chennakeshava reddy
-
25న చెన్నకేశవరెడ్డి రీ రిలీజ్
‘‘చెన్నకేశవరెడ్డి’ సినిమాని 20 ఏళ్ల క్రితం ఒక పండగలా రిలీజ్ చేశాం. ఇప్పుడు కూడా రీ రిలీజ్‌లా లేదు.. కొత్త సినిమాని విడుదల చేస్తున్నట్లే అనిపిస్తోంది. మంచి ఉద్దేశం కోసం రీ రిలీజవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు, నందమూరి ఫ్యాన్స్ ఆదరించాలి’’ అని డైరెక్టర్ వీవీ వినాయక్ అన్నారు. బాలకృష్ణ హీరోగా, టబు, శ్రియ హీరోయిన్లుగా వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చెన్నకేశవ రెడ్డి’. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ సినిమా 2002 సెప్టెంబర్ 25న రిలీజైంది. ఈ సినిమా రిలీజై 20 ఏళ్లవుతున్న సందర్భంగా ఈ నెల 25న రీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు బెల్లంకొండ సురేష్. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘చెన్నకేశవ రెడ్డి’లో బాలయ్యగారిని ఎలా చూపించాలా? అనే పిచ్చితో కొన్ని గంటలు మాత్రమే నిద్రపోయేవాణ్ణి. ఈ సినిమాలో వచ్చే మేజర్ రెవెన్యూని ‘బసవతారకం ట్రస్ట్’కి విరాళంగా ఇస్తాం’’ అన్నారు. బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ– ‘‘చెన్నకేశవ రెడ్డి’ రీ రిలీజ్ గురించి బాలకృష్ణగారికి చెప్పగానే సంతోషపడ్డారు. ఈ నెల 24న ప్రీమియర్ షోలతో మొదలుపెట్టి, 25న రెగ్యులర్ షోలతో విడుదల చేస్తున్నాం. రీ రిలీజ్లో ఒక సినిమాని కోటి రూపాయలకు అడిగిన దాఖలాలు లేవు.. కానీ పలువురు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కోటి రూపాయలకు అడగడం ‘చెన్నకేశవ రెడ్డి’ క్రేజ్‌కి నిదర్శనం. ఈ సినిమాకి వచ్చే రెవెన్యూలో 75 శాతం ‘బసవతారకం ట్రస్ట్’కి, మిగతాది నాకు సంబంధించిన అసోషియేషన్స్కి ఇస్తాను. నవంబర్ నుంచి మళ్లీ యాక్టివ్‌గా ప్రొడక్షన్ మొదలు పెట్టాలనుకుంటున్నాను’’ అన్నారు. -
మంత్రి ఆదినారాయణరెడ్డికి షాక్
సాక్షి, వైఎస్సార్‌జిల్లా: జమ్మలమడుగులో మంత్రి ఆదినారాయణరెడ్డికి గట్టి షాక్ తగిలింది. ఆదినారాయణరెడ్డి ముఖ్య అనుచరుడు చెన్నకేశవరెడ్డి శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆయనకు పార్టీ కండువా కప్పి.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. జమ్మలమడుగు వైఎస్సార్సీపీ ఇన్చార్జి సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరిక కార్యక్రమం జరిగింది. -
ఏంటీ డ్రామాలు?
