Chemistry question paper
-
ఇంటర్ కెమిస్ట్రీ, కామర్స్ పేపర్లలో తప్పులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా మంగళవారం జరిగిన ప్రథమ సంవత్సర కెమిస్ట్రీ, కామర్స్ ప్రశ్నపత్రాల్లో పొరపాట్లు దొర్లాయి. అక్షర దోషాలు, అన్వయ దోషాలు, తప్పుడు పదాలతో విద్యార్థులు గందరగోళపడ్డారు. అయితే ఇంటర్ బోర్డు అధికారులు ఆ తర్వాత అక్షర దోషాలు, అన్వయ దోషాలు ఏయే ప్రశ్నల్లో ఉన్నాయో పరీక్ష కేంద్రాలకు సమాచారం ఇచ్చి, విద్యార్థులకు తెలియజేశారు. కామర్స్ తెలుగు మీడియం ఓల్డ్ సిలబస్‌లో 3 ప్రశ్నలు తప్పుగా ఉన్నాయని గుర్తించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. వాటికి జవా బులు రాసిన (తప్పైనా, ఒప్పైనా) వారందరికీ మార్కులు ఇస్తామని తెలిపారు. మరోవైపు ఈ పరీక్షలు రాసేందుకు 5,03,429 మంది రిజిస్టర్ చేసుకోగా.. 4,78,987 మంది హాజరయ్యారు. ఇక 26 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. పూర్తయిన ప్రథమ సంవత్సర ప్రధాన పరీక్షలు: ఇంటర్ ప్రథమ సంవత్సర ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు మంగళవారంతో పూర్తయ్యాయి. ఈ నెల 19, 21 తేదీల్లో మరికొన్ని సబ్జెక్టుల పరీక్షలు ఉన్నాయి. ద్వితీయ సంవత్సర ప్రధాన పరీక్షలు ఈ నెల 18తో పూర్తికానున్నాయి. 20, 23 తేదీల్లో మరికొన్ని సబ్జెక్టుల పరీక్షలు ఉన్నాయి. ఇవీ ప్రశ్నపత్రాల్లో దొర్లిన తప్పులు.. - కామర్స్–1 తెలుగు మీడియం (ఓల్డ్ సిలబస్) సెక్షన్–డి 18వ ప్రశ్నలో డెబిట్ వైపు అప్పులకు బదులుగా క్రెడిట్ నిలువలు అని ఉండాలి. - తెలుగు మీడియం (న్యూ సిలబస్) కామర్స్–1లో 16వ ప్రశ్నలో నిలి అని ఉంది. అక్కడ నిలిపి అని ఉండాలి. - సెక్షన్–ఈ 19వ ప్రశ్నలో తేదీ 8లో చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేశారు అని ఉండాలి. - సెక్షన్–ఎఫ్‌లో 22వ ప్రశ్నలో తేదీ 5న వంశీకి అమ్మిన సరుకుకు బదులుగా వంశీ నుంచి కొన్న సరుకు అని ఉండాలి. అలాగే తేదీ 10లో వంశీకి అమ్మిన సరుకు రూ.1,200 అని ఉండాలి. ఇదీ ప్రింట్ కాలేదు. - సెక్షన్–ఎఫ్‌లో 23వ ప్రశ్నలో 2018 అని పొరపాటుగా వచ్చింది. - సెక్షన్–జీలో 31వ ప్రశ్నలో రుణగ్రస్తులు రూ.28,000 అని ఉండడానికి బదులుగా రూ.22,000 అని వచ్చింది. - కెమిస్ట్రీ–1లో (ఇంగ్లిష్ మీడియం) సెక్షన్–బి 14వ ప్రశ్నలో ప్రశ్న చివరలో ఠీజ్టీజి ్చn ్ఛ్ఠ్చఝp ్ఛ అని ఉండాలి. - సెక్షన్–జీలో 27వ ప్రశ్నలో ్కఅఐఈ ఇఏఉఖ్ఖఉ బదులుగా ్కఅఐఈ అఔఅఖఐఉ అని ఉండాలి. - కెమిస్ట్రీ–1లో (తెలుగు మీడియం) సెక్షన్–బీలో 15వ ప్రశ్నలో 10.6 శాతానికి బదులుగా 10.06 శాతం అని ఉండాలి. - సెక్షన్–బీలో 16వ ప్రశ్నలో ఏ్గఈఐఈఉకు బదులుగా ఏ్గఈఖఐఈఉ అని ఉండాలి. -
నిఘా నీడన..
