Cherlapalli
-
చర్లపల్లి టెర్మినల్‌తో గణనీయ అభివృద్ధి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్ స్టేషన్‌ను ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేయడం ద్వారా ఈ ప్రాంతంలో గణనీయ అభివృద్ధి సాకారం కానుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. చర్లపల్లి స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్‌లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, సౌరశక్తితో నడిచే కార్యకలాపాలతో సహా సుస్థిరమైన మౌలిక ఆధునిక సౌకర్యాలను సృష్టించడంలో ఇది ఒక ముందడుగు అని అన్నారు. ఈ కొత్త టెర్మినల్ సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడలలోని ప్రస్తుత స్టేషన్లపై ఒత్తిడిని తగ్గించడంతో పాటు ప్రజలకు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తుందని పేర్కొన్నారు. ఇటువంటి ప్రాజెక్ట్‌లు ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంపొందించడమే కాకుండా, వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా వ్యాపారాన్ని సులభతరం చేయడాన్ని ప్రోత్సహిస్తాయని మోదీ ఉద్ఘాటించారు. సమష్టిగా ఈ వృద్ధిని మరింతగా వేగవంతం చేసేందుకు తాను నిశ్చయించుకున్నానని ప్రధాని అన్నారు. చర్లపల్లి న్యూ టెర్మినల్ రైల్వే స్టేషన్‌తో పాటు జమ్మూ రైల్వే డివిజన్, ఈస్ట్‌కోస్ట్ రైల్వే రాయగడ రైల్వే డివిజన్ భవనానికి ప్రధాని మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. తర్వాత మోదీ మాట్లాడారు. ‘‘జమ్మూకశ్మీర్, తెలంగాణ, ఒడిశాలో రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రారంభంతో పర్యాటకం మరింత పెరుగుతుంది. ఈ ప్రాంతాల్లో సామాజిక–ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది’’ అని అన్నారు.త్వరలోనే తొలి బుల్లెట్ రైలు‘‘ఇవాళ ప్రజలు ఎక్కువదూరాలను తక్కువ సమయంలో పూర్తిచేయాలనుకుంటున్నారు. అందుకు తగ్గట్లే మేం పనిచేస్తున్నాం. వందేభారత్ స్లీపర్ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లడం చూశాక నాకెంతో సంతోషం కలిగింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. భారతదేశంలో మొదటి బుల్లెట్ రైలు పరుగులు తీసే రోజు కూడా ఎంతో దూరంలో లేదు. రాబోయే రోజుల్లో రైల్వేల ప్రయాణం ఓ గుర్తుండిపోయే మధురస్మృతిగా నిలిచిపోయేలా చేస్తాం. దేశంలో 2014లో 74 ఉన్న విమానాశ్రయాల సంఖ్య నేడు 150కి పైగా పెంచాం. 5 నగరాల నుంచి 21 నగరాలకు మెట్రో సేవలు విస్తరించాం. దేశం కలిసికట్టుగా, అంచెలంచెలుగా ముందుకు సాగుతోందనడానికి ఇలాంటి కార్యక్రమం ఒక నిదర్శనం’’ అని అన్నారు. -
Watch Live: చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం
-
త్వరలో చర్లపల్లి టెర్మినల్ నుంచి 25 రైళ్లు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల అనంతరం చర్లపల్లి రైల్వే టెర్మినల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం కృష్ణా, గోల్కొండ, శాతవాహన, ఇంటర్సిటీ రైళ్లకు చర్లపల్లిలో హాల్టింగ్ సదుపాయం ఉంది. ఇది వినియోగంలోకి వచ్చిన తరువాత 25 రైళ్లను ఇక్కడి నుంచే నడిపించేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రణాళికలను సిద్ధం చేసింది. సికింద్రాబాద్ స్టేషన్ రీడెవలప్మెంట్ పనులు కొనసాగుతున్న దృష్ట్యా కూడా ప్రస్తుతం ఈ స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే కొన్ని రైళ్లను చర్లపల్లికి