ఎమ్మిగనూరు/రూరల్: అమలు సాధ్యమవ్వని హామీలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజీకి ఎందుకు ఒప్పుకున్నారు.... ఇప్పుడు ఎందుకు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నారు అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నేత ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ప్రశ్నించారు. నాలుగేళ్లు బీజేపీతో దోస్తి కట్టిన సీఎం... విభజన చట్టం హామీలను పట్టించుకోకుండా నేడు కేంద్ర ప్రభుత్నాన్ని ఎందుకు విమర్శిస్తున్నారు... ఏంటీ డ్రామాలు అని ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక కుర్ని కల్యాణ మంఠపంలో నియోజకవర్గ ఇంచార్జ్ కే జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన బూత్‌కమిటీ కన్వీనర్ల సమావేశం జరిగింది. వైఎస్ఆర్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి వై.రుద్రగౌడ్, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు మాయ మాటలతో ప్రజలను మభ్యపెడుతూనే ఉన్నారని, రూ.16వేల కోట్ల పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.53వేల కోట్లకు పెంచి దోపిడీకి తెగడ్డారని ఆరోపించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ నిధులు మూటగట్టుకునేందుకు ప్రధాని మోడీతో ప్రత్యేకప్యాకేజీకి ఒప్పందం కుదుర్చుకున్నారని, ప్రజా వ్యతిరేకతను గుర్తించి ప్రత్యేక హోదా అంటూ డ్రామాలు మొదలు పెట్టారని విమర్శించారు. రాష్ట్ర స్థాయిలోనే కాదు... గ్రామ స్థాయిలోనూ జన్మభూమి కమిటీలు ప్రజలను దోపిడీ చేస్తున్నాయన్నారు. నీరు–చెట్టు, ఇసుక అమ్మకాలు పేరుతో ప్రజాధనాన్ని దోచుకొంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా సీఎం మభ్యపెట్టే చర్యలు విడనాడాలని, లేని పక్షంలో ప్రజల తిరుగుబాటు చవిచూస్తారని హెచ్చరించారు. నవరత్నాల ప్రయోజనాలు వివరించండి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాల ప్రయోజనాలను బూత్ కమిటీ సభ్యులు వివరించాలని చెన్నకేశవరెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి సామాజికవర్గానికి, ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందేవిధంగా అధినేత నవరత్నాల పథకాలు రూపొందించారనే విషయాన్ని ప్రజలకు విశదీకరించాలని చెప్పారు. 45సంవత్సరాలకే రూ.2000ఫించన్, అన్నిరోగాలకు ఆరోగ్యశ్రీ తదితర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత బూత్ కమిటీ కన్వీనర్లదేనని చెప్పారు. పల్లెల్లో కొందరు పోలీసుల సహకారంతో టీడీపీ నాయకులు అరాచకాలు సృష్టిస్తున్నారని, ఫలితం చవిచూస్తారని హెచ్చరించారు. టీడీపీ దౌర్జన్యాలకు భయపడాల్సిన అవసరం లేదని, అండగా మేమున్నామని భరోసా ఇచ్చారు. -
మట్టి పోసి.. నిధులు నొక్కేసి!
ఎమ్మిగనూరు, న్యూస్‌లైన్: వర్షాధారమే అయినప్పటికీ నాలుగు దశాబ్దాలుగా గాజులదిన్నె ప్రాజెక్టు కోడుమూరు, గోనెగండ్ల, వెల్దుర్తి, డోన్, క్రిష్ణగిరి మండలాల్లోని పంట పొలాలను తడుపుతూ.. ప్రజల దాహార్తి తీరుస్తోంది. 