ఐఏఎస్ అధికారి పర్యవేక్షణలో ప్రశ్నపత్రం కూర్పు మరోసారి ప్రశ్నపత్రం లీక్ కాకుండా చర్యలు బెంగళూరు : ద్వితీయ పీయూసీ రసాయన శాస్త్రం ప్రశ్నపత్రం రెండుసార్లు లీకైన నేపథ్యంలో మరోమారు అలాంటి పొరపాట్లు పునరవృతం కాకుండా రాష్ట్ర విద్యాశాఖ గట్టి చర్యలు చేపట్టింది. లీకైన పరీక్షను ఈనెల 12న తిరిగి నిర్వహించనున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ద్వితీయ పీయూసీ ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తున్న సిబ్బంది ఇప్పటికే పోలీసుల పర్యవేక్షణలో పనిచేస్తున్నారు. అంతేకాదు వీరికి బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా భద్రతా సిబ్బంది జాగ్రత్త వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రశ్నపత్రం రూపొందిస్తున్న వారు మొబైల్ ఫోన్‌తో పాటు ఎలాంటి సామాజిక మాధ్యమాలు వినియోగించరాదని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇదే సందర్భంలో ద్వితీయ పీయూసీ ప్రశ్నపత్రం తయారై పరీక్ష పూర్తయ్యే వరకు వీరంతా పీయూ బోర్డు కార్యాలయంలోనే ఉండాల్సిందిగా విద్యాశాఖ నుంచి ఆదేశాలు అందాయి. ప్రశ్నపత్రాన్ని రూపొందించిన వారు ఏదైనా ప్రలోభాలకు లొంగిపోయి తాము ప్రశ్నపత్రంలో ఏయే ప్రశ్నలను పొందుపరచాము అన్న సమాచారాన్ని ఎవరికీ చేరవేయకుండా ఈ విధమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రశ్నపత్రం రూపకల్పన, ప్రశ్నపత్రాల రవాణా ఇలా అన్ని అంశాలను ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి పర్యవేక్షిస్తున్నట్లు విద్యాశాఖ వర్గాల సమాచారం. ఇక ఇదే సందర్భంలో సాధారణంగా ప్రశ్నపత్రాలను పరీక్ష తేదీ కంటే రెండు రోజుల ముందు ఆయా మండల కేంద్రాల్లోని ట్రెజరీలకు పంపిస్తారు. అయితే ఈ సారి మాత్రం జిల్లా కేంద్రాల్లోని ట్రెజరీలలో ప్రశ్నపత్రాలను భద్రపరచనున్నారు. రవాణా చేసే వ్యక్తికి కూడా ఫోన్ బంద్..... ఇక ప్రశ్నపత్రాలను జిల్లా కేంద్రాల్లోని ట్రెజరీల నుంచి పరీక్షా కేంద్రాలకు చేరవేసే వాహనాల్లోని డ్రైవర్లు, ఇతర పర్యవేక్షకులు సైతం ఫోన్లను వినియోగించ రాదంటూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ‘లీకు’కు ఎలాంటి ఆస్కారం ఇవ్వరాదనే ఇలాంటి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు విద్యాశాఖ ఉన్నతస్థాయి అధికారులు చెబుతున్నారు. ప్రైవేటు కళాశాలల్లో పరీక్షా కేంద్రాలు వద్దు..... ప్రశ్నపత్రాల లీకుల వ్యవహారాలకు అడ్డుకట్ట వేసేందుకు పరీక్షల నిర్వహణలో సైతం కొన్ని మార్పులు చేయాలని పీయూసీ బోర్డు అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే 2017 విద్యా ఏడాది నుంచి ఏ ప్రైవేటు కళాశాలలోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయకుండా నిబంధనలు తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు ఉన్నత స్థాయి అధికారులు చెబుతున్నారు. ‘ప్రైవేటు కళాశాలల్లో పరీక్షా కేంద్రాల ఏర్పాటు కారణంగా పరీక్షల నిర్వహణలో పొరపాట్లు జరుగుతున్నాయి. అంతేకాదు మాల్‌ప్రాక్టీసింగ్, ప్రశ్నపత్రాల లీకులకు ఆస్కారం ఏర్పడుతోంది. అందువల్ల రానున్న విద్యా ఏడాది నుంచి ప్రైవేటు కళాశాలల్లో పీయూసీ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయరాదనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురానున్నాం’ అని పీయూసీ బోర్డులోని ఉన్నత స్థాయి అధికారి ఒకరు తెలిపారు.