మార్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ క్రమంలోనే లోక్‌సభ ఎన్నికల అనంతరం చర్లపల్లి టెర్మినల్‌ను వినియోగంలోకి తేవాలని నిర్ణయించినట్లు రైల్వే అధికారి ఒకరు తెలిపారు. రైల్వేశాఖ సుమారు రూ.430 కోట్లతో చర్లపల్లి టెర్మినల్ విస్తరణ చేపట్టిన సంగతి తెలిసిందే. అత్యాధునిక సదుపాయాలతో, ఆరులైన్లతో స్టేషన్‌ను విస్తరించారు. రైళ్లను శుభ్రం చేసేందుకు, నిలిపి ఉంచేందుకు వీలుగా పిట్లైన్లను ఏర్పాటు చేశారు. చర్లపల్లి టెర్మినల్ వినియోగంలోకి వస్తే పలు రైళ్లు సికింద్రాబాద్ వెళ్లకుండా ఇక్కడినుంచే నడుస్తాయి. ఇక్కడినుంచి ప్రతి రోజూ 60 వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చని అధికారవర్గాలు చెపుతున్నాయి. చర్లపల్లి ప్రారంభమయ్యాక ఇకనుంచి ఈ రైళ్లు అక్కడినుంచే.. ► కాజీపేట్ నుంచి సికింద్రాబాద్, లింగంపల్లి స్టేషన్ల మీదుగా వెళ్లే ముంబై–భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్, మచిలీపట్నం–షిరిడీ వీక్లీ ఎక్స్‌ప్రెస్, కాకినాడ–షిరిడీ ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను చర్లపల్లి టెర్మినల్ నుంచే నడిపించే అవకాశం ఉంది. ► అలాగే బీదర్ నుంచి మచిలీపట్నం వరకు నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, కాకినాడ–లింగంపల్లి మధ్య నడిచే గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, కాజీపేట – హడప్సర్ (పూణే) ట్రైవీక్లీ, లింగంపల్లి–కాకినాడ మధ్య నడిచే కోకనాడ ట్రైవీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్ ప్రెస్, టాటానగర్ నుంచి యశ్వంత్‌పూర్ వరకు నడిచే వీక్లీఎక్స్‌ప్రెస్, షాలిమార్–హైదరాబాద్ ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్–చెన్నై ఎక్స్‌ప్రెస్ రైళ్లను చర్లపల్లి నుంచే నడపనున్నారు. ► జమ్ముతావి–తిరుపతి మధ్య నడిచే హమ్‌సఫర్ వీక్లీ, గోరఖ్‌పూర్ నుంచి వచ్చే యశ్వంత్‌పూర్ వీక్లీ సూపర్ ఫాస్ట్ఎక్స్ ప్రెస్, నిజాముద్దీన్ ఢిల్లీ– బెంగళూరు సిటీ మధ్య నడిచే రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ తదితర రైళ్లను కూడా చర్లపల్లి నుంచి నడిపించే ప్రతిపాదనలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ► ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా నిర్మించిన మౌలాలి–సనత్‌నగర్ మార్గం ఇప్పటికే పూర్తయింది. ఈ రూట్లో ప్రస్తుతం గూడ్స్ రైళ్లు నడుస్తున్నాయి. చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించిన అనంతరం ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా ఈ రూట్లో నడిపించే అవకాశం ఉంది. దీంతో చర్లపల్లి మీదుగా ముంబై, ఢిల్లీ వైపు రాకపోకలు సాగించే రైళ్లు సికింద్రాబాద్‌కు వెళ్లకుండా చర్లపల్లి నుంచి మౌలాలి, సనత్‌నగర్, లింగంపల్లి మీదుగా నడుస్తాయి. సిటీ స్టేషన్లపై తగ్గనున్న ఒత్తిడి.. చర్లపల్లి టెర్మినల్ వినియోగంలోకి వస్తే సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపైన ఒత్తిడి తగ్గనుంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రతి రోజూ 200 రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. 1.86 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ వినియోగంలో ఉన్న 10 ప్లాట్‌ఫామ్‌లపైన ఒత్తిడి పెరగడం వల్ల కొన్ని రైళ్లను నగర శివార్లలోనే నిలిపివేయవలసి వస్తోంది. దీంతో ఉదయం వేళల్లో స్టేషన్‌కు రావలసిన రైళ్లు సకాలంలో చేరుకోవడం లేదు. దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు సిటీ శివార్లలోనే పడిగాపులు కాయవలసి వస్తోంది. చర్లపల్లి ప్రారంభమైతే సిగ్నల్ కోసం ఇలా ఎదురుచూడవలసిన అవసరం లేకుండా చర్లపల్లి నుంచే రాకపోకలు సాగించవచ్చు. అలాగే కాచిగూడ, నాంపల్లి స్టేషన్లపైన కూడా ఒత్తిడి తగ్గుతుందని చెపుతున్నారు. -