5.25 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 32,500 ఎకరాలకు రబీలో సాగునీరు ఇవ్వాలన్నది ప్రాజెక్టు లక్ష్యం. నాలుగేళ్ల క్రితం వరకు కుడి కాలువ కింద 21వేలు, ఎడమ కాలువ కింద 5వేల ఎకరాల ఆయకట్టు సాగయ్యేది. అయితే ప్రాజెక్టు నుండి బండగట్టు ర క్షిత మంచినీటి పథకం పేరుతో పత్తికొండ నియోజకవర్గంలోని 21 గ్రామాలకు తాగునీటిని అందిస్తున్నారు. అదేవిధంగా డోన్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీ ప్రజలతో పాటు 40 గ్రామాలకు తాగునీటిని అందించేందుకు క్రిష్ణగిరి వద్ద మంచినీటి పథకాన్ని నిర్మిస్తున్నారు. ఫలితంగా ఏటా ఆయకట్టు విస్తీర్ణం తగ్గుతోంది. ఇదే సమయంలో ప్రాజెక్టు పటిష్టతకు చర్యలు చేపట్టకపోతే మనుగడ కష్టమంటూ 1996లో సెంట్రల్ డిజైనింగ్ ఆర్గనైజేషన్(సీడీఓ), ఇరిగేషన్ ఈఎన్సీ బృందం ఓ నివేదిక రూపొందించింది. ఈ నేపథ్యంలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, కోడుమూరు దివంగత ఎమ్మెల్యే శిఖామణి 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు 2009లో ఆయన పరిపాలనా అనుమతులివ్వగా.. 2011లో ఆధునికీకరణకు టెండర్లను ఆహ్వానించారు. హైదరాబాద్‌కు చెందిన హార్విన్ కన్స్ట్రక్షన్ గ్రూపు ఒక శాతం తక్కువతో టెండర్‌ను రూ.43.9 కోట్లకు దక్కించుకుంది. 2011 ఆగస్టు నుంచి 2013 సెప్టెంబర్ 30వ తేదీ లోపు పనులను పూర్తి చేసేలా అగ్రిమెంట్ ఖరారైంది. జపాన్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ఏజెన్సీ(జేఐసీఏ) నిధులతో చేపట్టే ఈపనుల పర్యవేక్షణ నీటిపారుదల ఇంజనీర్లుతోపాటు జపాన్ ప్రతినిధుల అజమాయిషీ ఉంది. మంజూరైన నిధులతో ఆనకట్ట(బండ్)పటిష్టత, డ్యామేజైన 6 స్లూయిస్ గేట్ల మరమ్మతు, వరద ఉద్ధృతిని నుంచి ప్రాజెక్టు పరిరక్షణకు రెండు అదనపు స్లూయిస్ గేట్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అదేవిధంగా ఎడమ కాలువకు 25 కిలోమీటర్లు, కుడి కాలువకు 36 కిలోమీటర్ల వరకు లైనింగ్, కాలువ గట్ల పటిష్టత పర్చాల్సి ఉంది. మట్టి పనులకే ప్రాధాన్యం: అధికార పార్టీ ప్రధాన ప్రజాప్రతినిధులకు భారీగా గుడ్‌విల్ ఇచ్చుకోవాల్సి రావడం.. అధికారుల పర్సెంటేజీల నేపథ్యంలో కాంట్రాక్టర్ ప్రధానమైన ప్రాజెక్టు గేట్లు, బండ్ పటిష్టతను పక్కనపెట్టి మట్టి పనులకే ప్రాధాన్యమిచ్చాడు. ఎడమ కాలువకు 17.3 కిలోమీటర్లు, కుడి కాలువకు 26.35 కిలోమీటర్ల మేర లైనింగ్ చేశారు. కాలువ గట్ల పటిష్టతకు గ్రావెల్ ప్రెస్సింగ్ పనులు చేయాల్సిన చోట రైతుల పొలం గట్టున ఉన్న మట్టిపోసి మెరుగులుదిద్దారు. బండ్ డ్యామేజీ ఉన్న చోట రివిట్మెంట్, రెండు కెనాల్ రెగ్యులేటర్ల నిర్మాణం చేపట్టి పని పూర్తయిందనిపించారు. ఈ పనులకు ఇప్పటికే రూ.38కోట్ల బిల్లు కూడా తీసేసుకున్నాడు. మరో రెండు కోట్ల రూపాయలకు బిల్లులు సిద్ధమయ్యాయి. మిగిలిన ప్రధానమైన పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్ కుంటి సాకులు చెబుతూ చేతులెత్తేశాడు. చేయాల్సిన పనులకు సరిపడా నిధులు లేవని.. అగ్రిమెంట్ గడువు కూడా ముగిసిందంటూ కాంట్రాక్టర్ తప్పుకోవడం గమనార్హం. అధికారులు సైతం ముందుగా ప్రాజెక్టు పటిష్టత పనులు చేయించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. డిస్ట్రిబ్యూటరీ కాలువలకు లైనింగ్ చేస్తే తప్ప పంట పొలాలకు నీరందదని రైతులు వాపోతున్నారు. ఆధునికీకరణ పనుల్లో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని.. ఉన్నతాధికారులచే విచారణ చేపట్టాలని గతంలో ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ప్రకాష్‌రెడ్డి ఇరిగేషన్ ప్రధాన అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది.