెప్పటానికి వాడతారు. మీ మనసును గురించి కాదు. మానసిక ప్రక్రియ తగ్గిపోలేదు. మనసు ఉన్న స్థితి మాత్రమే కృంగిపోయింది. అనేక మంది వ్యక్తులలో, ముఖ్యంగా సంపన్న వర్గాలకు చెందిన వ్యక్తులలో ఉన్న విషాదం ఏమిటో తెలుసా? వాళ్లకు అన్నీ ఉంటాయి, కానీ ఏదీ ఉండదు. కృంగిపోవటం అంటే, ఎక్కడో ఒక విధమైన నిరాశాభావం ప్రవేశించిందని! ఒక గ్రామానికి వెళితే... ఆ గ్రామంలోని వారు అతి పేదరికంలో ఉండవచ్చు కానీ వాళ్ల ముఖాలు మాత్రం ఉల్లాసవంతంగా కనిపిస్తాయి. ఎందుకంటే, వాళ్లలో ‘రేపు ఇంతకంటే బాగా ఉండబోతోంది’ అనే ఆశ ఉంది. సంపన్న వర్గాలవారిలో ఈ ఆశ అనేది లేకుండా పోయింది. కృంగిపోవటం ఆరంభమైంది. ఎందుకంటే, భౌతికంగా వారికి అన్నీ అమరినాయి. ఆహారం, నివాసం అన్నీ ఉన్నాయి. కానీ ఇంకా ఎక్కడో ఏదో లోటు ఉంది. అదేమిటో వాళ్లకు కూడా తెలియదు. ఒక పేదవాడు ‘రేపు, నేను ఒక జత చెప్పులు తెచ్చుకోగలిగితే చాలు, అంతా బాగుంటుంది’ అనుకుంటాడు. అతనికి చెప్పుల జత లభిస్తే ముఖమంతా సంతోషంతో అతనొక మహారాజులాగా నడుస్తాడు. ఎందుకంటే అతని బాహ్య జీవితంలో అన్నీ ఇంకా సరిగా అమరకపోయినా, ఒక ఆశ అనేది ఉంది. సంపన్న వర్గాలలో బాహ్య జీవితంలో అన్నీ అమరినాయి. అంతరంగం మాత్రం సరిగా అమరలేదు. అందుకనే అక్కడ నిరాశ, కృంగిపోవటం జరుగుతోంది. మనం ముందుగా మన అంతరంగాన్ని సరిచేసుకోవాలి. తర్వాతనే బాహ్య పరిస్థితి గురించి శ్రమించాలి. అప్పుడు ప్రపంచం సుందరమౌతుంది. ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే ఇదే. అంతరంగంలో మీరు ఎవరో, దానిని మీరు తీర్చిదిద్దుకోవటం. మీ జీవితంలోని భౌతికతను నిలబెట్టుకోవటం కాదు. అలా అంతరంగాన్ని తీర్చిదిద్దుకోలేకపోతే మాత్రం, మీకు అన్నీ ఉంటాయి. మీకు ఏదీ ఉండదు. సమస్య - పరిష్కారం గతంలో నేను నా తండ్రి ద్వారా చాలా వేధింపులకు లోనైనాను. నా పిల్లలకు అలానే చేస్తున్నానని అనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితిని ఎలా తప్పించుకోవాలి? - డి.వెంకటేశ్వర్లు, కాకినాడ నా చిన్నప్పుడు మా నాన్న నాకు ఏం చేశాడో తెలుసా అంటూ తామున్న పరిస్థితిని చాలామంది సమర్థించుకో జూస్తారు. మీ తండ్రి ఒక మూర్ఖుడైనప్పుడు, అది తెలుసుకునే సామర్థ్యం మీకున్నప్పుడు, మీరు మరింత వివేకంగా బతకాలి కదా! మీరు వేధింపులకు గురయ్యుంటే, జీవితంలో మీరు అవాంఛనీయ పరిస్థితులని ఎదుర్కొని ఉంటే, ఇంకెవరినీ ఇలాంటి పరిస్థితులకు గురిచేయనంత వివేకాన్ని కలిగి ఉండాలి. వివేకం అంటే అదే కదా! జరిగినవి ఎంత బాధగా ఉన్నా, మన మెదడు పదునుగా ఉంటే, వీటిని అధిగమించడం మన చేతిలో పని. మనకేదైనా బాధ కలిగితే, మనకు రావాల్సిన మొదటి ఆలోచన ఏమిటి? నాక్కానీ, మరెవరికీ కానీ మళ్లీ ఇలాంటిది జరగకూడదు అని అనుకోవాలి. నేను మీ చెడు అనుభవాలను తక్కువ చేసి చూపాలని ప్రయత్నించడం లేదు. దాని వెనుక బాధ ఉందని నాకూ తెలుసు. కానీ మనం ఈ బాధనే కొనసాగించాలా? లేక మన జీవిత అనుభవాన్నుంచి వివేకాన్ని పోగు చేయాలనుకుంటున్నామా? ఇది ప్రతి మనిషికీ ఉన్న ఛాయిస్.