జైలర్ వేధింపులు..ఖైదీల ఆందోళన
చర్లపల్లి జైళ్లో ఖైదీల ఆందోళన హైదరాబాద్: నగరంలోని చర్లపల్లి సెంట్రల్ జైలు డిప్యూటీ జైలర్ దశరథం వేధింపులకు గురిచేస్తున్నాడంటూ.. జైళ్లోని ఖైదీలు ఆందోళనకు దిగారు. భోజనం సరిగ్గాలేదని నిరసన తెలిపిన మల్లేశం అనే ఖైదీపై కక్ష కట్టిన జైలర్ దశరథం అతన్ని చర్లపల్లి నుంచి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించడానికి యత్నిస్తున్నారు. దీంతో ఆగ్రహించిన ఖైదీలు గురువారం జైల్లో ఆందోళన చేపట్టారు. చర్లపల్లి జైలు సూపరిండెంట్ దశరథం అవినీతి పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విచారించాలని ఖైదీలు వేడుకుంటున్నారు. ఆయన ఖమ్మం సెంట్రల్ జైలు నుంచి చర్లపల్లి జైలుకు ఓ.డి పై వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఖైదీలను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారు. జైళ్ల శాఖ డీజీ వి.కే సింగ్ తాను ఎలా చెబితే అలా వింటాడని ఓ వైపు జైలు సిబ్బందిని మరో వైపు ఖైదీలను తరచూ వేధింపులకు గురి చేస్తున్నారు. జైలర్ వేధింపులు తాళలేక గతంలో ఓ ఖైదీ ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. జీవిత ఖైదు అనుభవిస్తున్న మల్లేషం పై జైలర్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఆయన అవినీతి, అక్రమాలను ప్రశ్నించిన జైలు సిబ్బంది, ఖైదీలపై జైళ్ల శాఖ డీజీకి తప్పుడు ఫిర్యాదు చేసి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దశరథం పై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఖైదీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
చర్లపల్లి జైలును సందర్శించిన హైపవర్ కమిటీ బృందం
నగరం నడిబొడ్డున ఉన్న చంచల్‌గూడ జైలు తరలింపు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘనందన్రావులతో కూడిన హైపర్ కమిటీ బృందం గురువారం చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలును సందర్శించింది. చంచల్‌గూడ జైలును చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలుకు మార్చాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలిసిందే. ఈ క్రమంలో చర్లపల్లిలో ఉన్న వసతులను పరిశీలనలో భాగంగానే వారు జైలును సందర్శించి అధికారులతో చర్చించారు. ఓపెన్ ఎయిర్ జైలును ప్రత్యామ్నాయంగా ఎక్కడకు మార్చాలన్న పలు అంశాలపై సమీక్షించి వెళ్లారు. వారితో పాటుగా జైళ్లశాఖ డీజీ వీకే సింగ్, డీఐజీ నరసింహ, చర్లపల్లి జైళ్ల పర్యవేక్షణాధికారులు కొలను వెంకటేశ్వర్ రెడ్డి, రాజేశ్‌లు ఉన్నారు. -
చర్లపల్లి జైలులో ఓపెన్ వర్సిటీ పరీక్షలు
చర్లపల్లి కేంద్ర కారాగారంలో శుక్రవారం ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధికారులు ఇక్కడి ఖైదీల కోసం ప్రత్యేకంగా కేంద్రం ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా జైలు, హైదరాబాద్ మహిళా జైలు, చర్లపల్లి వ్యవసాయ క్షేత్రం జైలు నుంచి దాదాపు 25 మంది ఖైదీలు వచ్చి ఇక్కడ పరీక్షలకు హాజరయ్యారు. -
జైల్లోనే.. ఇలా దర్జాగా..!!